క్రికెట్: వార్తలు

IND vs AUS: భారత ఓటమిపై గవాస్కర్ అసక్తికర కామెంట్స్

స్వదేశంలో టీమిండియా టెస్టుల్లో ఓడిపోవడం చాలా అరుదైన విషయం. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ మూడో టెస్టులో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.

IND vs AUS: ఇండోర్ టెస్ట్‌లో రోహిత్ శర్మకు ఘోర అవమానం!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం జరిగింది. సొంత అభిమానులే రోహిత్ శర్మపై నోరు పారేసుకున్నారు. మూడో టెస్టులో ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయిన అభిమానులు వడాపావ్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు.

ఇంగ్లండ్ తరుపున ఆదిల్ రషీద్ అద్భుత రికార్డు

ఇంగ్లండ్ తరుపున ఆదిల్ రషీద్ అరుదైన రికార్డును సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 4/45తో చెలరేగడంతో ఓ అద్భుత రికార్డుకు దగ్గరయ్యాడు.

04 Mar 2023

ఐసీసీ

ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు

భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు కోసం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పిచ్‌పై ఐసీసీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మ్యాచ్ మూడో రోజు ఉదమయే ముగిసిపోవడంతో పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం మూడు డీమెరిట్ పాయింట్లను అందుకుంది.

BAN vs ENG: బంగ్లాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్

ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలిచింది. 132 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. దీంతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్‌ను 2-0తో తిరుగులేని అధిక్యాన్ని సాధించింది. సామ్ కర్రన్ 4 వికెట్లు, ఆదిల్ రషీద్ 4 వికెట్లు తీసి బంగ్లా బ్యాటర్ల నడ్డి విరిచారు.

PSL: వావ్.. సూపర్ మ్యాన్‌లా బంతిని ఆపిన సికిందర్ రాజా

ఒకప్పుడు అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తూ.. క్యాచ్‌లు పట్టే ఆటగాళ్లు ఎవరంటే టక్కున గుర్తొచ్చే ప్లేయర్లలో తొలి ఆటగాడు జాంటీ రూడ్స్.. ఆ తర్వాత మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా అని చెప్పేవాళ్లు. కొంతమంది ఆటగాళ్లు బౌండరీ లైన్ల మధ్య అద్భుతమైన క్యాచ్‌లు పడుతూ ఔరా అనిపిస్తుంటారు. సిక్సర్ వెళ్లకుండా బంతిని పట్టుకొని కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుంటారు.

BAN vs ENG: రెండో వన్డేలో అద్భుతంగా రాణించిన జోస్ బట్లర్

బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లండ్ విజయఢంకా మోగించింది. డేవిడ్ మలన్ సెంచరీ చేయడంతో మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. శుక్రవారం జరుగుతున్న రెండో వన్డేలో తొలుత టాస్ గెలిచి బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది.

BAN vs ENG: జాసన్ రాయ్ సూపర్ సెంచరీ

బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డేలో అతి కష్టం మీద ఇంగ్లండ్ విజయం సాధించింది డేవిడ్ మలన్ సెంచరీ చేయడంతో మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గట్టెక్కింది. శుక్రవారం జరుగుతున్న రెండో వన్డేలో తొలుత టాస్ గెలిచి బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది.

జడేజా, అశ్విన్‌ సమక్షంలో స్వదేశంలో భారత్ రెండు టెస్టు ఓటములు

భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్‌ 2-1తో భారత్‌ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ముందంజలో ఉంది. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించిన ఆసీస్ అద్భుత ప్రదర్శన కనభరిచింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో కలిసి స్వదేశంలో ఇంతవరకూ భారత్ రెండు టెస్టులను ఓడిపోవడం గమనార్హం.

IND vs AUS: పుజారాపై ప్రశంసలు కురిపించిన ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్‌మెన్ చతేశ్వర్ పుజారా అద్భుతంగా రాణించాడని ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ ప్రశంసించాడు. ఇండోర్ వేదికగా ఒకవైపు వికెట్లు కోల్పోతున్న మరో ఎండ్‌లో టీమిండియాను స్కోరును పుజారా కదిలించాడు.

IND vs AUS : తెలివిగా ఖావాజాను ఔట్ చేసిన అశ్విన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకు అలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా విజయానికి 76 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఖావాజా డకౌట్ అయ్యాడు.

IND vs AUS : టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. రెండు టెస్టులో దారుణంగా ఓడిన ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది.

RSA vs WI : వెస్టిండీస్‌ను హడలెత్తించిన రబడ.. దక్షిణాఫ్రికా విజయం

వెస్టిండీస్‌తో సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో రబడ 6 వికెట్ల తీసి చెలరేగడంతో విండీస్ 159 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా 87 పరుగుల తేడాతో గెలుపొందింది.

IND vs AUS: కష్టకాలంలో భారత జట్టును అదుకున్న పుజారా

టీమిండియా టెస్టు స్టార్ బ్యాట్‌మెన్ చతేశ్వర్ పుజారా కష్టకాలంలో భారత జట్టును అదుకున్నాడు. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పుజారా అర్ధ శతకంలో రాణించారు. ఒకవైపు వికెట్లు కోల్పోతున్నా తాను మాత్రం ఒక ఎండ్‌లో నిలబడి టీమిండియా స్కోరును కదిలించాడు.

IND vs AUS: 8 వికెట్లతో నాథన్ లియాన్ విశ్వరూపం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. ఇండోర్‌లోని హెల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియన్ స్పిన్నర్ 8 వికెట్లు తీయడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకు అలౌటైంది. దీంతో ఆసీస్‌కు 76 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్

ఆస్ట్రేలియాకు ఒంటి చేత్తో విజయాలను అందిస్తున్న మెగ్ ల్యానింగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్సీగా ఎంపికైంది. యువ క్రికెటర్ జెమీయా రోడ్రిగ్స్‌ను వైస్ కెప్టెన్సీగా నియామకమైంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో మెగ్ లానింగ్‌కు తిరుగులేదు. అమె సారథ్యంలోనే ఆస్ట్రేలియా నాలుగు టీ20 ప్రపంచ కప్‌లు గెలిచింది.

IND vs AUS: స్వదేశంలో ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ సంచలన రికార్డును సృష్టించాడు. స్వదేశంలో ఆడిన టెస్టులో 100 వికెట్లు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

సెంచరీతో ఇంగ్లండ్‌ను గెలిపించిన డేవిడ్ మలన్

బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లండ్ విజయం సాధించింది. డేవిడ్ మలన్ అజేయ సెంచరీ తో ఇంగ్లండ్ జట్టుకు విజయాన్ని అందించాడు. వన్డేలో డేవిడ్ మలన్ తన నాలుగో వన్డే సెంచరీని సాధించాడు. ఆరేళ్ల తర్వాత మొదటి సారి బంగ్లాదేశ్ స్వేదేశంలో తొలి వన్డే‌లో పరాజయం పాలైంది. ఇంగ్లండ్ మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది.

మహిళల ఐపీఎల్ మస్కట్ చూస్తే గూస్‌బంప్స్

ఐపీఎల్ తరహాలో భారత్‌లో అమ్మాయిల క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు మహిళల ప్రీమియర్ లీగ్ సిద్ధమవుతంది. మార్చి 4న ఈ టోర్నీ వైభవంగా ప్రారంభం కానుంది. ముంబై వేదికగా జరిగే ఈ లీగ్‌లో ఐదు జట్లు పోటీ పడుతున్నాయి.

SA vs WI: అరుదైన మైలురాయిని అందుకున్న జాసన్ హోల్డర్

సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో జాసన్ హోల్డర్ అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. టెస్టులో 2500 పరుగులు, 150 వికెట్లు తీసిన ఆటగాడిగా జాసన్ హోల్డర్ చరిత్రకెక్కాడు.

