క్రికెట్: వార్తలు

37 టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయని విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును అధిగమించే క్రికెటర్ విరాట్ కోహ్లీనే అని క్రికెట్ దిగ్గజాలు చెబుతుంటారు. అయితే టెస్టులో మాత్రం విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. గత 37 టెస్టు ఇన్నింగ్స్ లో ఒక సెంచరీ కూడా చేయకపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

భారత్ క్రికెట్ చరిత్రలో రోహిత్‌శర్మ అరుదైన రికార్డ‌ు

భారత్ క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్‌కూ సాధ్యం కానీ రికార్డును టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ సాధించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటో సెంచరీ చేయడంతో ఈ ఘనతను రోహిత్ సాధించాడు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లోనూ సెంచరీలు సాధించిన కెప్టెన్ గా చరిత్రకెక్కాడు. టెస్టులో మొత్తం 9 సెంచరీలు సాధించిన ఆటగాడి నిలిచాడు.

సూపర్ సెంచరీతో అదరగొట్టిన మార్కరమ్, ఫైనల్‌కు చేరిన సన్ రైజర్స్

సౌతాఫ్రికా టీ20 లీగ్-2023 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ను 14 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓడించింది.

టీమిండియాకి పెద్ద షాక్.. జస్ప్రిత్ బుమ్రా టెస్టులకు దూరం

టీమ్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచ కప్ ఉన్నందున బోర్డర్ గవాస్కర్ ట్రోఫికి దూరమైనట్లు తెలుస్తోంది.

మొదటి టెస్టులో ఆస్ట్రేలియాకు చుక్కులు చూపించిన ఇండియా బౌలర్లు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరుగుతోన్న మొదట టెస్టులో మొదటి రోజు ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను 177 పరుగులకే టీమిండియా బౌలర్లు ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి ఆసీసీ బ్యాటర్ల నడ్డి విరిచాడు.

09 Feb 2023

జడేజా

జడేజా దెబ్బకు ఆస్ట్రేలియాకు మైండ్ బ్లాంక్

గతేడాది గాయానికి గురై కొన్ని నెలల పాటు క్రికెట్‌కు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మొదటి టెస్టులో విజృభించాడు. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా ఆసీస్ వెన్ను విరిచాడు. జడేజా ఐదు కీలక వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్‌పై అన్ని ఫార్మాట్‌లలో 100 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.

టెస్టులో చరిత్రను తిరగరాసిన రవిచంద్రన్ అశ్విన్

టీమిండియా వెటనర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టులో చరిత్రను సృష్టించాడు. టెస్టు క్రికెట్లో 450 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. నాగపూర్ వేదికగా జరుగుతున్న మొదటి మ్యాచ్ లో అలెక్స్ క్యారీని అశ్విన్ ఔట్ చేసి ఈ ఘనతను సాధించాడు. అనిల్ కుంబ్లే తర్వాత ఈ మైలురాయిని అందుకున్న రెండో ఇండియన్ బౌలర్‌గా నిలిచాడు.

మొదటి టెస్టులో రాణించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ లబుషాగ్నే

నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు జరిగింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టపటపా వికెట్లను కోల్పోయింది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఫాస్ట్ బౌలర్ షమీ సంచలన రికార్డు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ సంచనల రికార్డును సృష్టించాడు. షమీ అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లను పడగొట్టి చరిత్రకెక్కాడు. ఈ మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా షమీ నిలిచాడు.

టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్

నాగ్ పూర్ వేదికగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు టీమిండియా తుది జట్టులో ఆంధ్రా కుర్రాడు కేఎస్.భరత్ చోటు దక్కించుకున్నాడు. భరత్‌కు టీమిండియా క్రికెటర్ల సమక్షంలో టెస్ట్ క్యాప్‌ను సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా అందజేశారు.

టెస్టుల్లో అరంగేట్రం చేసిన టీ20 నెం1.ప్లేయర్

భారత్ టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు నెరవేరింది. అంతర్జాతీయ టీ20, వన్డేలో అదరగొట్టిన సూర్య.. ప్రస్తుతం టీమిండియా తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేశారు.

బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్, భరత్

స్వదేశంలో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే భారత్‌కి కనీసం మూడు విజయాలు కావాలి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

వెస్టిండీస్‌కి ధీటుగా బదులిచ్చిన జింబాబ్వే, డ్రాగా ముగిసిన మొదటి టెస్టు

జింబాబ్వే-వెస్టిండీస్ మధ్య బులవాయో వేదికగా మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది. మ్యాచ్ చివరి రోజు వెస్టిండీస్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ లో 54 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులను చేసింది.

టీ20 నెం.1 ప్లేయర్‌కి టెస్టులోకి చోటు దక్కేనా..?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో ఆస్ట్రేలియాను ఓడిస్తేనే భారత్ ఐసీసీ డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు నాగ్‌పూర్ లోని VCA స్టేడియంలో ప్రారంభం కానుంది.ఇండియా స్వదేశంలో 2017లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి టెస్టు ఆడే ప్లేయర్స్ ఎంపికలో టీమిండియా ఆచూతూచి వ్యవరిస్తోంది.

