క్రికెట్: వార్తలు

కింగ్ కోహ్లీపైనే అందరి చూపులు..!

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ అంటే అంత సులభమేమీ కాదు, ప్రస్తుతం అందరి చూపు ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఆసీస్ టెస్టు సిరీస్ పైనే ఉంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్‌లో కింగ్ కోహ్లీపై అంచనాలు పెరిగిపోయాయి.

రంజీ ట్రోఫీలో సెమీస్‌కు చేరిన సౌరాష్ట్ర

రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా క్వార్టర్ ఫైనల్ పోరులో పంజాబ్‌పై 71 పరుగుల తేడాతో సౌరాష్ట్ర విజయం సాధించి, సెమీ-ఫైనల్‌కు దూసుకెళ్లింది.

స్టీవ్ స్మిత్‌ను అశ్విన్ అపగలడా..?

ఫిబ్రవరి 9నుంచి నాగ్ పూర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే భారత్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా నెట్స్‌లో చెడటోడుస్తోంది. ముఖ్యంగా భారత స్పిన్నర్లను ఎదుర్కొనడం కోసం వ్యూహాలను రచిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ రన్ మెషీన్ స్టీవ్ స్మిత్, టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవించంద్రన్ అశ్విన్ మధ్య పోరు జరగనుంది.

టీమిండియాను చూసి ఆసీస్ భయపడుతోంది

టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడనుంది. ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ కోసం రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ప్యాట్ కమిన్స్ బృందం.. గతంలో ఎన్నడూ లేని విధంగా 18 మంది సభ్యులతో భారత పర్యటనకు వచ్చింది. ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటికే నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియాకు భారీ షాక్, తొలిటెస్టుకు ఆల్ రౌండర్ దూరం

భారత్‌తో టెస్టు ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ దూరం కానున్నాడు.బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఫిబ్రవరి 12న భారత్-పాకిస్తాన్ మ్యాచ్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 8వ ఎడిషన్ ఫిబ్రవరి 10న ధక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభం కానుంది. ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మళ్లీ టైటిల్ పై కన్నేసింది.

మార్చి 4నుంచి 26 వరకు ముంబాయిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలోని రెండు వేదికలపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ మొత్తాన్ని ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు యోచిస్తోందని క్రిక్‌బజ్ తెలిపింది. డివై పాటిల్, సీసీఐ స్టేడీయాలు వేదిక కానున్నాయి.

గాబ్రియేల్ మార్టినెల్లి ఆర్సెనల్‌తో కొత్త ఒప్పందం

ప్రీమియర్ లీగ్ 2022-23 లీడర్స్ ఆర్సెనల్‌తో గాబ్రియేల్ మార్టినెల్లి కొత్త ఒప్పందంపై సంతకం చేశాడు. 21 ఏళ్ల బ్రెజిలియన్ మార్టినెల్లి మునుపటి ఒప్పందం వచ్చే సీజన్ చివరిలో ముగియనుంది. అయితే, అతను అదనపు సంవత్సరం కోసం ఎంపికతో, నూతనంగా నాలుగున్నర సంవత్సరాల ఒప్పందాన్ని అంగీకరించాడు.

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జింబాబ్వే సై

ఫిబ్రవరి 4 నుంచి జింబాబ్వేతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ సిద్ధమైంది. జింబాబ్వే‌‌కు కీలకమైన ఆటగాళ్లు దూరం కావడంతో జట్టు బలహీనంగా కనిపిస్తోంది. క్రెయిగ్ ఎర్విన్ జింబాబ్వే టెస్టు పగ్గాలను చేపట్టనున్నారు. మరోవైపు, కరీబియన్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

ఆంధ్రాపై విజయం సాధించి సెమీస్‌కు చేరిన మధ్యప్రదేశ్

రంజీ ట్రోఫీ 2022-23 క్వార్టర్ ఫైనల్స్‌లో మధ్యప్రదేశ్ ఆంధ్రపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. రికీభుయ్, కరణ్ షిండేల సెంచరీలతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేసింది. అయితే 2వ ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 93 ​​పరుగులకే ఆలౌటైంది.

ఒంటిచేత్తో విహారి బ్యాటింగ్, స్పందించిన దినేష్ కార్తీక్

టీమిండియా ప్లేయర్ హనుమాన్ విహారికి క్రికెట్ పట్ల ఎంతో నిబద్ధత ఉందని మనకు తెలుసు. ఈ మధ్య ఆస్ట్రేలియా టూరులో ఆ టీమ్ బౌలర్లు విసురుతున్న బంతులకు తన శరీరాన్ని అడ్డుగా పెట్టి అప్పట్లో విరోచితంగా పోరాడిన విషయం తెలిసిందే.

రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 వరల్డ్ కప్‌ హీరో

టీమిండియా బౌలర్ జోగిందర్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మంట్ ప్రకటించారు. ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్ కప్ లో జోగిందర్ చివరి ఓవర్ వేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ ఫైనల్ చివరి ఓవర్లో మిస్బాను ఔట్ చేసి అప్పట్లో వార్తల్లోకెక్కాడు.

ఝార్ఖండ్ పై విజయం సాధించి సెమీస్‌కు చేరిన బెంగాల్

2022-23 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో జార్ఖండ్‌పై ఘన విజయం సాధించి బెంగాల్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.ఝార్ఖండ్ పేసర్ ఆకాశ్ దీప్ ఆరు వికెట్లు పడగొట్టడంతో, 9 వికెట్ల తేడాతో బెంగాల్ గెలుపొందింది.

ఉత్తరాఖండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు చేరిన కర్ణాటక

2022-23 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఉత్తరాఖండ్‌పై సంచనల విజయంతో కర్ణాటక సెమీ ఫైనల్‌కు చేరుకుంది. కర్ణాటక విజయంలో శ్రేయాస్ గోపాల్, మురళీధర్ వెంకటేష్, కీలక పాత్ర పోషించారు.

టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన, ఆలౌరౌండర్ రీ ఎంట్రీ

ఇంగ్లండ్‌తో ఫిబ్రవరి 16న స్వదేశంలో న్యూజిలాండ్ రెండు టెస్టులను ఆడనుంది. ఇందుకోసం 14మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ ప్రకటించింది. టిమ్ సౌతీ న్యూజిలాండ్ టెస్టుకు సారథిగా నియమితులయ్యారు.

ఫైనల్‌కు చేరుకున్న బ్రిస్బేన్ హీట్

బిగ్‌బాష్ లీగ్ ఫైనల్‌కు బ్రిస్బేన్ హీట్ చేరుకుంది, సిడ్నీ సిక్సర్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో బ్రిస్బేన్ హీట్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్ నిర్ణీత 20 ఓవర్ల కు 9 వికెట్ల నష్టానికి 116 పరుగులను మాత్రమే చేసింది.

స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కింగ్ కోహ్లీకి కష్టమే..!

భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పాటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

గాయాలపై పోరాటం చేయలేకపోయా : షాహీన్ ఆఫ్రిది

ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్‌గా షామీన్ ఆఫ్రిదికి పేరుంది. యార్కర్లతో ప్రత్యర్థులకు బోల్తా కొట్టించే సత్తా ఆఫ్రిదికి ఉంది. అద్భుత బౌలింగ్ ఫెర్ఫామెన్స్‌తో పాకిస్తాన్ విజయంలో కీలకపాత్ర పోషిస్తాడు. 2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆఫ్రిది 25 టెస్టులు ఆడి 99 వికెట్లు పడగొట్టాడు.

ఫైనల్లో భారత్ మహిళలు ఓటమి

సౌతాఫ్రికా మహిళలతో జరిగిన టీ20 ట్రై సిరీస్ ఫైనల్లో టీమిండియా మహిళలు దారుణంగా విఫలమయ్యారు. లీగ్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన భారత మహిళలు పేలవ ప్రదర్శనతో ఫైనల్లో చతికిలపడ్డాడరు. ఫలితంగా ముక్కోణపు టోర్నీలో సౌతాఫ్రికా మహిళలు విజేతగా నిలిచారు.

అహ్మదాబాద్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌ను వీక్షించనున్న నరేంద్రమోడీ

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9న టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. నాలుగో టెస్టు మ్యాచ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ చివరి మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా భారత్‌కు రానున్నారు.

కర్ణాటక తరఫున సూపర్ సెంచరీతో మెరిసిన శ్రేయాస్ గోపాల్

ఆల్ రౌండర్ శ్రేయాస్ గోపాల్ రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశారు. క్వార్టర్-ఫైనల్‌లో ఉత్తరాఖండ్‌పై కర్ణాటక తరఫున అజేయ సెంచరీతో అదరగొట్టాడు. గోపాల్ ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఐదు సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచారు. మొత్తం ఈ ఫార్మాట్లో 3000 పరుగులకు మార్కును దాటి సత్తా చాటాడు.

జోఫ్రా ఆర్చర్ దెబ్బకు సౌతాఫ్రికా విలవిల

ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మూడో వన్డేలో నిప్పులు చెరిగాడు. జోఫ్రా దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు. తొలి వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆర్చర్ 81 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అతని కెరీర్‌లో ఇది చెత్త ప్రదర్శన కావడంతో రెండో వన్డేలో అతన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది.

దక్షిణాఫ్రికాను చిత్తు చేసి పరువు నిలబెట్టుకున్న ఇంగ్లండ్

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌కు ఊరట లభించింది. 59 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. మొదటి రెండు వన్డేలను కోల్పోయిన ఇంగ్లండ్.. మూడో వన్డేలో సత్తా చాటింది. జోస్ బట్లర్, డేవిడ్ మలన్ సెంచరీలతో రాణించగా, జోఫ్రా ఆర్చర్ ఆరు వికెట్ల తీసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

అర్ధ సెంచరీతో అదరగొట్టిన రీజా హెండ్రిక్స్

దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం కింబర్లీలో జరిగిన మూడో వన్డేలో రీజా హెండ్రిక్ రాణించారు. సౌతాఫ్రికా తరుపున హెండ్రిక్ 50 పరుగులు చేసి సత్తా చాటారు. దీంతో వన్డేలో తన 5వ అర్ధ సెంచరీని పూర్తి చేశారు.

న్యూజిలాండ్‌పై హార్ధిక్ పాండ్యా సూపర్ ఫర్మామెన్స్

అహ్మదాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఆలౌరౌండర్ హార్ధిక్ పాండ్యా సూపర్ ఫర్మామెన్స్ తో చేలరేగిపోయాడు. న్యూజిలాండ్ ని 66 పరుగులకే కట్టడి చేయడంతో హార్ధిక్ కీలక పాత్ర పోషించాడు.

ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సూర్యకుమార్ యాదవ్

సూర్య భాయ్.. ఇది పేరు కాదు! ఇట్స్ ఏ బ్రాండ్.. టీ20ల్లో ఈ బ్రాండ్ చేస్తున్న రీసౌండ్ మామూలుగా లేదు. గతేడాది చివరన ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెం.1 ప్లేస్ ని దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ తాజాగా మరో రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రికార్డు క్రియేట్ చేసిన మయాంక్ అగర్వాల్

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనతను సాధించాడు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ పోరులో కర్నాటక కెప్టెన్ మయాంక్ అద్భుత హాఫ్ సెంచరీతో రికార్డును క్రియేట్ చేశాడు. 109 బంతుల్లో 89 పరుగులు చేసి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 6500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఐపీఎల్ ఉమెన్స్ ప్లేయర్ల వేలం తేదీలు ఖరారు..?

ఇటీవలే ఫ్రాంచేజీల వేలం ముగిసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ప్రస్తుతం మరో ప్రక్రియకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 11న న్యూఢిల్లి లేదా ఫిబ్రవరి 13న ముంబైలో జరిగే అవకాశం ఉందని ESPN cricinfo నివేదించింది.

ఆసీస్‌తో తొలి టెస్టుకు శ్రేయాస్ దూరం

ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో జరిగే మొదటి టెస్టుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. వెన్నుగాయం నుంచి శ్రేయాస్ ఇంకా కోలుకోకపోవడంతో మొదటి టెస్టు నుంచి తప్పించారు. రేపటి నుంచి నాగపూర్‌లో జరిగే ట్రైనింగ్ సేషన్‌కు అతను రావడం లేదని సమాచారం. ఇదే నిజమైతే శ్రేయాస్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ టెస్టు ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.

బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా మరోసారి చండికా హతురుసింఘ

బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ మరోసారి చండికా హతురుసింఘ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మంగళవారం తెలిపింది. రెండేళ్ల పాటు కొత్త కోచ్‌గా చండికా బంగ్లాదేశ్‌కు సేవలందించనున్నారు. అంతకుముందు 2014 నుండి 2017 వరకు బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా హతురుసింఘ పనిచేసిన విషయం తెలిసిందే.

అవేష్‌ఖాన్ బౌలింగ్‌లో గాయపడ్డ హనుమ విహారి

రంజీ ట్రోఫీలో ఆంధ్ర కెప్టెన్ హునమ విహారి గాయపడ్డాడు. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2022-23 క్వార్టర్-ఫైనల్లో అవేష్ ఖాన్ బౌన్సర్ దెబ్బకు విహారి మణికట్టు ఫ్రాక్చర్ అయింది.

క్లీన్ స్వీప్ కోసం సౌతాఫ్రికా, పరువు కోసం ఇంగ్లండ్

సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు వన్డేలు ఇంగ్లండ్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. రేపు ఇంగ్లండ్ తో మూడో వన్డేకి న్యూజిలాండ్ సిద్ధమైంది. ఆఖరి వన్డేలోనూ విజయం సాధించి.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని ఆత్మవిశ్వాసంతో న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది. ఎలాగైనా ఓ మ్యాచ్ నెగ్గి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

8వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం

ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్‌లో జరిగిన టీ20 ట్రై-సిరీస్‌ ఆరో మ్యాచ్‌లో సోమవారం వెస్టిండీస్ మహిళలపై భారత్ మహిళలు 8 వికెట్ల తేడాతో గెలుపొందారు. దీప్తిశర్మ (3/11)తో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో విండీస్ 6వికెట్ల నష్టానికి 94 పరుగులే చేయగలిగింది.

ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డులు-2023.. విజేతలు వీరే..

ఆస్ట్రేలియా తమ దేశానికి చెందిన మెన్, ఉమెన్ క్రికెట్ ప్లేయర్లకు అవార్డులకు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ 2023లో భాగంగా ఆసీస్‌ రన్ మెషిన్ స్టీవ్ స్మిత్ అలెన్ బోర్డర్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. ఉమెన్ ప్లేయర్ బెత్ మూనీ బెలిండా క్లార్క్ అవార్డును సొంతం చేసుకుంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మురళీ విజయ్

భారత్ వెటనర్ క్రికెటర్ మురళీవిజయ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2008లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ద్వారా అరంగ్రేటం చేసిన విజయ్ చివరి టెస్టును ఆ దేశంపైనే ఆడడం గమనార్హం.

టీమిండియా టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎంట్రీ..?

డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు రానుంది. ఫిబ్రవరి 9-మార్చి 13 వరకు ఈ టెస్టు సిరీస్‌ జరగనుంది. నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

వరుస ఓటములతో ఇంగ్లండ్ చెత్త రికార్డు

వరుస ఓటములతో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. ఇంగ్లండ్ 50 ఓవర్లలో 342/7 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తో కైవసం చేసుకుంది.

హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన డేవిడ్ మిల్లర్

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ అద్భుతంగా రాణించారు. కేవలం 37 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు.

షాహీన్ అఫ్రిది ముందు బుమ్రా పనికి రాడు: పాక్ మాజీ ప్లేయర్

ప్రపంచంలోని గొప్ప పేస్ బౌలర్లలో ఇండియాకు చెందిన జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ షాహీన్ అఫ్రిది ముందుంటారు. యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో ఈ ఇద్దరూ సిద్ధహస్తులే.. గతేడాది ఆసియా కప్ తర్వాత బుమ్రా మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టలేదు. బుమ్రా సేవలను టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఎంతగానో మిస్ అయింది.

దక్షిణాఫ్రికా సిరీస్‌పై‌ కన్నేసిన షఫాలీ వర్మ

అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా ఇండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో ఇంగ్లాండ్ పై ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకే ఆలౌటైంది.