SA vs WI: రసవత్తరంగా సౌతాఫ్రికా, వెస్టిండీస్ టెస్టు మ్యాచ్

సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు హోరాహోరీగా సాగుతోంది. 314/8 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిధ్య సౌతాఫ్రికా మరో 28 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది.

Indore Test: 11 పరుగుల వ్యవధిలో ఆరుగురు ఔట్.. ఆసీస్ 197 ఆలౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ విజృభించడంతో 11 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు తీశారు. ఓ దశలో 186/4తో భారీ స్కోరు దిశగా సాగుతున్న ఆసీస్, ఈ ఇద్దరి దెబ్బకు కుప్పకూలింది.

Irani Cup: 33 ఏళ్ల రికార్డును ఇరానీ కప్‌లో బ్రేక్ చేసిన యశస్వీ జైస్వాల్

ముంబై యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇరానీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఈ టోర్నిలో రెస్ట్ ఆఫ్ ఇండియా తరుపున బరిలోకి దిగిన జైస్వాల్.. 33 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. మార్చి 1న మధ్యప్రదేశ్ జరిగిన ప్రారంభ మ్యాచ్ లో 230 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.

02 Mar 2023

జడేజా

Ravindra Jadeja Record: లెజెండరీ ప్లేయర్స్ సరసన రవీంద్ర జడేజా

టీమిండియా అల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. లెజెండరీ ప్లేయర్స్ కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ ల సరసన నిలిచి అద్భుత రికార్డును జడేజా సాధించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఈ సంచలన రికార్డును జడ్డూ క్రియేట్ చేశాడు.

అంపైర్ నితిన్ మీనన్‌పై కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్

ఇండోర్ టెస్టులో అంపైర్ నితిన్ మీనన్ ఘోర తప్పిదాలు చేశారు. తొలి టెస్టులో ఫస్ట్ బాల్‌కే రోహిత్ శర్మ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చినప్పటికీ అంపైర్ స్పందించలేదు. అదే ఓవర్లో నాలుగో బంతికి స్కార్ట్క్ ఎల్బీ కోసం అపీల్ చేయగా.. అంపైర్ అడ్డంగా తల ఊపాడు.

02 Mar 2023

జడేజా

రవీంద్ర జడేజా నోబాల్స్‌పై గవాస్కర్ సీరియస్

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీమిండియాకు కీలకమైన ఆటగాడు. తన బౌలింగ్ ప్రదర్శనతో ఇండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించారు.

FA Cup 2022-23: క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న మాంచెస్టర్ యునైటెడ్

FA Cup 2022-23లో మాంచెస్టర్ యునైటెడ్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. వెస్ట్ హామ్ యునైటెడ్‌ను మాంచెస్టర్ సిటీ 3-1తేడాతో చిత్తు చేసింది. లీగ్ కప్ గెలిచిన కొన్ని రోజుల తర్వాత, ఎరిక్ టెన్ హాగ్ మాంచెస్టర్ యునైటెడ్‌కు 54వ నిమిషంలో సెడ్ బెన్రాహ్మా గోల్ చేయడంతో వెస్ట్ హామ్ వెనుకబడింది.

IND vs AUS: మూడో టెస్టులో అర్ధ సెంచరీతో చెలరేగిన ఉస్మాన్ ఖవాజ

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియానే పైచేయి సాధించింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 47 పరుగుల అధిక్యంలో నిలిచారు.

SA vs WI: తొలి టెస్టులో ఐదు వికెట్ల తీసి సత్తా చాటిన అల్జారీ జోసెఫ్

సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ బౌలర్ అల్లారీ జోసెఫ్ అద్భుతంగా రాణించాడు. తన టెస్టు క్రికెట్‌లో మొదటి సారిగా ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో తొలి టెస్టులో 2వ రోజు దక్షిణాఫ్రికా 342 పరుగులకు ఆలౌటైంది.

