క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

నేను ఇండియాకు ఆడి ఉంటే 1000వికెట్లు తీసేవాడిని; పాక్ మాజీ బౌలర్ బోల్డ్ కామెంట్స్ 

పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు సయీద్ అజ్మల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్ తరపున 212 మ్యాచులు ఆడిన ఆజ్మల్, 448వికెట్లు తీసుకున్నాడు.

ఐసీసీ వరల్డ్ కప్ 2023: వేదికలను తనిఖీ చేసేందుకు ఇండియాకు రానున్న పాకిస్థాన్ ప్రతినిధి 

ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచులకు భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 10నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచులను ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

ఫీల్డింగ్ సెట్ చేయడంలో ధోనీ మాస్టర్ మైండ్; వెంకటేష్ అయ్యర్ ప్రశంసలు 

భారత క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి ధోనీ రిటైరైనా ఐపీఎల్‌లో సీఎస్కే తరపున ఆడుతూ అభిమానులను అలరిస్తూ ఉన్నాడు.

01 Jul 2023

బీసీసీఐ

భారత క్రికెట్ టీమ్ లీడ్ స్పాన్సర్‌గా 'డ్రీమ్ 11': బీసీసీఐ ప్రకటన 

భారత క్రికెట్ జట్టు లీడ్ స్పాన్సర్ గా 'డ్రీమ్ 11'ని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.

జావెలిన్ త్రో: భారత్‌కు మరో టైటిల్ తీసుకొచ్చిన నీరజ్ చోప్రా 

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న లాసేన్ డైమండ్ లీగ్ 2023లో సత్తా చాటాడు. 87.66మీటర్లు బల్లాన్ని విసిరి భారతదేశానికి మరో టైటిల్ తీసుకుని వచ్చాడు.

325 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు భారీ ఆధిక్యం

యాషెస్ రెండో టెస్టులోనూ ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. లార్డ్స్ మైదానంలో రెండో రోజు ప్రదర్శించిన దూకుడును ఇంగ్లాండ్ మూడో రోజు కొనసాగించలేకపోయింది.

30 Jun 2023

శ్రీలంక

CWC Qualifiers: 213 పరుగులకే చాప చుట్టేసిన శ్రీలంక.. నెదర్లాండ్స్ బౌలర్ల విజృంభణ

జింబాబ్వే వేదికగా జరుగుతున్న వన్డేవరల్డ్ కప్ క్యాలిఫైయర్ లీగ్ మ్యాచులు ముగిశాయి. దీంతో సూపర్ సిక్స్ కు ఆరు జట్లు అర్హత సాధించాయి.

ఆసియా ఛాంపియన్‌గా భారత కబడ్డీ జట్టు.. 8వసారి టైటిల్ కైవసం

కబడ్డీ ఆటలో తమకు తిరుగులేదని భారత పురుషుల జట్టు మరోసారి నిరూపించింది. నేడు జరిగిన ఆసియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో భారత్ 42-32 తేడాతో ఇరాన్‌పై ఘన విజయం సాధించింది.

CWC Qualifiers: ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జింబాబ్వే సారిథి సీన్ విలియమ్స్

జింబాబ్వే వేదికగా వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇప్పటికే లీగ్ దశ ముగియడంతో సూపర్ సిక్స్ కు ఆరు జట్లు అర్హత సాధించాయి.

పాకిస్థానీ స్టార్ స్నూకర్ ఆటగాడు మాజిల్ అలీ ఆత్మహత్య

పాకిస్థానీ స్నూకర్ ఆటగాడు, ఆసియా అండర్-21 రజత పతక విజేత మజిద్ అలీ(28) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం పంజాబ్ లోని ఫైసలాదాద్ సమీపంలోని సుముంద్రిలో మజిల్ అలీ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.

30 Jun 2023

శ్రీలంక

CWC Qualifiers: శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ.. గాయం కారణంగా తప్పుకున్న దుష్మంత చమీరా 

జింబాబ్వే వేదికగా జరుగుతన్న వన్డే వరల్డ్ కప్ మ్యాచుల్లో శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా దుష్మంత చమీరా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతను స్వదేశానికి వెళ్లిపోయాడు.

యాషెస్ సిరీస్ : నాథన్ లియోన్ గాయంపై స్పందించిన స్టీవన్ స్మిత్

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు.

హునుమ విహారి సంచలన నిర్ణయం.. ఆంధ్ర జట్టుకు గుడ్‌బై

టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు.

ఆ మెగా టోర్నీకి టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్!

చైనాలోని హాంగ్జౌ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగే ఏషియన్ గేమ్స్ కు భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లను పంపాలని బీసీసీఐ భావిస్తోంది. తొలుత పంపకూడదని భావించినా, తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం.

సెంచరీతో విజృంభించిన వీవీఎస్ లక్ష్మణ్ కొడుకు

టీమిండియా క్రికెట్లో వీవీఎస్ లక్ష్మణ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో లక్ష్మణ్ తనదైన ముద్ర వేసుకున్నారు.

29 Jun 2023

బీసీసీఐ

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్!

టీమిండియా పురుషుల క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్‌ బాధ్యతలు తీసుకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

29 Jun 2023

శ్రీలంక

ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ సూపర్ సిక్స్ : శ్రీలంకతో పోరుకు సిద్ధమైన నెదర్లాండ్

భారత వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం అర్హత సాధించడానికి రెండు జట్లకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వే వేదికగా ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచులు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఆ బంతి నా ప్యాడ్‌కు తాకి ఉంటే నా కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడేది : అశ్విన్

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బౌలింగ్‌తో చాలాసార్లు ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. అతను బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్ లోనూ ఎన్నోసార్లు రాణించాడు. అయితే తన కెరీర్ లో ఓ కీలక మ్యాచు గురించి అశ్విన్ ఐసీసీ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

టెస్టు క్రికెట్ రారాజు స్టీవన్ స్మిత్.. మరో రికార్డు సొంతం

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా నిన్న మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్టులో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇందులో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవన్ స్మిత్ సాధించిన రికార్డు ప్రధానమైనది.

వింబుల్డన్‌లో టాప్ సీడ్‌గా నిలిచిన కార్లోస్‌ అల్కరాజ్

ప్రతిష్టాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో యువ టెన్నిస్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ స్పెయిన్ ఆటగాడికి టాప్‌సీడ్ దక్కింది.

ప్రజా సేవ చేయాలని ఉంది.. త్వరలో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా అంబటి రాయుడు

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

వన్డే వరల్డ్ కప్‌కి తెలుగు కుర్రాడు అవసరం : రవిశాస్త్రి

భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం ఐసీసీ ఇటీవలే షెడ్యూల్‌ను ప్రకటించింది. సొంతగడ్డపై ఈ మెగాటోర్నీ జరగనుండటంతో రోహిత్ సేనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కొన్ని కీలక సూచనలు చేశారు.

టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఆ సిరీస్‌కు ఇద్దరు స్టార్ ప్లేయర్లు రెడీ

భారత జట్టులో పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆసియా‌ కప్, వన్డే వరల్డ్ కప్ సిరీస్‌లు దగ్గరికి వస్తున్నాయి. తాజాగా ఇద్దరు కీలక ఆటగాళ్లు ఆసియా కప్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

వన్డే వరల్డ్‌కప్ పాకిస్థాన్ ఆడకపోతే.. ఐసీసీ ఏం చేస్తుందో తెలుసా..?

భారత్ వేదికగా జరిగే ప్రపంచ కప్ 2023 కోసం షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. షెడ్యూల్ ఖరారు కావడంతో పాకిస్థాన్ జట్టు ఇండియాకు వస్తుందని అంతా భావించారు.

చిరకాలం గుర్తిండిపోయే రికార్డుకు చేరువలో నాథన్ లియోన్

యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో నేడు రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.

వన్డే ప్రపంచకప్ 2023లో ఉత్కంభరితంగా సాగే మ్యాచులు ఇవే.. ఐసీసీ వెల్లడి 

భారత వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆక్టోబర్ 5న నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడే మ్యాచులు ఎలా జరుగుతాయంటే?

2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 12తో తొలి దశ మ్యాచులు ముగియనున్నాయి.

2011లో సచిన్ కోసం వరల్డ్ కప్ సాధించాం.. ఈసారి ఆ ప్లేయర్ కోసం కప్పు గెలవాలి : సెహ్వాగ్

భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 కోసం షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది.

World Cup 2023 : ఆ రెండు స్టేడియాలు, ఆ రెండు జట్లతో టీమిండియాకు గండం!

వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈ టోర్నీకి ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉంది.

డేంజర్ జోన్‌లో వెస్టిండీస్.. నేటి నుంచే క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్

వన్డే వరల్డ్ కప్‌ను రెండుసార్లు ముద్దాడి, ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టు డేంజర్ జోన్ లో ఉంది. క్వాలిఫయర్స్ సూపర్ 6 స్టేజ్‌కు శ్రీలంక అర్హత సాధించగా, ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ లలో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించడానికి ఆరు జట్లు బుధవారం నుంచి క్వాలిఫయర్స్ సూపర్ 6 స్టేజ్‌లో పోటీ పడనున్నాయి.

వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఐర్లాండ్ టూర్‌కు టీమిండియా

టీమిండియా, వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లు ఆడనుంది. ఆ సిరీస్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ పర్యటనలో టీమిండియా మూడు టీ20 సిరీస్ లను ఆడనుంది.

ఇండియన్ క్రికెట్ అభిమానులకు చేదు వార్త

దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2023 మ్యాచులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది.

ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి యాషెస్ రెండో టెస్టు

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండో టెస్టు ప్రారంభం కానుంది. లార్డ్స్ మైదానంలో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఎన్‌సీఏలో బుమ్రా ప్రాక్టీస్.. జూలైలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్న యార్కర్ల కింగ్

ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అంతకంటే ముందే ఆసియా కప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రాపైనే నిలిచాయి.

SAFF Championship : డ్రాగా ముగిసిన భారత్, కువైట్ మ్యాచ్ 

సాఫ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇండియా, కువైట్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. కువైట్‌తో జరిగిన మ్యాచులో భారత్ పుట్‌బాల్ జట్టు 1-1తో సమానంగా నిలిచింది.

27 Jun 2023

శ్రీలంక

ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ : వన్డేలో 9వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన పాతుమ్ నిస్సాంక

బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక అద్భుతంగా రాణించాడు.

పక్కా ప్రణాళికలతో వరల్డ్ కప్ బరిలోకి.. షెడ్యూల్‌పై రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్ 

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. టీమిండియా వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుండటంతో అంచనాలు పెరిగిపోయాయి.

హైదరాబాద్‌లో జరిగే వరల్డ్ కప్ మ్యాచుల లిస్ట్ ఇవే!

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచుతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 12న పూణేలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే ఆఖరి గ్రూప్ మ్యాచులతో లీగ్ స్టేజ్ ముగియనుంది.

ధోనీని కలవడంతో నా కల నిజమైంది: యశస్వీ జైస్వాల్

మైదానంలోనూ బయటా మిస్టర్ కూల్ అనిపించుకునే మహేంద్ర సింగ్ ధోనీని అభిమానించని వారెవరుంటారు? తన ఆట, మాట తీరుతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకొనే ధోనీ ఎంతోమందికి ఆదర్శం.

కోహ్లీ పుట్టిన రోజు నాడు బలమైన జట్టుతో మ్యాచ్.. శతకం బాదేనా?

వరల్డ్ కప్‌ 2023 కోసం రోజుల దగ్గర పడుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్నా ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ ను నేడు ఐసీసీ ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఈ టోర్నీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.