భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి.. వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత, గాల్లోకి పోలీసుల కాల్పులు

ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా వినుకొండలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలన సృష్టించింది.

PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్‌ సీఎం వ్యంగ్యస్త్రాలు

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా నిర్వహించే సభలో రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రసంగంపై వివాదం తలెత్తింది.

27 Jul 2023

ముంబై

ముంబై మహానగరానికి అతి భారీ వర్ష సూచన.. బయటకు రాకూడదని బీఎంసీ హెచ్చరిక

మహారాష్ట్ర రాజధాని ముంబైలో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఇవాళ అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ముంబై వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ మేరకు మహానగరానికి రెడ్ అలర్ట్ ను సూచించింది.

27 Jul 2023

కేరళ

కేరళలో మైకుపై కేసు నమోదు.. సీఎం ప్రసంగంలో మొరయించిందని పరికరం స్వాధీనం

కేరళ సీఎం పినరయి విజయన్‌ సభలో 'మైక్‌' కాసేపు పనిచేయని ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయం దుమారం రేపుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.

27 Jul 2023

మణిపూర్

మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యం; కుకీ, మైతీ గ్రూపులతో కేంద్రం చర్చలు

కుకీ, మైతీ గ్రూపుల జాతి ఘర్షణలతో మణిపూర్ మూడు నెలలుగా హింస చెలరేగుతోంది. మిలిటెంట్ గ్రూప్‌లు చేస్తున్న విద్వంసానికి ఆ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు మణిపూర్ అంశంపై ప్రధాన ఎజెండాగా మారింది.

27 Jul 2023

తెలంగాణ

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కడెం ప్రాజెక్ట్.. గేట్ల మీది నుంచి దూకుతున్న వరద 

గత కొద్ది రోజులుగా తెలంగాణ అంతటా కుంభవృష్టి కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదవుతున్నాయి. గోదావరికి భారీ స్థాయిలో వరద చేరుతుండటంతో కడెం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

27 Jul 2023

కర్ణాటక

Karnataka: మితిమీరిన వేగంతో వచ్చి.. బైక్, విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు 

కర్ణాటకలో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను బలంగా ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

27 Jul 2023

దిల్లీ

దిల్లీల్లో మరికొన్ని రోజులు వర్షాలు; మళ్లీ ప్రమాద స్థాయికి యమునా నది

దేశ రాజధాని దిల్లీని వర్షాలు ఇప్పట్లో వీడేలా కనపడం లేదు. దిల్లీలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

బిగ్‌బాస్ షోలో అశ్లీల ప్రసారంపై మండిపడ్డ ఏపీ హైకోర్టు.. సెన్సార్ లేకపోవడంపై ఆగ్రహం 

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మంది ప్రేక్షకులు చూసే రియాల్టీ షోల్లో బిగ్ బాస్ ఒకటిగా నిలిచింది. సదరు షో సెన్సార్ కటింగ్స్ లేకుండానే ప్రసారం అవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహించింది.

27 Jul 2023

తెలంగాణ

రాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరిక

గత మూడు రోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ మహానరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.

27 Jul 2023

తెలంగాణ

Telangana Floods: వరదల్లో చిక్కుకున్న 80మంది పర్యాటకులు, రక్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది 

తెలంగాణ ములుగు జిల్లాలోని వెంకటాపురం(నూగూరు) మండలం ముత్యాలధార జలపాతాల వద్ద గల్లంతైన 80 మంది పర్యాటకులను పోలీసులు గురువారం తెల్లవారుజామున రక్షించారు.

No Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు? 

మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ బుధవారం ఆమోదించారు.

26 Jul 2023

మణిపూర్

Manipur violence: మణిపూర్‌లో మరోసారి విధ్వంసం, భద్రతా దళాల బస్సులకు నిప్పు

మణిపూర్‌లో మరోసారి విధ్వంసం చెలరేగింది. మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని మోరే జిల్లాలో ఒక గుంపు అనేక ఇళ్లకు నిప్పు పెట్టింది.

26 Jul 2023

జనసేన

జర్మనీలో జనసేన నేత నాగబాబుకు అపూర్వ స్వాగతం.. యూరోప్ దేశాల్లోని ఎన్ఆర్ఐలతో వరుస సమావేశాలు

జనసేన అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఐరోపా దేశాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు.

భారత వాతావరణ అంచనా వ్యవస్థలు ప్రపంచంలోనే భేష్  : కిరణ్ రిజిజు

భారతదేశంలోని వాతావరణ అంచనా వ్యవస్థలు భేషుగ్గా ఉన్నట్లు కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థల కంటే భారత్ లోని వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

అట‌వీ సంర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లు 2023కి లోక్‌స‌భ గ్రీన్ సిగ్నల్.. సఫారీల ఏర్పాటుకు ముందడుగు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా అటవీ శాఖకు సంబంధించి కీలక అడుగు పడింది. అట‌వీ ప‌రిర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లు (Forest Conservation Amendment Bill)కు లోక్‌స‌భ ఆమోదం లభించింది.

అమెరికాలో దోపిడీకి గురైన భారత విద్యార్థిని.. ఇండియాకు రప్పించాలని కేంద్రాన్ని వేడుకున్న తల్లి

భారతదేశానికి చెందిన ఓ విద్యార్థిని అగ్రరాజ్యం అమెరికాలో ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయం తెలిసిన బాధిత తల్లి, వెంటనే తమ కుమార్తెను స్వదేశం రప్పించాలని విదేశీ వ్యవహారాల శాఖకు విజ్ఞప్తి చేశారు.

Assam: ట్రిపుల్ మర్డర్ కేసు: అత్త, మామ, భార్యను చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 

అసోంలో దారుణం జరిగింది. గోలాఘాట్ జిల్లాలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది.

26 Jul 2023

దిల్లీ

అశ్లీల వీడియో కాల్ చేసి కేంద్రమంత్రిని బ్లాక్‌మెయిల్‌ చేసిన ముఠా.. ఇద్దరి అరెస్ట్

ఇటీవల సైబర్‌ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. సామాన్యులు సహా ప్రముఖులనూ విడిచిపెట్టట్లేదు. ఈ క్రమంలో అశ్లీల కాల్స్ చేసే ఓ ముఠా ఏకంగా కేంద్రమంత్రికే వీడియో కాల్ చేసింది.

26 Jul 2023

లోక్‌సభ

లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం

మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు కాంగ్రెస్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి చెందిన భారత రాష్ట్ర సమితి లోక్‌సభలో బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.

26 Jul 2023

మణిపూర్

రాజీనామా ప్రచారానికి బీరెన్ సింగ్ ఫుల్ స్టాప్.. మణిపూర్ సీఎంగా కొనసాగనున్నట్లు ప్రకటన 

మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం, తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు.

ఏపీ:ఆకివీడులో ఘోరం.. ఇంట్లోకి చొరబడి తాత,తల్లిపై దాడి, యువతి అపహరణ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు ఓవృద్ధుడు, అతడి కుమార్తెపై దాడి చేశాడు.అంతటితో ఆగకుండా ఓ యువతిని బలవంతంగా లేవదీసుకెళ్లాడు.

26 Jul 2023

మణిపూర్

మణిపూర్‌ కిరాణా షాపులో లైంగిక వేధింపులు..సరుకులు కొంటున్న యువతిని వేధించిన జ‌వాన్‌ స‌స్పెండ్

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మహిళలపై దాష్టీకాలకు కేంద్రంగా నిలుస్తోంది. రక్షించాల్సిన పోలీసులు, ఆర్మీ భక్షిస్తోంది. ప్రజల మాన, ప్రాణాలను కాపాడాల్సిన అధికారులు, సిబ్బందిలో కొందరు అఘాయిత్యాలకు పాల్పడటం కలకలం సృష్టిస్తోంది.

26 Jul 2023

అయోధ్య

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం 

అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నయి.

26 Jul 2023

దిల్లీ

మరోసారి దిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. నోయిడాలో వరద నీటిలో తేలియాడుతున్న వాహనాలు

దేశ రాజధాని దిల్లీకి జులై నెలలో భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో మరోసారి హస్తినాను ఎడతెరిపి లేని వర్షాలు ముంచెత్తాయి.

'ఆమె చనిపోయింది'.. పాకిస్థాన్ ప్రియుడిని పెళ్లి చేసుకున్న అంజుపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు 

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు వెళ్లి మంగళవారం అక్కడ తన ఫేస్‌బుక్ స్నేహితుడిని వివాహం చేసుకున్న భారతీయ మహిళ అంజుపై ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

26 Jul 2023

తెలంగాణ

తెలంగాణ ఆరోగ్యశ్రీలో కీలక పరిణామం.. ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన నిమ్స్ వైద్యులు

తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మరో కీలక ముందడుగేసింది. ఆరోగ్యశ్రీలో పథకంలో భాగంగా తొలిసారిగా పూర్తి ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేపట్టింది. ఈ మేరకు నిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు ఓ రోగి ప్రాణం నిలబెట్టారు.

No confidence motion: లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ 

మణిపూర్‌లో హింసపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు బుధవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు సమర్పించాయి.

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఒడిశా వ్యాప్తంగా దంచికొట్టనున్న వర్షాలు

ఒడిశాలో జులై 30 వరకు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది.

INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు

మణిపూర్ అంశం, విపక్ష కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష కూటమి 'ఇండియా', అధికార పక్షం ఎన్డీఏ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

నేడు హైదరాబాద్​లో కుంభవృష్టి.. మహానగరానికి ప్రమాద హెచ్చరికలు జారీ

హైదరాబాద్​లో గత కొద్ది రోజులుగా మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే జోన్ల వారీగా రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి: కేంద్రం 

ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. విభజన సమస్యలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని, తాము కేవలం మధ్యవర్తిగా ఉంటామని స్పష్టం చేసింది.

మిస్టర్ మోదీ, మణిపూర్‌లో భారతదేశ ఆలోచనను పునర్నిర్మిస్తాం: రాహుల్ గాంధీ

మణిపూర్ హింసకు సంబంధించి పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు కూటమి 'ఇండియా'పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

25 Jul 2023

కర్ణాటక

లోక్‌స‌భ ఎన్నిక‌లపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు.. ఒంట‌రిగా బరిలోకి దిగుతామని స్పష్టం

2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనతాదళ్ సెక్యులర్ (JDS) పార్టీ కీలక నిర్ణయం వెల్లడించింది. రానున్న ఎన్నిక‌ల్లో జ‌న‌తాద‌ళ్ ఒంట‌రిగానే పోటీ చేయనుందని ప్రకటించింది. ఈ మేరకు మాజీ ప్రధాన మంత్రి, ఆ పార్టీ అధినేత హెచ్‌డీ దేవెగౌడ వెల్లడించారు.

చెన్నై: నడిరోడ్డుపై అగ్గిపాలైన ఖరీదైన బీఎండబ్ల్యూ కారు.. భారీగా ట్రాఫిక్ జామ్ 

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో అనుహ్య ఘటన చోటుచేసుకుంది. అత్యంత రద్దీ గల రోడ్డులో ఖరీదైన కారు మంటల్లో దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సీఎం జగన్ రాష్ట్రాన్ని రివర్స్‌ గేర్‌లో  నడిపిస్తున్నారు: టీడీపీ అధినేత చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను నాశనం చేసి రివర్స్‌ గేర్‌లో పాలన నడిపిస్తున్నారని మండిపడ్డారు.

'ఇండియా' కూటమిపై మోదీ ధ్వజం.. మరోసారి కేంద్రంలో బీజేపీదే అధికారమని ధీమా

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం దిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు నిరసనలతో చట్టసభల కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు 

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నికను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.

25 Jul 2023

తెలంగాణ

తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల పనివేళల్లో మార్పులు.. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ

తెలంగాణలో విద్యార్థుల బడి వేళల్లో విద్యాశాఖ కీలక మార్పులను నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీఎస్ఈలకు ఉత్తర్వులు జారీ చేసింది.

IRCTC సర్వర్ డౌన్; రైలు టిక్కెట్ బుకింగ్‌లు నిలిపివేత

భారతీయ రైల్వే యొక్క ఈ-టికెటింగ్ విభాగం ఐఆర్‍సీటీసీ(IRCTC) సేవల్లో అంతరాయం ఏర్పడింది.