క్రికెట్: వార్తలు

ఐపీఎల్‌కు రిషబ్ పంత్ దూరం.. సౌరబ్ గంగూలీ క్లారిటీ

భారత్ స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. పంత్ కోలుకోవడానికి 12 నెలలు పట్టచ్చు. అయితే మెగా ఐపీఎల్ టోర్నికి రిషబ్‌పంత్ అందుబాటులో ఉండడని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు.

ఆస్ట్రేలియా టెస్టు జట్టులో టాడ్ మర్ఫీకి చోటు

వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఇండియాతో నాలుగు టెస్టు మ్యాచ్ లను ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆడనున్న ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 18 మంది సభ్యులతో కూడిన టీమ్ ను ప్రకటించింది. ఇందులో స్పిన్నర్లకు అవకాశం కల్పించింది.

దటీజ్ రోహిత్ శర్మ.. క్రీడాస్ఫూర్తిని చాటుకున్న కెప్టెన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి క్రీడాస్ఫూర్తిని చాటుకొని అందరి మనసులను గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 'మన్కడింగ్ రనౌట్' కు భారత బౌలర్ షమీ ప్రయత్నించగా.. వెంటనే కెప్టెన్ రోహిత్ నిరాకరించాడు. షమీచేత అప్పిల్ ను వెనక్కు తీసుకునేలా చేసి శబాష్ అనిపించుకున్నాడు.

భారత ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్

శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేలో ఏ బౌలర్‌కు సాధ్యంకాని రికార్డును ఉమ్రాన్ మాలిక్ క్రియేట్ చేశారు. వన్డేలో అత్యంత వేగవంతమైన భారత్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఏకంగా 156కి.మీ వేగంతో బంతిని విసిరి ఈ ఘనతను సాధించాడు.

దసున్ శనక సెంచరీ వృథా

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేసింది.

రోహిత్ శర్మ సెంచరీ మిస్.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బద్దలు

గౌహతిలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. శుభ్ మన్ గిల్ తో కలిసి మొదటి వికెట్ కు 143 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓపెనర్ గా వన్డేలో అత్యధిక పరుగులు చేసిన భారత్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ మూడోస్థానంలో నిలిచాడు.

ప్రపంచ కప్‌లో జార్జియా వేర్‌హామ్‌కు అవకాశం

ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్ జట్టులో జార్జియా వేరేహామ్ కు చోటు లభించింది. గతంలో గాయం భారీన పడిన ఈ లెగ్ స్పిన్నర్ మ్యాచ్ లకు దూరమైన విషయం తెలిసిందే.

10 Jan 2023

శ్రీలంక

వన్డేల్లో శ్రీలంక పేసర్ అరంగ్రేటం

శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక భారత్ తో జరిగిన వన్డేలో శ్రీలంక తరుపున అరంగ్రేటం చేశారు. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ తన T20I కెరీర్‌లో మంచి ప్రారంభాన్ని ప్రారంభించాడు.

టీమిండియా షాక్.. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌‌కు బుమ్రా దూరం

టీమిండియా యార్కర్ల కింగ్ జస్పిత్ బుమ్రాను ఇప్పటికే వన్డే సిరీస్ నుంచి జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే మొదటి రెండు టెస్టులకు బుమ్రా తప్పుకున్నాడు. ఈ పేసర్‌కు మరో మూడు వారాల విశ్రాంతి పొడిగించినట్లు సమాచారం.

సూర్యకుమార్ పాకిస్తాన్‌లో పుట్టి ఉంటే కష్టమే: పాక్ మాజీ కెప్టెన్

సూర్యకుమార్ యాదవ్ లేటు ఎంట్రీ ఇచ్చినా టీమిండియా తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 బ్యాట్స్ మెన్స్ కొనసాగుతూ రికార్డుల మోత మోగిస్తున్నాడు.

ఇక రోహిత్, విరాట్ కోహ్లీల టీ20 కెరీర్ ముగిసినట్లేనా..?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియా జట్టుకు అద్భుత విజయాలను అందించారు. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ నుంచి భారత జట్టులో అనేక ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.

పాకిస్తాన్‌కు విజయాన్ని అందించిన మహ్మద్ రిజ్వాన్

న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మహ్మద్ రిజ్వాన్ అజేయంగా 77 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

రిషబ్ పంత్ కి ఫుల్ సాలరీ ఇస్తూ ప్రకటన

రిషబ్ పంత్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ కోలుకోవడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. తాజాగా పంత్ విషయంలో బీసీసీఐ పెద్ద మనసు చాటుకుంది.

09 Jan 2023

ప్రపంచం

అంతర్జాతీయ క్రికెట్‌కు సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వీడ్కోలు

సౌతాఫ్రికా ఆటగాడు ఆల్ రౌండర్ డ్వైన్ పెట్రోరియస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇకపై టీ20 ఫార్మాట్ పైనే దృష్టి సారిస్తానని పెట్రోరియస్ ప్రకటించాడు. ఇది తన కెరియర్లో అత్యంత కఠిన నిర్ణయమని పెట్రోరియస్ చెప్పారు.

వన్డే సిరీస్ ముందే టీమిండియాకు షాక్.. బుమ్రా దూరం

శ్రీలంకతో టీ20 సిరీస్ సాధించి, మంచి ఫామ్ లో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా అనివార్య కారణాలతో ఈ సిరీస్ దూరమయ్యాడు. బూమ్రా రీఎంట్రీ విషయంలో బిసీసీఐ యూటర్న్ తీసుకుంది. భవిష్యత్ టోర్నిల నేపథ్యంలో బుమ్రాను పక్కకు పెట్టినట్లు సమాచారం. గాయం కారణంగా సీనియర్ పేసర్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే.

నాలుగో స్థానంలో సూర్యానా.. అయ్యారా..?

2023 వన్డే ప్రపంచ కప్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీమిండియా ప్లేయర్ల ఎంపిక ప్రస్తుతం బీసీసీఐకి పెను సవాల్‌గా మారింది. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలో అర్ధం కాక తలలు పట్టుకుంటోంది.

భారత్ బ్యాట్‌మెన్స్ రాణించకపోతే కష్టమే

శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గి ఈ ఏడాదిని టీమిండియా ఘనంగా బోణి కొట్టింది. రేపటి నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ ను గౌహతి వేదికగా ఆడనుంది. టీ20 సిరీస్ కు రెస్టు తీసుకున్న సీనియర్ ప్లేయర్లు రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో టీమిండియా మరింత పటిష్టంగా తయారైంది.

శ్రీలంకతో జరిగే మొదటి వన్డేలో అదే ఫామ్ కొనసాగేనా..!

భారత్, శ్రీలంక మధ్య జనవరి 10న గౌహతిలో తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.

టెస్టులో సర్పరాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ

న్యూజిలాండ్ లో జరుగుతన్న టెస్టు సిరీస్ లో పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్పరాజ్ అహ్మద్ సెంచరీ చేశారు. టెస్టులో తిరిగి వచ్చాక సర్ఫరాజ్ 4 సెంచరీలు చేసాడు. ఐదో వికెట్ కు సౌద్ షకీల్ తో కలిసి 123 పరుగులు జోడించారు.

బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు

ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. బీసీసీఐ కార్యదర్శ జై షా పై పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమకు తెలియకుండా ఏసీసీ క్యాలెండర్ రిలీజ్ చేయడంపై ఆయన మండిపడ్డారు.

సెలక్షన్ కమిటీని తొలగించిన DDCA చీఫ్

సీనియర్ రాష్ట్ర సెలక్షన్ కమిటీని ఢిల్లీ, డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ తొలగించారు. ప్యానల్‌లో అంతర్గత పోరు, ఎంపికల కారణంగా తప్పించినట్లు సమాచారం. సెలక్షన్ కమిటీ తన విధులను నిర్వర్తిస్తున్న తీరుపై గతంలో జైట్లీ ప్రశ్నించారు.

అర్ష్‌దీప్‌పై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు

ప్రొఫెషనల్స్ ఇలా చేయరంటూ అర్ష్ దీప్ నోబాల్స్ పై టీమిండియా మాజీ ప్లేయర్ గవాస్కర్ సీరియస్ అయ్యారు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో అర్షదీప్ 5 నోబాల్స్ వేసి ఓ చెత్త రికార్డును నమోదు చేసిన విషయం తెలిసిందే.

10 బంతుల్లో 5 నో బాల్స్.. అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ పేసర్ అర్షదీప్ సింగ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. కేవలం 10 బంతుల్లో 5 నోబాల్స్ వేశాడు. దీంతో ఒక టీ20 మ్యాచ్‌లో అత్యధిక నోబాల్స్ వేసిన భారత్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేయడం విశేషం.

అక్షర్ ఆటకు అభిమానులు ఫిదా

పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత పోరాటం చేసింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ (31బంతుల్లో 65; 3ఫోర్లు, 6 సిక్సర్లు) కొట్టి అందరి మనసులను దోచుకున్నారు. శ్రీలంక కెప్టెన్ షనక, అక్షర్‌ను ఛాతిపై తట్టి అభినందించాడు.

నంబర్‌వన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్

శ్రీలకంతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 10 బంతుల్లో 7 పరుగులు చేసినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాకింగ్‌లో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇషాన్ కిషన్ 10 స్థానాలను మెరుగుపరుచుకొని 23 స్థానానికి, దీపక్ హుడా 97వ స్థానానికి చేరుకున్నారు. ఇక ఆల్‌రౌండర్ జాబితాలో హార్ధిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు.

టీ20 సిరీస్‌పై టీమిండియా గురి

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ అతి కష్టం మీద మ్యాచ్ ను గెలిచింది. నేడు సాయంత్రం పుణేలో రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ ఎలాగైనా నెగ్గి సిరీస్ సాధించాలని భావిస్తోంది టీమిండియా.

టెస్టులో ట్రావిస్ హెడ్ అద్భుత రికార్డు

ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ టెస్టు మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ట్రావిడ్ హెడ్ హఫ్ సెంచరీని పూర్తి చేశారు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. మొత్తం టెస్టులో 12 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. కేవలం 59 బంతుల్లో 70 పరుగులు చేశారు. ఎప్పటిలాగే హెడ్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 450 పరుగులను పూర్తి చేసింది.

శామ్ కర్రన్‌ను క్షమాపణ కోరిన విమానయాన సంస్థ

ఇంగ్లండ్ యువ క్రికెటర్ శామ్ కర్రన్ ఐపీఎల్ వేలంలో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శామ్ కర్రన్ కు ఎయిర్ లైన్ సంస్థ క్షమాపణలు కోరుతూ ట్విట్ చేసింది. బుధవారం బ్రిటిష్ విమానయాన సంస్థ అయిన వర్జిన్ అట్లాంటిక్ లో ప్రయాణించడానికి శామ్ కర్రన్ అసౌకర్యంగా భావించాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా పోస్టు చేశాడు.

గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మ

టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్‌కి దురదృష్టం వెంటాడుతోంది. మంగళవారం వాంఖడే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సంజూకి గాయమైంది. అతని స్థానంలో ఐపీఎల్‌లో అకట్టుకున్న జితేష్ శర్మ టీ20లో అరంగేట్రం చేయనున్నారు. ఈ విషయాన్ని బుధవారం బీసీసీఐ ధ్రువీకరించింది.

టీమిండియాలో చోటు దక్కాలంటే యోయో, డెస్కా పరీక్షలు పాస్ అవ్వాల్సిందే..

టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కొన్ని నెలలుగా చాలా అనుమానాలున్నాయి. గాయాలు కారణంగా బరిలోకి దిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికే అందరికీ యోయో పరీక్షలంటే తెలుసు. దీనికి తోడు డెక్సా స్కాన్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.

డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షద్ పటేల్‌కు ఏమైంది

డెత్ ఓవర్లో వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పే హర్షల్ పటేల్ లేటుగా ఎంట్రీ ఇచ్చినా టీమిండియాకి కీ బౌలర్‌గా మారాడు. స్లో బాల్స్‌తో బ్యాటర్‌ను పరుగులు చేయకుండా ఇబ్బంది పెట్టడం హర్షల్ పటేల్ స్పెషాలిటీ. శ్రీలంకతో జరిగిన టీ20లో రెండు వికెట్లు తీసినప్పటికీ, 41 పరుగులు ఇచ్చాడు.

