తెలంగాణ: వార్తలు

ఆసియాలోనే అతిపెద్ద నివాస సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద ప్రభుత్వ నివాస సముదాయాన్ని ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో దాదాపు 145 ఎకరాల విస్తీర్ణంలో 15 వేల 660 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించింది.

ట్రాఫిక్ నియంత్రణకు ఓఆర్ఆర్ చుట్టూ లింకురోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ చర్యలు

హైదరాబాద్ మహానగరం ఏడాదికేడాది వేగంగా విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు దాటి నలువైపులా పెరుగుతోంది.

నేటి నుంచి తెలంగాణలో ఆషాఢ బోనాలు.. తొలి బోనం ఆ అమ్మవారికే

ఆషాఢ మాసం వచ్చేసింది. తెలంగాణలో బోనాల పండగ సందడి మొదలైంది. నేటి నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి.గోల్కొండలో తొట్టెల ఊరేగింపుతో తొలి బోనాలు మొదలుకానున్నాయి.

శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ.. రేపు అమరవీరుల స్తూపం ఆవిష్కరణకు ఆహ్వానం

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది.

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ.. గద్దర్ ప్రజా పార్టీతోనే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రజాగాయకుడు 

తెలంగాణలో మరో నూతన రాజకీయ పార్టీ పుట్టింది. ప్రజా యుద్ధనౌకగా పేరు గాంచిన గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు; పార్కుల మూసివేత 

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు గురువారం ముగియనున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల ముగింపులో భాగంగా హైదరాబాద్‌లోని సచివాలయం ఎదురుగా, హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్; ఒక్కరోజే 11,241 మెగావాట్ల వినియోగం

తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతుందే కానీ, తగ్గడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగింది.

రేపు రైల్వే కోచ్‌ ప్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

తెలంగాణలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్, మెట్రో కోచ్‌లు తయారు చేస్తున్న మేధా సర్వో గ్రూప్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రారంభించనున్నారు.

ముడుమాల్‌ మెన్హిర్స్‌ కు యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

నారాయణపేట జిల్లా ముడుమాల్‌లోని మెన్హిర్స్‌ వారసత్వ సంపదకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి.

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్.. డబ్బులు, మద్యం పంచుకుండా గెలిపించాలని సూచన

తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రభుత్వం విద్యా దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ నేపథ్యంలో మంత్రి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కీలక పనులను చేపట్టింది.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట; ప్రభుత్వం ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటు 

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేళ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 2 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

జూన్ 20 గడుస్తున్నా వేసవి వేడితో అల్లాడుతున్న జనాలకు ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ నెల 11 నుంచి కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్దే నిలిచిపోయిన రుతుపవనాల్లో మళ్లీ కదలిక మొదలైంది.

రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త; ఈనెల 26నుంచి రైతుబంధు నగదు జమ 

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదును జమ చేయనున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్‌ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు; భారీగా మెఫెంటెర్‌మైన్‌ సల్ఫేట్‌ ఇంజక్షన్లు స్వాధీనం 

హైదరాబాద్‌లోని వట్టెపల్లిలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. మెఫెంటెర్‌మైన్‌ సల్ఫేట్‌ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు.

19 Jun 2023

ఉద్యోగం

TS KGBV Recruitment 2023: కస్తూర్బా విద్యాలయాల్లో 1241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 

తెలంగాణ రాష్ట్రాలలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(TS KGBV), అర్బన్ రెసిడెంట్ స్కూల్స్ (URS)లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకానికి కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఆఫర్: జూపార్కుల్లోకి ప్రవేశం ఉచితం 

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ రాష్ట్ర ప్రభుత్వం జంతుప్రదర్శనశాలల సందర్శకుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

వర్షాల జడలేక, ప్రాజక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు 

జూన్ మూడో వారం గడుస్తున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల జడలేదు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో జలాశయాల్లోని నీరు క్రమంగా అడుగంటిపోతున్న పరిస్థితి నెలకొంది.

నేటి నుంచి ఏపీలో వర్షాలు..తెలంగాణకు మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు

ఎప్పుడూ లేని రీతిలో నైరుతి రుతుపవనాలు అటు అన్నదాతలను, ఇటు సాధారణ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.

Telangana Forest Dept: రీల్స్, వీడియోలు తీసేయ్, అవార్డులు పట్టెయ్ 

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. దశాబ్ది ఉత్సవాల్లో జూన్ 19న 'హరితోత్సవం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖ కీలక ప్రకటన చేసింది.

తెలంగాణను వరించిన 5 యాపిల్ అవార్డులు.. యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ గుర్తింపు

తెలంగాణ 5 అంతర్జాతీయ అవార్డులను సాధించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 5 ప్రముఖ నిర్మాణాలను లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ గుర్తించింది. ఈ క్రమంలో గ్రీన్‌ యాపిల్‌ అవార్డులను ప్రకటించింది.

