తెలంగాణ: వార్తలు
15 Feb 2023
సికింద్రాబాద్తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరిన రైలు నెం.12727 గోదావరి ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. బీబీనగర్- ఘట్‌కేసర్ మధ్య ఈ ఘటన జరిగింది.
14 Feb 2023
కాంగ్రెస్కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తు; జోస్యం చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.
13 Feb 2023
పంకజ్ చౌదరీతెలంగాణ అప్పులు రూ. 4.33లక్షల కోట్లు; లోక్‌సభ్‌లో కేంద్రం ప్రకటన
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు గణనీయంగా పెరిగినట్లు చెప్పింది. లోక్‌సభలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.
11 Feb 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మహబూబాబాద్ సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని, రాళ్లదాడి కారణంగా ఒక కిటికీ పగిలిపోయిందని వార్తా సంస్థ పీటీడీ నివేదించింది.
09 Feb 2023
ఎన్నికల సంఘంఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్థానిక, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, తెలంగాణలోని ఒక నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి.
08 Feb 2023
కల్వకుంట్ల కవితదిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ
దిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది.
04 Feb 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)తెలంగాణ అసెంబ్లీ: ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శలు, మంత్రి కేటీఆర్ కౌంటర్
తెలంగాణ అసెంబ్లీలో ఏఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. హైదరాబద్ అభివృద్ధి, ప్రభుత్వం పనితీరుపై అక్బరుద్దీన్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
03 Feb 2023
కల్వకుంట్ల కవితఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
03 Feb 2023
బడ్జెట్తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది?
రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య ఉప్పు- నిప్పు చందంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10గంటలకు 'బడ్జెట్ 2023-24' సమావేశాలు మొదలు కానుండగా, అందరి దృష్టి తెలంగాణ అసెంబ్లీపైనే ఉంది.
30 Jan 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, సరిహద్దు ప్రాంతాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్
భారత రాష్ట్ర సమితి రెండో బహిరంగ సభను మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్య నాయకులకు అప్పగించారు.
27 Jan 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్!
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తన కుమారుడు శిశిర్‌తో కలిసి బీజేపీని వీడి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరనున్నట్లు ప్రకటించారు.
26 Jan 2023
పద్మశ్రీ అవార్డు గ్రహీతలుతెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన 'పద్మ' అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీనుంచి ఏడుగురికి అవార్టులు వచ్చాయి.
25 Jan 2023
గవర్నర్రాజ్భవన్లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం
కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
24 Jan 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం, స్టాలిన్, సోరెన్, తేజస్వీకి ఆహ్వానం
తుది మెరుగులు దిద్దుకుంటున్న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజున అంటే ఫిబ్రవరి 17న కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దాదాపు రూ. 700 కోట్లతో నిర్మించిన కొత్త ఐకానిక్ భవనాన్ని ఆ రోజు ఉదయం 11:30గంటలకు ప్రారంభించనున్నారు.
23 Jan 2023
అమెజాన్హైదరాబాద్లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
కస్టమర్లకు వేగంగా బుకింగ్ డెలివరీలను చేరవేసేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా హైదరాబాద్‌లో ఎయిర్ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. సోమవారం హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఎయిర్ సర్వీసులకు ప్రారంభించారు.
23 Jan 2023
భారతదేశంసీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డి డిప్యూటీ తహశీల్దార్ సస్పెండ్
సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్లోకి డిప్యూటీ తహశీల్దార్ చొరబడ్డ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే పోలీసులు డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేయగా, తాజాగా ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది.
20 Jan 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. గ్లోబల్ మల్టీ-బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' హైదరాబాద్‌లో సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
19 Jan 2023
భారతదేశంరూ. 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రభుత్వ ఉద్యోగి మర్డర్ డ్రామా
మెదక్ జిల్లా వెంకటాపూర్ గ్రామ శివార్లలోని కొండగట్టులో కారు దగ్ధమై, ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన ఘటనలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రభుత్వ ఉద్యోగి చనిపోలేదని రూ. 7కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ మర్డర్ డ్రామాకు తెరలేపాడని పోలీసుల విచారణలో తేలింది.
18 Jan 2023
బండి సంజయ్చిక్కుల్లో బండి సంజయ్ కుమారుడు, తోటి విద్యార్థులపై దాడి చేసిన వీడియోలు వైరల్
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. తోటి విద్యార్థులను కొట్టడంతో పాటు అసభ్యకర పదజాలంతో తిట్టిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
17 Jan 2023
చంద్రబాబు నాయుడురేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు
తెలంగాణలో మరో భారీ కార్యక్రమానికి టీడీపీ సిద్ధమవుతోంది. ఈనెల 18న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొననున్నారు.
16 Jan 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్
రాష్ట్ర అభివృద్ధి భాగస్వాములు కావాలని, రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, ఉద్యోగాలు కల్పించాలనుకున్నా పూర్తి సహకారం అందిస్తామని హామీ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు హామీ ఇచ్చారు.
12 Jan 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)ప్రతి గ్రామపంచాయతీకి రూ.10లక్షలు మంజురూ చేస్తాం: సీఎం కేసీఅర్
మహబూబాబాద్ జిల్లా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. గ్రామాలు, మున్సిపాలిటీలకు భారీగా నిధులను ప్రకటించారు. జిల్లాలోని పలు తాండాలను పంచాయతీలుగా మార్చామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించారు.
