తెలంగాణ: వార్తలు

తెలంగాణ: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం; ఆరుగురు మృతి

తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని నివాస సముదాయంలో గురువారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి.

టీఎస్‌పీఎస్‌సీ: మొత్తం 5 పేపర్లు లీకైనట్లు గుర్తించిన సిట్!

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారం రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు పేపర్లను కంప్యూటర్ నుంచి అపహరించినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) గుర్తించినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో మళ్ళీ మొదలైన పోస్టర్ల గొడవ, ఈసారి బీఎల్ సంతోష్ పై బీఆర్ఎస్ గురి

ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, ఈరోజు మళ్ళీ ఈడీ ముందు హాజరు అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో బీపేజీ పై పోస్టర్ల తో గురి పెట్టింది బీఆర్ఎస్.

తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హైస్పీడ్ రైలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే రైల్వైశాఖ మొదలు పెట్టింది. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ; సీఎం కేసీఆర్ హాజరు

మహారాష్ట్రలోని కందర్ లోహాలో మార్చి 26న జరిగే భారీ బహిరంగ సభకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని పార్టీ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు: రేపు కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి బుధవారం దిల్లీలోని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది.

మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం

సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు(84) కన్నుమూశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో విజయరామారావు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

13 Mar 2023

ఐఎండీ

తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

రాబోయో మూడు రోజుల్లో మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ (ఐఎండీ) హెచ్చరించింది. తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

దిల్లీ లిక్కర్ కుంభకోణం: నేడు ఈడీ ఎదుట విచారణకు కవిత

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరుకానున్నారు.

సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు

ప్రయాణికుల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రైల్వే స్టేషల్ లేదా బస్టాండ్ వద్ద క్యాబ్ లేదా ఆటో ఎక్కే మహిళా ప్రయాణికుల భద్రత కోసం ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది. అర్థరాత్రి నుంతి తెల్లవారుజాము వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్

త్వరలో ప్రారంభం కానున్న కొత్త సచివాలయ భవనం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం తుది దశ పనులను శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పరిశీలించారు.

10 Mar 2023

బీజేపీ

కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ

అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగింది.

మహిళల కోసం 'గృహలక్ష్మి' పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం; ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు

సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారునికి వారి అవసరాలకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకునేందుకు రూ.3 లక్షల సాయాన్ని అందించనుంది.

ఏపీలో అవినాష్ రెడ్డి, తెలంగాణలో కవిత అరెస్టు అవుతారా? ఆందోళనలో అధికార పార్టీలు

సీబీఐ, ఈడీ విచారణలతో తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు అరెస్టు అవుతారనే ఊహాగానాలు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్‌ను పెంచేశాయి.

TSRTC: ప్రయాణికుల కోసం రెండు స్పెషల్ ఆఫర్స్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ

హైదరాబాద్‌లో ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) రెండు ప్రత్యేకమైన ఆఫర్లను గురువారం లాంఛ్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రయాణికులకు సరసమైన ధరలో, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకురాలు కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మార్చి 9 (గురువారం) తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

తెలంగాణ లాంటి పనితీరును కనబరుస్తున్న రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేయాలి: కేటీఆర్

2022 నాటికి అన్ని భారతీయ రాష్ట్రాలు తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెంది ఉంటే భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించి ఉండేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

women's day 2023: 'ఉమెన్స్ డే' రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలందరికీ సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు

10వ తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గతంలో ఏపీలో 10వ తరగతి పరీక్షా పేపర్లు లీక్ అయిన నేపథ్యంలో తెలంగాణలో కూడా కార్పొరేట్, పలు ప్రవేటు పాఠశాలలు అలా అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

04 Mar 2023

ఆపిల్

బెంగళూరులో 100,000 ఉద్యోగాలను సృష్టించనున్న Foxconn ఐఫోన్ ప్లాంట్

అమెరికా చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ప్రధాన తయారీదారుగా చైనా స్థానాన్ని సవాలు చేస్తున్నాయి. ఆపిల్ వంటి కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చాలాకాలం నుండి వెతుకుతున్నాయి అయితే అటువంటి సంస్థలకు ఎక్కువగా కనిపిస్తున్న మార్గం భారతదేశం. ఇప్పుడు, తైవానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్, ఆపిల్ కు అతిపెద్ద సరఫరాదారు, బెంగళూరులో ఫ్యాక్టరీని నిర్మించడానికి $700 మిలియన్లను పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంది.

