క్రికెట్: వార్తలు

టెస్టుల్లో డబుల్ సెంచరీని బాదేసిన హెన్రీ నికోల్స్

వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆటగాళ్లు విజృంభించారు. ఫలితంగా కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 580 పరుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది.

సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. ఆరు గంటల్లో 29 వీడియోలు అప్‌లోడ్..?

సన్ రైజర్స్ హైదారాబాద్ టీంకి సైబర్ నేరగాళ్లు గట్టి షాక్‌నిచ్చారు. ఏకంగా సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానల్ కి హ్యాక్ చేసి ఝలక్ ఇచ్చారు. ఆరు గంటల్లో ఏకంగా 29 వీడియోలను అప్‌లోడ్ చేయడంలో అభిమానులు షాక్ కు గురయ్యాడు.

వామ్మో.. రన్నింగ్‌లో బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తిన కోహ్లీ

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మైదానంలో చురుగ్గా ఫీల్డింగ్ చూస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీని పలువురు క్రికెటర్లు ఆదర్శంగా తీసుకుంటుంటారు.

డబుల్ సెంచరీతో విజృంభించిన కేన్ విలియమ్సన్

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో అతిథ్య న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. 123 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 580 పరుగులు చేసింది . ఈ స్కోర్ వద్ద న్యూజిలాండ్ డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు.

భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ఐర్లాండ్ అతిథ్యం

ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించనుంది. భారత్‌తో టీ20 సిరీస్‌కు ఐర్లాండ్ ఆతిథ్యమివ్వనుంది. ఆగస్టు 18 నుంచి 23 వరకు జరిగే ఈ సిరీస్‌లో రెండు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

తొలి వన్డేలో టీమిండియాను గెలిపించిన కేఎల్ రాహుల్

టీ20, టెస్టులో వరుసగా విఫలమవుతూ టీమ్‌లో చోటు కోల్పోయిన టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ వన్డేల్లో సత్తా చాటాడు. 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియాని అద్భుత హాఫ్ సెంచరీతో ఆదుకొని.. కేఎల్ రాహుల్ ఘన విజయాన్ని అందించాడు. 91 బంతుల్లో 75 పరుగులు చేసి సత్తా చాటాడు.

పవర్ ప్లేలో విజృంభిస్తున్న మహ్మద్ సిరాజ్

వన్డేలో టీమిండియా తరుపున హైదరాబాద్ స్టార్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలను చూపిస్తున్నాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వికెట్లను రాబడుతున్నాడు.

నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. టీమిండియా టార్గెట్ 189 పరుగులు

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. మొదటగా టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించలేదు.

17 Mar 2023

సినిమా

ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ చూడడానికి వచ్చిన రజనీకాంత్, ఫోటోలు వైరల్

ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ చూడడానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ వెళ్ళారు. ఈ మేరకు మ్యాచ్ చూస్తున్న రజనీకాంత్ ఫోటోలను ముంబై క్రికెట్ అసోసియేషన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ, మైదానంలో తలైవా అని అర్థం వచ్చేలా పోస్ట్ చేసింది.

వన్డే మ్యాచ్‌లు చాలా డల్‌గా ఉన్నాయి : సచిన్ టెండూల్కర్

గడుస్తున్నా కాలం కొద్దీ క్రికెట్‌లో చాలా మార్పులొస్తున్నాయి. ఐదు రోజుల టెస్ట్ ఫార్మాట్ నుంచి 60 ఓవర్ల వన్డే ఫార్మాట్ రాగా.. దానిని 50 ఓవర్లకు కుదించారు. 2000 సంవత్సరంలో ధనాధన్ క్రికెట్ ను ప్రవేశపెట్టడంతో సక్సస్ అయింది.

టీ20ల్లో సరికొత్త మైలురాయిని అందుకున్న బాబర్ ఆజం

టీ20ల్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఎలిమినేటర్ 1లో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఆ ఫీట్ ను సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 9వేల పరుగుల చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్‌గా సత్యనాదేళ్ల

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న ఫ్రాంచేజీలు విశ్వవాప్తమవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించిన ఫ్రాంచేజీలు తాజాగా ఆమెరికాపై దృష్టి పెట్టాయి.

క్రికెట్ గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ అన్ని ఫార్మట్లకు కొన్నేళ్లుగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సెక్సెటింగ్ కుంభకోణం కారణంగా నవంబర్ 21లో అతను టెస్టు కెప్టెన్‌గా అప్పట్లో వైదొలిగాడు. తాజాగా అన్ని ఫార్మట్లకు రిటైర్మెట్ ప్రకటిస్తున్నట్లు టిమ్ పైన్ ప్రకటించాడు.

విరాట్ కోహ్లీని లెగ్ స్పిన్నర్ అడమ్ జంపా ఔట్ చేస్తాడా..?

ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానముంది. కోహ్లీ దేశం సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో మైలురాళ్లను ఒకటోకటిగా బద్దలుకొడుతూ రికార్డులను సృష్టించాడు. ప్రస్తుతం నేటి నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా వన్డే సిరీస్‌లో తలపడనుంది.

విరాట్ కోహ్లీ ఎప్పటికీ వరల్డ్ క్లాస్ ప్లేయరే : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని, ఇప్పుడు అతని బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు.

వామ్మో ధోని.. ఆ కండలతో కొడితే సిక్సర్ల వరదే..!

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని నెట్స్ శ్రమిస్తున్నాడు. సీఎస్‌కేను ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్ గా నిలిపిన ధోని.. ఈ ఎడిషన్‌లో ఎలాగైనా టైటిల్ తో కెరీర్ ఘనంగా ముగించాలని తహతహలాడుతున్నాడు.

16 Mar 2023

ప్రపంచం

వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీతో యూఏఈ ఆటగాడు ఆసిఫ్ ఖాన్ రికార్డు

కీర్తిపూర్‌లో నేపాల్‌తో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 మ్యాచ్‌లో యుఏఈ ఆటగాడు ఆసిఫ్ ఖాన్ చరిత్ర సృష్టించారు. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అసోసియేట్ దేశ ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

ఆస్ట్రేలియాపై కోహ్లీ సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి

ఇటీవల వన్డేల్లో సూపర్ ఫామ్ ను అందుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో సత్తా చాటాడు. దీంతో తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ప్రస్తుతం కోహ్లీపై అంచనాలు పెరిగిపోయాయి.

వన్డేల్లో ఆస్ట్రేలియాపై రోహిత్‌కు మెరుగైన రికార్డు

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఈనెల 17న ప్రారంభం కాబోతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మొదటి వన్డేకి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవ్వగా..రెండు, మూడు వన్డేలకి అందుబాటులో ఉండనున్నాడు. దీంతో మొదటి వన్డేకి కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు.

టీమిండియా, ఆస్ట్రేలియా వన్డే సమరానికి సర్వం సిద్ధం

భారత గడ్డపై టెస్ట్ సిరీస్‌ను ఓడిన ఆస్ట్రేలియా.. టీమిండియాతో వన్డే సమరానికి సిద్ధమైంది. శుక్రవానం నుంచి మొదటి వన్డేలో టీమిండియాను ఆస్ట్రేలియా ఢీకొట్టనుంది. ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1 భారత్ కైవసం చేసుకుంది. టీమిండియాకు హార్ధిక్ పాండ్యా, ఆస్ట్రేలియాకు స్టీవ్‌ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

అత్యంత అరుదైన రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్

భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ ముంబై వేదికగా శుక్రవారం జరగనుంది. మొదటి వన్డేకి కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడం లేదు. ఈ వన్డే సిరీస్‌లో హిట్ మ్యాన్ అరుదైన రికార్డును సొంతం చేసుకొనే అవకాశం ఉంది.

ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ దూరమైన శ్రేయాస్ అయ్యర్.. క్లారిటీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టులో గాయపడిన టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్.. ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కి దూరమయ్యాడు.

'నాటు నాటు' పాటకు స్టేప్పులేసిన సురేష్ రైనా, హర్భజన్

చిత్రం ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు లభించింది. ఎంతోమంది ఈ పాటకు స్టెప్పులు లేస్తూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి టీమిండియా క్రికెటర్లు కూడా చేరారు.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో ఉన్నదెవరు..?

మార్చి 31 నుంచి ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. 2023 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచేజీ నూతన కెప్టెన్‌ను ఎంపిక చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది చివర్లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో 2023 ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.

WTC: వికెట్ కీపర్ ఎంపికపై డైలామాలో టీమిండియా

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్‌లో టీమిండియా-ఆస్ట్రేలియా జూన్ 7న తలపడనున్నాయి. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 2-1తో టీమిండియా ఓడించింది.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన భారత ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో సెంచరీతో సత్తా చాటిన టీమిండియా స్టార్ ఆటగాడు కింగ్ కోహ్లీ (705) ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకున్నాడు.