12 Jan 2023
నరేంద్ర మోదీప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. జనవరి 19న ప్రధాని పలు రైల్వే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు హైదరాబాద్ రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల పర్యటన వాయిదా పడినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.
11 Jan 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి నియామకం
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి తెలంగాణ మొట్టమొదటి మహిళా సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
11 Jan 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)తెలంగాణ సీఎస్: రామకృష్ణారావు వైపే కేసీఆర్ మొగ్గు!
తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీ ప్రక్రియ తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, శాంత కుమారిలో ఒకరు సీఎస్‌గా నియామకం అయ్యే అవకాశం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురిలో రామకృష్ణారావు ఎంపికకే కేసీఆర్ మొగ్గు చూపినట్లు సమాచారం.
11 Jan 2023
భారతదేశంహైదరాబాద్ హై'టెక్' పోలీస్: సైబర్ యూనిట్ బలోపేతానికి 'ఏఐ' సపోర్టు
హైదరాబాద్‌లో శాంతిభద్రతలను మరింత మెరుగు పర్చేందుకు నగర పోలీసులు ఈ ఏడాది ప్రత్యేక కార్యచరణతో ముందుకుపోతున్నారు. అధునాత టెక్నాలజీ సాయంతో రాజధానిని హైటెక్ నరగంగా మార్చేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేశారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ భవనంలో అన్ని విభాగాల పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో సిటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ కార్యాచరణను వివరించారు.
10 Jan 2023
ప్రధాన మంత్రి19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?
దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈనెల 19న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రధానికి స్వాగతం పలుకుతారా? లేదా? అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
10 Jan 2023
ఆంధ్రప్రదేశ్తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు
తెలంగాణ సీఎస్‌గా పని చేస్తున్న సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. సోమేష్‌కుమార్ కేడర్‌ను రద్దు చేసింది. ఏపీ క్యాడర్‌కు సోమేష్‌కుమార్ వెళ్లాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
09 Jan 2023
చంద్రబాబు నాయుడునిజామాబాద్పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్
తెలంగాణలో టీడీపీకి పుర్వవైభవం తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మరింత ఫోకస్‌గా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో వరుస కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు.
06 Jan 2023
బీజేపీతెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?
తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతోంది. అనుకున్నట్లుగా తెలంగాణలో కాస్త పుంజుకున్నా.. ఏపీలో మాత్రం ప్రభావాన్ని చూపలేకపోతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ క్రమంలో త్వరలో చేపట్టనున్న కేంద్రమంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ, ఏపీకి ప్రాధాన్యత కల్పించొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
02 Jan 2023
కర్ణాటక2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా..
2023 జనవరి 1 రాకతో.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టాయి. ఈఏడాది ఏకంగా 9రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే.. ఈ ఎలక్షన్స్‌ను సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
30 Dec 2022
భారతదేశంతెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్
తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా 1990 బ్యాచ్ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్ నియామకమయ్యారు. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్నఅంజనీకుమార్‌కు తెలంగాణ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.
30 Dec 2022
భారతదేశంన్యూఇయర్ అలర్ట్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెండ్
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 10గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
30 Dec 2022
ఆంధ్రప్రదేశ్తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ
తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో వైద్య విద్య చదివి.. అర్హత పరీక్ష రాయకుండానే.. ప్రాక్టీసు చేస్తున్న వైద్యులపై సీబీఐ గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మిగతా రాష్ట్రాల్లో 91చోట్ల సోదాలు నిర్వహించింది.
28 Dec 2022
రైల్వే శాఖ మంత్రిసంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
సంక్రాంతికి ఊళ్లకు వెళ్లాలనుకునే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ట్రెయిన్స్ నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. సకాలంలో వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు అదనంగా 94రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.
27 Dec 2022
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసు కీలక మలుపులు తీరుగుతోంది. తాజాగా ఈ కేసులో తదుపరి విచారణకు రావట్లేదని ఈడీకి రోహిత్ రెడ్డి చెప్పారు. తాను ఎందుకు రావట్లేదో.. మెయిల్ ద్వారా స్పష్టంగా వివరించారు.
24 Dec 2022
భారతదేశంటీఎస్పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ
సంక్షేమ హాస్టళ్లలో ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా నోటిఫికేషన్ ద్వారా 581 ఖాళీలను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, 2, మాట్రాన్ గ్రేడ్-1, 2, వార్డెన్ గ్రేడ్-1, 2తో పాటు మహిళా సూపరింటెండెంట్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
24 Dec 2022
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా?
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)తో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కేసీఆర్ అనుకున్నట్లే ఇతర రాష్ట్రాల్లో పాగా వేస్తారా? జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
23 Dec 2022
చంద్రబాబు నాయుడుతెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం?
అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. వ్యూహాత్మకంగా ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించి.. తెలంగాణలో చాలా కాలంగా యాక్టివ్‌గా లేని టీడీపీని చంద్రబాబు తిరిగి చర్చలోకి తీసుకోచ్చారు. టీడీపీ యాక్టివ్ అయితే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
23 Dec 2022
భారతదేశంగోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే..
హైదరాబద్‌లోని గోషామహల్ బస్తీలో అనూహ్య సంఘటన జరిగింది. ఉన్నట్టుండి పెద్ద నాల కుంగిపోయింది. దీంతో ఆ నాలాపై ఉన్న దుకాణాలు, అక్కడ నిలిపేసిన వాహనాలు అందులోకి పడిపోయాయి. వాహనాలు స్వల్పంగా దెబ్బ తినగా.. కొందరికి గాయాలయ్యాయి.