నరేంద్ర మోదీ: వార్తలు
10 Aug 2023
అవిశ్వాస తీర్మానంనేడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. పార్లమెంటులో అవిశ్వాసంపై మూడో రోజు చర్చ
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో ఇవాళ వరుసగా మూడో రోజు చర్చ జరగనుంది. రెండో రోజు బుధవారం చర్చలు వేడెక్కాయి.
09 Aug 2023
రాహుల్ గాంధీNo Confidence Motion: మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది; రాహుల్ గాంధీ ధ్వజం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
08 Aug 2023
అవిశ్వాస తీర్మానంమోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అందుకే తీసుకొచ్చాం: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
మోదీ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తరుపున గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు.
08 Aug 2023
అవిశ్వాస తీర్మానంNo Confidence Motion: నేడే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం; లోక్‌సభలో ఏం జరగబోతోంది?
మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలాని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ జరగనున్నది.
08 Aug 2023
దిల్లీ సర్వీసెస్ బిల్లు'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాజ్యసభలో ఆమోదం; సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఆప్
దిల్లీ సర్వీసెస్ బిల్లు (దిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023) సోమవారం రాత్రి రాజ్యసభలో ఆమోదం పొందింది.
06 Aug 2023
ప్రధాన మంత్రికేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం
భారతదేశంలోని లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని చిట్టచివరి గ్రామానికి సైతం ఇంటర్నెట్ సేవలు అందించేందుకు భారత ప్రభుత్వం నడుం బిగించింది.
06 Aug 2023
ప్రధాన మంత్రిPM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు.
04 Aug 2023
రైల్వే స్టేషన్దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. ఆగస్ట్ 6న మోదీ శంకుస్థాపన
దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల ఆధునీకీకరణ పనులకు ముహుర్తం ఖరారైంది. ఆగస్టు 6న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.
02 Aug 2023
చంద్రబాబు నాయుడుదిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు
పార్లమెంట్‌లో దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నిర్ణయించింది.
01 Aug 2023
శరద్ పవార్ఒకే వేదికపై నరేంద్ర మోదీ, శరద్ పవార్.. లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాన మంత్రి
మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు విపక్ష కూటమి ఇండియాలోని కీలకనేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీతో వేదికను పంచుకున్నారు.
01 Aug 2023
అవిశ్వాస తీర్మానంఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్
మణిపూర్‌లో జాతి ఘర్షణలపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చతో పాటు ప్రధాని మోదీ స్పీచ్ తేదీలు ఖరారయ్యాయి.
31 Jul 2023
ప్రధాన మంత్రిPM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పుణేకు వెళ్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పుణేలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు.
28 Jul 2023
అంతర్జాతీయంకీలక ప్రకటన చేసిన చైనా.. 2022 G-20 డిన్నర్‌లో మోదీ, జిన్‌పింగ్ ఏం మాట్లాడారో తెలుసా?
గత ఏడాది 2022లో జరిగిన G-20 దేశాల డిన్నర్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
27 Jul 2023
రాజస్థాన్కాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లోని సికార్, రాజ్ కోట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
27 Jul 2023
రాజస్థాన్కంపెనీలు పేరు మార్చుకున్నట్టే కాంగ్రెస్ ఇండియా పేరుతో కూటమి పెట్టింది : మోదీ
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మండిపడ్డారు.
27 Jul 2023
అశోక్ గెహ్లాట్PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్ సీఎం వ్యంగ్యస్త్రాలు
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా నిర్వహించే సభలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రసంగంపై వివాదం తలెత్తింది.
26 Jul 2023
అవిశ్వాస తీర్మానంNo Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు?
మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ బుధవారం ఆమోదించారు.
26 Jul 2023
లోక్సభలోక్సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం
మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు కాంగ్రెస్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి చెందిన భారత రాష్ట్ర సమితి లోక్‌సభలో బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.
26 Jul 2023
అయోధ్యఅయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం
అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నయి.
26 Jul 2023
కాంగ్రెస్No confidence motion: లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్
మణిపూర్‌లో హింసపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు బుధవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు సమర్పించాయి.
26 Jul 2023
ప్రతిపక్షాలుINDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు
మణిపూర్ అంశం, విపక్ష కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష కూటమి 'ఇండియా', అధికార పక్షం ఎన్డీఏ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
25 Jul 2023
రాహుల్ గాంధీమిస్టర్ మోదీ, మణిపూర్‌లో భారతదేశ ఆలోచనను పునర్నిర్మిస్తాం: రాహుల్ గాంధీ
మణిపూర్ హింసకు సంబంధించి పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు కూటమి 'ఇండియా'పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
25 Jul 2023
బీజేపీ'ఇండియా' కూటమిపై మోదీ ధ్వజం.. మరోసారి కేంద్రంలో బీజేపీదే అధికారమని ధీమా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం దిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు నిరసనలతో చట్టసభల కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
25 Jul 2023
మణిపూర్మణిపూర్పై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన: రాత్రింతా ప్రతిపక్ష ఎంపీలు నిరసన
మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు మూడు రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నాయి.
24 Jul 2023
బీజేపీప్రధాని మోదీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. హింసకు పోలీసులూ కారణమేనట
మణిపూర్‌లో చెలరేగుతున్న హింస నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
22 Jul 2023
యూపీఏPM Modi: యూపీఏ 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్'తో దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ విచ్ఛిన్నం: ప్రధాని మోదీ
కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మండిపడ్డారు. యూపీఏ హయాంలో జరిగిన 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్' ఆ ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటని పేర్కొన్నారు.
21 Jul 2023
మల్లికార్జున ఖర్గేరెండో రోజూ రూల్స్ 267, 176లపై దుమారం.. ప్రధానికి ఖర్గే ఘాటు ప్రశ్నలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజూ మణిపూర్ దారుణ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘోర ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుపడుతున్నాయి.
20 Jul 2023
భారతదేశంమణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. దోషులు తప్పించుకోలేరని హెచ్చరిక
గురువారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు మణిపూర్ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
19 Jul 2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలురేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండపై చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.
19 Jul 2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలుMonsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం(జూలై 20) ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
18 Jul 2023
ఫ్రాన్స్Rafale Deal: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే!
భారత నావికా దళానికి 26రాఫెల్ విమానాలు, మూడు స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్‌ల ఒప్పందాలపై భారత్- ఫ్రాన్స్ మధ్య తర్వలో చర్చలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
18 Jul 2023
ప్రతిపక్షాలుPM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హార్డ్ కోర్ అవినీతిపరులంటూ వారిపై ధ్వజమెత్తారు.
15 Jul 2023
ప్రధాన మంత్రిఅబుదాబిలో ఐఐటీ-దిల్లీ క్యాంపస్ ఏర్పాటు; భారత్- యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్- ప్రధాని మోదీ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
15 Jul 2023
ప్రధాన మంత్రియూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ప్రధాని మోదీ చర్చలు
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు.
15 Jul 2023
ఫ్రాన్స్Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
14 Jul 2023
ఫ్రాన్స్అట్టహాసంగా బాస్టిల్ డే పరేడ్.. అద్భుత విన్యాసాలు వీక్షించిన మోదీ, మాక్రాన్
ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం (బాస్టీల్ డే) వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఫ్రెంచ్ దేశంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ వేడుకలకు గౌరవఅతిథిగా హాజరయ్యారు.
14 Jul 2023
భారతదేశంభారత అంతరిక్షానికే చంద్రయాన్-3 మైలురాయి.. ఇస్రో సైంటిస్టులకు గుడ్‌లక్ చెప్పిన మోదీ
చందమామ గురించి శోధించే క్రమంలో అగ్రరాజ్యాలు ఇప్పటికే చంద్రుడి మీద జెండాలు పాతాయి. అయినప్పటికీ చంద్రుడికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోలేకపోయాయి.
14 Jul 2023
ఫ్రాన్స్భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐదేళ్ల వర్క్ వీసాకు ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రెంచ్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు భారత విద్యార్థులకు శుభవార్తను ప్రకటించింది.
14 Jul 2023
ఫ్రాన్స్ఫ్రాన్స్ ఎన్ఆర్ఐలకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలోనే ఈఫిల్ టవర్ నుంచి యూపీఐ సేవలు
ఫ్రాన్స్ వాసులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు భారత్‌లో అత్యంత విజయవంతమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (UPI)ని ఇకపై ఫ్రాన్స్‌లో వాడుకోవచ్చని మోదీ ప్రకటన చేశారు.
14 Jul 2023
దిల్లీఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీలో వరదల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు.