క్రికెట్: వార్తలు

ఇంగ్లండ్‌తో పోరుకు న్యూజిలాండ్ సై

ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ ఫిబ్రవరి 16న ప్రారంభ కానుంది. న్యూజిలాండ్ తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ సిద్ధమైంది. అలాగైనా టెస్టు సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఈ టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ హోరా హోరీగా తలపడనున్నాయి.

బౌలర్ల జాబితాలో రికార్డు సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్

అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచి టీమిండియా జట్టు చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు టెస్టుల్లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 132 పరుగులు తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో భారత్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

సంచలన చరిత్ర సృష్టించిన టీమిండియా

ప్రపంచ క్రికెట్లో టీమిండియా సంచలన చరిత్ర సృష్టించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన క్రికెట్ ర్యాంకుల్లో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లో భారత్ క్రికెట్ జట్టు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. మూడు ఫార్మాట్లో భారత జట్టు నంబర్ వన్ స్థానంలో నిలవడం ఇది రెండోసారి. నాగపూర్ టెస్టు సిరీస్ లో టీమిండియా విజయం సాధించడం ద్వారా 115 పాయింట్లతో టెస్టుల్లోనూ అగ్రస్థానానికి చేరుకుంది.

ఆర్సీబీ హెడ్ కోచ్‌గా బెన్ సాయర్

మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ మొదలు కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు మహిళల జట్టుకు ప్రధాన కోచ్ బెన్ సాయర్ ను నియమించింది. ఈ విషయాన్ని ఆర్సీబీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. గతంలో సాయర్ న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా పనిచేశాడు.

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన

దక్షిణాఫ్రికా‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్ సిద్ధమైంది. ఫిబ్రవరి 28న దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ తలపడనుంది. ఈ సిరీస్‌కు వెస్టిండీస్ టెస్టు సిరీస్ కోసం 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇందులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వారికన్, బ్యాటర్ న్క్రుమా బోన్నర్‌లకు చోటు దక్కలేదు.

15 Feb 2023

బీసీసీఐ

ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన శర్మ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. కొంతమంది టీమిండియా ఆటగాళ్లు ఫిటెనెస్ నిరూపించేందుకు ఇంజక్షన్లు తీసుకుంటారంటూ కొత్త వివాదానికి తెర లేపాడు. జీన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్లో ఈ వ్యవహారంపై చేతన శర్మ నోరు జారాడు. కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ అబద్ధం చెప్పాడని, జట్టులో రెండు వర్గాలు ఉన్నాయని పేర్కొన్నాడు.

ICC మహిళల T20 ప్రపంచ కప్: బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా దుమ్ములేపుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి సత్తా చాటుతోంది. బంగ్లాదేశ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది.

ఆర్సీబీ ఉమెన్స్ టీం మెంటర్‌గా సానియా మిర్జా

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఫ్రాంచైజీ నూతన సంప్రదాయానికి తెర లేపింది. భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను ఆర్సీబీ మెంటర్‌గా నియమించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా బుధవారం వెల్లడింది. యూత్ ఐకాన్, భారత ఛాంపియన్ సానియా మిర్జాను మెంటర్‌గా ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది.

INDvsAUS : శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వేటు ఎవరిపై..?

టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో జరిగే రెండు టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. దీంతో టీమిండియా బలం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు వెన్నునొప్పితో జట్టుకు అయ్యర్ దూరమయ్యాడు. గతేడాది టెస్టులు, వన్డేల్లో టీమిండియా మిడిలార్డర్‌లో కీలకంగా వ్యవహరించాడు.

జింబాబ్వే నడ్డి విరిచిన విండీస్ బౌలర్, సిరీస్ కైవసం

జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 1-0తో సొంతం చేసుకుంది. బులవాయో వేదికగా జరిగిన రెండో టెస్టులో విండీస్ కేవలం 4 పరుగులు తేడాతో గెలిచి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.

ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగించేనా..?

ఐదుసార్లు ట్రోఫిని గెలిచిన అంబాని జట్టు.. ప్రస్తుతం మహిళల ఐపీఎల్‌పై ఫోకస్ పెట్టింది. ఏకంగా టీమిండియా కెప్టెనే తమవైపు లాక్కుంది. మొత్తం 12 కోట్లు వెచ్చింది 17 మంది ఆటగాళ్లను తీసుకుంది. భారత మహిళల జట్టుకు నాయకత్వం వహిస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ ముంబైకి చెందిన జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటనున్న గుజరాత్ జెయింట్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ముంబైలో అట్టహాసంగా ముగిసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లీగార్డనర్ ను గుజరాత్ జెయింట్స్ అధిక ధరకు కొనుగోలు చేసింది. అహ్మదాబాద్ ఆధారిత ఫ్రాంచైజీ అయిన ఇందులో బెత్ మూనీ, డియాండ్రా డాటిన్, స్నేహ్ రానా కూడా ఉన్నారు. వీరందరి చేరికతో గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనపడుతోంది.

ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..?

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఇప్పటివరకు ఒకసారి కూడా ట్రోఫీని గెలుచుకోలేదు. అయితే ఈసారి ఉమెన్స్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే కీలకమైన ఆటగాళ్లను ఫ్రాంచేజీ కొనుగోలు చేసింది.

న్యూజిలాండ్‌కు భారీ షాక్, కీలక పేసర్ దూరం

ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ కైలీ జెమీషన్ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. జెమిషన్ వెన్నునొప్పితో కొంతకాలంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. గాయం మళ్లీ తిరగబడటంతో జట్టు నుంచి తప్పుకున్నాడు.

ఆసీస్ ఓటమిపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఆసీస్ చెత్త రికార్డులను మూటగట్టుకుంది.

WPL వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే

ఉమెన్స్ ఐపీఎల్ వేలంలో ఐదు ఫ్రాంచేజీలు పోటాపోటిగా మహిళా ప్లేయర్స్ ను కొనుగోలు చేశారు. ఈ టోర్ని కూడా ఐపీఎల్ అంత హిట్ అవుతుందని బీసీసీఐ నమ్ముతోంది. డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ పోటీ పడనున్నాయి.

సంచలన నిజాన్ని బయటపెట్టిన జాకుబ్ జాంక్టో

చెక్ ఇంటర్నేషనల్ మిడ్ ఫీల్డర్, ఫుట్‌బాల్ ఆటగాడు జాకుబ్ జాంక్టో ఓ సంచనల నిజాన్నిబయటపెట్టారు . తనపై వస్తున్న ఆరోపణలపై తాజా ఓ కీలక విషయాన్ని బయటపడ్డారు.

మల్లికా సాగర్‌పై పొగడ్తల వర్షం కురిపించిన దినేష్ కార్తీక్

బీసీసీఐ నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ముగిసింది. ముంబై వేదికగా జరిగిన ఈ వేలంలో ఐదు ఫ్రాంచేజీలు పాల్గొన్నాయి. 87 మంది ఆటగాళ్లపై రూ.59.5 కోట్లకు ఐదు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.

వేలంలో రికార్డు సృష్టించిన విదేశీ ప్లేయర్లు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో మహిళా ప్లేయర్స్ పై ప్రాంఛైజీలు డబ్బులు వర్షం కురిపించాయి. ముఖ్యంగా భారత్ స్టార్ స్మృతి మంధాన రికార్డు స్థాయిలో రూ.3.40 కోట్లకు బెంగళూర్ కొనుగోలు చేసింది. అలాగే విదేశీ ప్లేయర్లు నటాలీ స్కివర్-బ్రంట్‌, ఆష్లీ గార్డనర్ అత్యంత ఖరీధైన ఆటగాళ్లగా నిలిచారు. బెత్‌మూనీ, ఎల్లీస్‌పెర్ర వేలంలో మంచి ధర పలికారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంధానకు కళ్లు చెదిరే జాక్‌పాట్

మహిళల ప్రీమియర్ లీగ్ కోసం తొలిసారి జరిగిన వేలంలో అమ్మాయిలపై కనకవర్షం కురిసింది. ఇందులో భారత్ స్టార్ ఓపెనర్ స్మృతి మందాన అంచనాలకు తగ్గట్టే రూ.3.40 కోట్లకు బెంగళూర్ తీసుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ ను మాత్రం రూ.2కోట్లలోపే ముంబై దక్కించుకుంది. ఇంకా విదేశీ ఆల్ రౌండర్లు ఆష్లే, స్కివర్‌లకు రూ.3.20 కోట్లు పలికారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో దీప్తిశర్మకు బంపర్ ప్రైజ్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తిశర్మకు బంపర్ ప్రైజ్ దక్కింది. ఆమెను కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పోటిపడ్డాయి. రూ.2.6కోట్లకు దీప్తిశర్మను యూపీ వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది.

ఆర్‌సీబీలోకి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళల ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా డబ్ల్యూపీఎల్ అరంగేట్ర సీజన్‌కు సంబంధించిన వేలం ప్రారంభమైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు మార్చి 4 నుంచి 26 వరకు జరగనున్నాయి. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా స్టేడియాలు వేదిక కానున్నాయి.

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

ఇంగ్లండ్‌కు 2019లో క్రికెట్‌ ప్రపంచకప్‌ సాధించిపెట్టిన కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఆటకు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. 2022 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన.. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

స్మృతి మంధానకు అదరిపోయే ధర

మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం నేడు ముంబాయిలో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా లీగ్ వేలం మల్లికా సాగర్ నేతృత్వంలో నిర్వహించారు. మల్లిక 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్త 90 బెర్తుల కోసం 409 క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు.

ముంబాయి ఇండియన్స్‌కు సేవలందించనున్న టీమిండియా కెప్టెన్

మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఈ వేలానికి 409 మంది మహిళా క్రికెటర్లు షార్ట్ లిస్ట్ కాగా.. ఇందులో నుంచి ఐదు ఫ్రాంఛైజీలు కలిసి అత్యధికంగా 90మంది కొనుగోలు చేయనున్నారు. ప్రతి ప్రాంఛైజీ పర్సులో రూ.12 కోట్లు ఉండనున్నాయి.

భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ వేదిక మార్పు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌కు ఆదిరిపోయే ఆరంభం లభించింది. నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 132 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. ఫిబ్రవరి 17న ఢిల్లీ వేదికగా ఆసీస్‌తో రెండో టెస్టు ఆడనుంది. కాగా ధర్మశాల వేదికగా మూడో టెస్టు జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం బీసీసీఐ వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

కోహ్లీ కెప్టెన్సీలో చాలా నేర్చుకున్నా : రోహిత్‌శర్మ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.

Womens T20 World Cup 2023లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు బోణీ చేసింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది. రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో రాణించగా షెఫాలీ వర్మ, రిచా ఘోస్ పర్వాలేదనిపించారు.

ఆస్ట్రేలియాకు వణుకు పుట్టించి, రికార్డులను సృష్టించిన అశ్విన్

నాగ్‌పూర్ మొదటి టెస్టులో అశ్విన్ బౌలింగ్ చేస్తుంటే ఆస్ట్రేలియా బ్యాటర్లు వణికిపోయారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో రోజు కూడా ఆట ముగియకముందే ఆస్ట్రేలియా 132 పరుగులు తేడాతో ఓడిపోయింది.

కేఎల్ రాహుల్ ఇంకా నువ్వు మారవా, నీకంటే గిల్ బెటర్

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి తన ఆటతీరుతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కు రాహుల్ దూరమయ్యాడు. అయితే మళ్లీ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు జట్టులోకి వచ్చాడు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో జాక్ పాట్ కొట్టేదెవరో..?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13న ముంబైలో జరగనుంది. ఒక జట్టులో కనీసం 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వీరి నుంచి ఫ్రాంచైజీలు తమ జట్లను ఎంపిక చేసుకుంటాయి. అయితే ఈ వేలంలో అత్యధిక ధరను పొందే అవకాశం క్రికెటర్లు ఎవరో ఇప్పడు మనం తెలుసుకుందాం.

11 Feb 2023

శ్రీలంక

సౌతాఫ్రికాపై శ్రీలంక సంచలన విజయం

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికాపై శ్రీలంక సంచలన విజయం నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 129 పరుగులను చేసింది.

విజృంభించిన స్పిన్నర్లు, మొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం

తొలిటెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. స్పిన్ ఆడటంతో మరోసారి తమ బలహీనతను ఆస్ట్రేలియా బ్యాటర్లు బయటపెట్టుకున్నారు. దీంతో కంగారులు మూడో రోజుకే చాప చుట్టేశారు. భారత స్పిన్నర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

యాక్సిడెంట్ తర్వాత తొలి అడుగు వేసిన రిషబ్ పంత్

టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్రాణప్రాయం నుంచి తప్పించుకున్న పంత్ కర్ర సాయంతో అడుగు వేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే.

విరాట్ కోహ్లీని దాటేసిన మహ్మద్ షమీ

టెస్టు క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లీ కన్నా అత్యధిక సిక్స్ లు బాదిన బ్యాటర్ మహ్మద్ షమీ నిలిచాడు. టెస్టులో విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ టెస్టులో 24 సిక్సర్లు కొట్టగా.. మహ్మద్ షమీ 25 సిక్స్ లు కొట్టాడు. నాగ్ పూర్ జరిగిన మొదటి టెస్టులో మహ్మద్ షమీ మూడు సిక్సర్లు కొట్టి ఈ ఘనతను సాధించాడు.

రాణించిన అక్షర్, టీమిండియా 400 పరుగులకు ఆలౌట్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 400 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం పాటను పాడనున్న మలికా అద్వానీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. మార్చి 4వ తేదీ నుంచి ముంబయిలో ఐదు జట్లతో తొలి సీజన్ ప్రారంభం కానుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని ఇండియా కన్సల్టెంట్స్ సంస్థలో భాగస్వామి అయినా మలికా అద్వానీ వేలాన్ని పర్యవేక్షించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానమే..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా-ఇండియా మధ్య మొదటి టెస్టు వైభవంగా ప్రారంభమైంది. అయితే మూడో టెస్టు ధర్మశాలలో జరగాల్సి ఉండగా.. దీనిపై క్లారిటీ రావడం లేదు.

లక్నో ఫ్రాంచైజీకి యుపీ వారియర్జ్‌గా నామకరణం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో ఫ్రాంచైజీకి యూపి వారియర్జ్‌గా నామకరణం చేశారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో ఫ్రాంచైజీ యజమానులైన కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 757 కోట్లను పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న జోన్ లూయిస్‌ ఈ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించారు.

మొదటి టెస్టులో అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్లు

బోర్కర్ గవాస్కర్ తొలి టెస్టులో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఆసీస్ పై భారత్ అధిక్యంగా దిశగా ముందుకెళ్తోంది. ఇప్పటికే 144 పరుగుల అధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ శతకంతో పాటు, ఆలౌరౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడడం వల్లే టీమిండియా సత్తా చాటింది.