విమానం: వార్తలు
02 May 2023
చమురునగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు
దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ ఎయిర్‌వేస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నగదు కొరత కారణంగా మే 3, 4 తేదీల్లో అన్ని విమానం సర్వీసులను రద్దు చేసినట్లు గో ఫస్ట్ మంగళవారం తెలిపింది.
27 Apr 2023
సూడాన్ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు
'ఆపరేషన్ కావేరి' కింద, భారతదేశం ఇప్పటివరకు సూడాన్ నుంచి దాదాపు 1100 మందిని తరలించింది.
19 Apr 2023
ఎయిర్ ఇండియామార్చి త్రైమాసికంలో పెరిగిన విమాన ప్రయాణాలు; ఫుల్‌జోష్‌లో ఇండిగో ఎయిర్ లైన్స్
కోవిడ్‌తో కుదేలైన దేశీయ విమానయాన పరిశ్రమ కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది.
12 Apr 2023
మయన్మార్పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి
మయన్మార్ మిలిటరీ జుంటా పౌరులపై వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడిలో పిల్లలు, విలేకరులతో సహా కనీసం 100 మంది మరణించారు. మయన్మార్ మిలిటరీని 'జుంటా' పిలుస్తారు.
11 Apr 2023
ప్రయాణంవిమానాల్లో వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులపై చర్యలకు 'డీజీసీఏ' కీలక సూచనలు
ఇటీవల విమానాల్లో కొందరు ప్రయాణికుల వికృత చేష్టలు పెరిగిపోతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక సూచనలను జారీ చేసింది.
10 Apr 2023
హైదరాబాద్శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్
హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ నుంచి బయలు దేరే అలయన్స్ ఎయిర్‌కు చెందిన ఎనిమిది విమానాలను రద్దు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది.
07 Apr 2023
ఇజ్రాయెల్ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు
జెరూసలేంలోని అల్-అక్సా మసీదు వద్ద జరిగిన ఘర్షణల అనంతరం లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
06 Apr 2023
నాసారికార్డులను బద్దలు కొట్టిన నాసా మార్స్ హెలికాప్టర్ ఇంజన్యుటీ
నాసాకు చెందిన మార్స్ ఇంజన్యుటీ హెలికాప్టర్ మరోసారి రికార్డులను బద్దలు కొట్టింది. ఏప్రిల్ 2న హెలికాప్టర్ ముందు కంటే ఎత్తుగా, వేగంగా ప్రయాణించింది. 1.8 కిలోల ఛాపర్ గంటకు 23.3 కిమీ వేగంతో 52.5 అడుగుల ఎత్తుకు చేరుకుంది.
04 Apr 2023
హైదరాబాద్గాలిలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం; హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్
బెంగళూరు నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6E897లో సాంకతిక లోపం తలెత్తడంతో మంగళవారం హైదరాబాద్‌కు మళ్లించారు. హైదరాబాద్ విమానాశ్రాయంలో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
03 Apr 2023
ఆటో మొబైల్క్యాబిన్ ప్రెజర్ తగ్గడంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం
200 మందికి పైగా ప్రయాణికులతో ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.
01 Apr 2023
ఆటో మొబైల్ఎయిర్ ఇండియా కొన్ని అంతర్జాతీయ మార్గాలలో అందిస్తున్న ప్రీమియం ఎకానమీ అనుభవం
ఎయిర్ ఇండియా ప్రయాణీకుల కోసం సరికొత్త ప్రీమియం ఎకానమీ అనుభవాన్ని పరిచయం చేసింది, మెరుగైన క్యాబిన్ ఉత్పత్తి, విమానంలో సేవలను అందిస్తోంది, ఆన్-గ్రౌండ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.
01 Apr 2023
ముంబైమద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులు; ముంబయిలో నిందితుడు అరెస్ట్
బ్యాంకాక్ నుంచి ముంబయికి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఎయిర్ హోస్టెస్‌పై ఓ స్వీడన్ ప్రయాణికుడు వేధింపులకు పాల్పడ్డాడు. విమానం దిగిన వెంటనే ముంబయి పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
31 Mar 2023
ఆటో మొబైల్మాన్యువల్ ధర నుండి ChatGPT వరకు టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాలో వస్తున్న మార్పులు
ఎయిర్ ఇండియా, ప్రతి విమానం నుండి మరింత ఆదాయం కోసం అల్గారిథమ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌కు మారుతోంది. కొత్త యజమాని టాటా గ్రూప్ పేపర్ ఆధారిత పద్ధతులను భర్తీ చేయడానికి OpenAI ప్రసిద్ధ చాట్‌బాట్ అయిన ChatGPTని ఎయిర్ ఇండియా పరీక్షిస్తోంది.
20 Mar 2023
హైదరాబాద్ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం
అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వస్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానంపై వడగళ్ల వాన పడింది. దీంతో విమానం భారీగా దెబ్బదిన్నది.
15 Mar 2023
అమెరికానల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చేసిన రష్యా ఫైటర్ జెట్లు
అమెరికా నిఘా డ్రోన్ ప్రొపెల్లర్‌ను నల్ల సముద్రంపై రష్యా ఫైటర్ జెట్ ఢీకొట్టింది. దీంతో తమ MQ-9 రీపర్ డ్రోన్ నీటిలో కూలిపోయినట్లు అగ్రరాజ్యం తెలిపింది
13 Mar 2023
పాకిస్థాన్ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి
దిల్లీ నుంచి దోహాకు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్‌కు చెందిన 6ఈ-1736 మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. అయితే విమానం విమానాశ్రాయానికి చేరుకునే లోపే నైజీరియన్‌కు చెందిన ప్రయాణికుడు మరణించినట్లు వైద్య బృందం ప్రకటించింది.
24 Feb 2023
కేరళరన్వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం పూర్తిస్థాయి ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
22 Feb 2023
ఎయిర్ ఇండియా300మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఆయిల్ లీక్; అత్యవసర ల్యాండింగ్
అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయం నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా AI106 విమానంలో బుధవారం సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అలర్ట్ అయిన పైలెట్, స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
20 Feb 2023
ప్రకటనఈ ఆర్ధిక సంవత్సరంలో విదేశీ పర్యటనల కోసం భారతీయులు పెట్టిన ఖర్చు $10బిలియన్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో భారతీయులు విదేశీ ప్రయాణాలకు దాదాపు $10 బిలియన్లు ఖర్చు పెట్టారు.రికార్డు స్థాయి ట్రావెల్ సీజన్ ఈ త్రైమాసికంలో కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు.
20 Feb 2023
ప్రయాణంIATA: భారత్‌లో గణనీయంగా పెరిగిన దేశీయ విమాన ప్రయాణాలు
ప్రపంచదేశాల్లో కరోనా ఆంక్షలు తొలగిపోయిన నేపథ్యంలో దేశీయ విమానాల ప్రయాణాలు గణనీయంగా పెరిగినట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌లో దేశీయంగా విమానాల్లో ప్రయాణించే సంఖ్య భారీగా పెరిగినట్లు పేర్కొంది.
18 Feb 2023
భారతదేశంఎయిర్ ఇండియాను మించిపోయిన ఇండిగో ఎయిర్‌లైన్స్, ఏకంగా 500 విమానాలకు ఆర్డర్
ఎయిర్ ఇండియా 470 విమానాలకు అర్డర్ ఇస్తేనే ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయాయి. ఇప్పుడు దానికి మించిన విమానాల ఆర్డర్‌ను ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో ఇవ్వడంతో ప్రపంచమంతా భారత్‌లో ఏం జరుగుతుందని గమనిస్తున్నారు.
16 Feb 2023
ఎయిర్ ఇండియాతగ్గేదేలే అంటున్న 'ఎయిర్ ఇండియా'; ఏకంగా 840 విమానాల కోనుగోలుకు 'టాటా' ప్లాన్
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా విమానాల కొనుగోళ్లలో ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే రూ.6లక్షల కోట్ల విలువ చేసే 470 విమానాలను బోయింగ్, ఎయిర్‌బస్ కంపెనీలకు ఆర్డర్ చేసి ప్రపంచంలోనే అతిపెద్ద డీల్‌ను ఎయిర్ ఇండియా కుదుర్చుకుంది.
15 Feb 2023
సంస్థIT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి
జర్మనీకి చెందిన Lufthansa సంస్థ విమానాలు బుధవారం IT అంతరాయం కారణంగా ఆలస్యం లేదా రద్దు అయ్యాయి.
11 Feb 2023
వ్యాపారంఎయిర్బస్, బోయింగ్‌ల సంస్థల నుంచి 500 జెట్‌లను ఆర్డర్ చేసిన ఎయిర్ ఇండియా
ఎయిరిండియా $100 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన 500 కొత్త విమానాల కోసం ఒక భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక ఎయిర్‌లైన్ నుండి ఒకేసారి వచ్చిన అతిపెద్ద ఆర్డర్ అని, పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
11 Feb 2023
భారతదేశంఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 20లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
మరో ఎయిర్‌లైన్స్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కొరడా ఝులిపించింది. పౌర విమానయాన అవసరాలను ఉల్లంఘించినందుకు ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ.20 లక్షల జరిమానా విధించింది.
03 Feb 2023
ఎయిర్ ఇండియాటేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
పైలట్ అప్రమత్తంగా ఉండటం వల్ల అబుదాబి నుంచి కేరళలోని కోజికోడ్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వినామానికి పనుప్రమాదం తప్పింది.
31 Jan 2023
ముంబైవిస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన
విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలు ఇటీవల తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అబుదాబి నుంచి ముంబయికు వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్ ఫ్లైట్ (యూకే 256)లో మరో సంఘటన జరిగింది. ఇటాలియన్ ప్రయాణీకురాలు విమానంలో మద్యం మత్తులో బీభత్సం చేయడంతో అమెను పోలీసులకు అప్పగించారు.
28 Jan 2023
మధ్యప్రదేశ్ఐఏఎఫ్: మధ్యప్రదేశ్‌లో కుప్పుకూలిన రెండు యుద్ధ విమానాలు , ఒక పైలెట్ మిస్సింగ్
భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు గాయాలతో ప్రాణాలతో బయటపడగా, మరో పైలెట్ కోసం వెతుకున్నట్లు అధికారులు తెలిపారు.
27 Jan 2023
కర్ణాటకడీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్' విమానానికి రూ.10లక్షల జరిమానా
బెంగళూరు విమానాశ్రయంలో 55 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్' విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.10 లక్షల జరిమానా విధించింది.
24 Jan 2023
దిల్లీస్పైస్జెట్: దిల్లీ-హైదరాబాద్ విమానంలో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన, అరెస్టు చేసిన పోలీసులు
విమానాల్లో కొందరు ప్రయాణికులు సిబ్బంది పట్ల , తోటి ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాల సంఘటనలు మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
23 Jan 2023
అమెజాన్భారతదేశంలో డెలివరీలు త్వరగా అందించడానికి ఎయిర్ కార్గో ఫ్లీట్ ప్రారంభించనున్న అమెజాన్
డెలివరీలను వేగవంతం చేసే ప్రయత్నంలో అమెజాన్ భారతదేశంలో అమెజాన్ ఎయిర్ అని ప్రత్యేక ఎయిర్ కార్గో ఫ్లీట్‌ను ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ బెంగళూరుకు చెందిన క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఇక్కడ ఎయిర్ ఫ్రైట్ సేవలను ప్రారంభించింది. ఈ సదుపాయం తొలుత బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై మెట్రో నగరాల్లో అందుబాటులో ఉంటుంది.
23 Jan 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏఉద్యోగులు చేసిన తప్పిదం వల్లే విమానాలు నిలిచిపోయాయి: ఎఫ్ఏఏ
జనవరి 11న అమెరికా వ్యాప్తంగా వేలాది విమానాలు నిలిచిపోవడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తీవ్ర విమర్శలను ఎందుర్కొంది. ఈ పరిణామంపై విచారణ చేపట్టిన ఎఫ్ఏఏ, ఆరోజు మిమానాలు నిలిచిపోవడానికి గల కారణాలను తాజాగా వెల్లడించింది.
21 Jan 2023
ఉజ్బెకిస్తాన్బాంబు బెదిరింపు: రష్యా నుంచి గోవా వస్తున్న విమానం ఉజ్బెకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు వస్తున్న చార్టర్డ్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో షాక్‌కు గురైన అధికారులు విమానాన్ని అత్యవరస ల్యాండింగ్ కోసం ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. శనివారం తెల్లవారుజామున జరిగన ఈ ఘటనతో అధికారులు హడలెత్తిపోయారు.
20 Jan 2023
ప్రపంచంతొలి ప్రయోగాన్ని పూర్తి చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్-ఎలక్ట్రిక్ విమానం
ZeroAvia, ఒక బ్రిటిష్-అమెరికన్ హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ డెవలపర్, ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
20 Jan 2023
ఎయిర్ ఇండియావిమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
న్యూయార్క్-దిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం చర్యలు తీసుకుంది.
18 Jan 2023
బీజేపీవిమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇండిగో విమానంలో జరిగిన ఒక ఘటనపై కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
17 Jan 2023
నేపాల్నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం
నేపాల్ విమాన ప్రమాదం నేపథ్యంలో మృతదేహాల కోసం అన్వేషిస్తున్న క్రమంలో రెండు బ్లాక్ బాక్స్‌లను సిబ్బంది గుర్తించారు. వాటిని సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులకు అప్పగించారు. ఈ విషయాన్ని యతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు. బ్లాక్ బాక్స్‌లోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ ప్రమాదానికి గల కారణాలను గుర్తించడంలో ఉపయోగపడుతాయి.
16 Jan 2023
నేపాల్నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే!
నేపాల్ విమాన ప్రమాదానికి సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విమానంలో ఉన్న ఐదుగురు భారతీయుల్లో ఒకరు ఫేస్‌బుక్ లైవ్‌లో ఫ్లైట్ గ్లాస్ నుంచి అందాలను చూపించారు. అయితే ఆ లైవ్ ప్రారంభమైన సెకన్లకే విమానం కుప్పకూలి.. అందులో మంటలు చెలరేగాయి. ఈ దృశ్యాలు ఫేస్ బుక్ లైవ్‌లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో తీసిన వ్యక్తిని యూపీకి చెందిన జైస్వాల్‌గా గుర్తించారు.
16 Jan 2023
నేపాల్నేపాల్ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 72మంది ప్రయాణిస్తున్న నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి పొఖారాకు వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 15మంది విదశీయులు మరణించినట్లు నేపాల్ పౌర విమానయాన అథారిటీ ధృవీకరించింది.
13 Jan 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏNOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు బుధవారం అనుకోని సంఘటన ఎదురైంది. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ (NOTAM) అనే వ్యవస్థ వలన అంతరాయం ఏర్పడి వేలాది విమానాలు ఆగిపోయాయి. అంతరాయం ఫలితంగా 9,700 విమానాలు ఆలస్యం అయ్యాయి, అంతేకాకుండా 2,800 కంటే ఎక్కువ విమానాలు రద్దు అయ్యాయి.