నరేంద్ర మోదీ: వార్తలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీకానున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

ప్రపంచాన్ని ఊపేస్తున్న 'నాటు..' పాటతో తెలుగు ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిలబెట్టడమే కాదు ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్న RRR సినిమా బృందం ఇటీవలే తిరిగి హైదరాబాద్ వచ్చారు. భారతదేశానికి ఆస్కార్ అవార్డును తెచ్చి పెట్టిన ఆ సినిమా బృందాన్ని అభినందిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఆ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు ఆహ్వానం అందింది.

Fake News: నోబెల్ బహుమతికి ప్రధాని మోదీ బలమైన పోటీదారు అని చెప్పలేదు: అస్లే టోజే

భారత పర్యటనలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి కమిటీ సభ్యుడు అస్లే టోజే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

'యోగా మహోత్సవ్‌'లో పాల్గొనాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 100 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల 'యోగ మహోత్సవ్'లో ఆనందంగా పాల్గొనాలని పౌరులను ఆహ్వానించారు. ప్రజలు ఇప్పటికే యోగా చేయకపోతే, ఆసనాలను నేర్చుకొని వారి జీవితాల్లో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

ఇటీవల లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే బీజేపీ నాయకుల తీరుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.

3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ

ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీని కొట్టినందుకు భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీకి నటి అనుష్క శర్మ అతిపెద్ద చీర్‌లీడర్‌గా మారారు. అతను నవంబర్ 2019లో బంగ్లాదేశ్‌పై తన చివరి టెస్టు సెంచరీని సాధించాడు.

12 Mar 2023

కర్ణాటక

కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా కృష్టి చేస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దక్షిణాదిన బీజేపీకి కీలకమైన కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని మోదీ భావిస్తున్నారు. అందుకే గత మూడు నెలల్లో ఇప్పటికే ఐదు సార్లు రాష్ట్రంలో పర్యటించగా, ఆదివారం మరోసారి కర్ణాటకకు రానున్నారు.

ఆస్ట్రేలియా ప్రధానితో హిందూ ఆలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించిన మోదీ

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఆ దేశంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారతీయ సమాజం భద్రత విషయంలో ఆస్ట్రేలియా ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు మోదీ చెప్పారు.

నేడు మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం; ప్రధాని మోదీ హాజరు

ఎన్‌డీపీ చీఫ్ నీఫియు రియో, ఎన్‌పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా నాగాలాండ్, మేఘాలయ ముఖ్యమంత్రులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మార్చి 9 నుంచి చివరి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ను చూడటానికి తొలి రోజు నరేంద్ర మోదీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ రానున్నారు.

06 Mar 2023

మేఘాలయ

మేఘాలయలో 45కు చెరిన సంగ్మా బలం; నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

మేఘాలయ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సోమవారం తొలిసారి అసెంబ్లీ సమావేశం అవుతోంది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నేడు రాత్రి 7గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి 7 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ప్రధాని ఏ విషయంపై మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది.

సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ

అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో బహుపాక్షిక(ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ వేదికలు) సంస్థలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు. దిల్లీలో గురువారం జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు.

సాంకేతికత సాయంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో సాంకేతికత భారత్‌కు సాయపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్‌కు అస్వస్థత; చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక

ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

27 Feb 2023

కర్ణాటక

అసెంబ్లీ ఎన్నికలు: కర్ణాకటపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్; శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం

మరో రెండు నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఆ రాష్ట్రంపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏమాత్రం అవకాశం వచ్చినా ఆయన కర్ణాటక‌లో పర్యటిస్తున్నారు. 2023లో ఇప్పటి వరకు రెండు నెలల్లోనే ఏకంగా ఐదు సార్లు మోదీ కర్ణాటకలో పర్యటించడం గమనార్హం.

Mann Ki Baat: 'ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో క్లాత్ సంచులు వాడాలి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు

స్వచ్ఛ భారత్ అభియాన్‌లో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 98వ 'మన్ కీ బాత్' ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక అంశాలపై మాట్లాడారు.

25 Feb 2023

జర్మనీ

ప్రధాని మోదీతో జర్మన్ ఛాన్సలర్‌ భేటీ; రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్వైపాక్షిక అంశాలపై చర్చ

రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం భారత్‌కు వచ్చిన జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌ రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.

మేఘాలయ: నరేంద్ర మోదీ సమాధిపై కాంగ్రెస్ కామెంట్స్; అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రధాని

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. నాగాలాండ్‌లో శుక్రవారం ప్రధాని మోదీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షిల్లాంగ్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

24 Feb 2023

కోవిడ్

మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది'

కరోనా సమయంలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన్ని కేంద్ర ఆరోగ్య‌మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా కరోనా టీకా కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల కోవిడ్ సమయంలో దేశంలో 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడగలిగినట్లు ఆయన చెప్పారు.

ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ పేరు, ఆయన తండ్రి పేరును కాంగ్రెస్ నాయకులు అపహాస్యం చేస్తున్నారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌సభ్యుల భయంకరమైన వ్యాఖ్యలను దేశం క్షమించదని శర్మ పేర్కొన్నారు.

20 Feb 2023

గుజరాత్

మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో గతేడాది అక్టోబర్ 30న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 135 మంది మృతిన ఈ ఘటనపై విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుజరాత్ హైకోర్టుకు సోమవారం నివేదికను సమర్పించింది.

మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై పెట్టుబడిదారుల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మండిపడ్డారు.

15 Feb 2023

కెనడా

కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు

కెనడాలోని మిస్సిసాగాలోని రామమందిరంపై కొందరు దుంగడులు దాడి చేశారు. దీంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యతిరేక భావం జాలం ఉన్న వారే ఈ దాడులు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

14 Feb 2023

బీబీసీ

ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం

ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్, పీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించాయి. కమల దళం కూడా అదేస్థాయిలో తిప్పికొట్టింది.

14 Feb 2023

బీబీసీ

BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు

ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ

2024-25 నాటికి రక్షణ ఎగుమతులను 5 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గత 8-9 సంవత్సరాల్లో భారతదేశం తన రక్షణ రంగాన్ని పునరుజ్జీవింపచేసిందన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని మోదీ స్పష్టం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా 2023'ని బెంగళూరులో ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు.

ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఆసియాలోనే అతిపెద్ద ఎయిరో షో 'ఏరో ఇండియా 2023' 14వ ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెంగళూరులో యలహంక వైమానిక స్థావరంలో ప్రారంభించనున్నారు.

11 Feb 2023

త్రిపుర

'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం

త్రిపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ప్రధాని మోదీ కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రెండు పార్టీలు రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టినట్లు ఆరోపించారు.

ఐదు రాష్ట్రాలను కలిపే దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే; రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిని కలుపుతూ, ఐదు రాష్ట్రాల గుండా వెళ్లే ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను కేంద్రం చేపడుతోంది. 1,386 కిలోమీటర్లు దూరంతో దాదాపు రూ.4లక్షల వ్యయంతో నిర్మిస్తున్న దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే మొదటి ఫేజ్‌ను ఆదివారం ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు.

ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు ఎవరు ముందుకొచ్చిన స్వాగతిస్తామని అమెరికా పేర్కొంది. అయితే భారత ప్రధాని మోదీకి మాత్రం యుద్ధాన్ని ఆపే శక్తి ఉందని వైట్ హౌస్ చెప్పింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ ఒప్పించగలరని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు.

గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. బుధవారం లోక్‌సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన మోదీ, గురువారం రాజ్యసభలో కూడా మాటల తూటాలను పేల్చారు.

09 Feb 2023

రాజ్యసభ

కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను దేశం సీరియస్‌గా తీసుకుంటోందని, ఈ క్రమలో కొంతమంది ఎంపీల ప్రవర్తన ప్రజలను నిరాశకు గురి చేసిందని ప్రధాని మోదీ అన్నారు.

కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు.

రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఆమె అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు.

అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌‌గాంధీ మంగళవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో ఆయన అదానీ అంశాన్ని లేవనెత్తారు. గౌతమ్ అదానీ ప్రయోజనాలను కోసం మోదీ ప్రభుత్వం వ్యాపార నియమాలను మార్చిందని ఆరోపించారు. ఈ సందర్భంగా విమనంలో అదానీతో కలిసి ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని రాహుల్ ప్రదర్శించారు.

టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్

వరుస భూకంపాలతో అల్లాడుతున్న టర్కీకి ఆపన్న హస్తం అందించడం కోసం ప్రత్యేక విమానాన్ని భారత్ పంపింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌తో పాటు నైపుణ్యం కలిగిన డాగ్ స్క్వాడ్‌లు, వైద్య సామగ్రి, అధునాతన డ్రిల్లింగ్ పరికరాలు, ఇతర కీలకమైన సాధనాలతో ఈ విమానం బయలుదేరింది.

06 Feb 2023

కర్ణాటక

ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం. ఇది లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది.

'మిల్లెట్స్‌తో ట్రై చేయండి', వంట చేయడంలో 'బిల్ గేట్స్ 'కు ప్రధాని మోదీ టిప్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రోటీ తయారు చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ప్రధాని మోదీ శనివారం షేర్ చేశారు. అంతేకాదు బిల్ గేట్స్‌కు వంటచేయడంలో ఒక టిప్ కూడా ఇచ్చారు.

'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1'

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోదీ అని అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' వెల్లడించింది. ఈ సంస్థ 'గ్లోబల్ లీడర్ అప్రూవల్' పేరుతో చేసిన సర్వేలో 78 శాతం అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని మోదీని ఆమోదించినట్లు పేర్కొంది.

'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్

జమ్ముకశ్మీర్‌లో పండిట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. వారి మమస్యలకు పరిషారం చూపాలని విజ్ఞప్తి చేశారు.