భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
టీఎంసీ మహువా మోయిత్రా పై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా అదానీ గ్రూప్ ను , ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి పార్లమెంటులో "ప్రశ్నలు అడగడానికి లంచం తీసుకున్నారని" ఆరోపిస్తూ, ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలని బిజెపి ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు.
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం : దిగ్విజయ్ సింగ్ రాజీనామా.. లేఖ వైరల్
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌ను ఓ వార్త కలవరపెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఓ లేఖ ఆయన పేరిట ట్విట్టర్ లో చక్కెర్లు కొడుతోంది.
శివరాజ్ సింగ్ చౌహాన్‌పై రామాయణం నటుడిని బరిలోకి దింపుతున్న కాంగ్రెస్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 144 మంది కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదలైంది. ఈ మేరకు ఆదివారం క్యాండిడేట్ల పేర్లను ప్రకటించింది.
Earthquake: దిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత నమోదు
దిల్లీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.
బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ బాలసాని రాజీనామా
బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేస్తూ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ షాక్ ఇచ్చారు. బీసీలకు గులాబీ పార్టీలో ఘోర అవమానం జరిగిన కారణంగానే రాజీనామా చేశానని బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు.
Nitish Kumar : దేశానికి నితీష్ రెండో గాంధీ.. పట్నాలో వెలిసిన పోస్టర్లు
బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ పేరిట పోస్టర్లు వెలిశాయి. ఆయనే దేశానికి రెండో గాంధీ అంటూ పట్నాలో ఆదివారం పోస్టర్లు కనిపించాయి.
BRS manifesto: బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన.. ప్రతి ఇంటికీ 'కేసీఆర్ బీమా'.. పెన్షన్, రైతు బంధు పెంపు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తెలంగాణలో భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మేనిఫెస్టో గురించి వివరించారు.
Maharashtra Expressway: మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేపై మినీ బస్- ట్రకు ఢీ.. 12 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
CM KCR: ఎమ్మెల్యేనే ఫైనల్ కాదు.. ఎన్నో అవకాశాలు ఉంటాయి: సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ కేంద్ర పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రస్తుతానికి రెడీగా ఉన్న 51 బీ-ఫారాలు పంపిణీ చేస్తున్నామని, మిగతావి రేపు అందించి పూర్తి చేస్తామన్నారు.
Operation Ajay: 274 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న నాలుగో విమానం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్'లో కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
BRS Manifesto : నేడు బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్.. అభ్యర్థులకు బీఫామ్ ల అందజేత
ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు బీఆర్ఎస్ రెడీగా ఉంది. ఈ మేరకు హ్యాట్రిక్ విజయమే ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం మధ్యాహ్నం 12. 15 నిమిషాలకు సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు.
Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థల తొలి జాబితాను ఆదివారం ప్రకటించింది. తొలి విడతగా 55 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.
Asaduddin Owaisi: ఇజ్రాయెల్ ప్రధాని ఓ 'దెయ్యం': అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో గాజాలోని సాధారణ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది.
ప్రవల్లికది ఆత్మహత్య కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హత్య: రాహుల్ గాంధీ ఆగ్రహం
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల వాయిదాపై తీవ్ర మానసిక ఆందోళనతో ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడటంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటర్లకు బంపర్ ఆఫర్.. ఓటేసొస్తే ఉచితంగా పోహా, జిలేబీ
అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండోర్ ఓటర్లకు బంపర్ ఆఫర్ తగిలింది. ఈ మేరకు నగరంలోని దుకాణదారుల సంఘం ఈ ఆఫర్ ప్రకటించింది.
Garbo Song : దేశంలో శరన్నవరాత్రుల సందడి.. మోదీ రాసిన 'గర్బా' పాట విడుదల
భారతదేశంలో దసరా నవరాత్రి 2023 సందడి మొదలైంది. గుజరాతీలు ఏటా శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలోనే 'గర్బా' సంప్రదాయ నృత్యంతో అమ్మవారిని స్తుతిస్తారు.
చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. కీలక విషయాలు చెప్పిన వైద్యులు
స్కిల్ స్కామ్‌లో ఆరోపణలు ఎందుర్కొంటూ.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బులిటెన్‌ను విడుదల చేశారు.
Ponnala : పొన్నాలకు తెరుచుకున్న బీఆర్ఎస్ తలుపులు.. పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
మాజీ మంత్రి, తెలంగాణ తొలి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు.
సిక్కిం, బెంగాల్‌లో నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌ను గుట్టు రట్టు.. 50 ప్రాంతాల్లో దాడులు
సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం భారీ నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌ను ఛేదించింది.
లోకేశ్ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుని అనారోగ్యంతో చంపేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబును హత్య చేసేందుకు కుట్ర పన్నారన్నారు.
Operation Ajay: 235మందితో ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకున్న రెండో విమానం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధ నడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌లో భాగంగా భారతీయులను తరలిస్తోంది.
KTR: కర్ణాటక నుండి తెలంగాణకు కాంగ్రెస్ కరెన్సీ కట్టలు.. కేటీఆర్ ట్వీట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కర్ణాటక నుంచి వందల కోట్ల రూపాయలను పంపిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు.
Telangana Ias Ips : ఐఏఎస్, ఐపీఎస్‌లకు కొత్త పోస్టింగ్స్ సిఫార్స్ చేసిన ఎన్నికల సంఘం.. ఆదేశాలిచ్చిన సీఎస్
ఎన్నికల వేళ కొత్తగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. ఒక్కో పోస్టుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు చొప్పున అభ్యర్థుల జాబితాను ఈసీకి పంపించింది.
బీఆర్ఎస్ ఇంఛార్జీలు వచ్చేశారు.. కీలక సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ వ్యూహాత్మక సూచనలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ దూకుడు మీద ఉంది.
PM Modi : ఉగ్రవాదంపై పోరుకు కొన్ని దేశాలు కలిసి రాకపోవడం బాధాకరం
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం అన్ని దేశాలకు పెను భూతంలా విస్తరిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
బెంగళూరు : క్యాబ్ బుక్ చేసి క్యాన్సిల్ చేసిందని, ఆమెను వేధించిన డ్రైవర్, అసలు ఏమైందంటే
కర్ణాటకలో ఓ క్యాబ్ డ్రైవర్ లో రాక్షసుడు నిద్రలేచాడు.ఈ మేరకు తొలుత క్యాబ్ బుక్ చేసి అనంతరం క్యాన్సిల్ చేసిందన్న కారణంగా ఆమెను వేధించాడు.
Dasara Holidays 2023: రేపటి నుంచి దసరా సెలవులు.. 11రోజులు హాలీడేస్ ఇస్తూ ఉత్తర్వులు
దసరా పండుగ ఇక మొదలు కానుంది.
Telangana Election: ఎన్నికల సంఘానికి తెలంగాణ సీఎస్ రిపోర్టు.. సాయంత్రానికి హైదరాబాద్ నూతన సీపీ ఖరారు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
No Merit:న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
చట్టవ్యతిరేక కార్యకలాపాల(నివారణ)చట్టం కింద తమ అరెస్టును,పోలీసు కస్టడీని సవాల్ చేస్తూ న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ,మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌లను దిల్లీ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.ఈ మేరకు ఆ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి, జనగామ మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు.
ఆకలి సూచిక : పాకిస్తాన్ కంటే దిగువ స్థానంలో భారత్.. సూచీ విధాన లోపమే కారణమంటున్న కేంద్రం
ప్రపంచ ఆహార సూచీ-2023లో భారత్ స్థానం పట్ల కేంద్రం ఆక్షేపిస్తోంది. ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం 111వ స్థానంలో నిలవడంపై ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది.
దిల్లీ లిక్కర్ కేసులో నేడు హైకోర్టు విచారణ..ఎంపీ సంజయ్ సింగ్ పిటిషన్ దాఖలు
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు.
Chandrababu: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట.. హైకోర్టులో బెయిల్ మంజూరు
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతల నడుమ ఢిల్లీలో హై అలర్ట్
ఇజ్రాయెల్-హమాస్ తీవ్రవాద గ్రూపు మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో,సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి భద్రతా సంస్థల నుండి పోలీసులకు సమాచారం అందడంతో శుక్రవారం దిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.
TELANGANA CASH SEIZURE : కేవలం నాలుగు రోజుల్లోనే రూ.37.07 కోట్లు సీజ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలై నాలుగు రోజులైనా పూర్తి కాలేదు. కానీ దాదాపు 40 కోట్ల విలువైన సొత్తును పోలీసులు సీజ్ చేశారు.
ఖలీస్థాన్ ఎఫెక్ట్ : కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు Z కేటగిరి భద్రత
భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఖలిస్థానీ ఉగ్రవాదులు పోస్టర్లు వేసిన సందర్భంగా ఆయన భద్రతను Y నుంచి Z కేటగిరీకి పెంచింది.
డెహ్రాడూన్: ఏడేళ్ల బాలుడికి మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలను చూపించి.. ఆపై అఘాయిత్యం
డెహ్రాడూన్ లోని రాయ్‌పూర్ ప్రాంతంలో 12 ఏళ్ల విద్యార్థి తన మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలను చూపించి ఏడేళ్ల బాలుడిపై అసభ్యంగా ప్రవర్తించాడు.
బెంగళూరు:వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుణ్ని ప్రేమించిందని.. కుమార్తెను హత్య చేసిన తండ్రి
బెంగళూరు సమీపంలో బిదనూరుకు చెందిన మంజునాథ్ కు ఇద్దరు కుమార్తెలు. అతని పెద్ద కూతురు(20) వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించింది.
Operation Ajay: 212 మందితో ఇజ్రాయెల్ నుండి మొదటి విమానం
'ఆపరేషన్ అజయ్' కింద మొదటి చార్టర్ ఫ్లైట్, యుద్ధంలో దెబ్బతిన్న ఇజ్రాయెల్ నుండి 212 మంది భారతీయ పౌరులతో శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది.
YS Sharmila: 119 స్థానాల్లో YSRTP పోటీ.. పాలేరు నుంచి షర్మిల
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది.