ప్రధాన మంత్రి: వార్తలు
11 Feb 2023
త్రిపుర'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం
త్రిపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ప్రధాని మోదీ కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రెండు పార్టీలు రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టినట్లు ఆరోపించారు.
11 Feb 2023
నరేంద్ర మోదీఐదు రాష్ట్రాలను కలిపే దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే; రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిని కలుపుతూ, ఐదు రాష్ట్రాల గుండా వెళ్లే ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను కేంద్రం చేపడుతోంది. 1,386 కిలోమీటర్లు దూరంతో దాదాపు రూ.4లక్షల వ్యయంతో నిర్మిస్తున్న దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే మొదటి ఫేజ్‌ను ఆదివారం ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు.
11 Feb 2023
వ్లాదిమిర్ పుతిన్ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు ఎవరు ముందుకొచ్చిన స్వాగతిస్తామని అమెరికా పేర్కొంది. అయితే భారత ప్రధాని మోదీకి మాత్రం యుద్ధాన్ని ఆపే శక్తి ఉందని వైట్ హౌస్ చెప్పింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ ఒప్పించగలరని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు.
09 Feb 2023
నరేంద్ర మోదీగాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. బుధవారం లోక్‌సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన మోదీ, గురువారం రాజ్యసభలో కూడా మాటల తూటాలను పేల్చారు.
09 Feb 2023
రాజ్యసభకొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను దేశం సీరియస్‌గా తీసుకుంటోందని, ఈ క్రమలో కొంతమంది ఎంపీల ప్రవర్తన ప్రజలను నిరాశకు గురి చేసిందని ప్రధాని మోదీ అన్నారు.
08 Feb 2023
నరేంద్ర మోదీకాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు.
08 Feb 2023
నరేంద్ర మోదీరాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఆమె అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు.
07 Feb 2023
రాహుల్ గాంధీఅదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో ఆయన అదానీ అంశాన్ని లేవనెత్తారు. గౌతమ్ అదానీ ప్రయోజనాలను కోసం మోదీ ప్రభుత్వం వ్యాపార నియమాలను మార్చిందని ఆరోపించారు. ఈ సందర్భంగా విమనంలో అదానీతో కలిసి ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని రాహుల్ ప్రదర్శించారు.
07 Feb 2023
భారతదేశంటర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్
వరుస భూకంపాలతో అల్లాడుతున్న టర్కీకి ఆపన్న హస్తం అందించడం కోసం ప్రత్యేక విమానాన్ని భారత్ పంపింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌తో పాటు నైపుణ్యం కలిగిన డాగ్ స్క్వాడ్‌లు, వైద్య సామగ్రి, అధునాతన డ్రిల్లింగ్ పరికరాలు, ఇతర కీలకమైన సాధనాలతో ఈ విమానం బయలుదేరింది.
06 Feb 2023
నరేంద్ర మోదీఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం. ఇది లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది.
04 Feb 2023
నరేంద్ర మోదీ'మిల్లెట్స్‌తో ట్రై చేయండి', వంట చేయడంలో 'బిల్ గేట్స్ 'కు ప్రధాని మోదీ టిప్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రోటీ తయారు చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ప్రధాని మోదీ శనివారం షేర్ చేశారు. అంతేకాదు బిల్ గేట్స్‌కు వంటచేయడంలో ఒక టిప్ కూడా ఇచ్చారు.
04 Feb 2023
నరేంద్ర మోదీ'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1'
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోదీ అని అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' వెల్లడించింది. ఈ సంస్థ 'గ్లోబల్ లీడర్ అప్రూవల్' పేరుతో చేసిన సర్వేలో 78 శాతం అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని మోదీని ఆమోదించినట్లు పేర్కొంది.
04 Feb 2023
రాహుల్ గాంధీ'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్
జమ్ముకశ్మీర్‌లో పండిట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. వారి మమస్యలకు పరిషారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
03 Feb 2023
సుప్రీంకోర్టుబీబీబీ డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీ నిషేధానికి వ్యతిరేకంగా మహువా మోయిత్రా, జర్నలిస్టు ఎన్ రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, న్యాయవాది ఎంఎల్ శర్మ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది.
