బీజేపీ: వార్తలు

13 May 2023

కర్ణాటక

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా?

కర్ణాటకలో 1985 నుంచి అధికారంలో ఉన్న పార్టీ తిరిగి పవర్ లోకి వచ్చిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాలని బీజేపీ భావించింది.

13 May 2023

కర్ణాటక

అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కర్ణాటక ఓటర్లు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. గత 38ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించారు.

మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: రాహుల్ గాంధీ 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తమ పార్టీ భారీ విజయంతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రజలకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.

తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తరపు న్యాయవాది టీఎన్ బీజేపీ చీఫ్ అన్నామలైపై బుధవారం పరువు నష్టం కేసు నమోదు చేశారు.

08 May 2023

కర్ణాటక

సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్‌కు చేరింది. వాడివేడీగా మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.

05 May 2023

కర్ణాటక

మతం ఆధారంగా ఓట్లు అడగడం సిగ్గుచేటు : అక్బరుద్దీన్ ఓవైసీ

రాబోయే కర్ణాటక ఎన్నికల్లో మెజారిటీ మతం ఆధారంగా కాంగ్రెస్, బీజేపీ ఓట్లు ఆడగడం సిగ్గుచేటు అని ఏఐఎంఐఎం ఛీప్ అసరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.

01 May 2023

కర్ణాటక

కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో; ఏడాదికి మూడు సిలిండర్లు, రోజుకు అర లీటర్ నందిని పాలు ఉచితం 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ జాతీయ(బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం బెంగళూరులో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని విషసర్పంతో పోల్చారు.

'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.

తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్ 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న హామీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.

23 Apr 2023

కర్ణాటక

Karnataka Elections 2023: హిమాచల్ ఎన్నికల ఫలితాలే కర్ణాటకలో రిపీట్ అవుతాయా? 

దేశంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం.

ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ అమలు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు బ్లూ మార్క్‌ను కోల్పోయారు.

రాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ 

క్రిమినల్ పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్ కోర్టు గురువారం కొట్టివేసింది.

యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు

గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.

18 Apr 2023

కర్ణాటక

బీఎల్ సంతోష్ కుట్ర వల్లే నేను బీజేపీ నుంచి బయటకు వచ్చా: జగదీశ్ శెట్టర్

బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

13 Apr 2023

కర్ణాటక

 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ 

మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వేలం పాటలో బిడ్ వేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు?

ఎప్పుడూ అదానీ అంశంపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నించే అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కాంగ్రెస్‌ను వీడిన నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే రాహుల్ చేసిన ఆ ట్వీట్‌కు తీవ్ర స్థాయిలో ప్రతి స్పందన వ్యక్తమవుతోంది.

బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు

తొలి భారత గవర్నర్ జనరల్, కాంగ్రెస్ దిగ్గజం సి.రాజగోపాలాచారి మనవడు, తమిళనాడుకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు సిఆర్ కేశవన్ శనివారం బీజేపీలో చేరారు.

అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా?

మహారాష్ట్ర మరో రాజకీయ కుదుపునకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం దిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

నేడు బీజేపీలోకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర పెద్దల సమక్షంలో ఆయన ఆయన పార్టీలో చేరనున్నారు.

06 Apr 2023

కేరళ

బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పదమైన బీబీసీ డాక్యుమెంటరీని విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగడంతో జనవరిలో ఆయన కాంగ్రెస్‌కతు రాజీనామా చేశారు.

06 Apr 2023

కర్ణాటక

అసెంబ్లీ ఎన్నికలు: 'రాహుల్ జీ.. కర్ణాటక సమస్యలపై గొంతు విప్పాలి'; కాంగ్రెస్ శ్రేణుల వేడుకోలు

నెల రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఆశపడుతుంది.

10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్

10వ తరగతి హిందీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్ బుధవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ

ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను ఏకపక్షంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ

శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంపై మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక కోరింది.

బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్

బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం అన్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తమతో చెప్పిందని పేర్కొన్నారు.

దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉత్తర భారత పర్యటనలో ఉన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం పవన్ పర్యటించారు. పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు.

సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్

పరువు నష్టం కేసులో సూరత్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం గుజరాత్‌లోని సూరత్‌లోని సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేయనున్నారు. అయితే ఈ కేసును ఈ రోజే విచారించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

శ్రీరామనవమి శోభాయాత్రలో మళ్లీ ఘర్షణలు; బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో శ్రీరామనవమి వేడుకల అనంతరం ఆదివారం నిర్వహించిన స్వామివారి ఊరేగింపులో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే గాయపడ్డారు.

27 Mar 2023

కర్ణాటక

రిజర్వేషన్ల కోసం ఆందోళన; యడ్యూరప్ప ఇల్లు, కార్యాలయంపై రాళ్ల దాడి

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) అంతర్గత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సోమవారం శివమొగ్గ జిల్లాలో బంజారా, భోవి సంఘాల కార్యకర్తలు సోమవారం మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఇల్లు, కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అనంతరం రాళ్లు రువ్వారు.

25 Mar 2023

కర్ణాటక

బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని కర్ణాటక ప్రజలు నిర్ణయించినట్లు ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. కర్ణాటకలోని దావణగెరెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా తగ్గేది లేదు, జైల్లో పెట్టినా భయపడను: రాహుల్ గాంధీ

పరువు నష్టం కేసులో సూరుత్ కోర్టు తీర్పు, లోక్‌సభలో అనర్హత వేటు, అధికార బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం నిప్పులు చెరిగారు. ఏఐసీసీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రం తనపై చేసిన ఆరోపణలపై లోక్‌సభలో మాట్లాడేందుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్సీ బాబూరావు చించన్‌సూర్ పార్టీని వీడారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు.

ప్రపంచంలోనే బీజేపీ అత్యంత ముఖ్యమైన పార్టీ: వాల్ స్ట్రీట్ జర్నల్

భారతీయ జనతా పార్టీపై అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ అని పేర్కొంది. వాల్టర్ రస్సెల్ మీడ్ ఈ కథనాన్ని రాశారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ

కోల్‌కతా నుంచి వర్చువల్‌గా జరిగిన ముర్షిదాబాద్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచనల వ్యాఖ్యలు చేశారు.

19 Mar 2023

కర్ణాటక

అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం!

కర్ణాటక అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే 24తో ముగియనుంది. రాష్ట్రంలో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి.