సుప్రీంకోర్టు: వార్తలు

బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు

గుజరాత్ అల్లర్ల సమయంలో అత్యాచారం, హత్య కేసులో 11మంది దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.

ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు; తక్కువ బాధతో మరణశిక్ష అమలు ఎలా? కేంద్రానికి సూచనలు

మరణశిక్షను అమలు చేసే కేసుల విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మరణశిక్ష అమలులో భాగంగా మెడకు తాడును వేలాడిదీసి ఉరివేయడం క్రూరమైన చర్యగా చెబుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది.

'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్

స్వలింగ సంపర్కుల వివాహంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాల విషయం అనేది దేశ ప్రజల విజ్ఞతకే వదిలేయాల్సిన అంశం అని కిరెన్ రిజిజు అన్నారు.

నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ కేసులో

ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ

దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కె కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

స్వలింగ సంపర్కుల వివాహం: పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.

మధ్యతరగతి ఇన్వెస్టర్ల డబ్బును కొల్లగొట్టడం దురదృష్టకరం; హిండెన్‌బర్గ్‌పై హరీష్ సాల్వే ఫైర్

అదానీ గ్రూప్ సంస్థలను టార్గెట్ చేసి, గత నెలలో మార్కెట్ ఒడిదుడుకులకు దారితీసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీనియర్ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే కోరారు.

'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్

పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేలా రాష్ట్ర గవర్నర్‌ను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతకుమారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎస్‌పై ఫైర్ అయ్యారు.

హిండెన్‌బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని స్వాగతించిన గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీ స్టాక్ రూట్‌కు కారణమైన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై కొనసాగుతున్న విచారణపై సుప్రీం కోర్టు ఆదేశాలను వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ గురువారం స్వాగతించారు.

ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు

భారత ఎన్నికల సంఘంలో కమిషనర్ల ఎంపిక కోసం ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఆదేశించింది.

'అదానీ-హిండెన్‌బర్గ్' వ్యవహారంపై దర్యాప్తుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

అదానీ-హిండెన్‌బర్గ్ ఎపిసోడ్‌పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ జడ్జి ఏఎం సప్రే నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై రెండు నెలల్లోగా నివేదికను అందించాలని ఆదేశించింది.

28 Feb 2023

పెన్షన్

అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO

ఇప్పటి వరకు అధిక పెన్షన్‌లను ఎంపిక చేసుకోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO గడువును మే 3 వరకు పొడిగించింది. 2022లో సుప్రీం కోర్ట్ ఆర్డర్ మార్చి 3న చివరి తేదీ అని నిర్ణయించింది.

'హిందుత్వం అంటే జీవన విధానం'; చారిత్రక స్థలాల పేర్లను మార్చాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

పురాతన, చారిత్రక సాంస్కృతిక మత స్థలాల పేర్లను మార్చే కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. భారతదేశం ఒక లౌకిక దేశమని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. హిందూ మతం ఒక జీవన విధానమని చెప్పుకొచ్చింది.

మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా?

మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జగన్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.

22 Feb 2023

శివసేన

శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చుక్కెదురైంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి శివసేన పేరు, విల్లు-బాణం గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ

హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరు కావడానికి అనుమతించాలని, తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ కర్ణాటకకు చెందిన విద్యార్థినుల బృందం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

20 Feb 2023

శివసేన

'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ

'శివసేన' పార్టీ పేరు, 'విల్లు, బాణం' గుర్తును మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అదానీ గ్రూప్ వ్యవహారంపై కేంద్రానికి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

అదానీ గ్రూప్ హిండెస్ బర్గ్ నివేదిక వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. నివేదికను పరిశీలించేందుకు కమిటీలో కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో సూచించే నిపుణుల పేర్లను చేర్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజెఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

యూపీ: అక్రమ ఆయుధాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

లైసెన్సు లేని తుపాకుల వల్ల కలిగే అనార్థాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

జమ్ముకశ్మీర్ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత-సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట

జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వవ్యస్థీకరణను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ తీర్పు 370కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రభావం చూపదని ధర్మాసనం చెప్పింది.

10 Feb 2023

బీబీసీ

బీబీసీ బ్యాన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

భారత్‌లో బీబీసీ ఛానల్ ప్రసారం కాకుండా బ్యాన్ చేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. హిందూసేన ఈ పిటిషన్ వేయగా.. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియమితులైన వారం తర్వాత, కేంద్రం ఈరోజు మరో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను అత్యున్నత న్యాయస్థానానికి పెంచింది, ఇప్పుడు పూర్తి స్థాయి 34 మంది న్యాయమూర్తుల సంఖ్యకు చేరుకుంది.

సుప్రీంకోర్టుకు అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం, రేపు విచారణ

షార్ట్ షెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై 'కుట్ర'కు పాల్పడిందంటూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పీఐఎల్)పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ పీఐఎల్‌లు దాఖలు చేశారు.

జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత

జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రముఖ మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల అంశంపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కేసు విచారణను ఈనెల 23వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మూడు రాజధానుల అంశాన్నిఅత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో 23న విచారిస్తామని జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మానసం వెల్లడించింది.

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు; ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు.

03 Feb 2023

బీబీసీ

బీబీబీ డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీ నిషేధానికి వ్యతిరేకంగా మహువా మోయిత్రా, జర్నలిస్టు ఎన్‌ రామ్‌, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, న్యాయవాది ఎంఎల్‌ శర్మ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది.

బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టులో విచారణ

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: జస్టిస్ నారిమన్

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్‌ ఫాలీ నారిమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల పేర్లను పెండింగ్‌లో ఉంచడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

27 Jan 2023

గూగుల్

ఆండ్రాయిడ్ విభాగంలో తగ్గనున్న గూగుల్ ఆధిపత్యం

గత వారం ఆండ్రాయిడ్‌కు సంబంధించిన వ్యాపార విధానాలను మార్చాలని సంస్థను కోరుతూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆర్డర్‌కు వ్యతిరేకంగా గూగుల్ చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి భారత సుప్రీంకోర్టు నిరాకరించింది. అందుకే దేశంలో ఆండ్రాయిడ్ లైసెన్సింగ్‌కు సంబంధించిన కొన్ని మార్పులను గూగుల్ ప్రకటించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు: జీఓ నెం.1 పిటిషన్‌పై 23న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1 పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. జీఓ నంబర్ 1పై జనవరి 23న విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది.

'రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే ప్రక్రియ జరుగుతోంది: సుప్రీంకోర్టుకు తెలిపి కేంద్రం

రామసేతుపై కేంద్రం ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. రామసేతును 'జాతీయ స్మారక చిహ్నం'గా ప్రకటించే ప్రక్రియ జరుగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్రం ప్రభుత్వం తెలిపింది.

సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలి: కిరెన్ రిజిజు

న్యాయమూర్తులను నియమించే ప్రక్రియకు సంబంధించి చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు మధ్య వివాదం నడుస్తోంది. అయితే ఈ విషయంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

10 Jan 2023

గూగుల్

యాంటీట్రస్ట్ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన గూగుల్

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)కి వ్యతిరేకంగా గూగుల్ చేస్తున్న పోరాటం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరుకుంది. గూగుల్ వాచ్‌డాగ్ అవిశ్వాస తీర్పును భారత సుప్రీంకోర్టులో శనివారం సవాలు చేసింది. గత వారం, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) CCI ఆర్డర్‌పై మధ్యంతర స్టే కోసం గూగుల్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది.

50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు

హల్ద్వానీ సమీపంలోని రైల్వే భూముల నుంచి 4,000 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సినిమా హాళ్ల లోపల ఆహారం, పానీయాల అమ్మకానికి సంబంధించిన నిబంధనలు, షరతులను విధించే పూర్తి అర్హత యజమానులకు ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎమ్మెల్యే, ఎంపీల వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం వాక్ స్వాతంత్య్ర హక్కు అందరికీ సమానంగా ఉంటుందని చెప్పింది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కూడా దీనికి అతీతం కాదని ధర్మాసనం చెప్పింది. ఆర్టికల్ 19(2) కింద పేర్కొన్నవి తప్ప.. వాక్‌స్వేచ్ఛపై అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.

పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశం చెల్లుబాటు అవుతుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు జడ్జీలు తీర్పు చెప్పారు. జస్టిస్ నాగరత్నం ఒక్కరే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తన జడ్జిమెంట్‌ను రాశారు.

పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది? తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన పెద్దనోట్ల రద్దుపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. జస్టిస్ నజీర్‌, జస్టిస్ గవాయ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇవ్వనుంది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన తర్వాత.. ఈ అంశంపై దాదాపు 58 పిటిషన్లు దాఖలయ్యాయి.

మునుపటి
1
తరువాత