01 Feb 2023
బడ్జెట్ 2023Union Budget 2023-24: మౌలిక రంగానికి పెద్దపీట, కేంద్ర బడ్జెట్‌లో హైలెట్స్ ఇవే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టారు.
01 Feb 2023
జార్ఖండ్ధన్బాద్: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం
జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది సజీవ దహనమయ్యారు. ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్‌మెంట్‌లో మంటలు చేలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ధన్‌బాద్ డీఎస్పీ ప్రకటించారు.
28 Jan 2023
నరేంద్ర మోదీbanned documentaries: భారత్‌లో నిషేధించిన ఈ ఐదు డాక్యుమెంటరీల గురించి తెలుసుకోండి
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
28 Jan 2023
రాజస్థాన్ప్రధాని మోదీ రాజస్థాన్ పర్యటనలో రాజకీయ కోణం? అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా?
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తొమ్మిది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా రాజస్థాన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని బీజేపీ భావిస్తోంది. అందుకే మోదీ కూడా రాజస్థాన్‌పై శ్రద్ధ కనబరుస్తున్నారు.
27 Jan 2023
హైదరాబాద్హెచ్సీయూలో ఉద్రిక్తత: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ vs కాశ్మీర్ ఫైల్స్ ప్రదర్శించిన ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఎస్ఎఫ్ఐ, కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ఏబీవీపీ పోటీ పడి మరీ ప్రదర్శించడంతో హెచ్‌సీయూలో మరోసారి వివాదం రాజుకుంది.
25 Jan 2023
నరేంద్ర మోదీఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు
జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా బుధవారం భారత్ చేరుకున్న అబ్దెల్ ఫతాహ్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు.
25 Jan 2023
న్యూజిలాండ్న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం
లేబర్ పార్టీ నేత క్రిస్ హిప్కిన్స్ న్యూజిలాండ్ 41వ ప్రధానమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జెసిండా ఆర్డెర్న్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె స్థానంలో క్రిస్ హిప్కిన్స్‌కు అవకాశం వచ్చింది.
25 Jan 2023
నరేంద్ర మోదీజేఎన్యూలో హై టెన్షన్: మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని చూస్తున్న విద్యార్థులపై రాళ్లదాడి
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో మంగళవారం రాత్రి హై డ్రామా జరిగింది. వామపక్ష విద్యార్థులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో బీబీసీ డాక్యుమెంటరీని చూసేందుకు గుమికూడగా వారిపై రాళ్లదాడి జరిగింది. దీంతో జేఎన్‌యూలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
24 Jan 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏబీబీసీ డాక్యుమెంటరీ: 'భారత్- అమెరికా భాగస్వామ్య విలువలు గురించి మాత్రమే తెలుసు'
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ విషయం ఇప్పుడు అంతర్జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే దీనిపై యూకే స్పందించగా, సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ బీబీసీ డాక్యుమెంటరీపై స్పందించారు.
23 Jan 2023
నరేంద్ర మోదీ21 అండమాన్ దీవులకు వీరుల పేర్లు, నేతాజీ స్మారక నమూనాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 పేరు లేని దీవులకు పరమవీర చక్ర అవార్డు పొందిన 21 మంది వీరుల పేర్లను పెట్టారు ప్రధాని మోదీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి 23) సందర్భంగా నిర్వహించిన 'పరాక్రమ దివస్'లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోదీ ఈ పేర్లను ప్రకటించారు.
23 Jan 2023
అసదుద్దీన్ ఒవైసీబీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుతం భారత ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వీడియోకు సబంధించిన యూట్యూబ్ లింకులను కేంద్రం భ్యాన్ చేయడంపై జాతీయస్థాయిలో రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్రం తీసుకున్న చర్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
21 Jan 2023
నరేంద్ర మోదీప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశం
ప్రధాని మోదీపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తీవ్ర దుమారం రేగుతోంది. భారత ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్‌గా స్పందిస్తోంది. బ్రిటన్ పార్లమెంట్‌లో కూడా డాక్యుమెంటరీపై చర్చ జరిగింది. తాజాగా డాక్యుమెంటరీలో మొదటి ఎపిసోడ్‌ను బీబీసీ ప్రసారం చేసింది. అయితే ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో లింక్ ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి.
21 Jan 2023
న్యూజిలాండ్న్యూజిలాండ్ కొత్త ప్రధాని: జెసిండా ఆర్డెర్న్ స్థానంలో 'క్రిస్ హిప్‌కిన్స్' ఎన్నిక
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా ప్రస్తుతం ఆ దేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్న క్రిస్ హిప్‌కిన్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. పోటీలో హిప్‌కిన్స్ ఒక్కరే ఉండటం వల్ల ఆయన ఎంపిక దాదాపు ఖరారైనట్లే. అధికార లేబర్ పార్టీ సమావేశంలో హిప్‌కిన్స్‌ను అధికారంగా ప్రకటించనున్నారు.
19 Jan 2023
నరేంద్ర మోదీప్రదాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: 'వలసవాద ఆలోచనా ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది'
ప్రధాని మోదీపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని భారత్ తీవ్రంగా స్పందించింది. అపఖ్యాతితో కూడుకున్న కథనాన్ని ముందుకు తీసుకురావడానికి రూపొందించబడిన ప్రచారాస్త్రంగా కనపడుతోందని చెప్పింది.
19 Jan 2023
న్యూజిలాండ్జెసిండా ఆర్డెర్న్: న్యూజిలాండ్ ప్రధాని సంచలన ప్రకటన, వచ్చే నెలలో పదవికి రాజీనామా
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే నెలలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మళ్లీ తాను ప్రధాని రేసులో ఉండనని ఈ సందర్భంగా ప్రకటించారు.
17 Jan 2023
పాకిస్థాన్భారత్తో మూడు యుద్ధాలు తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని ఆయన చెప్పారు. కశ్మీర్ విషయంపై ఇప్పుడు పొరుగుదేశంతో శాంతి చర్చలను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్‌కు చెందిన అల్ అరేబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
13 Jan 2023
నరేంద్ర మోదీఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ
ప్రపంచంలోనే అతిపొడవైన నదీ యాత్రకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వారణాసిలో ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ 'ఎంవీ గంగా విలాస్'ను వర్చువల్‌గా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశ పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
12 Jan 2023
నరేంద్ర మోదీభద్రతలో వైఫల్యం: ప్రధాని మోదీపైకి దూసుకొచ్చిన యువకుడు
కర్ణాటకలో జరుగుతున్న జాతీయ యువజనోత్సవాల వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతలో ఘోర వైఫల్యం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొనేందుకు హుబ్బళికి మోదీ చేరుకోగా.. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు.
10 Jan 2023
నరేంద్ర మోదీ19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?
దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈనెల 19న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రధానికి స్వాగతం పలుకుతారా? లేదా? అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
06 Jan 2023
నరేంద్ర మోదీజనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలోనే పట్టాలెక్కనుంది. కాజీపేట మీదుగా సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రయాణించే ఈ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని షెడ్యూల్‌ను బట్టి జనవరిలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించే అవకాశం ఉందని పీఎంఓ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
05 Jan 2023
నరేంద్ర మోదీవాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం
నీటి సరఫరా నిర్వహణపై కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పంచాయతీలను కోరారు. మొదటి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సదస్సులో 'వాటర్ విజన్- 2047'ను ఉద్దేశించి వర్చువల్‌గా మోదీ మాట్లాడారు.
31 Dec 2022
నరేంద్ర మోదీటార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్
2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. 2024లో లోక్‌సభ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో బీజేపీలో, కేంద్ర మంత్రివర్గంలో భారీమార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో.. అంత కంటే ముందే.. ఈ మార్పులు, చేర్పులు చేపట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం.
30 Dec 2022
నరేంద్ర మోదీతల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ
కన్నతల్లి అంత్యక్రియలు ముగిసి... రెండు గంటలు కూడా గడవలేదు, అప్పుడే విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. తల్లి చనిపోయిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించారు.
29 Dec 2022
చంద్రబాబు నాయుడుకందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. తోపులాటలో 8మంది మృతి చెందారు. అయితే దీనికి కారణం ఎవరనేదానిపై వైసీపీ- టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
28 Dec 2022
నరేంద్ర మోదీప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు.
27 Dec 2022
ఉక్రెయిన్ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి'
క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యాను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఒకవైపు యుద్ధం చేస్తూనే.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్‌కు మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీకి ఫోన్ చేశారు.