ప్రకటన: వార్తలు

11 Feb 2023

టాటా

ఫార్ములా E రేసులకు ప్రసార హక్కులు చేజిక్కించికున్న టాటా కమ్యూనికేషన్స్

రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా, టాటా కమ్యూనికేషన్స్ ABB FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం అధికారిక ప్రసార పంపిణీ హక్కులు చేజిక్కించుకున్నట్టు ప్రకటించింది.

11 Feb 2023

విమానం

ఎయిర్‌బస్, బోయింగ్‌ల సంస్థల నుంచి 500 జెట్‌లను ఆర్డర్‌ చేసిన ఎయిర్‌ ఇండియా

ఎయిరిండియా $100 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన 500 కొత్త విమానాల కోసం ఒక భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక ఎయిర్‌లైన్ నుండి ఒకేసారి వచ్చిన అతిపెద్ద ఆర్డర్‌ అని, పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఫైల్ షేరింగ్ లిమిట్ పెంచడంతో పాటు కొత్త రికార్డింగ్ మోడ్ ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్

వాట్సాప్ ఐఫోన్ కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అందుబాటులోకి వచ్చిన ఫీచర్స్ లో వీడియోలను హ్యాండ్స్-ఫ్రీగా రికార్డ్ చేయడానికి కెమెరా మోడ్‌ తో పాటు, ఒకేసారి 100 వరకు మీడియా ఫైల్స్ ను షేర్ చేయచ్చు.

ఉద్యోగ తొలగింపులు మొదలుపెట్టిన మైక్రోసాఫ్ట్ HoloLens, Surface, Xboxలో ఉద్యోగ కోతలు

మైక్రోసాఫ్ట్ గత నెలలో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దానిలో భాగంగా, ఇప్పుడు HoloLens మిక్స్డ్ రియాలిటీ హార్డ్‌వేర్, Surface డివైజ్‌ తో పాటు Xbox గేమింగ్ డివిజన్‌ యూనిట్లలో ఉద్యోగాలను తగ్గించింది.

భారతదేశంలో పూర్తిగా సిబ్బందిని తొలగించి కార్యాలయాన్ని మూసేసిన టిక్ టాక్

2020లో భారతదేశంలో నిషేదించిన షార్ట్ వీడియో ప్లాట్ఫాం టిక్‌టాక్ దేశంలోని తన కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకుంది. సంస్థలో మిగిలిన 40 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసింది.

11 Feb 2023

బైక్

భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్

చెన్నైకి చెందిన TVS మోటార్ కంపెనీ తన స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ అపాచీ RTR 310ని మార్చి 2023లో భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.దీని డిజైన్ 2014 ఆటో ఎక్స్‌పోలో డ్రేకెన్ బ్రాండ్ ప్రదర్శించిన కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తుంది. దీని ధర 2.65 లక్షలు ఉండే అవకాశముంది.

H-1Bపై అమెరికా కొత్త నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లాభం

H-1B వీసాపై అమెరికా కొత్త ప్లాన్ అమలు చేస్తుంది దీనితో H-1B, L1 వీసాలపై వేలాది మంది విదేశీ సాంకేతిక ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలో వేలాది మంది భారతీయ టెక్కీలకు ప్రయోజనం చేకూరుతుంది. పైలట్ ప్రాతిపదికన "దేశీయ వీసా రీవాలిడేషన్" కేటగిరీలు పెట్టి తర్వాత కొన్ని సంవత్సరాలలో దానిని పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది.

కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా

యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 14ని సంప్రదాయబద్ధంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే తేదీని కౌ హగ్ డేగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.

10 Feb 2023

భూకంపం

టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ

టర్కీలో వరుసగా సంభవించిన భూకంపాల తర్వాత మూడు రోజులపాటు శిథిలాల కింద కూరుకుపోయిన 6 ఏళ్ల బాలికను స్నిఫర్ డాగ్స్ రక్షించాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్‌లో భాగమైన రోమియో, జూలీ, శిథిలాల కింద 6 ఏళ్ల నస్రీన్ ఆచూకీని గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయి.

10 Feb 2023

భూకంపం

పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు

సిరియాలో సోమవారం సంభవించిన భూకంపం తర్వాత జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో ఒక ఇంటి శిథిలాల కింద దొరికిన అప్పుడే పుట్టిన పసికందుకు పేరుతో పాటు ఒక ఇల్లు దొరికింది..

1,000 మంది ఉద్యోగులను తొలగించనున్న యాహూ

యాహూ తన మొత్తం సిబ్బందిలో 20% కంటే ఎక్కువ మందిని తొలగించాలని ఆలోచిస్తున్నట్లు గురువారం ప్రకటించింది, దాదాపు 50% యాడ్ టెక్ ఉద్యోగులపై ఈ ప్రభావం ఉంటుంది రికార్డు స్థాయిలో అధిక ద్రవ్యోల్బణంతో పాటు మాంద్యం భయంతో కంపెనీలు టెక్ రంగంలో విస్తృతంగా ఉద్యోగ కోతలను ప్రకటిస్తున్నాయి.

ChatGPT కు మరో ప్రత్యర్ధిని తయారుచేస్తున్నఅలీబాబా సంస్థ

చైనీస్ ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా AI రంగంలోకి ప్రవేశించబోతుంది. ChatGPT లాంటి టూల్‌ను డెవలప్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు

హిమాచల్ ప్రదేశ్‌లోని అదానీ విల్మార్ పై రాష్ట్ర ఎక్సైజ్ పన్నుల శాఖ దాడులు నిర్వహించినట్లు అదానీ విల్మార్ గురువారం ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ ఉల్లంఘనల కారణంగానే ఈ దాడి జరిగిందని మీడియా నివేదించగా, ఎలాంటి అవకతవకలు జరగలేదని కంపెనీ పేర్కొంది.

ట్విట్టర్ బ్లూ టిక్‌ కోసం నెలకు రూ.650 చెల్లించాల్సిందే

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ భారతదేశంలో ప్రారంభమైంది. ఇది ట్వీట్‌లను సవరించగల సామర్థ్యం, వెబ్ ద్వారా HD రిజల్యూషన్‌లో వీడియోలను పోస్ట్ చేయడం, కొత్త ఫీచర్‌లకు ముందస్తు యాక్సెస్ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

7,000 మంది ఉద్యోగుల తొలగించనున్న డిస్నీ

డిస్నీ సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి 7,000 మందిని తొలగించాలని నిర్ణయించుకుంది. ఇటీవలే తమ త్రైమాసిక ఆదాయాన్ని ప్రకటించిన వెంటనే ఈ నిర్ణయం ప్రకటించింది.

అదానీ గ్రూప్ పతనం ప్రభావం దేశీయ రుణదాతలపై లేదంటున్న ఆర్ బి ఐ

స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ గ్రూప్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సంస్థ ఆకాశాన్నంటుతున్న అప్పులను కూడా నివేదిక ఎత్తి చూపింది. ఇప్పుడు, రెగ్యులేటర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు దేశీయ బ్యాంకులకు మద్దతుగా నిలిచాయి.

భారతదేశంలో కొత్త ఫీచర్లతో విడుదల కాబోతున్న సుజుకి Gixxer సిరీస్

జపనీస్ తయారీ సంస్థ సుజుకి భారతదేశంలో తన Gixxer, Gixxer SF, Gixxer 250, Gixxer SF 250 బైకుల 2023 వెర్షన్‌లను విడుదల చేసింది. ఇవి బ్లూటూత్- డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా కొత్త రంగు ఆప్షన్స్ తో పాటు మరిన్ని ఫీచర్స్ తో అందుబాటులో ఉన్నాయి. సింగిల్-సిలిండర్ 155cc, 249cc ఇంజిన్‌లతో నడుస్తాయి. .

09 Feb 2023

గూగుల్

అంచనాలను అందుకోలేకపోయిన గూగుల్ 'లైవ్ ఫ్రమ్ ప్యారిస్' AI ఈవెంట్

ChatGPTతో ఉన్న కొత్త Bing గురించి మైక్రోసాఫ్ట్ చేసిన ప్రకటన గురించి ఇంకా అందరు చర్చిస్తుండగానే గూగుల్ తన AI-సెంట్రిక్ "లైవ్ ఫ్రమ్ ప్యారిస్" ఈవెంట్ ను పారిస్‌లో ఏర్పాటు చేసింది. ఇందులో Bard-గూగుల్ గురించి ప్రివ్యూతో పాటు గూగుల్ లెన్స్ గురించి కొన్ని అప్‌డేట్‌లు ఉన్నాయి.

త్వరలో ఉత్పత్తిలోకి ప్రవేశించనున్న 2023 హ్యుందాయ్ VERNA

కొత్త తరం హ్యుందాయ్ VERNA ఈ మార్చిలో భారతదేశంలో ఉత్పత్తికి వెళ్లనుంది. ఏటా 70,000 యూనిట్లను తయారు చేయాలని హ్యుందాయ్ సంస్థ ఆలోచిస్తుంది. వీటిలో ఎక్కువ భాగం ఎగుమతి అవుతాయి. పెట్రోల్-ఇంజిన్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

08 Feb 2023

ఆర్ బి ఐ

#NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 2022 నుండి రెపో రేటును ఆరవసారి పెంచింది. సామాన్యుడికి ఈ రెపో రేటుతో సంబంధం ఏంటి?

