అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Bangladesh: బంగ్లాలో నిరసనకారుల విధ్వసం.. షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటికి నిప్పు
బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బంగబంధుగా పేరుగాంచిన షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై నిరసనకారులు దాడి చేసి, నిప్పు పెట్టారు.
Donald Trump: ట్రంప్‌కు గోల్డెన్ పేజర్ గిఫ్ట్ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని
ఇజ్రాయెల్-గాజా యుద్ధం తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుసుకున్న విషయం తెలిసిందే.
Iran rial: 'ట్రంప్' దెబ్బ.. రికార్డు స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ.. డాలరుకు 8.50లక్షల రియాల్స్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న చర్యల వల్ల అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
Donald Trump: ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పోటీ చేయకుండా నిషేధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై డొనాల్డ్ ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారు.
USA: సీఐఏ సంస్థలోని ఉద్యోగుల బైఅవుట్ ఆఫర్ చేసేందుకు రంగం సిద్ధం
తనను ఇబ్బందికి గురి చేసిన డీప్‌స్టేట్‌ను సహించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన ప్రకటన ఒక్కోకటిగా నిజమవుతోంది.
Trump-Iran: అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యం.. ఇరాన్‌కు ట్రంప్ చెక్
ఇరాన్ అణ్వాయుధాల తయారీకి వేగంగా ప్రయత్నాలు చేస్తుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారికి గట్టి ప్రతిస్పందన ఇచ్చారు.
Aga Khan: ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్ కన్నుమూత
ప్రఖ్యాత బిలియనీర్, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు అయిన ఆగాఖాన్ (Aga Khan) ఇక లేరు.
Donald Trump: గాజాను స్వాధీనం చేసుకుంటాం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.
central Sweden: సెంట్రల్ స్వీడన్ పాఠశాలలో కాల్పులు.. ఐదుగురు మృతి
సెంట్రల్ స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌కు పశ్చిమాన 200 కిలోమీటర్లు (125 మైళ్ళు) దూరంలో ఉన్న ఒరెబ్రో నగరంలోని ఒక పాఠశాలలో జరిగిన దాడిలో ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు స్వీడిష్ పోలీసులు మంగళవారం ధృవీకరించారు .
Iran: అత్యాధునిక అణ్వాయుధాలను తయారు చేసేందుకు ఇరాన్ యోచన.. అమెరికాకు ఇంటెలిజెన్స్ సమాచారం
ఇరాన్ ప్రభుత్వం అణుబాంబు తయారు చేయాలని నిర్ణయించుకున్న వెంటనే, అక్కడి శాస్త్రవేత్తలు దాన్ని సిద్ధం చేసేందుకు రహస్యంగా తమ యత్నాలను ప్రారంభించారు.
TikTok: టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడంపై ట్రంప్ కీలక నిర్ణయం
టిక్ టాక్ కొనుగోలుపై వివిధ అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలొచ్చాయి.
Trump:'మా అనుమతి లేకుండా ఏమీ చేయలేరు'.. మస్క్‌కు ట్రంప్ క్లియర్ మెసేజ్
అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ శాఖ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Illegal migrants: మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 205 మంది భారతీయులు..
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల (Illegal migrants) విషయంలో తొలి నుంచి కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Akash Bobba: మస్క్ డోజ్ బృందంలో భారత సంతతికి చెందిన యువకుడు.. ఎవరీ ఆకాశ్ బొబ్బ..?
వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పుల లక్ష్యంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) శాఖను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేశారు.
Trump-Trudeau: అమెరికా సుంకాల విషయంలో కెనడాకు తాత్కాలిక ఊరట.. స్పందించిన కెనడా అధ్యక్షుడు ట్రూడో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, కెనడా దేశాలను సుంకాల భయంతో ఒత్తిడికి గురి చేసినప్పటికీ, తాజాగా ఈ రెండు దేశాలకు కొంత ఉపశమనం కల్పించారు.
USA: అక్రమ వలసదారులతో భారత్‌కు బయలుదేరిన అమెరికా మిలిటరీ విమానం
అమెరికా (USA) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
South Africa: దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన అతి పెద్ద హిందూ ఆలయం
దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం దక్షిణార్ధగోళంలో అతి పెద్ద హిందూ ఆలయం, సాంస్కృతిక సముదాయం ప్రారంభమైంది.
Donald Trump: పనామా కాలువపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. తీవ్ర చర్యలుంటాయని హెచ్చరిక
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పనామా కాలువపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో వివాదాల తరువాత, ముక్కోణపు దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్, ఇప్పుడు పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
Donald Trump: కెనడా, మెక్సికో, చైనాలకు షాకిచ్చిన ట్రంప్
రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో దూకుడు పెంచారు. ముఖ్యంగా సుంకాల విధానంపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Israel: ఇజ్రాయెల్ నూతన సైన్యాధిపతిగా ఇయల్ జమీర్
ఇజ్రాయెల్ కొత్త సైన్యాధిపతిగా మాజీ మేజర్ జనరల్ ఇయల్ జమీర్ నియమితులయ్యారు.
