భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. ఖరారైన బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లగా, తాజాగా బీజేపీ కూడా ప్రచార పర్వంలో దూసుకెళ్లాలని చూస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్: నకిలీ జనన ధృవీకరణ పత్రం కేసులో దోషిగా తేలిన ఆజం ఖాన్, కుటుంబం
నకిలీ జనన ధృవీకరణ పత్రం కేసులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు ఆజం ఖాన్, అతని భార్య తంజీమ్ ఫాతిమా,వారి కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్‌లను ఉత్తర్‌ప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
TS Elections: తెలంగాణలో పోటీపై రెండ్రోజుల్లో నిర్ణయం : జనసేన
తెలంగాణ ఎన్నికల (TS Elections) హడావుడి మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి.
మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు..అక్టోబర్ 26న ఎథిక్స్ ప్యానెల్ విచారణ
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై 'క్యాష్ ఫర్ క్వెరీ' ఫిర్యాదుపై అక్టోబర్ 26న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, న్యాయవాది జై ఆనంద్ దేహద్రాయ్‌లను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారించనుంది.
Delhi-Meerut RRTS: అక్టోబర్ 20న ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రైలు సర్వీస్ రాపిడ్‌ఎక్స్‌ను శుక్రవారం (అక్టోబర్ 20) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
జమ్ము:పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు..ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందికి తుపాకీ గాయాలు
జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఇద్దరు సిబ్బందికి తుపాకీ గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు.
కేసీఆర్ చనిపోతే రూ.5లక్షలు.. కేటీఆర్ మరణిస్తే రూ.10లక్షలు ఇస్తాం: బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం వాడీ వేడీగా సాగుతోంది.
Operation Ajay: 286 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న 5వ విమానం
'ఆపరేషన్ అజయ్'లో భాగంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.
తమిళనాడు: విరుదునగర్‌లోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీలలో పేలుళ్లు.. 11 మంది మృతి
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బాణాసంచా యూనిట్లలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లలో కనీసం 11 మంది మరణించారని పోలీసులు తెలిపారు.
Mahua Moitra: బీజేపీ ఎంపీ,సుప్రీంకోర్టు న్యాయవాదిపై పరువు నష్టం దావా వేసిన మహువా మొయిత్రా
తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మోయిత్రా బీజేపీ ఎంపి నిషికాంత్ దూబే,న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌లకు లీగల్ నోటీసు పంపారు.
చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు
తనపై దాఖలు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.
Nitin Gadkari : కంపెనీలు కుమ్మకై ధరలను పెంచేస్తున్నాయి : నితిన్ గడ్కరీ
నూతన టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని, సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) తయారీలో భారత జాతీయ హైవే అధారిటీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వాపోయారు.
Cyclone: అరేబియా సముద్రంలో తుపాను.. 48 గంటల్లో అల్పపీడనం
ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన తుపాను వల్ల వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా లంచాల ఆరోపణల వెనుక ఉన్నది మాజీ సన్నిహితుడేనా?
లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
BRS: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మరో నలుగురు నేతలు రాజీనామా!
ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వలసలు మొదలయ్యాయి.
Madhya Pradesh Congress Manifesto: ఉచిత విద్యుత్, రూ.25లక్షల ఆరోగ్య రక్షణ.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భోపాల్‌లో కాంగ్రెస్ పార్టీ 'వచన్ పాత్ర'తో తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
రాఘవ్ చద్దా ప్రభుత్వ బంగ్లాలో ఉండొచ్చు: ఢిల్లీ హైకోర్టు
పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ,ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా తన ప్రభుత్వ బంగ్లాలో ఉండవచ్చని,దానిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది.
Same-Sex Marriage: స్వలింగ వివాహానికి చట్టబద్ధత ఇవ్వలేమని చెప్పిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి కీలక ఆదేశాలు
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపును ఇవ్వడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది.
Voter ID Card : క్షణాల్లో ఓటరు కార్డుని డౌన్‌లోడ్ చేసుకోండిలా..!
ఓటర్లకు ఎన్నికల సంఘం (Election Commission) శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఇంటి వద్ద నుంచే ఆన్ లైన్‌లో ఓటర్ కార్డు (Voter Card)ను పొందేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
TMC ఎంపీ మహువా మొయిత్రాపై ఆరోపణలు.. ఎథిక్స్ కమిటీ పరిశీలనకు పంపించిన స్పీకర్ ఓంబిర్లా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన "లంచం" ఫిర్యాదును స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభ ఎథిక్స్ కమిటీకి పంపారు.
Same sex marriage: స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టం అవసరం: సుప్రీంకోర్టు
స్వలింగ వివాహాలకు చట్టభద్రత కల్పించడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును ఇచ్చింది.
గ్రూప్-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దసరా తర్వాత జనరల్ ర్యాంకు మెరిట్ జాబితా విడుదల
తెలంగాణ పబ్లిక్ కమిషన్(TSPSC) గ్రూప్-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్. పరీక్ష రాసిన అభ్యర్థుల జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్‌సీ వెలువరించేందుకు సిద్ధమైంది.
నేడు ముంబై విమానాశ్రయం రన్‌వేలు మూసివేత.. కారణం ఇదే..
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం 6గంటల పాటు మూసివేయనున్నారు.
హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ భాస్కరరావు కన్నుమూత
హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ భాస్కరరావు కన్నుమూశారు. 86ఏళ్ల వయస్సున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
స్వలింగ వివాహానికి చట్టపరమైన ధ్రువీకరణపై నేడు సుప్రీంకోర్టు తీర్పు
భారతదేశంలో స్వలింగ వివాహాలను గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పును వెలువరించనుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ని నిందితుడిగా చేర్చాలని ఆలోచన..సుప్రీంకోర్టుకి ఈడీ, సీబీఐ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుల్లో ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని నిందితుడిగా పేర్కొనే ఆలోచనలో ఉన్నామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ),ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేశాయి.
స్వదేశీ ఎల్‌సీఏ ఫైటర్ జెట్‌లలో 'అంగద్', 'ఉత్తమ్'ను అమర్చేందుకు రక్షణ శాఖ ప్లాన్
మేకిన్ ఇండియాలో భాగంగా మిలిటరీ ఆయుధ వ్యవస్థల స్వదేశీకరణపై రక్షణ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్‌పై రాజ్యసభ సెక్రటేరియట్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ
ప్రివిలేజ్ కమిటీ విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఎగువసభ నుంచి తన నిరవధిక సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం రాజ్యసభ సెక్రటేరియట్‌కు నోటీసు జారీ చేసింది.
Supreme Court: 26 వారాల ప్రెగ్నెన్సీ అబార్షన్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
తనకు అనారోగ్యం కారణంగా 26 వారాలకు పైగా ఉన్న గర్భాన్ని తొలగించాలని కోరుతూ ఓ వివాహిత చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 87చోట్ల టీడీపీ పోటీ: కాసాని జ్ఞానేశ్వర్
చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉండటంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు.
మణిపూర్ కంటే ఇజ్రాయెల్‌పై ప్రధాని మోదీకి ఎక్కువ ఆసక్తి: రాహుల్ గాంధీ
మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ కంటే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపైనే ప్రధాని ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు.
Earthquake: ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4తీవ్రత నమోదు
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లా సమీపంలో సోమవారం భూకంపం సంభవించింది.
CM Jagan: డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్
డిసెంబర్‌లో తన నివాసాన్ని విశాఖపట్నంకు మారుస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తెలిపారు.
మిజోరంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్.. ఐజ్వాల్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర
రాహుల్ గాంధీ సోమవారం మిజోరంలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసు: సీఐడీ విచారణకు హాజరైన కిలారు రాజేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను స్కిల్ డెవలప్ మెంట్ కేసు కుదిపేస్తున్న విషయం తెలిసిందే.
నిఠారీ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు.. సురేంద్ర, మణిందర్ మరణశిక్ష రద్దు
2006 నిఠారీ హత్య కేసులో దోషులుగా తేలిన అన్ని కేసుల్లో సురేంద్ర కోలీ, మోనీందర్ సింగ్ పంధేర్‌లను అలహాబాద్ హైకోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు
యూఏపీఏ కేసులో అరెస్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ అమిత్ చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Army: అగ్నివీర్ అమృత్‌పాల్ సింగ్ ఆత్మహత్య.. ఆర్మీ కీలక ప్రకటన
సెంట్రీ డ్యూటీలో సమయంలో అగ్నివీర్ అమృత్‌పాల్ సింగ్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కేరళ వర్షాలు: నేడు పాఠశాలలు,కళాశాలలు మూసివేత
కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, తిరువనంతపురంలో సోమవారం అన్ని విద్యాసంస్థలు మూసివేశారు.
భారత్-పాక్ మ్యాచ్‌లో 'జై శ్రీరాం' నినాదాలపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్.. తీవ్రంగా స్పదించిన బీజేపీ
అహ్మదాబాద్‌లో శనివారం జరిగిన భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ క్రికెటర్‌ను అవహేళన చేసేలా 'జై శ్రీరామ్' నినాదాలు చేశారని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు.