ప్రకటన: వార్తలు

మార్చి 21న విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Verna

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈరోజు మార్చి 21న భారతదేశంలో విడుదల చేయనున్న 2023 హ్యుందాయ్ Verna డిజైన్ రెండర్‌లను ఆవిష్కరించింది.

పశ్చిమ బెంగాల్‌లోని 15 కొత్త నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G

భారతి ఎయిర్‌టెల్ పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్, దుర్గాపూర్, దిన్హటా, అసన్సోల్, జల్పైగురి, డార్జిలింగ్‌తో సహా మరో 15 నగరాల్లో తన 5G సేవలను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ తన 5G సేవలను అక్టోబర్ 2022లో ప్రారంభించింది.

20 Feb 2023

విమానం

ఈ ఆర్ధిక సంవత్సరంలో విదేశీ పర్యటనల కోసం భారతీయులు పెట్టిన ఖర్చు $10బిలియన్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో భారతీయులు విదేశీ ప్రయాణాలకు దాదాపు $10 బిలియన్లు ఖర్చు పెట్టారు.రికార్డు స్థాయి ట్రావెల్ సీజన్ ఈ త్రైమాసికంలో కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు.

20 Feb 2023

జియో

వినియోగదారుల కోసం అందుబాటులో ఉండే రీఛార్జ్ ప్లాన్‌లు అమలుచేస్తున్న రిలయన్స్ జియో

రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ. ఇది 2016లో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి వినియోగదారులకు అనుకూలంగా ఉండే రీఛార్జి ప్లాన్స్ అమలుచేస్తూ వస్తుంది. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు ఇంటర్నెట్ డేటాను అందించే ఆల్ ఇన్ వన్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం

ఇప్పుడు కేవలం రూ. 27,000కే సామ్ సంగ్ Galaxy S22

సామ్ సంగ్ Galaxy S22 ఫోన్ ధర తగ్గింపు ధరతో అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. అలాగే భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరింత తక్కువ ధరకు ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. కొత్త మోడల్ Galaxy S23 విడుదల తో, సామ్ సంగ్ Galaxy S22 ధరను గణనీయంగా తగ్గించింది ఆ సంస్థ.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 లైట్నింగ్ బైక్ టాప్ ఫీచర్లు

బైక్‌ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఇంటర్‌సెప్టర్ 650 కోసం ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను గ్లోబల్ మార్కెట్ల కోసం విడుదల చేయనుంది. ఈ మోడల్ పేరు లైట్నింగ్.

అమెరికా ప్రెసిడెంట్ బిడ్‌ కు సిద్దపడుతున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక ప్రత్యేకత సంతరించుకోనున్నాయి. ప్రెసిడెంట్ రేసులో భారత సంతతికి చెందిన కొందరు కూడా పాల్గొనే అవకాశం ఉంది. వారిలో మిలియనీర్ వివేక్ రామస్వామి ఒకరు.

17 Feb 2023

ఐఫోన్

ఆపిల్ ఏడాది చివరిలో విడుదల చేయనున్న ఐఫోన్ 15 Pro ఫోటో లీకైంది

ఆపిల్ ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయనుంది, ఇక లీకైన ఫోటోలో ఐఫోన్ 15 Pro ఫోన్ లో సన్నని బెజెల్స్, కెపాసిటివ్ బటన్లు, కొంచెం మందంగా ఉండే కెమెరా లేఅవుట్, టైప్-సి పోర్ట్ ఉంటాయి.

17 Feb 2023

ఇటలీ

ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ

ఫెరారీ తన మొట్టమొదటి SUV, Purosangueను గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది. ఇప్పుడు. US మార్కెట్లో ఈ SUV ధరను ప్రకటించింది. స్పోర్టీ ఆఫ్-రోడర్ శక్తివంతమైన 6.5-లీటర్, V12 ఇంజన్‌తో నడుస్తుంది.

భారతదేశంలో 2 ట్విట్టర్ కార్యాలయాలను మూసేసిన తర్వాత, ముగ్గురు ఉద్యోగులు మిగిలారు

ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ఉద్యోగులను తొలగించడం, కార్యాలయ వస్తువులను విక్రయించడం, కార్యాలయాల మూసివేత వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ట్విట్టర్ శుక్రవారం ఉదయం భారతదేశంలోని దాని మూడు కార్యాలయాలలో రెండింటిని మూసివేసింది, ఆ కార్యాలయాల్లోని ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని కోరింది.

యూట్యూబ్ కొత్త భారతీయ-అమెరికన్ సిఈఓ నీల్ మోహన్ గురించి తెలుసుకుందాం

యూట్యూబ్ కొత్త సిఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్న నీల్ మోహన్ అంతకుముందు ఆ సంస్థలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్నారు. మోహన్ 1996లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు, అక్కడ అతను అర్జయ్ మిల్లర్ స్కాలర్ (GPA పరంగా టాప్ 10 శాతం విద్యార్థులు). తరువాత 2005లో స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి MBA పట్టా పొందారు.

17 Feb 2023

స్కూటర్

సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్

బజాజ్ చేతక్, ఒకప్పుడు ప్రతి మధ్య తరగతి ఇంట్లో ఉండేది. అయితే కైనెటిక్ జూమ్‌లు, హోండా యాక్టివా వంటి బ్రాండ్ల రాకతో అమ్మకాలలో వెనకపడింది. 2006లో చివరిగా చేతక్ విడుదలైంది. మళ్ళీ 16 సంవత్సరాల తరవాత ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో మార్కెట్లోకి రాబోతుంది.

యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్

ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ లో తొమ్మిదేళ్ల అధికారం తర్వాత తానూ వైదొలుగుతున్నట్లు యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుసాన్ వోజికి ప్రకటించారు. ఒక బ్లాగ్ పోస్ట్‌లో, కుటుంబం, ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించాలనుకుంటున్నట్లు తెలిపారు.

COVID-19 ఇన్ఫెక్షన్ మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది

JAMA నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ఒక అధ్యయనం COVID-19 బారిన పడిన వారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శరీరం గ్లూకోజ్‌ను ప్రాసెస్ చేసే విధానాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపింది.

16 Feb 2023

టాటా

ADAS ఫీచర్ తో 2023 హారియర్, సఫారిని ప్రకటించిన టాటా సంస్థ

స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలోని సామర్థ్యం గల హారియర్, సఫారీ 2023 వెర్షన్ విడుదల చేసింది. భారతదేశంలో రెండు వాహనాల కోసం బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

భారతదేశంలో విడుదలైన iQOO Neo 7 ఫోన్

iQOO భారతదేశంలో iQOO Neo 7 అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.ఇందులో 120Hz AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్, 64MP ప్రైమరీ కెమెరా, 5,000mAh బ్యాటరీ ఉన్నాయి.

ఆధార్‌ని పాన్ నంబర్‌తో లింక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇవి పాటించండి

ఈ ఏడాది మార్చి 31లోపు పాన్‌ నంబర్లకు ఆధార్‌ను లింక్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2022తో ముగిసింది, కానీ ప్రభుత్వం దానిని రూ.1000 అపరాధ రుసుముతో పొడిగించింది.

అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు

భారతి ఎయిర్‌టెల్ తన 5G సేవలను భారతదేశంలోని కోహిమా, ఐజ్వాల్, గ్యాంగ్‌టాక్, టిన్సుకితో సహా మరిన్ని ఈశాన్య నగరాల్లో ప్రారంభించింది.

IIT గౌహతి పేటెంట్ టెక్నాలజీ భారతదేశంలో కమ్యూనికేషన్‌ను ఎలా సహాయపడుతుంది

భారతీయ టెలికాం పరిశ్రమ అప్‌గ్రేడ్‌ను కు సిద్ధంగా ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతి, నావ్ వైర్‌లెస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్ టెక్నాలజీ (ToT) ట్రాన్స్ఫర్ ని పూర్తి చేసింది.

16 Feb 2023

పేటియం

UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్

తక్కువ-విలువ UPI లావాదేవీలను వేగంగా, మరింత సురక్షితంగా ఆటంకం లేకుండా, పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) భారతదేశంలో UPI LITEని ప్రవేశపెట్టింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా ఈ ఫీచర్‌ను అందించే దేశంలోనే మొదటి పేమెంట్స్ బ్యాంక్ పేటియం.

టెలిగ్రామ్ vs వాట్సాప్ వీటి మధ్య ఏం జరుగుతోంది

గత వారం, వాట్సాప్ అధిపతి విల్ క్యాత్‌కార్ట్ తన ఎన్‌క్రిప్షన్ విధానాలపై మాట్లాడుతూ టెలిగ్రామ్‌ను డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయలేదని విమర్శించారు. వాట్సాప్ ఇతర యాప్‌ల భద్రతా పద్ధతులపై ఆరోపించడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబరులో, నిర్దిష్ట భద్రతా ఫీచర్లు లేవని ఆపిల్ Message సేవను విమర్శించింది. వాట్సాప్ గోప్యతా విధానాలపైనా, ప్రైవేట్ సందేశాలను స్నూపింగ్ చేస్తుందనే దానిపై ఆరోపణలను ఎదుర్కుంటుంది.

వార్షిక ప్లాన్ తో ఉచిత ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ని అందిస్తున్న ఎయిర్‌టెల్

భారతి ఎయిర్‌టెల్ అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ అందిస్తోంది, దానితో పాటు ఉచిత కాలింగ్, ఒక సంవత్సరం వ్యాలిడిటీ రోజుకు 2.5GB డేటా వంటి ప్రయోజనాలు కేవలం రూ. 3,359కే అందిస్తుంది.

15 Feb 2023

విమానం

IT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి

జర్మనీకి చెందిన Lufthansa సంస్థ విమానాలు బుధవారం IT అంతరాయం కారణంగా ఆలస్యం లేదా రద్దు అయ్యాయి.

ఇకపై హ్యుందాయ్, కియా కార్లను దొంగిలించడం మరింత కష్టం

USలో వాహన దొంగతనం అనేది ఒక పెద్ద సమస్య, కొన్ని బీమా కంపెనీలు సులభంగా దొంగిలించగల మోడల్‌లకు ఇన్సూరెన్స్ కి నిరాకరిస్తాయి. హ్యుందాయ్, కియా మోటార్స్ దాదాపు 8.3 మిలియన్ వాహనాల కోసం ఉచిత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నాయి, అది వాటిని దొంగిలించడం కష్టం చేస్తుంది. హ్యుందాయ్ ఇప్పటికే తన కార్లపై ఫర్మ్‌వేర్‌ను అందించడం ప్రారంభించింది.

ఐరోపాలో 3,800 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫోర్డ్

వచ్చే మూడేళ్లలో యూరప్‌లో 3,800 ఉద్యోగాలను తగ్గించాలని అమెరికా వాహన తయారీ సంస్థ ఫోర్డ్ నిర్ణయాన్ని ప్రకటించింది. పెట్రోలు, డీజిల్ ఇంజన్‌ల నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారుతుండడంతో ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి. ఫోర్డ్ లో ప్రస్తుతం ఐరోపాలో 34,000 ఉద్యోగులు ఉన్నారు. 2035 నాటికి ఐరోపాలో తన విమానాలను పూర్తిగా విద్యుదీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిపై $50 బిలియన్లను ఖర్చు చేస్తోంది.

2023 ఫార్ములా 1 సీజన్ కోసం SF-23 రేస్ కారును ప్రదర్శిస్తున్న ఫెరారీ

రాబోయే 2023 ఫార్ములా 1 (F1) సీజన్‌కు ముందు, ఇటాలియన్ వాహన తయారీ సంస్థ ఫెరారీ తన SF-23 రేస్ కారును ప్రకటించింది. గత సంవత్సరం మోడల్ కంటే చిన్న మార్పులు చేసారు. ఇది 1.6-లీటర్, టర్బోచార్జ్డ్, V6 ఇంజన్‌తో నడుస్తుంది.

మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse

స్విట్జర్లాండ్‌లోని రెండవ అతిపెద్ద బ్యాంకు Credit Suisseలో ఒక మాజీ ఉద్యోగి జీతాలు, బోనస్‌లకు సంబంధించిన వేలాది మంది ఉద్యోగుల వ్యక్తిగత డేటాను దొంగిలించాడని సంస్థ ప్రకటించింది. డేటా చోరీ సమస్యను బ్యాంక్ మొదటిసారిగా మార్చి 2021లో గుర్తించింది. సంబంధిత డేటా రక్షణ అధికారులకు తెలియజేసింది.

ఇంటర్నెట్ సంచలనం ChatGPT వెనుక ఉన్న సామ్ ఆల్ట్‌మాన్ గురించి తెలుసుకుందాం

గత కొన్ని నెలలుగా ChatGPT ఎన్నో చర్చలకు దారితీసింది. అయితే అందరూ ఈ చాట్ బాట్ గురించి మాట్లాడారు గాని OpenAI సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ గురించి ఎవరూ మాట్లాడలేదు. 37 సంవత్సరాల ఆల్ట్‌మాన్, చికాగో, ఇల్లినాయిస్‌లో 1985లో జన్మించాడు. అతను మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో పెరిగాడు.

14 Feb 2023

కొచ్చి

కొచ్చిలో కొత్త గెస్ట్ ఎక్స్పీరియెన్స్ సెంటర్ ను ప్రారంభించిన Lexus

Lexus GECలు అతిథి దేవో భవ అనే భారతీయ స్ఫూర్తితో అసాధారణమైన ఆతిథ్యం, అతిథుల అవసరాలను తీరుస్తూ అద్భుతమైన అనుభవాన్ని అందించడానికి జపనీస్ తత్వశాస్త్రమైన 'ఒమోటేనాషి'ని ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

14 Feb 2023

మెటా

ఫిబ్రవరి 21న మెటా సంస్థ నుండి బయటకి వెళ్లనున్న చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్

మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్, 13 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఏడాది చివర్లో కంపెనీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని నెలలుగా కంపెనీ నుండి వైదొలిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఆమె కూడా ఒకరు.

మార్చిలో ప్రారంభమయ్యే ఫార్ములా 1కు AMR23ని ప్రకటించిన ఆస్టన్ మార్టిన్

AMR23 అప్డేటెడ్ డిజైన్‌ను ఆస్టన్ మార్టిన్ ఆవిష్కరించింది. మార్చి 5 నుండి ప్రారంభమయ్యే సీజన్‌లో పాల్గొంటుంది. ఆస్టన్ మార్టిన్ టెక్నికల్ డైరెక్టర్ డాన్ ఫాలోస్, AMR23 AMR22 కంటే 95% భిన్నంగా ఉంటుందని తెలిపారు.

వాట్సాప్‌లో వాలెంటైన్స్ డే స్టిక్కర్ ప్యాక్‌ యాక్సెస్ చేయండిలా

ప్రత్యేక వాలెంటైన్స్ డే స్టిక్కర్ ప్యాక్‌లు వాట్సాప్‌లో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్‌ 2018 అక్టోబర్‌లో స్టిక్కర్ల ఫీచర్‌ను విడుదల చేసింది. స్టిక్కర్ ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసే విధానం గురించి ఇక్కడ చదవండి

అమ్మకందారుల ఆదాయంలో 50% కోత వేస్తున్న అమెజాన్

అమెజాన్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ లో అందించే వివిధ రకాల ఉత్పత్తులు అందించే డిస్కౌంట్‌ల కారణంగా కొనుగోలుదారులకు చాలా ఇష్టమైన ఈ-కామర్స్ వేదిక. ఇందులో మిలియన్ల కొద్ది అమ్మేవారు ఉన్నారు. మార్కెట్‌ప్లేస్ పల్స్ అధ్యయనం ఆధారంగా, 2022లో మొదటిసారిగా అమెజాన్ ప్రతి సేల్‌లో కోత 50% దాటింది.

14 Feb 2023

జియో

ప్రేమికుల రోజు కోసం జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్లు

జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్ ను అందిస్తుంది. ఇది ఫిబ్రవరి 10 ఆ తర్వాత రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మే చివరినాటికి భారతదేశంలో 2023 హ్యుందాయ్ VERNA విడుదల

దక్షిణ కొరియా తయారీ సంస్థ హ్యుందాయ్ 2023 VERNA సెడాన్ మే నాటికి భారతదేశంలో విడుదల చేస్తుందని ప్రకటించింది. ఇప్పుడు ఈ సెడాన్ ను రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. రాబోయే కారు టీజర్ చిత్రాలను కూడా షేర్ చేసింది హ్యుందాయ్.

Internet Explorerకు ఇక సెలవు పూర్తిగా డిసేబుల్ చేసిన మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా Windows 10లో Internet Explorerను డిసేబుల్ చేసింది. ఇది ఫిబ్రవరి 14 నుండి అమలు అవుతుంది. గత సంవత్సరం యాప్‌కు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ను కంపెనీ నిలిపివేసినప్పటికీ, బ్రౌజర్ ఇప్పటికీ ఆపరేటింగ్ సిస్టమ్ ముందు వెర్షన్‌లో నడుస్తుంది.

భారతదేశంలో 51 లక్షలకు అందుబాటులోకి రానున్న Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్

జర్మన్ వాహన తయారీ సంస్థ Audi తన Q3 స్పోర్ట్‌బ్యాక్ కూపే SUVని భారతదేశంలో విడుదల చేసింది. ఇది ఒకే ట్రిమ్‌లో అందుబాటులో ఉంది. కారు స్టైలిష్ రూపంతో పాటు టెక్నాలజీ సపోర్ట్ తో సంపన్నమైన క్యాబిన్‌ తో వస్తుంది. ఇది 2.0-లీటర్ TFSI టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తుంది.

OnePlus 11 కంటే OnePlus 11R కొనడం ఎందుకు మంచిది

OnePlus 11 టోన్డ్-డౌన్ OnePlus 11R డిజైన్ కంటే బాగుంటుంది. OnePlus 11, 11R మధ్య ఉన్న తేడాలను తెలుసుకుందాం.

ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే లభిస్తున్న Acer Nitro 5 ల్యాప్ టాప్

Acer Nitro 5 భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లలో ఒకటి. ఇది మంచి గేమింగ్-ఫోకస్డ్ ల్యాప్‌టాప్ అయితే ఇప్పుడు ఇది ఫ్లిప్ కార్ట్ లో చాలా చౌకగా లభిస్తుంది.

13 Feb 2023

మెటా

మరిన్ని ఉద్యోగ కోతలను సంస్థ పునర్నిర్మాణంలో భాగమని సమర్ధించుకుంటున్న మెటా

మరింత మందిని ఉద్యోగాల్లోంచి తొలగించే ఆలోచనలో ఉన్న మెటా సంస్థ. ఫేస్‌బుక్ పేరెంట్ సంస్థ మెటా వచ్చే నెలలో సిబ్బంది పనితీరు సమీక్షలను పూర్తి చేసిన తర్వాత సంస్థను పునర్నిర్మించనున్నట్లు తెలిపింది.