ఉగ్రవాదులు: వార్తలు

20 Aug 2023

మాలి

సెంట్రల్ మాలిలో గ్రామంపై సాయుధుల దాడి 21మంది పౌరులు మృతి 

సెంట్రల్ మాలి మోప్టి ప్రాంతంలోని ఒక గ్రామంపై తిరుగుబాటు దారులు విరుచుకుపడ్డారు. తుపాకులతో సాయుధులు రెచ్చిపోయారు. ఈ దాడిలో 21 మంది పౌరులు మరణించినట్లు అధికారులు చెప్పారు.

Terror Attack: స్వాతంత్య్ర దినోత్సవం వేళ దిల్లీపై దాడికి ఉగ్రవాదుల ప్లాన్

పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ లక్ష్యంగా దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

14 Aug 2023

పంజాబ్

స్వాతంత్య్ర దినోత్సవ వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం; ఐదుగురు అరెస్టు 

స్వాతంత్య్ర దినోత్సవం వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం రేగింది.

Jammu and Kashmir: నియంత్రణ రేఖ వద్ద ఎన్‌కౌంటర్; ఇద్దరు ఉగ్రవాదులు హతం 

జమ్ముకశ్మీర్‌ పూంచ్‌లోని దేగ్వార్ టెర్వాన్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి.

Jammu Kashmir: కుల్గామ్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు; ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం 

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు.

04 Aug 2023

సిరియా

సిరియాలో టెర్రర్ దాడులు.. ఘర్షణల్లో మరణించిన ఐఎస్ఐఎస్ చీఫ్ ఖురాషీ 

ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబూ హుస్సేన్ అల్-హుస్సేనీ అల్ ఖురాషీ మరణించారు.

02 Aug 2023

నంద్యాల

జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. నంద్యాల యువజవాన్ వీర మరణం 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలకు చెందిన నవ యువ జవాన్ వీరమరణం పొందారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో తుదిశ్వాస విడిచారు.

28 Jul 2023

సిరియా

దద్దరిల్లిన సిరియా.. బాంబు పేలుడుతో ఆరుగురు దుర్మరణం, 20 మందికిపైగా గాయాలు

సిరియాలో బాంబుల మోతతో రాజధాని డమాస్కస్‌ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మహమ్మద్ ప్రవక్త మనవరాలు, ఇమామ్ అలీ కుమార్తె సయీదా జీనాబ్ సమాధి నుంచి కేవలం 600 మీటర్ల దూరంలో భారీ పేలుడు సంభవించింది. భద్రతా భవనం సమీపంలోనే ఈ పేలుడు చోటు చేసుకున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.

పాకిస్థాన్: మసీదులో ఆత్మాహుతి దాడి; పోలీస్ ఆఫీసర్ మృతి 

పాకిస్థాన్‌లోని ఓ మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఖైబర్ జిల్లాలోని అలీ మసీదు ప్రాంతంలోని ఒక మసీదు వద్ద మంగళవారం బాంబు పేలింది.

బెంగళూరు మహానగరంలో భారీ పేలుళ్లకు యత్నం.. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ, ఎలక్ట్రానిక్ మహానగరం బెంగళూరులో బాంబుల కలకలం రేగింది. ఈ మేరకు పోలీసులు భారీ ఉగ్రదాడిని భగ్నం చేశారు.

J-K Encounter: జమ్ముకశ్మీర్ పూంచ్‌లో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో పూంచ్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

జెనిన్‌లో ఇజ్రాయెల్ ఆపరేషన్; 12మంది మృతి

జెనిన్ శరణార్థి శిబిరంలోని తీవ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధాలను నాశనం చేయడం లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ముగిసింది.

కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక 

ఉగ్రవాదం ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

28 Jun 2023

ఈజిప్ట్

మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం ఈజిప్ట్‌లో పర్యటించారు. అమెరికా పర్యటన తర్వాత మోదీ ఈజిప్టు వెళ్లారు.

28 Jun 2023

గుజరాత్

హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు.. తండ్రి కూతురు అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌ ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఐఎస్ కేపీ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న ఓ తండ్రి, కుమార్తెను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

జమ్ముకశ్మీర్: కుప్వారాలో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని మచల్ సెక్టార్‌లోని కాలా జంగిల్‌లో శుక్రవారం భారత సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఉగ్రవాది సాజిద్ మీర్‌కు అండగా చైనా; భారత్ ఆగ్రహం

భారతదేశంపై చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రతిపాదనకు బీజింగ్ మరోసారి అడ్డుకుంది.

జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్: కుప్వారాలో ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య శుక్రవారం హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

14 Jun 2023

ఎన్ఐఏ

నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ 

కర్ణాటకలో తప్పుడు గుర్తింపు పత్రాలో నివసిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మాస్టర్ వెపన్ ట్రైనర్‌ మొహమ్మద్ యూనస్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది.

కుప్వారా: ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం 

సరిహద్దు ప్రాంతమైన కుప్వారా జిల్లాలో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

పీఎల్‌ఎఫ్‌ఐ టెర్రర్ ఫండింగ్ కేసు: జార్ఖండ్‌లో ఎన్‌ఐఏ సోదాలు; ఆయుధాలు స్వాధీనం 

పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్‌ఎఫ్‌ఐ) ఉగ్రదాడులకు నిధులు సమకూర్చిన కేసులో గత రెండు రోజులుగా జార్ఖండ్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్థానిక పోలీసుల సహకారంతో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది.

పాకిస్థాన్: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై ఏ క్షణమైనా పంజాబ్ పోలీసుల దాడి; ఉగ్రవాదులే టార్గెట్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై పంజాబ్ పోలీసులు ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి.

18 May 2023

అమెరికా

26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్ 

2008 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న కెనడాకు చెందిన వ్యాపారి తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించాలని కాలిఫోర్నియాలో కోర్టు తీర్పునిచ్చింది.

జమ్ముకశ్మీర్: టెర్రర్ ఫండింగ్ కేసులో పుల్వామా, షోపియాన్‌‌లో ఎన్‌ఐఏ దాడులు 

జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ కమాండర్లు లేదా హ్యాండ్లర్ల ఆదేశానుసారం మారు పేర్లతో పనిచేస్తున్న టెర్రర్ గ్రూపుల ఫండింగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్పెషల్ ఫోకస్ పెట్టింది.

హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు

హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి సంచలనం సృష్టించగా, భోపాల్ ఏటీఎస్, హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

జమ్ముకశ్మీర్: రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

రాజౌరీ జిల్లాలోని కంది అడవుల్లో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.

05 May 2023

ఆర్మీ

ఎన్ కౌంటర్ మధ్యలో ముష్కరుల దొంగదెబ్బ.. ఐదుగురు ఆర్మీజవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. వారు జరిపిన బాంబు పేలుడులో ఐదురుగు జవాన్లు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

జమ్ముకశ్మీర్‌‌లో మరో ఎన్‌కౌంటర్‌- ఇద్దరు ఉగ్రవాదులు హతం 

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

01 May 2023

సిరియా

సిరియాలో ఐఎస్ఐఎస్ నాయకుడు హతం; టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటన 

సిరియాలో డేష్/ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ కీలక నాయకుడు అబూ హుస్సేన్ అల్-ఖురాషీని హతమార్చినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు.

తాలిబన్ చేతిలో కాబూల్‌ విమానాశ్రయంలో ఉగ్రదాడి సూత్రదారి హతం 

2021లో కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక సూత్రదారి అయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాలిబాన్ హతమార్చింది. ఈ విషయాన్ని అమెరికా ధృవీకరించింది.

ఉగ్రదాడిలో మరణించిన ఐదుగురు జవాన్ల పేర్లు వెల్లడి; రంగంలోకి ఎన్ఐఏ 

ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్ల మృతి చెందడంపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం శుక్రవారం జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు రానుంది.

18 Apr 2023

సిరియా

అమెరికా దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతం

ఉత్తర సిరియాపై అమెరికా జరిపిన హెలికాప్టర్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతమయ్యాడు.

జమ్ముకశ్మీర్: పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలోని ఓ వైన్‌షాప్‌లో బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరు లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు తప్పించుకున్నారు. సినీ ఫక్కీలో బుధవారం ఉదయం పోలీసుల అదుపులో నుంచి బయటపడ్డారు.

జమ్ముకశ్మీర్ పోలీసుల అదుపులో లష్కరే తోయిబా ఉగ్రవాది; 24 గంటల్లో రెండో అరెస్ట్

జమ్ముకశ్మీర్ పోలీసులు బుధవారం బారాముల్లాలో లష్కరే తోయిబా (ఎల్‌ఇటీ) ఉగ్రవాదిని అరెస్టు చేశారు. గత 24గంటల్లో బారాముల్లాలో ఇది రెండో అరెస్ట్ అని పోలీసులు వెల్లడించారు.

అఫ్ఘనిస్థాన్: ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్‌ను హతమార్చిన తాలిబాన్ దళాలు

అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో తాలిబాన్ భద్రతా దళాలు ఇస్లామిక్ స్టేట్ గ్రూపుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. మూడో వ్యక్తిని అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.

21 Feb 2023

ఎన్ఐఏ

గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు

గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్ అణచివేతపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఫోకస్ పెట్టింది. మంగళవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 72చోట్ల దాడులు నిర్వహిస్తోంది.

జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన మూడున్నరేళ్ల తర్వాత లోయలో మోహరించిన అదనపు బలగాలను ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం.

పోలీస్ హెడ్ ఆఫీస్‌పై ఉగ్రదాడి; 9మంది మృతి

పాకిస్థాన్‌లో పోలీస్ కార్యాలయంపై మరోసారి ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) శుక్రవారం రాత్రి దాడి చేసింది. దీని ఫలితంగా ఒక పౌరుడు, ఆర్మీ రేంజర్, ఇద్దరు పోలీసు అధికారులు సహా నలుగురు మరణించారు.

15 Feb 2023

ఎన్ఐఏ

ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బుధవారం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తో సంబంధాలున్న వారే లక్ష్యంగా మొత్తం కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.

03 Feb 2023

ఎన్ఐఏ

'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్

ముంబయిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. ముంబయిలో ఒక వ్యక్తి ఉగ్రదాడికి పాల్పడతాడని అందులోని సారాంశం.

మునుపటి
తరువాత