క్రికెట్: వార్తలు

ఇరానీ కప్‌లో తలపడనున్న మధ్యప్రదేశ్, రెస్ట్ ఆఫ్ ఇండియా

గ్వాలియర్ లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో మార్చి 1 నుంచి మధ్య ప్రదేశ్, రెస్ట్ ఆఫ్ ఇండియా టీం మధ్య ఇరానీ కప్ టోర్నీ జరగనుంది. రంజీలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన మిగిలిన జట్ల ప్లేయర్లను ఓ టీమ్‌‌గా చేసి రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌గా, రంజీ ట్రోఫీ విజేతతో ఇరానీ కప్ జరుగుతుంది

pakistan super league: ధోనీలాగా షాట్ కొట్టిన రషీద్ ఖాన్

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 లో ఇస్లామాబాద్ యునైటెడ్‌పై లాహోర్ ఖలందర్స్ భారీ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ 20 ఓవర్లలో 200/7 స్కోరు చేసింది. అబ్దుల్లా షఫీక్ 24 బంతుల్లో 45 పరుగులు చేశాడు.

క్రికెట్ దేవుడు సచిన్ కోసం భారీ విగ్రహం.. ఫ్యాన్స్‌కు పండుగే

క్రికెట్‌లో అభిమానులందరూ సచిన్‌ను దేవుడితో కొలుస్తారు. ధోని నుంచి కోహ్లీ వరకూ అందరూ సచిన్‌ను ఆరాధిస్తుంటారు. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్ ఎంతోమంది స్ఫూర్తిధాయకంగా నిలిచాడు. మాస్టర్ బ్లాస్టర్ గా కీర్తి గడించిన సచిన్ కు ప్రస్తుతం అరుదైన గౌరవం దక్కనుంది. సచిన్ త్వరలో 50 ఏళ్లు పూర్తి చేసుకోనునడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది.

IND vs AUS : ముగ్గురు స్పిన్నర్లతో ఆడించడం అనవసరం

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టు వార్ ఫ్యాన్స్‌కు మజానిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రోఫీలో భాగంగా రెండు టెస్టులో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు తేలిపోయారు. దీంతో టీమిండియా 2-0 అధిక్యంలో నిలిచింది.

కోహ్లీ, బాబర్‌ను అవుట్ చేయాలి : పాక్ స్టార్ పేసర్

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం తమ డ్రీమ్ అని ఎంతోమంది బౌలర్లు చెబుతుంటారు. కోహ్లీ క్రీజులో నిల్చుకుంటే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు, అందుకే ప్రతి మ్యాచ్‌లోనూ కోహ్లీ వికెట్ కీలకం. ఎలాగైనా కోహ్లీ వికెట్ తీయాలని బౌలర్లు శ్రమిస్తుంటారు. ప్రస్తుతం కోహ్లీ వికెట్ తీయడం తన లక్ష్యమని పాకిస్తాన్ యువ స్టార్ పేసర్ హారిస్ పేర్కొన్నారు.

టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ రికార్డు.. ఒక పరుగు తేడాతో విజయం

బజ్‌బాల్ విధానంతో దూసుకెళ్తున్న ఇంగ్లండ్‌కు టెస్టులో మొదటిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 258 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లండ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. కివిస్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకొని పరువును నిలబెట్టుకుంది.

NZ Vs Eng: వారెవ్వా.. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ దెబ్బకు బిత్తిరిపోయిన బ్యాటర్లు

వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ స్పిన్నర్ జాకోలీచ్ అద్భుత బౌలింగ్‌తో అకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌కు జాక్ క్రాలే, బెన్ డకెట్ ఘనమైన ఆరంభాన్ని అందించారు. కేన్ విలియమ్సన్ మెరుపు సెంచరీతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

కేన్ విలియమ్సన్ ఘనత; న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు

స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వెల్లింగ్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 2వ టెస్టులో 4వ రోజున అతను రాస్ టేలర్‌ను అధిగమించాడు. అంతేకాదు విలియమ్సన్ తన 26వ సెంచరీని కూడా ఈ ఫార్మాట్‌లో పూర్తి చేసుకున్నారు.

మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే; ఆరోసారి కప్పు కైవసం

కేప్‌టౌన్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా విజయ దుందుభిని మోగించింది. దక్షిణాఫ్రికాను 19పరుగుల తేడాతో ఓడించి ఏకంగా ఆరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Tim Southee: ఎంఎస్ ధోనీ రికార్డును సమం చేసిన టిమ్ సౌథి

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. 2వ రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 138/7 వద్ద కొట్టుమిట్టాడుతోంది.

Women's T20 World Cup Final:టైటిల్ పోరులో రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఢీ

మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కేప్‌టౌన్‌ వేదికగా ఆదివారం జరగనుంది. నిర్ణయాత్మక పోరులో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మహిళల జట్లు తలపడనున్నాయి.