ఇషాన్ కిషన్ వర్సెస్ కెఎస్ భరత్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం భారత శిబిరం భీకరంగా సిద్ధమవుతోంది.‌

భయపడేది లేదు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై టీమిండియా కాన్ఫిడెన్స్

ప్రపంచ క్రికెట్లో రెండు అత్యుత్తమ జట్లు టెస్టులో తలపడితే అభిమానులకు అంతకుమంచి కిక్ ఏముంటుంది. ఉత్కంఠభరిత సమరాలకు వేదికగా నిలిచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

పాకిస్తాన్ క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం, 2 ఏళ్లపాటు ఆటగాడిపై నిషేధం

మ్యాచ్ ఫిక్సింగ్ లో పాక్ ఆటగాళ్లు మరోసారి బయటపడ్డారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫిక్సింగ్ లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం మరో పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు ఈ మహమ్మరికి బలి అయ్యారు.

క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన కమ్రాన్ అక్మల్

పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలే జాతీయ సెలక్షన్ కమిటీగా ఎంపికైన అక్మల్.. ప్రస్తుతం తన కొత్త పాత్రపై దృష్టి సారించాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యాక్షన ప్లాన్ ఇదే..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం భారత శిబిరం భీకరంగా సిద్ధమవుతోంది.‌

నాగపూర్‌లో టెస్టు సమరానికి సిద్ధమైన భారత్-ఆస్ట్రేలియా

గత రెండు దశాబ్దాల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎన్నో అద్భుతమైన, చిరస్మరణీయ టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఎన్నో రికార్డులు, ఘనతలు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్రపంచ క్రికెట్లో అన్నింటికంటే అత్యత్తుమ టెస్టు పోరుగా మార్చేశాయి. ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్‌పై రెండు జట్లు సమరం మొదలైంది.

తగ్గేదేలే అంటున్న ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాన్ ఆఫ్ స్పిన్నర్ టాడ్ మార్ఫీ తన బౌలింగ్‌లో ప్రత్యర్థుల బ్యాటర్లకు ఇబ్బంది పెట్టే సత్తా ఉంది.

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల రేసులో గిల్, సిరాజ్

అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను గుర్తించి.. గౌరవించడం కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి 2021లో 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును ప్రవేశపెట్టిన విషం తెలిసిందే. 2023 జనవరికి సంబంధించి నామినీల వివరాలను ఐసీసీ తాజాగా ప్రకటించింది.

సూపర్ రికార్డుకు చేరువలో హర్మన్ ప్రీత్ కౌర్

భారత మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో గొప్ప రికార్డుకు చేరువలో ఉంది. ఫిబ్రవరి 10న ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఆ ఫీట్‌ను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. కేవలం 60 పరుగులు సాధిస్తే ఆ మైలురాయిని అందుకొనే అవకాశం ప్రస్తుతం ఉంది.

అక్షర పటేల్ ఔట్.. కుల్దీప్ ఇన్..?

భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. మరో మూడ్రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కు తెరవేవనుంది. గురువారం నుంచి నాగపూర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో టీమిండియా పట్టు సాధించాల్సి ఉంది.

అరుదైన రికార్డు చేరువలో కింగ్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య కొద్దిరోజుల్లో బోర్కర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్ పైనే ఉంది. ఈ సిరీస్‌లో పలు రికార్డులు బద్దలు కావడానికి టెస్టు సిరీస్ వేదిక కానుంది. విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా ప్రస్తుతం ఓ ప్రత్యేకమైన మైలురాయికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆరోన్ ఫించ్ క్రికెట్లో సాధించిన రికార్డులపై ఓ కన్నేయండి..!

టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. 12 ఏళ్ల సుదీర్ఘమైన తన క్రికెట్ కెరీర్‌కు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్‌మెన్ ఆరోన్‌ఫించ్ ఫుల్‌స్టాప్ పెట్టాడు.గత సెప్టెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2021లో తొలి T20 ప్రపంచకప్ టైటిల్‌ను ఆస్ట్రేలియాకు ఫించ్ అందించాడు. టీ20ల్లో రెండుసార్లు 150-ప్లస్ స్కోర్‌ సాధించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.

పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలపై రవిచంద్రన్ అశ్విన్ సీరియస్

ఆసియాకప్ 2023 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. పా‌కిస్తాన్ వేదికగా ఆసియా కప్‌ను నిర్వహిస్తే.. పాక్‌లో ఆడేదిలేదని టీమిండియా ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఆడాలని భావిస్తే మాత్రం వేదికను మార్చాలని సూచించింది. పాకిస్తాన్‌లో టీమిండియా ఆసియాకప్ ఆడకపోతే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌లో పాక్ ఆడదిలేదని ఆ జట్టు క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సౌథీ వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి.

క్రికెట్ లీగ్స్‌పై సౌరబ్ గంగూలీ అసక్తికర వ్యాఖ్యలు

క్రికెట్ లీగ్స్ ఆడటానికి క్రికెటర్లు ఇష్టపడుతుంటారు. ఇండియన్ ఐపీఎల్ లీగ్, బిగ్ బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్స్ వేలంలో ప్రస్తుతం పోటీ కనిపిస్తోంది. ఏదో ఒక లీగ్‌లో ఆడాలని ప్రస్తుత క్రికెటర్లు ఆరాటపడుతున్నారు. అందుకే ఈ లీగ్స్‌కు ప్రస్తుతం చాలా డిమాండ్ ఏర్పడింది.

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించారు. 2020లో ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచ కప్‌ను అందించడంలో ఫించ్ కీలక పాత్ర పోషించి ఆ జట్టుకు ట్రోఫీని అందించాడు.

టీ20 ఉమెన్స్ ప్రపంచ కప్‌లో ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు

ఇటీవల ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో ఈనెల 10న ప్రారంభ కానుంది.

మార్చి 4న మహిళల ఐపీఎల్ ప్రీమియర్ లీగ్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ వచ్చే నెల ప్రారంభం కానుంది. మార్చి 4 నుంచి 26వ తేదీ వరకూ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడీయం, డివై పాటిల్ స్టేడియాలు ఈ లీగ్ కు అతిథ్యమివ్వనున్నాయి. చివరి మ్యాచ్ మార్చి 26న చివరి మ్యాచ్ జరగనుంది. ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 13న ముంబైలో జరగనుంది.

సెంచరీతో కదం తొక్కిన చందర్ పాల్

వెస్టిండీస్‌ బ్యాటర్‌ టాగెనరైన్‌ చందర్‌పాల్‌ సెంచరీతో కదం తొక్కాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండు మ్యాచ్ ల సిరిస్ లో భాగంగా వెస్టిండీస్ యువ ఆటగాడు చందర్‌పాల్ తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ బ్రాత్‌వైట్, చందర్ పాల్ సెంచరీలతో రాణించారు. బ్రాత్‌వైట్ టెస్టులో తన 12వ సెంచరీని నమోదు చేశారు.

అశ్విన్‌కు వార్నర్ చెక్ పెట్టేనా..?

టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టీమిండియా పోటి పడనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్పిన్ మంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్‌తో తలపడనున్నాడు.

సంచలన రికార్డుకు చేరువలో స్టీవెన్ స్మిత్

ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. స్మిత్ టీమిండియాతోనే మ్యాచ్ అంటేనే చెలరేగిపోతాడు.

సెంచరీతో గర్జించిన వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్

జింబాబ్వేతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్ వైట్ శతకంతో అదరగొట్టాడు. తన కెరీర్‌లో 12వ టెస్టు సెంచరీ చేసి సత్తా చాటాడు. బ్రాత్‌వైట్‌తో పాటు టాగెనరైన్ చందర్‌పాల్ తన తొలి టెస్టు శతకాన్నిసాధించాడు. వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య తొలి టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది.

రవీంద్ర జడేజా ఈజ్ బ్యాక్, టీమిండియా-ఆస్ట్రేలియా జట్టులో ఎంట్రీ

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా 6నెలలు జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 9నుంచి ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో రవీంద్ర జడేజా ఆడనున్నాడు.

వోల్ఫ్స్‌బర్గ్‌ను -2తో ఓడించింన ఎఫ్‌సి బేయర్న్

బుండెస్లిగా 2022-23 మ్యాచ్‌లో ఎఫ్‌సి బేయర్న్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 4-2తో వోల్ఫ్స్‌బర్గ్‌ను ఓడించి సత్తా చాటింది. దీంతో 2022-23 బుండెస్లిగాలో బేయర్న్ 11వ విజయాన్ని సాధించింది. కింగ్స్లీ కోమన్ 14 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు గోల్ కొట్టి రికార్డును క్రియేట్ చేశారు.

ఆసియా కప్ 2023 నిర్వహణపై స్పష్టత రానట్లేనా..?

ఆసియాకప్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఆసియాకప్ నిర్వహణ విషయంలో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఎందుకంటే ఆసియా కప్ మీటింగ్‌లో 'ప్రభుత్వ క్లియరెన్స్' చర్చలను పాకిస్తాన్ బోర్డు తిరస్కరించింది

తొలిటెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగే మొదటి, రెండు టెస్టు మ్యాచ్‌లకు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ నాగ్ పూర్ టెస్టుకు దూరమయ్యాడు. తాను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లోని మొదటి టెస్టుకు దూరమవుతున్నట్లు హేజిల్ వుడ్ స్వయంగా ప్రకటించారు.

సెమీస్‌లో సమరానికి సిద్ధమైన బెంగాల్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కర్నాటక

ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్ దశ పూర్తి అయింది. బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, సౌరాష్ట్ర, కర్ణాటక జట్లు ప్రస్తుతం సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 8న ప్రారంభం కానున్నాయి. అయితే ఇంతవరకు వేదికలు నిర్ణయించకపోవడం గమనార్హం.