నిమ్స్ ఆస్పత్రికి మహర్ధశ.. విస్తరణకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిమ్స్ ఆస్పత్రిని విస్తరించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుబంధ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

గ్రేహౌండ్స్‌ గురువు బాటీ కన్నుమూత.. సీఎం కేసీఆర్, డీజీపీ అంజనీకుమార్‌ సంతాపం

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌కు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి భాటీ మంగళవారం మరణించారు. ఉమ్మడి ఏపీలోని పోలీసులకు నారాయణ్‌ సింగ్‌ బాటీ అంటే దాదాపుగా తెలియనివారు ఉండకపోవచ్చు.

తెలంగాణలో ఐటీ దాడుల కలకలం: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు 

తెలంగాణలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుతున్నాయి.

ప్రజల్ని మోసగించలేకే బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా: కేసీఆర్ సన్నిహితుడు కుచాడి శ్రీహరిరావు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత, సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కూచాడి శ్రీహరిరావు అధికార పార్టీకి బైబై చెప్పారు.

13 Jun 2023

మేడ్చల్

కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే 

హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న మేడ్చల్ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఇద్దరు కొత్త పెళ్లైన జంట కావడం గమనార్హం.

నైరుతి మరింత ఆలస్యం.. వచ్చే 4 వారాల పాటు రుతుపవనాలు లేవు, వర్షాల్లేవ్

ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పై రుతుప‌వ‌నాలు మందగమనం ప్రతికూల ప్ర‌భావమే ఉండ‌బోతుందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రైవేట్ వాతావ‌ర‌ణ సంస్థ స్కైమెట్ అంచ‌నా వేసింది. దీనికి కారణం, రానున్న మరో నాలుగు వారాల పాటు రుతుపవనాల కదిలకలు నెమ్మదిగా సాగుతుండటమేనని వివరించింది.

కేంద్రం పన్నుల్లో వాటా : ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం

భారతీయ జనతా పార్టీ అగ్రనేతల వరుస పర్యటనల నేపథ్యంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు నిధుల ప్రవాహం పారిస్తోంది. ఈ మేరకు 3వ విడత కేంద్ర జీఎస్టీ పన్నుల నిధులను విడుదల చేసింది.

మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు

తెలంగాణలో మరో ప్రజాప్రతినిధి కన్నుమూశారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కీలక నేత మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు.

12 Jun 2023

పన్ను

రాష్ట్రాలకు మూడో విడత పన్నుల పంపిణీ; రూ.1.1 లక్షల కోట్లను విడుదల చేసిన కేంద్రం 

ప్రభుత్వ పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటాను సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ బొనాంజ.. దసరాకి చెల్లిస్తామన్న సీఎం

సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్‌ బొనాంజా ప్రకటించింది. వార్షిక లాభాల్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ రూ.2184 కోట్ల లాభాలను వచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగ, కార్మికులకు రూ.700 కోట్ల ప్రొడక్షన్ బోనస్ రాబోతోంది.

కరీంనగర్: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఘోర ప్రమాదం జరిగింది.

తెలంగాణలో పునఃప్రారంభమైన పాఠశాలలు.. 41 వేల స్కూళ్లు, గురుకులాల రీ ఓపెన్

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వేసవి సెలవులు నేటితో ముగిశాయి. దాదాపు 45 రోజుల విరామం తర్వాత బడి గంటలు మోగుతున్నాయి.

రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ

నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 1 పరీక్ష ఆదివారం జరగనుంది. పేపర్ లీకేజీతో రద్దు అయిన పరీక్షను కమిషన్‌ ఆదివారం ( జూన్ 12న ) మరోసారి నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గ్రూప్‌-1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్ 

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. ఈ మేరకు సిట్‌ అధికారులు దాఖలు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు ఈ కేసులో రూ.1.63 కోట్ల మేర లావాదేవీలు జరిగాయని విచారణలో తేలిందన్నారు.

ఈటలకు అధిష్ఠానం పిలుపు.. కీలక పదవి అప్పగించే అవకాశం

తెలంగాణ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా రెపరెపలాడించాలన్నది భారతీయ జనతా పార్టీ జాతీయ నేతల లక్ష్యం. ఇందుకోసం అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలు చేయనున్నారు.

ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన మంత్రి గంగులను రక్షించిన భద్రతా సిబ్బంది

కరీంనగర్ గ్రామీణ మండలం, ఆసిఫ్ నగర్ లో నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కి పెను ప్రమాదం తప్పింది.

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ కానుక.. జూన్‌ 20 నుంచి ప్రతిరోజూ రాగిజావా

తెలంగాణ ప్రభుత్వం బడి పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కార్ పాఠశాలల్లో విద్యార్థులకు ఉధయం అల్పాహారంగా రాగిజావను అందించనున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం

ఐఎండీ తీపి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళ,తమిళనాడు రాష్ట్రాలను తాకాయి. 48 గంటల్లో కేరళ, తమిళనాడులో విస్తరించి కర్ణాటకలోని కొన్ని భాగాలలో సైతం అవి ప్రవేశించనున్నాయి.

08 Jun 2023

దిల్లీ

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వీడియో విడుదల.. జాతీయ మహిళా కమిషన్ లో శేజల్ ఫిర్యాదు 

తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా బాధితురాలను చిన్నయ్యకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేయడం రాజకీయాల్లో కలకలం రేపుతోంది.