భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

22 Jul 2023

మణిపూర్

మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన

ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ పరిస్థితిపై చర్చ నేపథ్యంలో పార్లమెంట్ అట్టుడికిపోతోంది.

మొదటి భార్య రీల్స్ చూస్తున్నాడని, భర్త మర్మాంగాలపై బ్లేడ్‌తో దాడి చేసిన రెండో భార్య

ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భర్త మర్మంగాలపై రెండో భార్య బ్లేడుతో దాడి చేసింది. మొదటి భార్య ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నాడన్న ఉద్దేశ్యంతో భర్త మర్మాంగాలను కోసేసింది.

22 Jul 2023

మణిపూర్

Manipur Violence: మణిపూర్‌లో అదేరోజు 40కి.మీ దూరంలో మరో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్

మణిపూర్‌లో కుకీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన బాధాకరమైన సంఘటన జరిగిన రోజునే మరో ఘోరం జరిగింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా సూర్యుడు కనిపించకుండా పోయాడు.

PM Modi: యూపీఏ 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్'తో దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ విచ్ఛిన్నం: ప్రధాని మోదీ 

కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మండిపడ్డారు. యూపీఏ హయాంలో జరిగిన 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్' ఆ ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటని పేర్కొన్నారు.

యోగి స్వస్థలంలో దారుణం: యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో జరిగిన సంఘటన సంచలనంగా మారింది.

Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు 

ఉత్తర్‌ప్రదేశ్‌ బారాబంకిలోని మిత్వారా గ్రామంలో దారణం జరిగింది. ఓ యువకుడు తన సోదరిని దారుణంగా నరికి చంపాడు. అంతేకాదు, ఆ ఆమె తలను శరీరం నుంచి వేరు చేసి, పోలీస్ స్టేషన్‌కు బయలుదేరగా, పోలీసులు మార్గమధ్యలో అతన్ని అరెస్ట్ చేశారు.

22 Jul 2023

మణిపూర్

Manipur video case: మణిపూర్ వీడియో కేసులో మరొకరు అరెస్టు

మణిపూర్ వీడియో కేసులో పోలీసులు మరొక నిందితుడిని గుర్తించి అరెస్టు చేసారు. అతడి పేరు యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ మెటీ (19)గా పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 5కు చేరుకుంది.

21 Jul 2023

మణిపూర్

రణరంగంగా మారిన మణిపూర్.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్

వరుస హింసాత్మక ఘటనలతో అల్లాడిపోతున్న మణిపూర్‌లో మరో భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.

21 Jul 2023

మణిపూర్

మహిళల ఊరేగింపుపై జాతీయ మహిళా కమిషన్ 3 సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఇప్పటికే మూడు సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఛైర్‌ పర్సన్ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో మణిపూర్ తరహా ఘటన.. బీజేపీ మహిళా అభ్యర్థిని నగ్నంగా తిప్పారు

మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు ఘటన మరవకముందే పశ్చిమ బెంగాల్ లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.

21 Jul 2023

తెలంగాణ

Usman Sagar Project: వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తివేత

తెలంగాణలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.

జ్ఞానవాపి మసీదులో కీలక పరిణామం.. శాస్త్రీయ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్

జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వే చేసేందుకు వారణాసి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

21 Jul 2023

అయోధ్య

శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్మాణ పనులకు సంబంధించి ఆలయ ట్రస్టు తాజా ఫోటోలను రిలీజ్ చేసింది.

వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సాక్షిగా వైఎస్‌ షర్మిల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ.. ప్రతివాదులకు నోటీసులు

2019 ఎన్నికల్లో కర్నాటకలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలని చెప్పడంతో అప్పట్లో ఆయనపై పరువు నష్టం కేసు నమోదైంది.

21 Jul 2023

మణిపూర్

మణిపూర్‌ను వేధిస్తున్న పోలీసుల కొరత.. 6 వేల ఎఫ్ఐఆర్ లు నమోదైతే 657 మందే అదుపులోకి

మణిపూర్ అల్లర్లకు సంబంధించి మే నుంచి సుమారు 6 వేల ఎఫ్ఐఆర్ లను పోలీసులు నమోదు చేశారు. కానీ కేవలం 657 మంది నిందితులనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

రుణాల ఎగవేత కారణంగా వైసీపీ ఎమ్మెల్యే ఆస్తుల వేలం

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గట్టి షాక్ తగిలింది. కెనరా బ్యాంకు అతని ఆస్తులను వేలం వేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటనను విడుదల చేసింది.

మమతా బెనర్జీ నివాసంలోకి తుపాకీతో చొరబడేందుకు వ్యక్తి యత్నం

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఓ వ్యక్తి తుపాకితో చొరబడేందుకు ప్రతయ్నంచాడు. వెంటనే అప్రమ్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

రెండో రోజూ రూల్స్ 267, 176లపై దుమారం.. ప్రధానికి ఖర్గే ఘాటు ప్రశ్నలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజూ మ‌ణిపూర్‌ దారుణ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఇద్ద‌రు మ‌హిళ‌లను న‌గ్నంగా ఊరేగించిన ఘోర ఘటనపై చ‌ర్చకు విప‌క్షాలు ప‌ట్టుప‌డుతున్నాయి.

21 Jul 2023

మణిపూర్

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు: పోరుగు రాష్ట్రాల నుంచి డీఐజీ స్థాయి అధికారుల నియామకం 

మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. దీంతో మణిపూర్‌కు ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ పోలీసు అధికారులను తరలిస్తున్నారు.

బియ్యం ధరల కట్టడికి కేంద్రం కళ్లెం.. ఎగుమతులపై నిషేధం విధింపు

బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భారతదేశంలో ధరలను నియంత్రించేందుకు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

21 Jul 2023

ఐఎండీ

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ ప్రకటించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నుంచి కుంభవృష్టి ఉందని అంచనా వేసింది.

21 Jul 2023

మణిపూర్

మణిపూర్ ఘటన.. ప్రధాన నిందితుడి ఇంటిని కాల్చేసిన స్థానికులు

మణిపూర్ లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఉరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

21 Jul 2023

మణిపూర్

మణిపూర్ అమానుషం: నిందితులపై చర్యలకు 2 నెలల ఆలస్యంపై స్పందించిన జిల్లా ఎస్పీ

యావత్ దేశాన్నే కుదిపేసిన మణిపూర్ మహిళల నగ్న ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడంపై పౌర సంఘాలు మండిపడుతున్నాయి.

21 Jul 2023

మణిపూర్

మణిపూర్‌, జైపూర్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు

మణిపూర్‌ ఉక్రుల్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున భూమికంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.

20 Jul 2023

జనసేన

నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టుకోండి ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సవాల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తనను అరెస్ట్ చేసుకోవచ్చని, ఈ మేరకు చిత్రవధ కూడా చేసుకోవచ్చని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

పెట్రోల్ ధరల్లో ఏపీ టాప్.. చమురు ధరల నివేదికను పార్లమెంట్ కు అందజేసిన కేంద్రం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా తొలిరోజున పెట్రోల్ ధరలపై కేంద్ర పెట్రోలియం శాఖ కీలక నివేదిక అందజేసింది. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు ఒకే చమురు విధానం అంటూ లేదని కేంద్రం గురువారం లోక్‌సభకు నివేదించింది.

బ్రిజ్ భూషణ్ దేశం వదిలి వెళ్లకూడదు..లైగింక వేధింపుల కేసులో బెయిల్ మంజూరు

రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఊరట లభించింది. దిల్లీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

KUNO NATIONAL PARK : చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆరా.. కేంద్రంపై ప్రశ్నల వర్షం

కునో నేషనల్ పార్కులో ఇటీవలే చిరుతపులుల వరుస మరణాలు ఎక్కువగా సంభవించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌లోని జాతీయ చీతాల పార్కులో ఘటనలపై స్పందించిన సుప్రీం, ఇలాంటి సంకేతాలు అంత మంచిది కాదని అభిప్రాయపడింది.

20 Jul 2023

ఏలూరు

జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ డుమ్మా.. సీఎస్‌కు ఫిర్యాదు చేసిన పేర్ని నాని

ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ రాకపోవడంపై మంత్రి పేర్నీ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎస్ కు పిర్యాదు చేశారు.

20 Jul 2023

మణిపూర్

మహిళల వివస్త్ర ఘటనపై మణిపూర్‌లో ప్రజాగ్రహం.. నిరసనలు, ర్యాలీలతో హోరెత్తుతోన్న ఈశాన్యం 

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆ రాష్ట్రంలో నిరసన జ్వాలలు అంటుకున్నాయి. ఈ మేరకు గిరిజన మహిళలను వివస్త్రను చేయడాన్ని ఖండిస్తూ భారీ ర్యాలీని చేపట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం

తెలంగాణలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.ఉదయం 11 గంటల వరకు నీటిమట్టం 41.3 అడుగులు దాటింది.

మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే మణిపూర్ కాలిపోతోందన్న నినాదాలతో సభలు దద్దరిలిపోయాయి. ఈశాన్య రాష్ట్రంలో జరిగిన అమానుష ఘటన పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టించింది.

20 Jul 2023

దిల్లీ

ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ మృతి.. హత్య.. ఆత్మహత్యా..!

దిల్లీలోని ఓ ఫ్యాషన్ డిజైనర్ ఇంట్లో గురువారం మృతదేహం లభ్యమైంది. ఆత్మహత్యగా అనుమానిస్తున్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు.

KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మళ్లీ క్రియాశీలకంగా మారుతోంది. ఈ మేరకు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్‌రెడ్డి భారీ వర్షంలోనే బైఠాయించారు.

20 Jul 2023

గుజరాత్

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి, 10 మందికి గాయాలు 

గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం అహ్మదాబాద్‌లోని ఇస్కాన్‌ వంతెనపై మారణహోమం జరిగింది.అతివేగంతో వచ్చిన జాగ్వార్‌ కారు ఢీకొట్టిన ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌ సహా 9 మంది మరణించారు.

మహారాష్ట్రలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో భారీ వర్షాలు బీభత్సాలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు కొండచరియలు విరిగిపడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల్లో మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

20 Jul 2023

మణిపూర్

మణిపూర్‌లో మహిళల నగ్న ఊరేగింపు.. ప్రధాన నిందితుడు అరెస్టు

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

మణిపూర్‌ ఘటనపై సుప్రీం సీరియస్‌.. రాజ్యాంగ ఉల్లంఘనలపై ఏం చేశారని కేంద్రాన్ని నిలదీత 

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ఈ క్రమంలో కుకీ తెగకు చెందిన గిరిజన మహిళలపై అమానుష చర్యలను ముక్తకంఠంతో ఖండించింది.