INDvsAUS : మళ్లీ నిరాశపరిచిన విరాట్ కోహ్లీ.. నిరుత్సాహంలో ఫ్యాన్స్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా తరుపున అరంగేట్రం చేసిన టాడ్ మార్ఫీ తొలి టెస్టులోనే ఆకట్టుకున్నాడు. ఢిల్లీ టెస్టులో ఫర్వాలేదనిపించాడు. నిన్నమెన్నటి వరకు ఆస్ట్రేలియా క్రికెట్ లో పెద్దగా ఎవరికి తెలియని పేరు టాడ్ మార్ఫీ. ఇప్పుడు విరాట్ కోహ్లీని వరుసగా మూడుసార్లు అవుట్ చేసిన మర్ఫీ ఆసీస్‌లో స్టార్ ప్లేయర్ అయిపోయాడు.

IND vs AUS: ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకు 109 పరుగులకే టీమిండియా ఆలౌట్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా కుప్పకూలింది. వరుసగా రెండు టెస్టులో ఆసీస్ ను ఓడించిన భారత్.. మూడో టెస్టులో మాత్రం తేలిపోయింది.

ఆస్ట్రేలియా దిగ్గజానికి దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన రవిశాస్త్రి

టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ స్పిన్నర్లు విజృంభించారు. ఇండోర్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే ఆలౌటైంది. ఆరో ఓవర్లో బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించిన ఆసీస్‌ స్పిన్నర్‌ మాథ్యూ కుహ్నెమన్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(12) వికెట్‌తో ఖాతా తెరిచాడు.

Ind Vs Aus: షేన్‌వార్న్ రికార్డును బద్దలు కొట్టిన నాథన్ లియోస్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. పేస్‌కు అనుకూలిస్తుందనుకున్న పిచ్‌పై స్పిన్ బౌలర్లు చెలరేగుతున్నారు. మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్ వరుసగా వికెట్లు తీస్తూ టీమిండియాను కష్టాల్లోకి నెట్టారు.

IND vs AUS: మూడో టెస్టులో అశ్విన్‌ను ఊరిస్తున్న నెం.1 రికార్డు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టులో అశ్విన్ మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ల నడ్డి విరిచిన అశ్విన్ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

IND vs AUS: 3వ టెస్టులో బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ముందుగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

SA vs WI: ఐడెన్ మార్ర్కమ్ సూపర్ సెంచరీ.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అదరగొట్టిన ఐడెన్ మార్ర్కమ్ టెస్టులోనూ తన జోరును కొనసాగుతున్నాడు. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. 174 బంతుల్లో 18 ఫోర్ల సాయంతో 115 పరుగులు చేశాడు.

SA vs WI: అర్ధ సెంచరీతో అదరగొట్టిన ఎల్గర్

వెస్టిండీస్ జరుగుతున్న తొలి టెస్టులో ధక్షిణాఫ్రికా ఓపెనింగ్ స్టార్ బ్యాటర్ ఎల్గర్ అర్ధ సెంచరీతో చెలరేగాడు. 118 బంతుల్లో 71 పరుగులు చేశాడు. తొలి వికెట్ కు మార్క్‌రమ్, ఎల్గర్ కలిసి 141 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్‌కు బుమ్రా దూరం

ఐపీఎల్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కి భారీ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమయయాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా ఎనిమిది నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దక్షిణాఫ్రికా తరుపున టెస్టులో అరంగేట్రం చేసిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు టోనీ డి జోర్జి, గెరాల్డ్ కోయెట్జీ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇటీవల దేశవాళీ క్రికెట్లు ఇద్దరు బాగా రాణించడంతో వాళ్లు తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. బ్యాట్‌మెన్‌గా డిజోరి, రైట్ ఆర్మ్ పేసర్ గా కోయెట్టీ జట్టులో రాణించనున్నారు.

ఇంగ్లండ్‌తో పోరుకు బంగ్లాదేశ్ సై

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో తలపడేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. మార్చి 1 నుంచి ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోపక్క ఇంగ్లండ్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. అయితే ఇరు జట్లు వన్డే సిరీస్ పై కన్నేయడంతో సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉండనుంది.