క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

టెస్టుల్లో స్టీవ్ స్మిత్ ఎవరెస్టు.. అరుదైన మైలురాయిని చేరుకున్న ఆసీస్ బ్యాటర్!

టెస్టు క్రికెట్‌లో ఘనమైన రికార్డులతో పాటు ఇప్పటికే ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన ఆసీస్ స్టార్ స్టీవన్ స్మిత్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

వరల్డ్ కప్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ కెప్టెన్

బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్‌కు మరో మూడు నెలల సమయం ఉన్న తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

IND Practice Match: విఫలమైన విరాట్ కోహ్లీ.. విజృంభించిన రోహిత్

ప్రస్తుతం టీమిండియా జట్టు కరీబియన్ దీవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో మొదలు కానన్న టెస్టు సిరీస్ కు భారత జట్టు సిద్ధమైంది.

పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా జాకా అష్రఫ్ నియామకం 

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా జాకా అష్రాఫ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని పీసీబీ గురువారం ప్రకటించింది.

లండన్‌లో అజిత్ అగార్కర్‌తో లంచ్.. గొప్ప సందేశాన్ని ఇచ్చిన సచిన్

టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ లండన్‌లో వెకేషన్‌ని ఆస్వాదిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉంటే సచిన్, తన అభిరుచుల్ని, అనుభవాల్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.

దులీప్ ట్రోఫీ 2023: విజృంభించిన శివమ్ మావి 

2023 దులీప్ ట్రోఫీలో భాగంగా తొలి సెమీ ఫైనల్లో రైట్ ఆర్మ్ పేసర్ శివమ్ మావి విజృంభించాడు. తొలుత ఈ మ్యాచులో సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ 220 పరుగులకు ఆలౌటైంది.

టీ20ల్లో అరుదైన ఘనత సాధించిన అలిస్సా హీలీ 

ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్ అలిస్సా హీలీ టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచులో ఈ ఘనతను సాధించింది.

2023 వింబుల్డన్: మొదటి రౌండ్‌లో విజయం సాధించిన స్టెఫానోస్ సిట్సిపాస్ 

పురుషుల సింగిల్స్‌లో స్టెఫానోస్ సిట్సిపాస్ మొదటి రౌండ్ లో కి ప్రవేశించాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో అతను 3-6, 7-6(1), 6-2, 6-7(5), 7-6(8)తో థిమ్ పై విజయం సాధించాడు.

IND vs WI: భారత జట్టులోకి తెలుగోడు.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి

వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. హార్ధిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ పాత్రలో కనిపించనున్నాడు.

వెస్టిండీస్ దిగ్గజంతో టీమిండియా ప్లేయర్లు  

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం భారత ఆటగాళ్లు కరేబియన్ గడ్డపై అడుగుపెట్టారు. ఈ క్రమంలో భారత బృందం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు.

టీమిండియాతో టెస్టు సిరీస్.. స్పెషల్ ఫోకస్ పెట్టిన విండీస్!

జింబాబ్వే వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచుల్లో నిరాశపరిచిన వెస్టిండీస్, వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించకలేపోయింది.

యాషెస్ సిరీస్ : ఇంగ్లాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం

యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టు మ్యాచులు ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టుకు ముందు గాయం కారణంగా ఆ జట్టు వైస్ కెప్టెన్ ఒల్లీ పోప్ యాషెస్ సిరీస్‌లోని మిగిలిన మ్యాచులకు దూరమయ్యాడు.

ఐసీసీ నెంబర్ 1 టెస్టు బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్.. టాప్-10లో భారత్ నుంచి ఒక్కడు

న్యూజిలాండ్ జట్టు స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు.

ముగ్గురు భారత ఆటగాళ్లను వదిలేయనున్న లక్నో సూపర్ జెయింట్స్!

ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిరాశపరిచింది. గతేడాది టోర్నీలో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత ప్రదర్శన‌తో ఫ్లే ఆఫ్స్ చేరింది. ఈసారి ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలై ఇంటిముఖం పట్టింది.

వింబుల్డన్‌లో కార్లోస్ అల్కరాజ్ ముందంజ

టాప్ సీడ్ అల్కరాజ్ వింబుల్డన్‌లో సత్తా చాటాడు. మంగళవారం జరిగిన మొదటి రౌండ్‌లో అతడు 6-0, 6-2, 7-5తో చార్డీ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. మూడో సెట్లో మాత్రమే అల్కరాజ్ కొంచెం పోరాడాల్సి వచ్చింది.

భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌కు గౌరవ డాక్టరేట్

భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు మరో అరుదైన గౌరవం లభించింది. కర్ణాటకు చెందిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆయనకు గౌరవ డాక్టరేట్ ను అందించింది.

మరింత పడిపోయిన పీవీ సింధు ర్యాంకు

డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పివి.సింధు బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో వెనుకబడింది. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన జాబితాలో ఏకంగా మూడు స్థానాలు కోల్పోయి సింధు 15వ ర్యాంకులో నిలిచింది.

టీమిండియా మాజీ ప్లేయర్‌కు తప్పిన పెను ప్రమాదం

టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్, అతని కుమారుడు త్రుటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా దూసుకొచ్చి ఓ ట్రక్కును ఢీకొట్టింది.

వన్డే వరల్డ్ కప్ ముందు కీలక నిర్ణయం.. టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

వన్డే ప్రపంచ కప్ నుంచి జింబాబ్వే నిష్క్రమణ

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కు జింబాబ్వే కూడా అర్హత సాధించలేకపోయింది. మెగా టోర్నీకి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో జింబాబ్వే చేతులెత్తేసింది.

9వ సారి SAFF టైటిల్ గెలిచిన భారత్

శాఫ్ ఫుట్‌ బాల్ జట్టు ఛాంపియన్ షిప్‌లో భారత జట్టు అదరగొట్టింది. మంగళవారం జరిగిన ఫైనల్లో కువైట్‌పై నెగ్గిన సునీల్ ఛెత్రి సేన తొమ్మిదోసారి సాఫ్ కప్‌ను కైవసం చేసుకుంది.

బ్యాట్ పట్టుకున్న కేన్ విలియమ్సన్..ఐపీఎల్ గాయం నుంచి కోలుకున్నట్లేనా?

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో మిగతా లీగ్‌లకు, కివీస్ తరుపున అంతర్జాతీయ మ్యాచులకు దూరమయ్యాడు.

భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా అమోల్ మంజుదార్ ఫిక్స్!

భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా వెటరన్ క్రికెటర్ అమోల్ మజుందార్ నియామకం అయినట్లు సమాచారం. ఈ మేరకు సీఏసీ ముంబయిలో సోమవారం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది.

పాకిస్థాన్‌ను వదిలేస్తున్నా.. ఐపీఎల్ ఆడటానికి సిద్ధం : మహ్మద్ అమీర్

2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎంతోమంది ఆటగాళ్లను అంతర్జాతీయ మ్యాచులను ఆడే అవకాశం ఐపీఎల్ కల్పించింది.

ఆసియా కప్ నిర్వహణపై క్లారిటీ..ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆ రోజునే!

ఆసియా కప్ వివాదంపై త్వరలోనే సస్పెన్స్ వీడనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆసియా కప్ నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

ఒమన్‌పై నెదర్లాండ్స్ విజయం

వరల్డ్ క్యాలిఫయర్స్ టోర్నమెంట్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన సూపర్ సిక్సెస్ మ్యాచులో నెదర్లాండ్స్ 74 పరుగుల తేడాతో గెలుపొందింది.

రంగంలోకి దిగిన బ్రియాన్ లారా.. వెస్టిండీస్ పరాజయాలకు చెక్ పడేనా?

జింబాబ్వే వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ క్యాలిఫైయర్ మ్యాచుల్లో వెస్టిండీస్ చేతులెత్తేసింది. లీగ్ దశలో ధాటిగా ఆడిన ఆడిన విండీస్, సూపర్ సిక్స్ స్టేజ్ లో దాన్ని కొనసాగించలేకపోయింది.

టీ10 లీగ్ ఆడనున్న టీమిండియా మాజీ ఆటగాళ్లు

జింబాబ్వే క్రికెట్ తొలిసారిగా 'జిమ్ ఆప్రో టీ10' పేరుతో ఓ ప్రాంఛైజీ లీగ్ ను నిర్వహిస్తోంది. ఈ జిమ్ ఆఫ్రో టీ 10 లీగ్ జులై 20న ప్రారంభం కానుంది.