150కిలోమీటర్ల వేగంతో వెన్నులో వణుకు పుట్టించిన ఉమ్రాన్ మాలిక్

భారత్ యువ ఫాస్ట్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ త ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఏకంగా 150 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి.. బ్యాట్స్ మెన్స్ కు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. కాశ్మీర్ కు చెందిన ఈ బౌలర్ ప్రస్తుతం భారత్ తరుపున ఫాస్టెస్ట్ బాల్ వేసి రికార్డు బద్దలు కొట్టాడు.

రిషబ్ పంత్ కోసం ప్రత్యేక విమానం.. ముంబైకి తరలింపు

రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ కు వెళ్తుండుగా.. రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.

సూపర్ బౌలింగ్.. అక్షర పటేల్ : సాబా కరీమ్

శ్రీలంకతో జరిగిన టీ20 లో చివరి ఓవర్లో అక్షర్ పటేల్ అధ్బుతంగా బౌలింగ్ చేసి.. భారత్ కు విజయాన్ని అందించాడు. జోరుమీదున్న చమికకు షాట్‌ ఆడే అవకాశం ఇవ్వకుండా అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన బంతులు వేసి జట్టును గట్టెక్కించాడు.

4వేలు పరుగులు సాధించి.. ఖ్వాజా సంచలన రికార్డు

ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా నూతన ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు. టెస్టులో 4వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసి.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

హడలెత్తించిన మావి.. భారత్ థ్రిలింగ్ విన్

కొత్త ఏడాదిని భారత్ విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో జరిగిన టీ20లో బ్యాటర్లు విఫలమైనా.. బౌలర్లు రాణించారు. డెబ్యూ బౌలర్ శివమ్‌మావి లంక బ్యాటర్లకు చుక్కులు చూపించాడు. నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి.. నాలుగు వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రాణించడంతో టీమిండియా విజయం సాధించింది. అఖరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠను రేపింది.

స్ట్రైక్-రేట్ 135 కంటే తక్కువ ఉంటే జట్టులోకి నో ఎంట్రీ : షాహిద్ ఆఫ్రిది

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చీఫ్ సెలక్టర్‌గా పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది ఎంపికైన విషయం తెలిసిందే. వచ్చి రాగానే జాతీయ జట్టులో పెను మార్పులను ఆఫ్రిది చేయాలని నిర్ణయించుకున్నాడు.

03 Jan 2023

ఐపీఎల్

దాదా ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లోకి గంగూలీ రీ ఎంట్రీ

భారత్ క్రికెట్ దిగ్గజం సౌరబ్ గంగూలీ ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ విరమణ పొందారు. మళ్లీ ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఢిల్లీ కేపిటల్స్ హెడ్‌గా వస్తున్నట్లు సమాచారం. 2019 సీజన్‌లో గంగూలీ ఢిల్లీ కేపిటల్స్ అడ్వైజర్‌గా పనిచేశాడు. అదే ఏడాది అక్టోబరులో బీసీసీఐ అధ్యక్షుడయ్యాక డీసీ అడ్వైజర్ పదవికి గంగూలీ రాజీనామా చేశారు.

80 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత్ ప్లేయర్

భారత్ లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ రంజీ టోర్నిలో సంచలన రికార్డును నమోదు చేశారు. ఏ బౌలర్ కి 80 ఏళ్లుగా సాధ్యం కానీ.. రికార్డును నేటితో బద్దలు కొట్టాడు. గతేడాది దేశవాళీ క్రికెట్లో చక్కటి బౌలింగ్ తో అకట్టుకొని 12 ఏళ్ల తరువాత భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో ఎంపికై రెండు మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా..?

ఆసియా కప్ సమయంలో లంకేయుల చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నేటి నుండి జరిగే శ్రీలంక సిరీస్‌ టీమిండియా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శనతో అలరిస్తారో లేదో వేచి చూడాలి.