South Africa World Cup Final: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి

కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20ప్రపంచ కప్ 2023లో దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. న్యూలాండ్స్‌లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సఫారీ టీమ్ ఇంగ్లండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్.. మూడో టెస్టుకు కామెరాన్ గ్రీన్ సిద్ధం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాయంతో మొదటి రెండు మ్యాచ్ లకు కామెరాన్ గ్రీన్ దూరమయ్యాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. మూడో టెస్టు కోసం తాను వందశాతం ఫిట్‌గా ఉన్నానని ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ చెప్పాడు.

అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించిన సెర్గియో రామోస్

స్పానిష్ స్టార్ ఆటగాడు సెర్గియో రామోస్ గురువారం తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రామోస్ 2010 FIFA ప్రపంచ కప్, 2008, 2012లో యూరోపియన్ ఛాంపియన్ షిప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2005లో అరంగేట్రం చేసిన సెర్గియో రామోస్ అత్యధిక క్యాప్‌లు సాధించిన ఆటగాడి చరిత్రకెక్కాడు.

PSL 2023: అర్ధ సెంచరీతో చెలరేగిన బాబార్ ఆజం

ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2023 పోరులో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ అజామ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో తన కెరియర్‌లో 73వ టీ20 హాఫ్ సెంచరీని నమోదు చేయడం గమనార్హం.

Womens T20 World Cup 2023 Finalలోకి ఏడోసారి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా

ఐసీసీ టీ20 మహిళల వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు అదరగొడుతోంది. ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ఏడోసారి వరల్డ్ కప్ టీ20 ఫైనల్లోకి చేరుకుంది. ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ పోరులో విజేతతో తలపడనుంది. ఫైనల్ ఫిబ్రవరి 26న న్యూలాండ్స్‌లో జరుగుతుంది.

ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్.. పాట్ కమిన్స్ దూరం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్ తగిలింది. వ్యక్తిగత పనిమీద విదేశాలకు వెళ్లిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్ మూడో టెస్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.

ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన హ్యారీ బ్రూక్

ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ టెస్టులో చేలరేగిపోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన బ్రూక్.. రెండో టెస్టులో సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో కేవలం 109 బంతుల్లోనే తన సెంచరీని మార్క్ ను అందుకున్నాడు.

జో రూట్ సూపర్ సెంచరీ

టెస్టులో ఇంగ్లండ్ జట్టు స్పీడ్‌ను పెంచుతోంది. గతేడాది నుంచి బజ్ బాల్ విధానంలో టెస్టు స్వరూపాన్నే ఇంగ్లండ్ మార్చేసింది. తాజాగా న్యూజిలాండ్ జరుగుతున్న టెస్టులో కూడా అదే జోరును కొనసాగిస్తోంది.

Womens T20 World Cup 2023 Semisలో భారత్ కెప్టెన్ పోరాటం వృథా

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2023 ICC మహిళల T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో అద్భుతంగా పోరాడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల చేసి సత్తా చాటింది. అయినప్పటికీ ఆస్ట్రేలియా మహిళలు విజయం సాధించడంతో ఆమె పోరాటం వృథా అయింది.

Womens T20 World Cup 2023 Semisలో భారత్ పరాజయం

మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీస్ పోరులో టీమిండియా పరాజయం పాలైంది. లక్ష్య చేధనలో టీమిండియా బ్యాటర్స్ రాణించనప్పటికీ.. ఉత్కంఠ పోరులో కేవలం 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఓటమిపాలైంది.

మరో రికార్డుపై కన్నేసిన కింగ్ కోహ్లీ

భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టులో అత్యంత వేగంగా 25వేలు పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

మూడో టెస్టుపై గురి పెట్టిన టీమిండియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భారత్ వర్సస్ ఆస్ట్రేలియా మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-0లో అధిక్యంలో నిలిచింది. మార్చి 1 ఈ టెస్టు మ్యాచ్ జరుగుతుంది.

రోహిత్ మరీ లావుగా కనిపిస్తున్నాడు.. మాజీ లెజెండ్ కామెంట్

రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ కొనసాగుతూనే ఉంది. రోహిత్ బ్యాటింగ్ విఫలమైన ప్రతిసారీ రోహిత్ ఫిటె‌నెస్‌పై సోషల్ మీడియాలో ట్రోల్ తెగ వైరల్ అవుతుంటాయి. ఏదో ఒక సందర్భంలో రోహిత్ బాడీ షేమింగ్‌పై వార్తలు వస్తుంటాయి. తాజాగా మాజీ లెజెండ్ కపిల్ రోహిత్ ఫిటెనెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ శ్రీలంక లెగ్ స్పిన్నర్ హసరంగ సత్తా

హసరంగా టీ20 ఫార్మాట్‌లో సంచలనం సృష్టించాడు. ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ సత్తా చాటాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్న అప్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను హసరంగ వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం ఇదే విషయాన్ని ప్రకటించింది.

టెస్టు సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లండ్

టెస్టుల్లో ఇంగ్లండ్ సంచలనాత్మక మార్పులను తీసుకొస్తోంది. ప్రధాన కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలను తీసుకున్నప్పటీ నుంచి ఇంగ్లండ్ అద్భుతంగా రాణిస్తోంది.