మార్కెట్లో అతి తక్కువ ధరకు Moto E13 ఫోన్ విడుదల చేసిన మోటోరోలా

మోటోరోలా Moto E13 ఫోన్ ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో పాటు 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Moto E13 సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం వెనుకవైపు 13MP ప్రైమరీ కెమెరా సెన్సార్, ముందు భాగంలో 5MP లెన్స్ తో వస్తుంది.

ChatGPT జత చేసిన Bingను అందరికి అందుబాటులో తెచ్చిన మైక్రోసాఫ్ట్

వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌లోని ప్రధాన కార్యాలయంలో మైక్రోసాఫ్ట్ జర్నలిస్టులు, క్రియేటర్ల సమక్షంలో కొత్త Bing గురించి ప్రకటించింది.

ఇంటెల్ సిఈఓ బాటలో జూమ్ సిఈఓ, తన వేతనంలో 98% కోత విధింపు

జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ మంగళవారం తన 15% అంటే దాదాపు 1,300 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. జూమ్ సిఈఓ ఎరిక్ యువాన్ తొలగింపులకు దారితీసిన పరిస్థితులకు తాను బాధ్యత వహిస్తానని, రాబోయే ఆర్థిక సంవత్సరానికి తన జీతం 98% తగ్గించడంతో పాటు కార్పొరేట్ బోనస్‌ను వదులుకుంటున్నానని చెప్పారు.

08 Feb 2023

ఆర్ బి ఐ

రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.

రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్‌లో 5G సేవలను ప్రారంభించిన ఎయిర్ టెల్

భారతీ ఎయిర్‌టెల్ తన 5G సేవలను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్. నగరాల్లో ప్రారంభించింది.

సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సంధర్భంగా భద్రతా ఫీచర్లను ప్రారంభించిన Tinder

సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం (SID) గుర్తుగా, ప్రముఖ ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫారమ్ Tinder వినియోగదారులు సులభంగా నియంత్రించడానికి అనేక భద్రతా ఫీచర్‌లను విడుదల చేస్తోంది. వినియోగదారులకు అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్లలో 'Incognito Mode', 'Block Profile' వంటి భద్రతా ఫీచర్లను అప్‌డేట్ చేసింది.

అసెస్‌మెంట్ పరీక్షలో ఫెయిలైన 600 ఫ్రెషర్స్ ను తొలగించిన ఇన్ఫోసిస్ సంస్థ

ఇంటర్నల్ ఫ్రెషర్స్ అసెస్‌మెంట్ (FA) పరీక్షలో ఫెయిలైన కారణంగా ఇన్ఫోసిస్ 600 మంది ఫ్రెషర్లను తొలగించింది. గత నెలలో, దేశంలోని మరో ప్రముఖ ఐటీ సంస్థ విప్రో కూడా ఇలానే 450 మంది ఫ్రెషర్లను తొలగించింది.

ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి

భారతీ ఎయిర్‌టెల్ తన 5G సేవలను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, గ్వాలియర్, భోపాల్ నగరాల్లో విడుదల చేసింది. రిలయన్స్ జియో తన 5G నెట్‌వర్క్‌ను హరిద్వార్‌లో ప్రారంభించింది..

రుణాలని ముందుగా చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువలో సగానికి పైగా నష్టపోయింది. ఆ నష్ట నివారణ చర్యల దిశగా అదానీ గ్రూప్ పనిచేస్తుంది. మల్టీ-ప్రోంగ్ విధానం ద్వారా పెట్టుబడిదారుల ఆందోళనలకు జవాబు ఇవ్వాలని ఆలోచిస్తుంది.

ట్విట్టర్ లో గోల్డ్ చెక్ మార్క్ వెరిఫికేషన్ కోసం వ్యాపారుల నుండి నెలకు $1,000 వసూలు

గతంలో బ్లూ ఫర్ బిజినెస్ అని పిలిచే "వెరిఫైడ్ ఫర్ ఆర్గనైజేషన్స్" ప్లాన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు గత నెలలో ట్విట్టర్ తెలిపింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ బ్రాండ్‌ల ఖాతాల పేరు పక్కన గోల్డ్ చెక్ గుర్తు కోసం నెలకు $1,000 వసూలు చేయాలని ఆలోచిస్తుంది. వ్యాపారులకు ట్విట్టర్ కొత్త చెల్లింపు ప్రణాళిక వివరాలను సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా వివరించారు.