SA vs WI : సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి వెస్టిండీస్ సిద్ధం

ఇటీవల వెస్టిండీస్‌ను సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో 2-0తో ఓడించింది. వన్డేలో కూడా వెస్టిండీస్‌ను ఓడించి సత్తా చాటాలని సౌతాఫ్రికా భావిస్తోంది. టెస్టు సిరీస్‌లో ఓడిన వెస్టిండీస్ ఎలాగైనా సౌతాఫ్రికా ప్రతీకారం తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

15 Mar 2023

ప్రపంచం

2023లో వన్డేలకు ఐదుగురు స్టార్ ఆటగాళ్లు గుడ్‌బై..!

ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో సీనియర్లుగా మారుతున్న స్టార్ ఆటగాళ్లు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి మిగతా ఫార్మాట్లో రాణించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ స్టార్ ఆటగాళ్ల దృష్టి ఫ్రాంఛేజీల వైపు మళ్లుతోంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఆడి రిటైరయ్యే యోచనలో ఆ స్టార్ ఆటగాళ్లు ఉన్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వాడుకొని ఓ వక్తి దాదాపు 60కంపెనీల నుంచి రూ.3 కోట్ల వరకు కాజేశాడు. తాజాగా తనను తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిచయం చేసుకుని రూ.12 లక్షల వరకు టోపీ పెట్టాడు. తర్వాత మోసపోయానని గమనించిన బాధితుడు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఐసీసీ ర్యాకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్‌గా రవిచంద్రన్ అశ్విన్

అంతర్జాతీయ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌ను తాజాగా అంతర్జాతీయ కౌన్సిల్ విడుదల చేసింది. గతంలో టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తో పాటు ఇంగ్లాండ్ స్పీడ్ స్టార్ అండర్సన్ ఇద్దరు 859 పాయింట్లతో సమానంగా నిలిచారు.

భారత్‌తో జరిగే వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు ఇదే.. కెప్టెన్‌గా స్మిత్

భారత్‌తో త్వరలో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. టీమిండియా చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా ప్రస్తుతం వన్డే సమరానికి సిద్ధమైంది. టెస్టుల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో స్టీవ్ స్మిత్ కి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.

గంటల వ్యవధిలో అమ్ముడుపోయిన విశాఖ వన్డే మ్యాచ్ టికెట్లు

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 19న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ ఏడీసీఏ స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. దీనికి సంబంధించిన వన్డే టికెట్లు గంటల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాడు.

World Boxing Championships: మహిళల బాక్సింగ్ పోరుకు వేళాయే

ప్రతిష్టాత్మక మహిళల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు వేళయైంది. న్యూఢిల్లీలోని కేడి జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్‌కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తియ్యాయి. మూడోసారి ఈ పోటీల నిర్వహణకు భారత్ సిద్ధమైంది.

మైఖేల్ వాన్‌కు వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్

టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా అనేక సార్లు మాటల యుద్దానికి దిగారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో విజృంభిస్తున్న బ్రంట్, మాథ్యూస్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ తరుపున నాట్ స్కివర్-బ్రంట్, హేలీ మాథ్యూస్ మూడు కీలక వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

WPL : వరుసగా ముంబై ఐదో విజయం.. ప్లేఆఫ్‌లో బెర్త్ ఖరారు

ప్రత్యర్థితో సంబంధం లేకుండా ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయఢంకా మోగించింది. ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో సగర్వంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీంతో మరో మూడు మ్యాచ్‌లు మిగిలుండగానే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది.

14 Mar 2023

ఇండోర్

ఇండోర్ పిచ్‌పై ఐసీసీకి బీసీసీఐ అప్పీల్

ఇండోర్ స్టేడియానికి ఇచ్చిన పిచ్ రేటింగ్‌పై ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్‌కు బీసీసీఐ అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ఐసీసీ పేలవమైన పిచ్‌ అంటూ గతంలో ఈ స్టేడియానికి మూడు డీమెరిట్‌ పాయింట్లను విధించింది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన అశ్విన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో దక్కించుకుంది. ఈ సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ రికార్డులను సృష్టించాడు. సిరీస్ మొత్తం 25 వికెట్లు పడగొట్టి, 86 పరుగులు చేశాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాహుల్‌ని ఆడించాలి : గవాస్కర్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆహ్మదాబాద్ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. అటు శ్రీలంకను తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓడించడంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్‌కు టీమిండియా క్వాలిఫై అయింది. ఇప్పుడు ఫైనల్లోనూ ఆస్ట్రేలియాతోనే టీమిండియా టైటిల్ కోసం పోరాడనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశారు.

ఇలా అయితే బౌలింగ్ జాబ్ వదిలేస్తానన్న అశ్విన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా వరుసగా నాలుగోసారి గెలుచుకుంది.