అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

ఇమ్రాన్ ఖాన్‌ను ఏ జైలుకు పంపారు? ఎలాంటి సౌకర్యాలు కల్పించారంటే? 

తోషాఖానా కేసులో అరెస్టయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జైలుకు తరలించారు. అక్కడ ఇమ్రాన్ కు భారీ భద్రత కల్పించారు.

07 Aug 2023

మొరాకో

మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం; బస్సు బోల్తాపడి 24మంది మృతి

సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 24మంది మరణించారు.

పాకిస్థాన్‌: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు; 22 మంది మృతి 

పాకిస్థాన్‌‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రావల్పిండికి వెళ్లే హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 10బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో 22మంది మరణించారు. 80మంది గాయపడ్డారు.

ఉక్రెయిన్‌ విషయంలో అదే జరిగితే భారత్‌ సంతోషానికి అవధులుండవు: దోవల్ 

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుదేశాలు ఘర్షణ విధానానికి స్వస్తి పలికితే అంతకు మించిన సంతోషం భారత్‌కు మరోటి లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రకటించారు. సమస్యలను చర్చలు, దౌత్య మార్గాలతోనే పరిష్కరించాలనేది తమ విధానమని వెల్లడించారు.

06 Aug 2023

చైనా

చైనాలో భారీ భూకంపం.. 10 మందికి గాయాలు

చైనాలో ఆదివారం తెల్లవారుజామున భారీగా భూమి కంపించింది. బీజింగ్‌‌కి 300 కి.మీ దూరంలోని డెజౌలో 2.33 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదైనట్లు ఎర్త్‌క్వేక్‌ నెట్‌వర్క్స్‌ సెంటర్‌ ప్రకటించింది.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్; తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష.. అరెస్టు 

తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా తేలింది.

04 Aug 2023

సిరియా

సిరియాలో టెర్రర్ దాడులు.. ఘర్షణల్లో మరణించిన ఐఎస్ఐఎస్ చీఫ్ ఖురాషీ 

ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబూ హుస్సేన్ అల్-హుస్సేనీ అల్ ఖురాషీ మరణించారు.

04 Aug 2023

అమెరికా

ఫెడరల్‌ కోర్టుకు హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు.. తాను నిర్దోషినని కోర్టుకు చెప్పిన ట్రంప్

అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి న్యాయ విచారణను ఎదుర్కొంటున్నారు.

మెక్సికోలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రమాదంలో ఆరుగురు భారతీయుల దుర్మరణం

మెక్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఓ బస్సు లోయలో పడిపోయిన దారుణ ఘటన నాయారిట్ రాష్ట్రంలో జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందడం కలకలం సృష్టించింది.

బ్రెజిల్‌లో డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం.. పోలీస్ కాల్పుల్లో 9 మంది దుర్మరణం

దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ లో దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కాల్పుల మోత మోగుతోంది.

03 Aug 2023

కెనడా

18 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేక్.. భార్యకి విడాకులు ఇస్తున్న కెనడా ప్రధాని

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, సోఫీ దంపతులు విడిపోతున్నారు. 18 ఏళ్ల వైవాహిత జీవితానికి గుడ్ బై చెబుతున్నట్లు బుధవారం ఇన్‌స్టాలో ట్రూడో ప్రకటించారు.

03 Aug 2023

అమెరికా

హర్యానా మత ఘర్షణలపై స్పందించిన అమెరికా.. హింసకు దూరంగా ఉండాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి 

హర్యానాలో చెలరేగిన తీవ్ర మత ఘర్షణలపై అగ్రరాజ్యం అమెరికా స్పందంచింది. నూహ్ జిల్లాలో మొదలైన హింస, గురుగ్రామ్ వరకు వ్యాపించింది.

Donald Trump: ట్రంప్‌పై మరో క్రిమినల్ కేసు.. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్లు అభియోగాలు 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరో క్రిమినల్ కేసు నమోదైంది.

Australia: 91మంది బాలికలపై లైంగిక వేధింపులు; మాజీ చైల్డ్ కేర్ వర్కర్‌ కేసు 

ఆస్ట్రేలియాలో చైల్డ్ కేర్ వర్కర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి 91మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ దేశ పోలీసులు అభియోగాలు మోపారు.

01 Aug 2023

చైనా

చైనాలో తుపాను బీభత్సం; భారీ వర్షాలకు 11మంది మృతి, 27మంది గల్లంతు

చైనాలో తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Singapore: విహారయాత్రకు వెళ్లిన భారతీయ మహిళ క్రూయిజ్ షిప్‌లో అదృశ్యం; ఇంతకీ ఏమైంది? 

మలేషియాలోని ఉత్తర ద్వీప రాష్ట్రమైన పెనాంగ్ నుంచి సింగపూర్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న క్రూయిజ్ షిప్‌లో 64 సంవత్సరాల వయస్సున్న భారతీయ మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

31 Jul 2023

చైనా

చైనాలో ఘోరం.. ప్రమాదవశాత్తు 68వ అంతస్తుడి నుంచి జారిపడి ప్రాణాలు విడిచిన ఫ్రాన్స్ సాహసికుడు 

చైనా దేశంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. అనుమతి లేకుండా ఓ ఆకాశహర్మ్యంలోని టాప్ ఫ్లోర్ కు చేరుకున్న ఓ సాహసికుడి యాత్ర దుస్సాహసంగా మారింది. ప్రమాదవశాత్తు అక్కడ్నుంచి కిందపడి చనిపోయిన ఘటన హంకాంగ్‌లో జరిగింది.

31 Jul 2023

అమెరికా

అమెరికాను మళ్లి కలవరపెడుతున్న కరోనా; పెరుగుతున్న ఆస్పత్రిలో చేరికలు, సీడీసీ హెచ్చరిక 

అమెరికాలో కరోనా మరోసారి కలవరపెడుతోంది. కరోనాతో యూఎస్‌లో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెచ్చరించింది.

పాకిస్థాన్ బాంబు దాడిలో 44కు చేరిన మృతల సంఖ్య; 10కిలోల పేలుడు పదార్థాల వినియోగం 

పాకిస్థాన్‍‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా (కేపీ) ప్రావిన్స్‌లో ఇస్లామిస్ట్ పార్టీ జమియాత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఎఫ్ (జేయూఐ-ఎఫ్) నిర్వహించిన రాజకీయ సభలో ఆత్మాహుతి దాడి జరిగింది.

American Presidential Elections: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు భారతీయ-అమెరికన్‌లు

వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ కనిపిస్తోంది.

30 Jul 2023

అమెరికా

విమానంలో బాలికపై లైంగిక వేధింపులు.. ఎయిర్ లైన్స్‌పై రూ.16 కోట్లకు దావా

విమానంలో మద్యం మత్తులో బాలికతో పాటు అమె తల్లి పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మద్యం తాగిన వ్యక్తి, పక్క సీట్లో ఉన్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఆస్ట్రేలియాలో కుప్పకూలిన మిలటరీ హెలికాప్టర్.. నలుగురు గల్లంతు

ఆస్ట్రేలియన్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. ఆస్ట్రేలియా దేశంలోని ఈశాన్యతీరంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

కీలక ప్రకటన చేసిన చైనా.. 2022 G-20 డిన్నర్‌లో మోదీ, జిన్‌పింగ్ ఏం మాట్లాడారో తెలుసా? 

గత ఏడాది 2022లో జరిగిన G-20 దేశాల డిన్నర్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

మరోసారి విషం కక్కిన పాక్.. మాదకదవ్య్రాల సరఫరాలపై పాక్ సంచనల విషయాలు

భారత్ పై దయాది పాకిస్థాన్ మరోసారి విషం కక్కింది. పాక్ ఇండియాలోకి పెద్ద ఎత్తున ఆయుధాలు, మదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం తెలిసిందే.

28 Jul 2023

ఇండియా

బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం

బ్రిక్స్ విస్తరణపై దూకుడు మీదున్న డ్రాగన్ చైనాకు భారత్, బ్రెజిల్ సంయుక్తంగా కళ్లెం వేస్తున్నాయి. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్య దేశాలుగా ఉన్నాయి.

28 Jul 2023

సిరియా

దద్దరిల్లిన సిరియా.. బాంబు పేలుడుతో ఆరుగురు దుర్మరణం, 20 మందికిపైగా గాయాలు

సిరియాలో బాంబుల మోతతో రాజధాని డమాస్కస్‌ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మహమ్మద్ ప్రవక్త మనవరాలు, ఇమామ్ అలీ కుమార్తె సయీదా జీనాబ్ సమాధి నుంచి కేవలం 600 మీటర్ల దూరంలో భారీ పేలుడు సంభవించింది. భద్రతా భవనం సమీపంలోనే ఈ పేలుడు చోటు చేసుకున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.

సింగపూర్‌లో 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష

సింగపూర్‌లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరికి ఉరిశిక్ష పడినట్లు ఆ దేశ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.