ఆరుద్ర భార్య, ప్రముఖ రచయిత కె.రామలక్ష్మి కన్నుమూత

ప్రముఖ రచయిత, ఆరుద్ర భార్య కె.రామలక్ష్మి శుక్రవారం కన్నుమూశారు. వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్

పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేలా రాష్ట్ర గవర్నర్‌ను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతకుమారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎస్‌పై ఫైర్ అయ్యారు.

తెలంగాణలో 'ఫాక్స్‌కాన్' భారీ పెట్టుబడులు; లక్షమందికి ఉపాధి అవకాశాలు

ఆపిల్‌తో సహా వివిధ బ్రాండ్‌లకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది.

పెండింగ్ బిల్లులు‌ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ వద్ద పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దాఖలు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చారు.

ఐటీ నిపుణుల నియామకంలో హైదరాబాద్ నంబర్ వన్

సాఫ్ట్‌వేర్ నిపుణులను నియమించుకోవడంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 నగరాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు టెక్నికల్ హైరింగ్ ఏజెన్సీ అయిన 'కారత్' జాబితాను విడుదల చేసింది.

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త: భారీగా డైట్ ఛార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో చదవుతున్న విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలు భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధింత మంత్రులు ప్రతిపాదనలను రూపొందించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపారు.

28 Feb 2023

బీజేపీ

అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ డిసెంబర్‌లో జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఈ సారి జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధినేత జేపీ నడ్డాతో తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు సమావేశమయ్యారు.

కింగ్‌ఫిషర్ బీర్ కోసం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మందుబాబు

కొందరి మందుబాబుల సమస్యలు అప్పడప్పుడూ హాస్యాస్పదంగా ఉంటాయి. వాళ్లకు అది సీరియస్ సమస్య అయినా, వేరే వాళ్లకు నవ్వు తెప్పించే విషయం అవుతుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

దిల్లీ మద్యం కేసు: 'సీబీఐ తర్వాత అరెస్టు చేసేది ఎమ్మెల్సీ కవితనే'

దిల్లీ మద్యం కుంభకోణంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అంశం తెలుగు రాష్ట్రాలు కూడా చర్చశీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన కొంతర కీలక నేతలు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈ కేసు వ్యవహారాన్ని ఇరు రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

D Srinivas: సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత

తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు, పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఆయన ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రంగారెడ్డి: మర్మాంగాన్ని కోసి, గుండెను బయటికి తీసి స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన యువకుడు

ఓ యువకుడు తన స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. మర్మాంగాన్ని కోసి, గుండెను బయటికి తీసి అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. తను ప్రేమించిన యువతిని తన స్నేహితుడు ఇష్టపడటమే ఈ హత్యకు కారణం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను రూ.20.5లక్షల కోట్లకు తీసుకెళ్లడమే లక్ష్యం: కేటీఆర్

ప్రపంచ లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు తెలంగాణను నాలెడ్జ్ క్యాపిటల్‌గా మార్చడమే తమ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 2030 నాటికి తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను 250 బిలియన్ డాలర్లకు (రూ.20.5 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ

సికింద్రాబాద్‌లోని మౌలా-అలీలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (జెడ్ఆర్‌టీఐ)లో గల 200 సంవత్సరాల పురాతన వారసత్వ మెట్ల బావిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది.

హైదరాబాద్ లో మరో బాలుడిపై వీధి కుక్కుల దాడి

హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతంలో వీధికుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ మృతి చెందిన ఘటన మరువకముందే, మరొకటి వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌లో విషాదం: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. వీధికుక్కుల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ దారుణ ఘటన అతడి తండ్రి పనిచేసే స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.

కేసీయార్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి బెలూన్లు పేలి కాలేరు వెంకటేష్ కు గాయాలు

అంబర్ పేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం కేసీయార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఆ వేడుకలో బెలూన్లు పేలి అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు తీవ్ర గాయాలయ్యాయి.

'హిందువుగా పుట్టాను, హిందువుగానే చనిపోతాను'; కేఏ పాల్ ఆసక్తికర కామెంట్స్

క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఎ పాల్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. తాను హిందువుగా పుట్టానని, హిందువుగానే చనిపోతానని ప్రకటించారు. అయితే తాను చివరి వరకు ఏసుక్రీస్తు అనుచరుడిగా ఉంటానని వెల్లడించారు.

కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంజన్న క్షేత్రం అభివృద్ధికి మరో రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.