భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Lok Sabha: నేడు లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది.
Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్! ఇవాళ మీ ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు జమ!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో 'రైతు భరోసా' నిధులను జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Air Show: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో.. నేటి నుంచి ఏరో ఇండియా 2025
ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షోగా గుర్తింపు పొందిన 'ఏరో ఇండియా' 15వ ఎడిషన్‌కు సర్వం సిద్ధమైంది.
Srisailam: తిరుపతి తొక్కిసలాటతో అప్రమత్తం.. శ్రీశైలంలో శివరాత్రి ఏర్పాట్లపై నేడు ఆరుగురు మంత్రుల పరిశీలన
శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
Telangana: తుదిదశకు చేరుకున్న యాదగిరిగుట్ట స్వర్ణ విమానం పనులు.. 19 నుంచి మహా కుంభాభిషేకం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమానం (గోపురం) స్వర్ణ తాపడం పనులు తుదిదశకు చేరుకున్నాయి.
Dunki Route:డంకీ రూట్‌లో అమెరికాకు ప్రయాణం.. మార్గమధ్యంలో పంజాబీ యువకుడు మృతి
అమెరికా తన దేశానికి అక్రమంగా వచ్చిన 104 మంది భారతీయులను ఇటీవల తిరిగి పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమంగా అమెరికా వెళ్లే మార్గాలపై చర్చ మళ్లీ ఊపందుకుంది.
Talliki Vandanam: తల్లికి వందనం పథకం అమలు పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. విధి విధానాలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు పై కసరత్తును ప్రారంభించింది.
Pariksha Pe Charcha: నేటి నుండి పరీక్షా పే చర్చ కార్యక్రమం.. Live ఎలా చూడాలంటే?
పరీక్షా పే చర్చా 2025 ఎనిమిదో సీజన్ ఫిబ్రవరి 10న ప్రారంభంకానుంది.
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల ప్రీ-గ్రౌండింగ్ సమావేశాల ఏర్పాటుకు యంత్రాంగం సిద్ధం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అధికారులు సిద్ధం చేశారు.
Andhra Pradesh: రూ.17,000 కోట్లతో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు గ్రీన్ ఎనర్జీ కారిడార్!
రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 1,200 సర్క్యూట్ కిలోమీటర్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది.
Biren Singh: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా
మణిపూర్‌లో రాజకీయాలు మరింత వేడక్కాయి.
Amit Shah: 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం.. అమిత్ షా
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
Delhi New CM: దిల్లీ నూతన సీఎం ఎంపికపై అమిత్ షాతో నడ్డా కీలక భేటీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ముమ్మర కసరత్తు చేపట్టింది.
'Dhar Gang': దక్షిణాదిని గడగడలాడించిన 'ధార్ గ్యాంగ్' అరెస్టు
దేశంలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన 'ధార్ గ్యాంగ్'ను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
AAP: దిల్లీ ఎన్నికల్లో ఓటమితో ఆప్‌కి షాక్.. పంజాబ్‌లో మోడల్ మార్చక తప్పదా?
జాతీయ పార్టీ స్థాయిని సాధించిన ఆమ్‌ఆద్మీ పార్టీకి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది.
#NewsBytesExplainer: దిల్లీ ఎన్నికల్లో పరాజయం...ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదాను కోల్పోతుందా?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
Ham radio: ఉగ్రకుట్ర సంకేతాలు..? బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రేడియో సిగ్నళ్ల కలకలం!
పశ్చిమ బెంగాల్‌లోని అమెచ్యూర్ హామ్ రేడియో సంస్థ దేశంలో ఉగ్రదాడుల కోసం కుట్ర జరుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేసింది.
Delhi: దిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కీలక నిర్ణయం.. ప్రమాణస్వీకార తేదీ ఫిక్స్!
దేశ రాజధాని దిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
Congress : పంజాబ్‌లో కూడా ఆప్‌కు భవిష్యత్తు లేనట్లే : కాంగ్రెస్
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొనడంపై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.
Purandeswari: దిల్లీ గెలుపుతో దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలు: పురందేశ్వరి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందించారు.
Atishi Marlena : సీఎం పదవికి అతిశీ రాజీనామా
దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం పదవికి అతిశీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించారు.
Encounter: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం.
GHMC : హైదరాబాద్‌లో కొత్త టూరిస్ట్ స్పాట్.. మీర్ ఆలం చెరువుపై 2.4 కిలోమీటర్ల బ్రిడ్జి!
హైదరాబాద్ నగరంలోని మీర్ ఆలం చెరువుపై నిర్మించే బ్రిడ్జిని నగరంలోని ప్రముఖ ఆకర్షణగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం.. చికిత్స పొందుతూ మహిళ మృతి
తెలంగాణలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) బారిన పడిన ఓ మహిళ మరణించడంతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.
Delhi LG: ఫైళ్ల తరలింపుపై నిఘా.. దిల్లీ సచివాలయానికి ఎల్జీ కొత్త మార్గదర్శకాలు!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Narendra Modi: అంకితభావంతో పనిచేస్తాం.. దిల్లీ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు
దిల్లీ ప్రజలు 27 ఏళ్లుగా కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనను అనుభవించిన తరువాత ఈసారి బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీకి భారీ విజయాన్ని అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
Chandrababu: దిల్లీలో బీజేపీ విజయానికి ప్రధాన కారణం మోదీనే : చంద్రబాబు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసమే కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
Arvind Kejriwal: ప్రజా తీర్పును గౌరవిస్తాం.. బీజేపీకి శుభాకాంక్షలు : అరవింద్ కేజ్రీవాల్
ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టామని, ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Delhi Election Analysis: దిల్లీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్స్ ఎవరు?.. ఆప్ ఓటమికి ముఖ్య కారణాలు ఇవేనా!
దేశ రాజధాని దిల్లీలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని భావించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ గట్టి షాకిచ్చింది.
Parvesh Varma: దిల్లీ సీఎం అభ్యర్థిగా పర్వేష్ వర్మ? అమిత్ షాతో కీలక చర్చలు
దిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించి, ఆప్ అగ్రనేతలను ఓడించి దిల్లీపై పట్టు సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 చోట్ల బీజేపీ విజయం సాధించగా, 22 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం దక్కించుకుంది.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా అగ్రనేతలు మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ పరాజయం పాలయ్యారు.
Congress: దిల్లీలో కాంగ్రెస్ దారుణ ఓటమి.. ఖాతా కూడా తెరవలేకపోయిన హస్తం
దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీ పని కంచికే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
Omar Abdullah: కొట్టుకుంటూ ఉండండి.. ఇండియా కూటమిపై ఒమర్ అబ్దుల్లా తీవ్ర విమర్శలు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుతోంది. ఈ తరుణంలో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.
Milkipur Bypoll: మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
SVAMITVA scheme: స్వమిత్వ పథకం పనులకు నూతన ఊపు.. మళ్లీ ప్రారంభమైన సర్వేలు
గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించే 'స్వమిత్వ పథకం' మళ్లీ కార్యరూపం దాల్చింది.
AAP: ఆప్‌కు షాక్.. కేజ్రీవాల్ సహా కీలక నేతలంతా వెనకంజలో!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. దశాబ్దం పాటు దిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
Delhi Election Results: దిల్లీలో కమలం జోరు.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 జిల్లాల్లోని 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తుండగా ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది.
Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి భారీ ఎదురుదెబ్బ: ఎర్లీ ట్రెండ్స్‌లో వెనకబడ్డ ఆప్!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది.
Ration Cards: మీ-సేవ ద్వారా కొత్త రేషన్‌కార్డులు.. మార్పులు, చేర్పులకు అవకాశం!
తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నూతన రేషన్‌కార్డుల కోసం అర్హులైన వారు మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
Delhi:దిల్లీ పీఠం ఎవరిది? మొదలైన కౌంటింగ్
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.