ముఖ్యమంత్రి: వార్తలు

పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సస్పెండ్ చేసింది.

ఈదురు గాలులకు కూలిన భారీ చెట్టు; ఏడుగురు మృతి

మహారాష్ట్రలోని అకోలాలో ఓ టిన్‌షెడ్‌పై భారీ చెట్టు కూలడంతో ఏడుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.

ఒంట్టిమిట్ట సీతా‌రాముల కల్యాణానికి సీఎం జగన్ గైర్హాజరకు కారణాలేంటి?

ఒంటిమిట్టలో బుధవారం జరిగే సీతా రాముల కల్యాణానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆ కార్యక్రమం రద్దయింది.

31 Mar 2023

పంజాబ్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుమార్తెకు ఖలిస్థానీ మద్దతుదారుల బెదిరింపులు

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కుమార్తె సీరత్ కౌర్‌ను ఖలిస్థానీ అనుకూల శక్తులు బెదిరించారు. భగవంత్ మాన్ కుమార్తెకు భద్రత కల్పించాలని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు.

31 Mar 2023

పంజాబ్

పాటియాలా జైలు నుంచి రేపు విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ

పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏప్రిల్ 1న, పాటియాలా జైలు నుండి విడుదల కానున్నారు. అతని అధికారిక హ్యాండిల్ నుండి విడుదల గురించి ప్రస్తావిస్తూ ట్వీట్‌ విడుదల అయింది,

ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని శ్రీరామనవమి సందర్భంగా బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది.

30 Mar 2023

కర్ణాటక

Karnataka: 100శాతం నేనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని; డీకేతో ఇబ్బంది లేదు: సిద్ధరామయ్య కామెంట్స్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో సీఎం కుర్చి కోసం పోటీ మొదలైంది. కర్ణాటక కాంగ్రెస్‌లో చాలా మందే సీనియర్ నాయకులు సీఎం అభ్యర్థిగా తామంటే తాము అని ఊహించుకుంటున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ మధ్య నెలకొంది.

ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం దిల్లీ వెళ్లిన ఆయన గురువారం ఉదయం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు.

'భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు'; రాహుల్‌ అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం

ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను గురువారం సీఎం కేసీఆర్ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పరిశీలించారు. తొలుత ఖమ్మ జిల్లా రామాపురం, గార్లపాడు గ్రామాల్లో పొలాలను స్వయంగా సందర్శించారు.

Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయాన్నే సీఎం జగన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ; టీఎస్‌పీఎస్సీని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం!

ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పేపర్ల లీకేజీ వల్ల ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి.

ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలన పునరుద్ఘాటించారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వంటి అంశాలపై చర్చించారు.

మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చాం: అసెంబ్లీలో సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 11.28 ఆర్థిక వృద్ధి రేటు నమోదవుదైందని సీఎం జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చినట్లు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వాడుకొని ఓ వక్తి దాదాపు 60కంపెనీల నుంచి రూ.3 కోట్ల వరకు కాజేశాడు. తాజాగా తనను తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిచయం చేసుకుని రూ.12 లక్షల వరకు టోపీ పెట్టాడు. తర్వాత మోసపోయానని గమనించిన బాధితుడు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం

2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ తప్పకుండా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ అధినేత నీఫియు రియో ​​ప్రమాణ స్వీకారం

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) నేత నీఫియు రియో ​​మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.

07 Mar 2023

మేఘాలయ

ప్రధాని మోదీ సమక్షంలో మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం

నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా మంగళవారం మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా ప్రిస్టోన్ టైన్‌సాంగ్, స్నియాభలాంగ్ ధర్ ప్రమాణ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి, అమిత్ షా, నడ్డా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

04 Mar 2023

త్రిపుర

ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్; అదే జరిగితే మొదటి మహిళా సీఎంగా రికార్డు

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరనేది తీవ్రమైన చర్చనడుస్తోంది.

మార్చి 7న నాగాలాండ్ సీఎంగా ​​ 'నీఫియు రియో' ప్రమాణస్వీకారం

ఎన్‌డీపీపీ అధినేత నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నీఫియు రియో ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ మద్దతతో ఆయన ఐదోసారి సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు.

03 Mar 2023

మేఘాలయ

ఈనెల 7న మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం

నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) నాయకుడు కాన్రాడ్ సంగ్మా ఈ నెల 7న మేఘాలయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు

విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీతో పాటు ఇతర దిగ్గజ కంపెనీల అధినేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు.

01 Mar 2023

తెలంగాణ

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త: భారీగా డైట్ ఛార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో చదవుతున్న విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలు భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధింత మంత్రులు ప్రతిపాదనలను రూపొందించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపారు.

28 Feb 2023

కర్ణాటక

కర్ణాటకలో 'PayCM' క్యూఆర్ కోడ్ పోస్టర్ల కలకలం; కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయంలో దగ్గర పడటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అన్ని రాజకీయ పక్షాలను ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మంగళవారం ఉత్తర కన్నడ జిల్లాలోని బనవాసి మార్గంలో వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌భవన్‌లో తేనేటి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

23 Feb 2023

దిల్లీ

దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ

దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌ను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది.

ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా నియమితులైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పదిహేను రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది.

విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్

విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్ర్‌టన్‌ ఎరీనాలో 'గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌' ప్రారంభమైంది. గురువారం, శుక్రవారం జరగనున్న ఈ ఈవెంట్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఫార్మా, వ్యవసాయ రంగాల ఆవిష్కరణలపై చర్చించనున్నారు. ఉదయం 10గంటలకు సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు.

కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంజన్న క్షేత్రం అభివృద్ధికి మరో రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

15 Feb 2023

కడప

కడప: జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.

ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్

పర్యాటకుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక టూరిస్టు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 26 టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు.

కమ్యూనిస్టులు హత్యలు చేశారు, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వం: త్రిపుర సీఎం

గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో 35ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ చరిత్ర సృష్టించినట్లు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్!

ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని ఇటీవల నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు.

ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం. ఇది లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల అంశంపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కేసు విచారణను ఈనెల 23వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మూడు రాజధానుల అంశాన్నిఅత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో 23న విచారిస్తామని జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మానసం వెల్లడించింది.

02 Feb 2023

దిల్లీ

దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు

దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ గురువారం దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉండటం గమనార్హం. రెండో చార్జ్‌షీట్‌లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కవిత, వైసీపీ ఎంపీ మాగుంట బాబుతో పాటు మొత్తం 12మంది పేర్లను ఈడీ ఇందులో చేర్చింది.

ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది సజీవ దహనమయ్యారు. ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్‌మెంట్‌లో మంటలు చేలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ధన్‌బాద్‌ డీఎస్పీ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు. మార్చి 3, 4 తేదీల్లో కొత్త రాజధాని విశాఖలో పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సదస్సుకు వ్యాపారవేత్తలు, పెట్టబడిదారులను ఆహ్వానించారు.

20 Jan 2023

దిల్లీ

దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య మాటల యుద్ధం రోజుకు రోజుకు పెరుగుతోంది. ఇటీవల గవర్నర్‌పై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్జీని కలిసేందుకు తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. ఈ ప్రశ్నలపై సమాధానంగా శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. కేజ్రీవాల్‌కు లేఖ రాశారు.

వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్

డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులను డిజిటల్‌గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్‌లు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ డిస్‌ప్లే (ఐఎఫ్‌పిడి) ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. డిజిటల్‌ స్క్రీన్‌లతో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

మునుపటి
తరువాత