నరేంద్ర మోదీ: వార్తలు

ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్సెస్ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు ముగింపు పడే అవకాశం కనిపించడం లేదు. శుక్రవారం ఇరు‌వర్గాల మధ్య ఢీఅంటేఢీ అనేలా మాటల తూటాలు పేలాయి.

బీబీబీ డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీ నిషేధానికి వ్యతిరేకంగా మహువా మోయిత్రా, జర్నలిస్టు ఎన్‌ రామ్‌, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, న్యాయవాది ఎంఎల్‌ శర్మ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది.

Union Budget 2023-24: మౌలిక రంగానికి పెద్దపీట, కేంద్ర బడ్జెట్‌‌లో హైలెట్స్ ఇవే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టారు.

ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది సజీవ దహనమయ్యారు. ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్‌మెంట్‌లో మంటలు చేలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ధన్‌బాద్‌ డీఎస్పీ ప్రకటించారు.

బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టులో విచారణ

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

28 Jan 2023

దిల్లీ

బీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని దిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేయగా, ఆ సమయంలో గందరగోళం నెలకొంది.

banned documentaries: భారత్‌లో నిషేధించిన ఈ ఐదు డాక్యుమెంటరీల గురించి తెలుసుకోండి

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా?

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తొమ్మిది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా రాజస్థాన్‌‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని బీజేపీ భావిస్తోంది. అందుకే మోదీ కూడా రాజస్థాన్‌పై శ్రద్ధ కనబరుస్తున్నారు.

27 Jan 2023

దిల్లీ

నేడు దిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించినా దేశంలో ప్రదర్శనలు ఆగడం లేదు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో పలు విద్యార్థి సంఘాలు ప్రతిష్టాత్మంగా తీసుకొని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా దిల్లీ యూనివర్సిటీలో ఎన్ఎస్‌యూఐ, భీమ్ ఆర్మీ, వామపక్షతో పాటు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నార్త్ క్యాంపస్‌లో ప్రదర్శించనున్నట్లు పిలుపునిచ్చారు.

హెచ్‌సీయూలో ఉద్రిక్తత: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ vs కాశ్మీర్ ఫైల్స్‌ ప్రదర్శించిన ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఎస్ఎఫ్ఐ, కాశ్మీర్ ఫైల్స్‌ సినిమాను ఏబీవీపీ పోటీ పడి మరీ ప్రదర్శించడంతో హెచ్‌సీయూలో మరోసారి వివాదం రాజుకుంది.

గణతంత్ర వేడుకలు: ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ తలపాగా- దేశంలో వైవిధ్యానికి ప్రతీక

74వ గణతంత్ర వేడుకల వేళ ప్రధాని మోదీ తలపాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి స్వాతంత్య్ర, రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఆయన వస్త్రాధారణ హైలెట్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా మోదీ ధరించే తలపాగా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.

74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు

దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళితో గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దిల్లీలోని కర్తవ్య‌పథ్‌లో రిపబ్లిక్ డే వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కర్తవ్య‌పథ్‌లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ హాజరయ్యారు.

ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు

జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా బుధవారం భారత్ చేరుకున్న అబ్దెల్ ఫతాహ్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు.

25 Jan 2023

కేరళ

కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ పార్టీకి రాజీనామా చేశారు.

25 Jan 2023

దిల్లీ

జేఎన్‌యూలో హై టెన్షన్: మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని చూస్తున్న విద్యార్థులపై రాళ్లదాడి

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో మంగళవారం రాత్రి హై డ్రామా జరిగింది. వామపక్ష విద్యార్థులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో బీబీసీ డాక్యుమెంటరీని చూసేందుకు గుమికూడగా వారిపై రాళ్లదాడి జరిగింది. దీంతో జేఎన్‌యూలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

హెచ్‌సీయూలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన, యూనివర్సిటీ అధికారులకు ఏబీవీవీ ఫిర్యాదు

ప్రధాని మోదీ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తాజాగా ఈ వివాదాస్పద విషయం హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి చేరుకుంది.

బీబీసీ డాక్యుమెంటరీ: 'భారత్- అమెరికా భాగస్వామ్య విలువలు గురించి మాత్రమే తెలుసు'

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ విషయం ఇప్పుడు అంతర్జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే దీనిపై యూకే స్పందించగా, సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ బీబీసీ డాక్యుమెంటరీపై స్పందించారు.

23 Jan 2023

బడ్జెట్

బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు

భారత ప్రభుత్వం మార్చి 2024 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 16 ట్రిలియన్ రూపాయలు ($198 బిలియన్లు) అప్పుగా తీసుకుంటుంది.

21 అండ‌మాన్ దీవుల‌కు వీరుల పేర్లు, నేతాజీ స్మారక నమూనాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

అండ‌మాన్ నికోబార్ దీవుల్లోని 21 పేరు లేని దీవులకు పరమవీర చక్ర అవార్డు పొందిన 21 మంది వీరుల పేర్లను పెట్టారు ప్రధాని మోదీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి 23) సందర్భంగా నిర్వహించిన 'పరాక్రమ దివస్'లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోదీ ఈ పేర్లను ప్రకటించారు.

బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుతం భారత ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వీడియోకు సబంధించిన యూట్యూబ్ లింకులను కేంద్రం భ్యాన్ చేయడంపై జాతీయస్థాయిలో రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్రం తీసుకున్న చర్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశం

ప్రధాని మోదీపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తీవ్ర దుమారం రేగుతోంది. భారత ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్‌గా స్పందిస్తోంది. బ్రిటన్ పార్లమెంట్‌లో కూడా డాక్యుమెంటరీపై చర్చ జరిగింది. తాజాగా డాక్యుమెంటరీలో మొదటి ఎపిసోడ్‌ను బీబీసీ ప్రసారం చేసింది. అయితే ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో లింక్ ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి.

ప్రదాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: 'వలసవాద ఆలోచనా ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది'

ప్రధాని మోదీపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని భారత్ తీవ్రంగా స్పందించింది. అపఖ్యాతితో కూడుకున్న కథనాన్ని ముందుకు తీసుకురావడానికి రూపొందించబడిన ప్రచారాస్త్రంగా కనపడుతోందని చెప్పింది.

భారత్‌తో మూడు యుద్ధాలు తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని ఆయన చెప్పారు. కశ్మీర్ విషయంపై ఇప్పుడు పొరుగుదేశంతో శాంతి చర్చలను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్‌కు చెందిన అల్ అరేబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ

ప్రపంచంలోనే అతిపొడవైన నదీ యాత్రకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వారణాసిలో ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ 'ఎంవీ గంగా విలాస్‌'ను వర్చువల్‌గా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశ పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం

సోషలిస్టు నేత, కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా వెళ్లడించారు. శరద్ యాదవ్‌కు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

భద్రతలో వైఫల్యం: ప్రధాని మోదీపైకి దూసుకొచ్చిన యువకుడు

కర్ణాటకలో జరుగుతున్న జాతీయ యువజనోత్సవాల వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతలో ఘోర వైఫల్యం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొనేందుకు హుబ్బళికి మోదీ చేరుకోగా.. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు.

12 Jan 2023

తెలంగాణ

ప్రధాని నరేంద్ర‌‌మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. జనవరి 19న ప్రధాని పలు రైల్వే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు హైదరాబాద్ రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల పర్యటన వాయిదా పడినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?

దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈ‌నెల 19న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రధానికి స్వాగతం పలుకుతారా? లేదా? అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.

06 Jan 2023

బీజేపీ

తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?

తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతోంది. అనుకున్నట్లుగా తెలంగాణలో కాస్త పుంజుకున్నా.. ఏపీలో మాత్రం ప్రభావాన్ని చూపలేకపోతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ క్రమంలో త్వరలో చేపట్టనున్న కేంద్ర‌మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ, ఏపీకి ప్రాధాన్యత కల్పించొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది. కాజీపేట మీదుగా సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రయాణించే ఈ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని షెడ్యూల్‌ను బట్టి జనవరిలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌‌ ప్రారంభోత్సవాన్ని నిర్వహించే అవకాశం ఉందని పీఎంఓ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

నీటి సరఫరా నిర్వహణపై కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పంచాయతీలను కోరారు. మొదటి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సదస్సులో 'వాటర్ విజన్- 2047'ను ఉద్దేశించి వర్చువల్‌గా మోదీ మాట్లాడారు.

'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా?

గత కొన్నేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రచారంతో భారతదేశాన్ని ప్రపంచానికి తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రయత్నం చేసింది. అయితే ప్రపంచవ్యాప్త డిమాండ్ తగ్గడంతో తయారీ రంగం ఒత్తిడికి గురవుతుంది. భారతదేశ ఎగుమతి ఆదాయాన్ని దెబ్బతీసి ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నందున ఈ ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం రాబోయే బడ్జెట్‌లో తన విధానాలను సర్దుబాటు చేయవలసి ఉంటుంది.

పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశం చెల్లుబాటు అవుతుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు జడ్జీలు తీర్పు చెప్పారు. జస్టిస్ నాగరత్నం ఒక్కరే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తన జడ్జిమెంట్‌ను రాశారు.

31 Dec 2022

ఆర్ బి ఐ

బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం

కేంద్ర బడ్జెట్ 2023కి ముందు, నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచే సుంకాల గురించి తాను భయపడుతున్నానని, భారతదేశాన్ని ఇటువంటి చర్యలు అధిక ఖర్చుతో కూడిన దేశంగా మారుస్తుందని. చైనాకు ప్రత్యామ్నాయంగా మారడం మరింత సవాలుగా మారనుందని, టారిఫ్‌లను పెంచడం వలన భారతదేశంలోకి వచ్చే నిధులు ఆగిపోయే అవకాశం ఉందని మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్

2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. 2024లో లోక్‌సభ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో బీజేపీలో, కేంద్ర మంత్రివర్గంలో భారీమార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో.. అంత కంటే ముందే.. ఈ మార్పులు, చేర్పులు చేపట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం.

తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ

కన్నతల్లి అంత్యక్రియలు ముగిసి... రెండు గంటలు కూడా గడవలేదు, అప్పుడే విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. తల్లి చనిపోయిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించారు.

30 Dec 2022

గుజరాత్

మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్

ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబేన్(100) కన్నుమూశారు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆ తర్వాత కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. తోపులాటలో 8మంది మృతి చెందారు. అయితే దీనికి కారణం ఎవరనేదానిపై వైసీపీ- టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు.

ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి'

క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యాను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఒకవైపు యుద్ధం చేస్తూనే.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్‌కు మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీకి ఫోన్ చేశారు.

మునుపటి
తరువాత