Rishi Sunak: 'నమస్కారం చేయి' రిషి సునాక్ కు అత్త సూచన
బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ శనివారం జైపూర్‌లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు సతీమణి అక్షతా మూర్తి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Gaza Ceasefire Deal: గాజా కాల్పుల విరమణ ఒప్పందం.. ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు బందీల విడుదల
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (Gaza Ceasefire Deal) ప్రకారం బందీల విడుదల కొనసాగుతోంది.
Justin Trudeau: టారిఫ్‌ల యుద్ధం.. ట్రంప్ నిర్ణయంపై ట్రూడో ఘాటు వ్యాఖ్యలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికోపై విధించిన 25 శాతం టారిఫ్‌లపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా స్పందించారు.
Philadelphia: ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో కూలిన విమానం.. ఆరుగురు మృతి
అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక విమానం కుప్పకూలింది.
Deepseek: అమెరికాను షేక్ చేస్తున్న చైనా ఏఐ ''డీప్‌సీక్''.. ఉద్యోగులు ఇన్‌స్టాల్ చేయొద్దని యూఎస్ కాంగ్రెస్ ఆదేశం..
అమెరికాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్‌ను చైనా అభివృద్ధి చేసిన ''డీప్‌సీక్'' ఏఐ టూల్ కుదిపేసింది.
Mali: మాలి మైన్ కుప్పకూలి.. 10 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ఘోర ప్రమాదం సంభవించింది.
US Airstrike On Syria: సిరియాపై యుఎస్ వైమానిక దాడి.. అల్ ఖైదా నాయకుడు హతం
సిరియాలోని వాయువ్య ప్రాంతంలో గురువారం జరిగిన వైమానిక దాడిలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్‌ను అమెరికా సైన్యం హతమార్చింది.
Donald Trump: బానిసల పిల్లల కోసమే జన్మతః పౌరసత్వం.. ప్రపంచమంతా వచ్చి అమెరికాలో ఎగబడితే ఎలా?: ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, డొనాల్డ్ ట్రంప్ అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు.
Japan:ట్రక్ డ్రైవర్‌ను కాపాడాలి..ప్లీజ్ నీరు వాడకండి..12లక్షలమందిని కోరిన జపాన్
జపాన్‌లో (Japan) ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో, అక్కడి అధికారులు తమ ప్రజలను నీటిని తక్కువగా వినియోగించాలని అభ్యర్థించారు.
USA: 2023 నుండి అమెరికాలో 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్ విజిటర్లు
విద్యార్థి వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా ఉంటున్న వారిపై ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం దృష్టిసారించింది.
Bangladesh: బంగ్లాదేశ్‌కు నిధులు నిలిపేసిన ట్రంప్.. యూనస్‌తో భేటీ అయిన జార్జిసోరస్ కుమారుడు..!
వివాదాస్పద అమెరికన్ బిలియనీర్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ (OSF) అధినేత జార్జి సోరస్ కుమారుడు అలెక్స్ బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారైన మహమ్మద్ యూనస్‌తో భేటీ అయ్యారు.
Airplane Crash: ఘోర ప్రమాదం..హెలికాప్టర్‌ను ఢీకొట్టి.. నదిలో కూలిన విమానం
అమెరికాలోని వాషింగ్టన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 64 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం, మరో హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి.
Donald Trump: ట్రంప్‌కు రూ.216 కోట్లు చెల్లించనున్న మెటా.. ఎందుకంటే..?
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో మెటా (Meta) తన సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగా ప్రయత్నిస్తోంది.
Road Accident : సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది భారతీయులు దుర్మరణం
సౌదీ అరేబియాలోని జిజాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Serbia: సెర్బియాలో ఉద్యమ ప్రభావం.. ప్రధానమంత్రి రాజీనామా
సెర్బియాలోని నోవీసాడ్ నగరంలో గత నవంబరులో రైల్వేస్టేషన్ ముఖద్వార పైకప్పు కూలిన ఘటనలో 15 మంది మరణించినప్పటి నుంచి, విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం ఉద్ధృతమైంది.
South Korea: విమానంలో మంటలు.. ప్రాణాలతో బయటపడ్డ 176 మంది
దక్షిణ కొరియాలోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయంలో, ఎయిర్ బుసాన్ ఎయిర్‌బస్ ఏ321 ప్యాసింజర్ విమానం మంటల్లో చిక్కుకుంది.
Trump: వైట్ హౌస్ బ్రీఫింగ్ రూమ్‌లో 'న్యూ మీడియా' కి ఎంట్రీ
రెండోసారి అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పాలనలో మరింత వేగంగా ముందుకు సాగుతున్నారు.
Zelenskyy: యుద్ధాన్ని ముగించి శాంతి చర్చలకు వచ్చేందుకు పుతిన్ భయపడుతున్నారు: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
మూడేళ్లుగా ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, దీనికి ముగింపు పలకడం గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
DeepSeek: అరుణాచల్ ప్రదేశ్‌పై ప్రశ్న.. 'డీప్‌సీక్' చెప్పిన సమాధానం నెట్టింట వైరల్!
కృత్రిమ మేధా రంగంలో సంచలనంగా మారిన చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Vivek Ramaswamy: మస్క్‌తో విభేదాలు.. వివేక్ రామస్వామి ఏమన్నారంటే?
అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ నుంచి తన రాజీనామా పై వివేక్ రామస్వామి స్పందించారు.