టీమిండియా: వార్తలు

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే

బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. వన్డే సిరీస్ కోసం బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. అయితే మొదటి వన్డే నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నారు.

రెండో టెస్టు: ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది.

రెండో టెస్టుపై కన్నేసిన టీమిండియా

నాగపూర్ జరిగిన మొదటి టెస్టులో విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులో ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. అయితే టెస్టు సిరీస్ ఎలాగైనా గెలవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. మొదటి టెస్టులో 132 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. టీమిండియాపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది.

సంచలన చరిత్ర సృష్టించిన టీమిండియా

ప్రపంచ క్రికెట్లో టీమిండియా సంచలన చరిత్ర సృష్టించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన క్రికెట్ ర్యాంకుల్లో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లో భారత్ క్రికెట్ జట్టు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. మూడు ఫార్మాట్లో భారత జట్టు నంబర్ వన్ స్థానంలో నిలవడం ఇది రెండోసారి. నాగపూర్ టెస్టు సిరీస్ లో టీమిండియా విజయం సాధించడం ద్వారా 115 పాయింట్లతో టెస్టుల్లోనూ అగ్రస్థానానికి చేరుకుంది.

టీమిండియాకి పెద్ద షాక్.. జస్ప్రిత్ బుమ్రా టెస్టులకు దూరం

టీమ్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచ కప్ ఉన్నందున బోర్డర్ గవాస్కర్ ట్రోఫికి దూరమైనట్లు తెలుస్తోంది.

ఇషాన్ కిషన్ వర్సెస్ కెఎస్ భరత్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం భారత శిబిరం భీకరంగా సిద్ధమవుతోంది.‌

రవీంద్ర జడేజా ఈజ్ బ్యాక్, టీమిండియా-ఆస్ట్రేలియా జట్టులో ఎంట్రీ

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా 6నెలలు జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 9నుంచి ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో రవీంద్ర జడేజా ఆడనున్నాడు.

ఆసియా కప్ 2023 నిర్వహణపై స్పష్టత రానట్లేనా..?

ఆసియాకప్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఆసియాకప్ నిర్వహణ విషయంలో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఎందుకంటే ఆసియా కప్ మీటింగ్‌లో 'ప్రభుత్వ క్లియరెన్స్' చర్చలను పాకిస్తాన్ బోర్డు తిరస్కరించింది

కోహ్లీని దూషించిన పాక్ పేసర్ సోహైల్ ఖాన్..!

2015 ఫిబ్రవరిలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్‌- పాకిస్తాన్‌ తలపడింది. ఈ చిరకాల ప్రత్యర్థి పోరులో ఎప్పటిలాగే టీమిండియానే గెలుపొందింది. ఈ విజయంలో కింగ్ కోహ్లీ వన్ డౌన్ లో వచ్చి ముఖ్య పాత్ర వహించిన విషయం తెలిసిందే.

రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 వరల్డ్ కప్‌ హీరో

టీమిండియా బౌలర్ జోగిందర్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మంట్ ప్రకటించారు. ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్ కప్ లో జోగిందర్ చివరి ఓవర్ వేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ ఫైనల్ చివరి ఓవర్లో మిస్బాను ఔట్ చేసి అప్పట్లో వార్తల్లోకెక్కాడు.

అహ్మదాబాద్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌ను వీక్షించనున్న నరేంద్రమోడీ

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9న టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. నాలుగో టెస్టు మ్యాచ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ చివరి మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా భారత్‌కు రానున్నారు.

మైదానంలోకి అడుగుపెట్టిన యార్కర్ల కింగ్ బుమ్రా

ఇండియన్ క్రికెట్ టీమ్ లో స్టార్ పేస్ బౌలర్ జస్పీత్ బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సత్తా ఉంది. అలాంటి పేసర్ సేవలను కొన్నాళ్లుగా టీమిండియా కోల్పోయింది. వెన్ను గాయంతో గతేడాది సెప్టెంబర్ తర్వాత బుమ్రా ఇండియా టీమ్‌కు ఆడలేదు.

శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ సెంచరీతో రికార్డు బద్దలు

యువ బ్యాటింగ్ సంచలనం శుభ్‌మన్ గిల్ మరోసారి సంచలనాత్మక ఇన్నింగ్స్‌ను ఆడాడు. సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గిల్ చెలరేగి ఆడాడు. గిల్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా కూడా బ్యాట్ ఝుళిపించడంతో భారత్ 166 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీ20 సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో నెగ్గి సత్తా చాటింది. రెండో వన్డేలో వంద పరుగల లక్ష్యాన్ని చేధించడానికి టీమిండియా కష్టపడాల్సి వచ్చినా రెండో టీ20 గెలిచి సిరీస్ 1-1తో భారత్ సమం చేసింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మురళీ విజయ్

భారత్ వెటనర్ క్రికెటర్ మురళీవిజయ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2008లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ద్వారా అరంగ్రేటం చేసిన విజయ్ చివరి టెస్టును ఆ దేశంపైనే ఆడడం గమనార్హం.