ఆస్ట్రేలియా ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురిపై వేటు

యాషెస్ రెండో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో స్టంపౌట్ వివాదానికి సంబంధించి ఆస్ట్రేలియా ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురిని మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఎంసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

టీమిండియాకు అదే పెద్ద మైనస్.. ఈసారీ వరల్డ్ కప్‌లో పాక్ గెలుస్తుంది: పాక్ మాజీ క్రికెటర్

ఈ ఏడాది భారత్, పాకిస్థాన్ జట్లు కనీసం రెండుసార్లు తలపడనున్నాయి. మొదట వన్డే ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్ టోర్నీలో టీమిండియా, పాక్ తలపడనుండగా, భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ టోర్నీలో మరోసారి ఈ రెండు జట్లు మధ్య పోరు జరగనుంది.

Wimbledon 2023: జకోవిచ్, స్వియాటెక్‌ శుభారంభం.. విలియమ్స్ ఔట్!

ప్రతిష్ఘాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్ సీడ్ ప్లేయర్లు శుభారంభం అందించారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ నోవక్ జకోవిచ్, మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించారు.

కరేబియన్ బీచ్ లో వాలీబాల్ ఆడిన టీమిండియా ప్లేయర్లు

వన్డే ప్రపంచ కప్ సన్మాహకాల్లో ఉన్న భారత జట్టు వెస్టిండీస్ గడ్డపై కాలు మోపింది. టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లలో సత్తా చాటేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమయ్యారు.

ఆ ముగ్గురి బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం : డివిలియర్స్

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ లకు కేరాఫ్ గా నిలిచి ఘనమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు.

బాడీబిల్డర్ జో లిండ‌ర్న్ కన్నుమూత

ప్రముఖ జర్మన్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్స్, బాడీ బిల్డర్ జో లిండ్నర్ హఠాన్మరణం చెందాడు. అతను సోషల్ మీడియా వేదికగా ఫిటెనెస్ పాఠాలు చెబుతూ వినోదాన్ని పంచేవాడు.

యాషెస్‌ సిరీస్‌లో సెగలు పుట్టిస్తున్న మరో వివాదం.. బెయిర్ స్టో స్టంపౌట్ పై రచ్చ

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో టెస్టు మ్యాచును గెలిచింది. స్వదేశంలో బజ్‌బాల్ స్టైల్ నమ్ముకొని ఆస్ట్రేలియాను భయపెడదామనుకున్న ఇంగ్లండ్ ఆటలు సాగడం లేదు.

గాయం కారణంగా యాషెస్ సిరీస్ నుంచి తప్పుకున్న నాథన్ లియాన్

లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో యాషెస్ సిరీస్‌లో 2-0 తేడాతో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది.

బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా మహిళల జట్టు ప్రకటన.. ఆ ఇద్దరికి షాక్!

బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల వన్డే, టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. బంగ్లాదేశ్ తో జరగనున్న మూడు టీ20ల మ్యాచ్, వన్డే సిరీస్ లకు మహిళల సెలక్షన్ కమిటీ భారత్ జట్టును ఎంపిక చేసింది.

03 Jul 2023

బీసీసీఐ

ఆ స్టేడియాలకు ద్వైపాక్షిక సిరీస్‌లలో పెద్దపీట: బీసీసీఐ కార్యదర్శి

భారత వేదికగా వన్డే ప్రపంచ కప్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వేదికలకు ఐసీసీ ఖారారు చేసింది.

రిటైర్మెంట్ ప్రకటించినా.. మళ్లీ వింబుల్డన్ కోర్టులో పోటీకి సిద్ధమైన సానియా మీర్జా!

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె మళ్లీ వింబుల్డన్ కోర్టులో పోటీ చేయడానికి సిద్ధమైంది. కాగా ప్రధాన వింబుల్డన్ డ్రాలో సానియా పోటీ చేయకపోవడం గమనార్హం.

ప్రపంచ కప్ ఆడేందుకు వెస్టిండీస్‌కు ఉన్నది ఆ ఒక్క ఛాన్స్ మాత్రమే!

ప్రపంచ కప్ క్రికెట్ క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మ్యాచులో అందరినీ ఆశ్చర్యగొలిపే విధంగా స్కాట్లాండు మీద వెస్టిండీస్ ఓడిపోయి ప్రపంచ కప్ ఆడేందుకు అర్హత కోల్పోయింది.