సిబ్బంది, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4% పెంచనున్న కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం తన కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని ప్రస్తుతం ఉన్న 38 శాతం నుండి 42 శాతానికి నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది.

06 Feb 2023

గూగుల్

ఆండ్రాయిడ్‌ chromeలో సెర్చ్ హిస్టరీని త్వరగా తొలగించే ఫీచర్ ను ప్రవేశపెట్టనున్న గూగుల్

ఆండ్రాయిడ్ chromeలో 'quick delete' ఫీచర్‌ను ప్రారంభించే పనిలో గూగుల్ ఉంది. వెబ్ బ్రౌజింగ్ యాప్‌లో చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ 2021లో ఐఫోన్ అప్డేట్ లో విడుదల చేసారు. ఈ సంవత్సరం, గూగుల్ ఈ ఫీచర్ ను బ్రౌజర్ ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం విడుదల చేయబోతుంది.

ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విట్టర్ ప్రకటన ఆదాయాన్ని క్రియేటర్లకు షేర్ చేస్తుందని ప్రకటించారు. అయితే, ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్‌ ఉన్న క్రియేటర్లతో మాత్రమే కంపెనీ ప్రకటనల నుండి వచ్చే ఆదాయాన్ని పంచుకుంటుంది.ఈ విధానం ఈరోజు నుండే ప్రారంభమవుతుంది.

04 Feb 2023

కార్

భారతదేశంలో సెల్టోస్ (ఫేస్ లిఫ్ట్)ని విడుదల చేయనున్న కియా మోటార్స్

దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ ఈ ఏడాది మధ్యలో భారతదేశంలో సెల్టోస్ 2023 అప్డేట్ వెర్షన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఫేస్‌లిఫ్టెడ్ SUV ఇప్పటికే దక్షిణ కొరియాతో పాటు USలో అందుబాటులో ఉంది

04 Feb 2023

ఆపిల్

రికార్డు ఆదాయాన్ని రాబట్టిన ఆపిల్, భారత్‌పై అతినమ్మకాన్ని పెంచుకుంటున్న టిమ్ కుక్

ఆపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌పై చాలా నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. దానికి కారణం భారతదేశంలో 2022 చివరి త్రైమాసికంలో కంపెనీ రికార్డ్-సెట్టింగ్ పనితీరును చూపించింది.

GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియం ఆఫర్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియంను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ బింగ్‌తో ChatGPT కనెక్ట్ చేసే ఆలోచనను ఇటీవలే ప్రకటించింది.

మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్

బొగ్గు ఉత్పత్తి చేసే విద్యుత్ ధర ఖరీదు ఎక్కువ కావడంతో అదానీ పవర్ లిమిటెడ్‌తో 2017 విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలని బంగ్లాదేశ్ కోరింది. ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ భారతీయ కంపెనీతో కమ్యూనికేట్ చేసామని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDC) అధికారి తెలిపారు.

RDE-కంప్లైంట్ ఇంజన్‌ తో సిరీస్ మొత్తాన్ని అప్డేట్ చేసిన Renault

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Renault భారతదేశంలోని మొత్తం సిరీస్ ను RDE భద్రతా నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేసింది. KWID, Kiger, Triber ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఆప్షన్స్ తో అప్డేట్ అయ్యాయి.

అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి

పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడానికి భారతీయ బిలియనీర్ అదానీ చేసిన ప్రయత్నం విఫలమైంది గౌతమ్ అదానీ వ్యాపారాల షేర్లు గురువారం మరింత పడిపోయాయి. అతను తన సంపదలో $100 బిలియన్లను కోల్పోయారు.

03 Feb 2023

బైక్

మార్కెట్ లో మరిన్ని రంగుల్లో విడుదల కాబోతున్న 2023 సుజుకి Hayabusa

జపనీస్ తయారీ సంస్థ సుజుకి Hayabusa 2023 అప్డేట్ ను లాంచ్ చేసింది. ఈ సూపర్‌బైక్ మూడు డ్యూయల్-టోన్ రంగుల్లో అంటే పెర్ల్ వైగర్ బ్లూ/పెర్ల్ బ్రిలియంట్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ థండర్ గ్రే/క్యాండీ డేరింగ్ రెడ్ లో లభిస్తుంది. స్పోర్టి టూరర్ అవుట్‌గోయింగ్ మోడల్ మొత్తం డిజైన్‌ తో, 1,340cc ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్ తో నడుస్తుంది.