నేడు సెమీస్‌లో ఆసీస్‌తో తలపడనున్న ఇండియా

మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో నేడు కీలక పోరు జరగనుంది. టీమిండియా మహిళలు సెమీస్‌లో ఆస్ట్రేలియా మహిళలతో తలపడనున్నారు.

సన్ రైజర్స్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్

ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్ ను నియమిస్తున్నట్లు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ప్రకటించింది. మాయాంక్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నా చివరికి దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ వైపే సన్ రైజర్స్ యాజమాన్యం మెగ్గు చూపింది. మార్క్రమ్ ఇటీవలే సౌత్ ఆఫ్రికా 20-20 లీగ్‌లో సన్ రైజర్స్ ఈస్టర్‌ జట్టుకు కెప్టెన్‌గా వహించి టైటిల్ అందించిన విషయం తెలిసిందే.

ఇంగ్లండ్ జోరుకు న్యూజిలాండ్ బ్రేకులు వేసేనా..?

టెస్టులో ఇంగ్లండ్ దుమ్ము దులుపుతోంది. న్యూజిలాండ్ పై మొదటి టెస్టులో ఇంగ్లాండ్ 267 ప‌రుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్ ముగిసింది. 2008 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ తొలి విజయాన్ని అందుకొని చరిత్రను సృష్టించింది.

మాక్స్‌వెల్, మార్ష్ వచ్చేశాడు, టీమిండియాతో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక

మార్చి 17 నుంచి టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ఆ దేశ క్రికెట్ టీం ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.

23 Feb 2023

ఐపీఎల్

దేశం కంటే ఐపీఎల్ ముఖ్యం కాదన్న బెన్ స్ట్రోక్స్

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండేళ్ల తరువాత ఐపీఎల్ అడునున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ఇక నెల కంటే ఎక్కువ సమయం లేదు. ఈ సమయంలో చైన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ సీజన్ మధ్యలో జట్టును విడిచిపెట్టనున్నాడు.

దీప్తిశర్మకు షాక్.. యూపీ వారియర్స్ కెప్టెన్‌గా అలిస్సాహీలీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హీలీ ఎంపికైంది. ఈ మేరకు యూపీ వారియర్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో దీప్తిశర్మను రూ.2 కోట్ల 60లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది.

కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పించడంపై చాట్ జీపీటీ సమాధానం

సాంకేతిక ప్రపంచంలోకి విప్లవాత్మకంగా దూసుకొచ్చిన చాట్ జీపీటీ ఎన్నో సంచనాలను సృష్టిస్తోంది. ఈ కొత్త తరం సెర్చ్ ఇంజిన్ నెటిజన్లను బాగా అకట్టుకుంటోంది. ఈ టూల్ తో మాట్లాడేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. టీమిండియా రాహుల్ పేలవ ఫామ్‌ గురించి సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ప్రపంచ నెం.1 టెస్టు బౌలర్‌గా జేమ్స్ అండర్సన్

40 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే బౌలింగ్ పర్ఫామెన్స్‌తో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంచలన రికార్డును సాధించాడు. తాజాగా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. జేమ్స్ అండర్సన్ 886 పాయింట్లతో టెస్టులో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణించని స్టీవెన్ స్మిత్

టీమిండియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ రాణించడం లేదు. ఢిల్లీలో జరిగిన టెస్టులో 0, 6 పరుగులు చేసి పూర్తిగా విఫలమయ్యాడు.

ప్లీజ్.. అలసిపోయాను సార్ : జస్ప్రిత్ బుమ్రా

ఇండియన్ క్రికెట్ టీమ్‌లో స్టార్ పేస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సత్తా ఉంది. అలాంటి పేసర్ సేవలను కొన్ని నెలలుగా టీమిండియా కోల్పోయింది.

T20 World Cup Semi final లో తలపడనున్న భారత్- ఆస్ట్రేలియా

టీ20 వరల్డ్ కప్ సెమీ‌ఫైనల్ జట్లు ఏవో తెలిసిపోయాయి. గురువారం కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్-1 మ్యాచ్‌లో భారత్ జట్టు తలపడనుంది. శుక్రవారం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్ 2లో ఢీకొట్టనున్నాయి.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ భారీ రికార్డు

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ భారీ రికార్డు సాధించింది. మంగళవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 114 పరుగుల తేడాతో గెలిచింది.

రియల్ మాడ్రిడ్ చేతిలో లివర్‌పూల్‌పై ఓటమి

UEFA ఛాంపియన్స్ లీగ్ 2022-23 రౌండ్‌లో లివర్‌పూల్‌ ఓటమిపాలైంది. రియల్ మాడ్రిడ్ చేతిలో 5-2తేడాతో లివర్‌పూల్ ఓడిపోయింది.

టీ20ల్లో పాకిస్తాన్ మహిళా ప్లేయర్ అదరిపోయే రికార్డు

పాకిస్తాన్ మహిళా స్టార్ ప్లేయర్ నిదాదార్ అరుదైన రికార్డును సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిదాదార్ చరిత్రకెక్కింది. మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ఓ వికెట్ నిదాదార్ పడగొట్టి.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.