సుప్రీంకోర్టు: వార్తలు

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభించేందుకు లోక్‌సభ సచివాలయాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు 

మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా లోక్‌సభ సెక్రటేరియట్‌, కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో గురువారం పిల్ దాఖలైంది.

23 May 2023

కడప

అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.

22 May 2023

సీబీఐ

సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు; ముందస్తు బెయిల్ తిరస్కరణ

వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తు బెయిల్‌ కోసం వైఎస్‌ అవినాష్‌రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు

వారణాసిలోని మసీదులో 'శివలింగం'గా చెప్పబడుతున్న నిర్మాణ వయస్సును నిర్ధారించడానికి శాస్త్రీయ సర్వే నిర్వహించాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.

'హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు ఆధారల్లేవు'; అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ 

అదానీ గ్రూప్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల బృందం క్లీన్‌చిట్ ఇచ్చింది.

జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు

సంప్రదాయ క్రీడ 'జల్లికట్టు'ను సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. అయితే చట్టం ప్రకారం జంతువుల భద్రత, రక్షణ విషయంలో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలను ఆదేశించింది.

15 May 2023

అమరావతి

అమరావతి రైతులకు షాక్, 'ఆర్5 జోన్'పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

'ఆర్5 జోన్' విషయంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులకు దాఖలు పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్: జీఓ 1ని కొట్టివేసిన హైకోర్టు

ఈ ఏడాది జనవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్‌ వన్‌ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు 

సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినప్పటికీ, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవిష్యత్తు అంధకారంగానే ఉందని పాకిస్థాన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఉద్ధవ్ ఠాక్రే‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు; గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం

మహారాష్ట్రలో జూన్ 2022లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ గురువారం కీలక తీర్పును వెలువరించింది.

11 May 2023

దిల్లీ

కేజ్రీవాల్ సర్కారు భారీ విజయం; దిల్లీలో పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వాదేనని సుప్రీంకోర్టు తీర్పు

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గురువారం భారీ ఊరట లభించింది. దిల్లీ పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.

Same sex marriage case: విచారణ బెంచ్ నుంచి సీజేఐ చంద్రచూడ్‌ను తొలగించాలని పిటిషన్; తిరస్కరించిన సుప్రీంకోర్టు 

స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించే బెంచ్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను తొలగించాలని అన్సన్ థామస్ చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది.

4శాతం ముస్లిం రిజర్వేషన్లలపై రాజకీయ ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం 

కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల ఉపసంహరణకు సంబంధించిన కేసుపై జరుగుతున్న రాజకీయ ప్రకటనలను సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా పరిగణించింది.

04 May 2023

దిల్లీ

దిల్లీ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచన

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణను ముగించింది. నిరసన తెలుపుతున్న రెజ్లర్లు దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్ 

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన కొన్ని నిర్ణయాలపై విచారణకు బుధవారం సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.

విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు

విడాకుల విషయంలో 6నెలల వెయిటింగ్ పీరియడ్‌‌పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం వివాహం బంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైతే, ఆ కారణంతో వివాహాలను వెంటనే రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం 

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాలుగు రోజులగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు.

రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకొని, కేసు నమోదు చేయాలని భారత టాప్ రెజర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం నుంచి ఆందోళన చేస్తున్నారు.

తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు; అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్ 

వైఎస్ వివేకా హత్య కేసులో లోక్‌సభ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

సుప్రీంకోర్టు వర్సెస్ ప్రభుత్వం; పాకిస్థాన్‌లో ఆడియో క్లిప్ ప్రకంపనలు 

పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ అత్త మహ్ జబీన్ నూన్, ప్రతిపక్ష పార్టీ పీటీఐ న్యాయవాది ఖవాజా తారిఖ్ రహీమ్ భార్య రఫియా తారిక్ మధ్య జరిగిన ఫోన్ కాల్ లీకైంది.

Same Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది? 

భారతదేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరుగుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింటోంది.

21 Apr 2023

సీబీఐ

 వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్‌రెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రంకోర్టు 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ ప్రశ్నిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది.

'స్వలింగ వివాహం అర్బన్ కాన్సెప్ట్ కాదు'; కేంద్రం వాదనలను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు

భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా విచారణ వాడీవేడీగా సాగింది.

స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా 

స్వలింగ సంపర్కులకు పెళ్లి చేసుకునే హక్కు ఉందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. వారిని ఒటరిగా వదిలేస్తే సరిపోదన్నారు. కానీ వారికి అవసరమైన సామాజిక సంస్థల నిర్మాణం చాలా అనివార్యమని నొక్కి చెప్పారు.

గ్యాంగ్‌స్టర్ అతిక్ సోదరుల హత్యపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ 

పోలీసుల సమక్షంలో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ , అష్రఫ్ హత్య జరగడంపై విచారించేందుకు మాజీ సీజేఐ అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు స్వీకరించింది.

రుతుక్రమ సమస్యలపై పోరాటం: సూల్ విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందించాలన్న సుప్రీంకోర్టు 

స్కూల్ విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందించాలన్న సుప్రీంకోర్టు రుతుక్రమం గురించి పబ్లిక్ గా మాట్లాడటం సరైన పని కాదని భారతీయ ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే రుతుక్రమంలో శుభ్రత పాటించడం వంటి విషయాలను పెద్దగా పట్టించుకోవట్లేదు.

'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం

తన అధికారాలతో చెలగాటాలాడొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మంగళవారం ఒక న్యాయవాది పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ

ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను ఏకపక్షంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

31 Mar 2023

పంజాబ్

పాటియాలా జైలు నుంచి రేపు విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ

పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏప్రిల్ 1న, పాటియాలా జైలు నుండి విడుదల కానున్నారు. అతని అధికారిక హ్యాండిల్ నుండి విడుదల గురించి ప్రస్తావిస్తూ ట్వీట్‌ విడుదల అయింది,

30 Mar 2023

దిల్లీ

రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య

భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ భార్య వసుధ రోహత్గీ దిల్లీలోనే ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. బంగ్లా ఖరీదు అక్షరాల రూ.160 కోట్లు అని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

29 Mar 2023

కడప

'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు

మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30లోగా విచాణను ముగించాలని సీబీఐని ఆదేశించింది.

29 Mar 2023

లోక్‌సభ

ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పార్లమెంట్ దిగువ‌సభ బుధవారం పునరుద్ధరించింది.

అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

అమరావతి కేసును వెంటనే విచారించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను జులై 11న విచారించనున్నట్లు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడి న ధర్మాసనం పేర్కొంది.

27 Mar 2023

సీబీఐ

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు; దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే విచారణ అధికారిని తక్షణమే మార్చాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా

దిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది.

దిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కుమార్తె కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరగనుంది.

దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు అనర్హులైపోతారా?

క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన శాసన సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పిటిషన్ దాఖలైంది.

ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ

ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లను కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14రాజకీయ పార్టీలు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.