కార్గిల్ యుద్ధంపై రాజ్‌నాథ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్

ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఇండో పాక్ సరిహద్దులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Naked woman: కాలిఫోర్నియాలో మహిళ రచ్చ; బట్టలిప్పి నడిరొడ్డపై తుపాకీతో హల్‌చల్ 

కాలిఫోర్నియాలో నడి రోడ్డుపై ఓ మహిళ హల్‌చల్ చేసింది. రోడ్డుపై తుపాకీని చూపుతూ పరుగులు పెట్టింది.

27 Jul 2023

లండన్

లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. దొంగను పోలీసులు వెంటాడుతుండగా తెలుగు విద్యార్థి మృతి 

ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఓ తెలుగు విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

27 Jul 2023

నైజర్

ఆఫ్రికా దేశం నైజర్‌లో తిరుగుబాటు: అధ్యక్షుడిని తొలగించిన సైన్యం

నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆఫ్రికా దేశం 'నైజర్' అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ తన పదవిని కోల్పోయారు. అధ్యక్షుడిపై ఆ దేశ సైన్యం బుధవారం తిరిగుబాటు చేసింది.

సముద్రంలో పయనిస్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 3000 కార్లు అగ్గిపాలు, వ్యక్తి మృతి

యూరప్ ఖండంలోని నెదర్లాండ్స్‌కు చెందిన ఓ సరకు రవాణా నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 3వేల కార్లతో ఉత్తర సముద్రం (అట్లాంటిక్‌ సముద్రంలోని ఓ భాగం)లో వెళ్తున్న ఈ భారీ నౌకలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

26 Jul 2023

ఇటలీ

ఇటలీలో వడగళ్ల వాన.. గాల్లోనే విమానానికి రంధ్రం పడటంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలెట్లు

యూరోపియన్ దేశం ఇటలీలో భారీ వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల ప్రయాణాలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటకే దాని ముందు భాగం దెబ్బతింది.

పాకిస్థాన్: మసీదులో ఆత్మాహుతి దాడి; పోలీస్ ఆఫీసర్ మృతి 

పాకిస్థాన్‌లోని ఓ మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఖైబర్ జిల్లాలోని అలీ మసీదు ప్రాంతంలోని ఒక మసీదు వద్ద మంగళవారం బాంబు పేలింది.

25 Jul 2023

దుబాయ్

అబుదాబీలో ప్రాణాంతక మెర్స్‌ వైరస్‌ కేసు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారణ

మెర్స్‌కోవ్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌)ప్రాణాంతక వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. అబుదాబీలో ఓ 28ఏళ్ల యువకుడు ఈ వైరస్ బారిన పడ్డాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

బ్రిక్స్ సదస్సు వేళ చైనాపై అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు

డ్రాగన్ దేశం చైనాపై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా తమ నమ్మకాన్ని కోల్పోయిందని కుండబద్దలు కొట్టారు.

25 Jul 2023

రష్యా

రష్యా ఉక్రెయిన్ మధ్య అలజడులు.. కీవ్‌పై రష్యా వైమానిక దాడి 

రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్దం జరుగుతోంది. ఉక్రెయిన్‌లోని కీవ్‌ ప్రాంతంపై రష్యా మరోసారి వైమానిక దాడికి దిగింది. ఆరోసారి ఉక్రెయిన్ మిలటరీ విభాగంపై రష్యా వైమానిక దాడులకు పూనుకుంది.

24 Jul 2023

కెనడా

కెనడాలో ఘోరం.. బైక్ కోసం భారత విద్యార్థిని హత్య చేసిన దుండగులు

కెనడాలో భారతీయ విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ మేరకు ఒంటారియో ప్రావిన్స్ లో ఈ ఘోరం చోటు చేసుకుంది.

మద్యం తాగి కారు నడిపిన దేశ మహిళా మంత్రిని అరెస్ట్ చేసిన పోలీసులు 

న్యూజిలాండ్​ దేశంలో ఓ మహిళా మంత్రి మద్యం తాగారు. అంతటితో ఆగకుండా మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారకురాలయ్యారు. అనంతరం న్యాయశాఖ మంత్రిగా పదవి కోల్పోయారు.

24 Jul 2023

అమెరికా

మణిపూర్ బాధితులకు అమెరికా సానుభూతి, రాష్ట్ర సర్కారుకు అగ్రరాజ్యం సూచనలు

మణిపూర్‌లో జరుగుతున్న దురాగతాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇద్దరు మహిళలపై జరిగిన నగ్న ఊరేగింపు, లైంగిక వేధింపులు, హత్యాచార ఘటనలను క్రూరమైన చర్యగా అభివర్ణించింది.