షాహీన్ అఫ్రిది ముందు బుమ్రా పనికి రాడు: పాక్ మాజీ ప్లేయర్

ప్రపంచంలోని గొప్ప పేస్ బౌలర్లలో ఇండియాకు చెందిన జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ షాహీన్ అఫ్రిది ముందుంటారు. యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో ఈ ఇద్దరూ సిద్ధహస్తులే.. గతేడాది ఆసియా కప్ తర్వాత బుమ్రా మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టలేదు. బుమ్రా సేవలను టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఎంతగానో మిస్ అయింది.

రెండో టీ20లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా

న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి హార్ధిక్ సేన ప్రతీకారం తీర్చుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 99 పరుగుల టార్గెట్ ను భారత్ కష్టంగా చేధించింది.

రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే బోల్తా కొట్టింది. రోహిత్‌‌శర్మ, విరాట్‌ లేకుండా హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన యువ టీమిండియా దారుణంగా విఫలమైంది.

ధోని చూస్తుండగా వారెవ్వా అనిపించిన ఇషాన్ కిషన్

రాంచి వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించింది. 177 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ఇండియా.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అయితే బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ లో మెరిశాడు.

వాషింగ్టన్ సుందర్ మెరిసినా, టీమిండియా పరాజయం

రాంచి వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ఇండియా.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

టీమిండియా గొప్ప జట్టు : పాక్ ప్లేయర్

టీమిండియాపై పాకిస్తాన్ వెటరన్ వికెట్ కీపర్ కమ్రాన్ ఆక్మల్ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టును తక్కువ చేయాల్సిన పనిలేదని, దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ గెలవకపోయినా భారత్ గొప్ప జట్టేనని తెలిపాడు.

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలైన మేహా పటేల్‌ను అక్షర్ గురువారం పెళ్లి చేసుకున్నాడు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య వడోదరలో వైభవంగా జరిగింది. పెళ్లికి పలువురు క్రికెటర్లు, ప్రముఖులు హజరయ్యారు. ప్రస్తుతం అక్షర్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సై

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. నేడు టీ20 సమరానికి సిద్ధమైంది. రోహిత్‌శర్మ, కోహ్లీ, కెఎల్ రాహుల్ విశ్రాంతి తీసుకోగా.. హర్ధిక్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో న్యూజిలాండ్‌ ఉంది.

మహ్మద్ సిరాజ్ వరల్డ్ నంబర్ వన్ బౌలర్

మహ్మద్ సిరాజ్ వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా సంచలన రికార్డును సృష్టించాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో మహ్మద్ సిరాజ్ టాప్ స్థానంలో ఉన్నాడు. ఈ హైదరాబాద్ పేసర్ సంచలన బౌలింగ్‌తో ఈ మధ్య కాలంలో రికార్డును తిరిగరాస్తున్న విషయం తెలిసిందే.

రంజీ ట్రోఫీలో దుమ్ములేపుతున్న కేదార్ జాదవ్

మహారాష్ట్ర ఆటగాడు కేదార్ జాదవ్ రంజీ ట్రోఫీలో అబ్బురపరిచే ప్రదర్శనతో చెలరేగిపోతున్నాడు. కొద్ది రోజుల కిందట అస్సాంతో జరిగిన మ్యాచ్ లో 283 బంతుల్లో 21 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 283 పరుగులు చేసి విరుచుకుపడిన విషయం తెలిసిందే

సచిన్, అజయ్ జడేజా, సిద్దూని సెడ్జింగ్ చేయమని పాక్ మేనేజ్‌మెంట్ చెప్పింది

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే కోట్లాది మంది అభిమానులు అతృతగా ఎదురుచూస్తారు. ఇక దాయాది దేశాలుగా ముద్ర‌ప‌డ్డ భార‌త్‌, పాకిస్థాన్‌ మ్యాచ్ జరిగితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రికెట్ ల‌వ‌ర్స్ టీవీల‌కు అతుక్కుపోతారు. ముఖ్యంగా భారత్, పాక్ మ్యాచ్‌లో సెడ్జింగ్ ఒక్కోసారి హై ఓల్టేజిగా పెంచేస్తుంది. ఒకరిపై ఒకరు సెడ్జింగ్ చేసుకుంటూ ఆటపై మక్కువను మరింత పెంచేస్తారు.

బాబర్ అజమ్ రికార్డును సమం చేసిన గిల్

శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై మొదటి డబుల్ సెంచరీ, ఆ తర్వాత సెంచరీ చేసి మెరుగ్గా రాణిస్తున్నారు. ఇండోర్‌లో కేవలం 78 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ 21 మ్యాచ్‌లు ఆడి 73.8 సగటుతో 1254 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 3-0తో న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటర్లను పెవిలియన్‌కి పంపారు.

వన్డే, టీ20ల్లో టీమిండియాదే ఆగ్రస్థానం

టీమిండియా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. స్వదేశంలో మళ్లీ మరోసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్, శ్రీలంక‌పై వరుసగా వన్డే సిరీస్‌లను గెలుచుకొని సత్తా చాటింది.

ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచ కప్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. భారత్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సౌమ్య తివారీ టీమిండియా తరుపున అద్భుతంగా రాణించింది. భారత్ స్పిన్నర్లు టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు.

హాకీ వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ

హాకీ వరల్డ్ కప్ టీమిండియా పోరాటం ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా వరల్డ్‌కప్ నుంచి ఇంటిదారి పట్టింది.

రాయపూర్ వన్డేలో నిప్పులు చెరిగిన భారత్ బౌలర్లు, కివీస్ 108 ఆలౌట్

రాయపూర్ వన్డేలో భారత్ బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్ ఆటగాళ్లకు ఇండియన్ పేసర్లు చెమటలు పుట్టించడంతో తక్కువ స్కోర్ కే కివీస్‌ను కుప్పకూల్చారు

రెండో వన్డేకు ముందు టీమిండియాకు భారీ జరిమానా

న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియాకు భారీ జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 60శాతం కోత విధిస్తున్నట్లు ఐసీపీ ప్రకటించింది.

ఫ్యాషన్ షోకి వెళ్లితే స్లిమ్‌గా ఉన్నవారు దొరుకుతారు, సెలెక్టర్లపై సన్నీ ఆగ్రహం

సెలెక్టర్లు క్రికెటర్ల ఆకారాన్ని బట్టి కాకుండా వారి టాలెంట్‌ను చూసి ఎంపిక చేయాలని సెలక్టర్లకు టీమిండియా మాజీ ప్లేయర్ గవస్కర్ సూచించారు. సన్నగా ఉన్నవారిని మాత్రమే కావాలనుకుంటే సెలెక్టర్లు ఫ్యాషన్ షోకి వెళ్లి కొంతమంది మోడల్స్‌ని ఎంచుకొని వారికి బ్యాట్, బాల్ ఇచ్చి జట్టులోకి చేర్చుకోవాలని ఆయన హితువు పలికారు.

రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో అదరగొట్టిన మయాంక్ అగర్వాల్

టీమిండియాలో స్థానం కోల్పోయిన మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో కర్నాటక ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 208 పరుగులు చేసి సత్తా చాటాడు. అగర్వాల్ మూడో వికెట్‌కు నికిన్ జోస్‌తో కలిసి 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

న్యూజిలాండ్‌తో రెండో వన్డేకి టీమిండియా రెడీ

హైదరాబాద్‌లో న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన మొదటి వన్డే అభిమానులకు మంచి కిక్‌ను ఇచ్చింది. ఇటు శుభ్‌మన్ గిల్, అటు బ్రాస్‌వెల్ ఉప్పల్ స్టేడియంలో బౌండరీల మోత మోగించాడు. దీంతో చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కివిస్‌పై భారత్ పైచేయి సాధించింది.

రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్

హైదరాబాద్‌లో జరిగిన వన్డేలో శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగించాడు. వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన ఐదో బ్యాటర్‌గా రికార్డును సృష్టించాడు. 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లతో 208 పరుగులు చేసి అరుదైన ఘనతను కైవసం చేసుకున్నాడు.

బ్రాస్‌వెల్ భయపెట్టినా, భారత్ థ్రిలింగ్ విక్టరీ

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేయడంతో భారత్ 349 పరుగులు చేసింది. ఒకానొక దశలో భారత్ ఓడేలా కనిపించేలా శార్దుల్ ఠాకూర్ అద్భుతమైన యార్కర్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు.

శుభ్‌మాన్ గిల్ సూపర్ సెంచరీతో అరుదైన రికార్డు

శుభ్‌మాన్‌ గిల్ వన్డేల్లో అరుదైన ఘనతను సాధించాడు. వన్డేల్లో 1000 పరుగులు చేసిన భారత్ ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో సెంచరీ చేసి సత్తా చాటాడు. కేవలం 87 బంతుల్లో వంద పరుగులు చేశాడు.

వన్డే, టెస్టు ర్యాకింగ్‌లో టీమిండియా మొదటి స్థానంలో నిలిచేనా..?

భారత్ 267 పాయింట్లతో టీ20లో ప్రస్తుతం ఆగ్రస్థానంలో నిలిచింది. అలాగే వన్డే, టెస్టు ర్యాకింగ్‌లో ఫస్ట్ ప్లేస్ సాధించడానికి కృషి చేస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. త్వరలోనే టీ20 సిరీస్ కూడా ఉంది. తరువాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌లను భారత్ ఆడనుంది.

మునుపటి
తరువాత