భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: రేవంత్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేందుకు తగు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
MIG 29: ఆగ్రా సమీపంలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మిగ్-29 యుద్ధ విమానం కుప్పకూలిన ఘటన జరిగింది. ఈ సంఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
whatsApp: కేరళలో ప్రత్యేక వర్గం పేరుతో ఐఏఎస్ అధికారుల వాట్సప్ గ్రూపు ఏర్పాటుపై వివాదం..
కేరళలో ఐఏఎస్ అధికారుల ఒక ప్రత్యేక వర్గం పేరుతో ఏర్పాటుచేసిన వాట్సప్ గ్రూప్ వివాదానికి దారి తీసింది.
By-elections: ఉత్తరప్రదేశ్, కేరళ,పంజాబ్‌లలో ఉప ఎన్నికలు వాయిదా..
ఎన్నికల సంఘం ఉప ఎన్నికల తేదీలపై కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత నవంబర్ 13న జరగాల్సిన కేరళ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ (యూపీ)లోని ఉప ఎన్నికలను నవంబర్ 20కి వాయిదా వేసింది.
Kota: రాజస్థాన్ కోటాలో 16 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద మృతి
రాజస్థాన్‌లోని కోటాలో నీట్ ప్రవేశపరీక్ష కోసం సిద్ధమవుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
TG TET 2024: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. నవంబరు 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో తాజాగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
JammuKashmir: ఆర్టికల్ 370 తొలగింపుకు వ్యతిరేకంగా PDP ఎమ్మెల్యే ప్రతిపాదన.. వ్యతిరేకించిన ఒమర్ అబ్దుల్లా
ఆరేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది.
Rythu Bharosa: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నవంబర్ చివరికల్లా రైతు భరోసా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. గత సంవత్సరం జరిగిన విధానాల ప్రకారమే, ఇప్పుడు ఒక్క ఎకరా నుండి ప్రారంభించి, ఐదు ఎకరాలు ఉన్న రైతులకు డిసెంబర్ నెలాఖరు వరకు నిధులు జమ చేయాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.
NEET: రెండంచెల్లో నీట్!.. రాధాకృష్ణన్ కమిటీ కీలక సిఫారసులు
జేఈఈ తరహాలో NEET ను రెండంచెల్లో నిర్వహించాలని రాధాకృష్ణన్ కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల .. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.
Uttarakhand: అల్మోరాలో కాలువలో పడిన ప్రయాణికులతో నిండిన బస్సు.. 15 మందికి పైగా మృతి
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అల్మోరాలో, ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన మెట్రో రైళ్లు..
హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడడం వలన నిత్యం రద్దీగా ఉండే రైళ్ల సేవలు అరగంట పాటు నిలిచిపోయాయి.
India-China: భారత్- చైనా మధ్య ఇప్పుడు మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి: జైశంకర్
భారత్, చైనాల మధ్య వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వెంబడి బలగాల ఉపసంహరణలో కొంత మేర పురోగతి సాధించబడినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ తెలిపారు.
Bus Fire Accident: బస్సులో ఒక్కసారిగా మంటలు.. ఆహాకారాలు పెట్టిన ప్రయాణికులు
దిల్లీ నుంచి బిహార్‌లోని సుపాల్‌కు ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ వద్ద బాద్సా ప్రాంతంలో చోటు చేసుకుంది.
Seaplane: విజయవాడ - శ్రీశైలం మధ్య 'సీ ప్లేన్' ఏర్పాటుకు సన్నాహాలు.. 9న మరో అద్భుత ప్రయోగం
పర్యాటక రంగంలో విజయవాడ కొత్త ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. ఈ నెల 9న పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు ప్రయాణించే 'సీ ప్లేన్' ప్రయోగాన్ని ప్రారంభించనున్నారు.
Vijay: డీఎంకే,బీజేపీపై టీవీకే విమర్శలు..'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అప్రజాస్వామికం..
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'జమిలి' ఎన్నికల ప్రతిపాదనను ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ వ్యతిరేకించారు.
Rahul Gandhi: రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం: రాహుల్ గాంధీ
భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం దేశంలో ప్రధాన పోరాటంగా నిలిచిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
TET Results: రేపే ఏపీలో టెట్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోవచ్చు
ఏపీలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) ఫలితాలను ఉన్నత విద్యా మండలి రేపు (సోమవారం) ప్రకటించనుంది.
Yogi Adityanath: సీఎం యోగిని చంపేస్తామని బెదిరించిన ముస్లిం మహిళ.. విచారణలో సంచలన విషయాలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామని బెదిరించిన ఓ మహిళను పోలీసులు, సార్వత్రిక ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అదుపులోకి తీసుకున్నారు.
Ap New Ration Card Details : కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. కీలక అప్‌డేట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది.
Srinagar: టూరిజం కార్యాలయం సమీపంలో గ్రెనేడ్‌తో ఉగ్రవాదులు దాడి.. 10 మందికి గాయలు
జమ్ముకశ్మీర్, శ్రీనగర్‌లోని ఫ్లీ మార్కెట్‌లో ఉన్న పర్యాటక శాఖ రిసెప్షన్ సెంటర్ (టిఆర్‌సి)పై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు.
Andhrapradesh: తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ మధ్య కనెక్టివిటీకి కీలక అడుగు
ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. ముఖ్యంగా ఇతర ప్రాంతాలతో అనుసంధానానికి కూడా ప్రాధాన్యం ఉంది.
Jharkhand Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి
జార్ఖండ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాంచీలో బీజేపీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు.
Yogi Adityanath: బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను చంపుతాం.. ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం
ముంబై పోలీసులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేయబోతున్నట్లు ఒక బెదిరింపు సందేశం అందుకున్నట్టు సమాచారం.
AP Government : ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. వారిపై కేసులు పెట్టేవారికి రక్షణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై తీసుకున్న తాజా నిర్ణయం ప్రభుత్వ రంగంలో కలకలం రేపుతోంది.
Andhrapradesh: ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు పూర్తి స్థాయి బడ్జెట్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
Sabarimala pilgrims: శబరిమల యాత్రికులకు టీడీబీ రూ. 5 లక్షల ఉచిత బీమా
ఈ ఏడాది మండలం-మకరవిలక్కు యాత్రా సీజన్ నేపథ్యంలో శబరిమల ఆలయాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకు ప్రతీ ఒక్కరికీ రూ.5 లక్షల ఉచిత బీమా అందించనున్నారు.
Delhi air pollution: ఢిల్లీలో కొనసాగుతున్న ప్రమాద ఘంటికలు.. పీల్చితే శ్వాసకోశ సమస్యలే
దేశ రాజధాని దిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకీ అధికమవుతూ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది.
Hyderabad Metro : మెట్రో రెండో దశలో ఐదు కారిడార్ల నిర్మాణానికి ఆమోదం
హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ పనులకు సంబంధించి కొత్త మార్గాల నిర్మాణానికి పరిపాలన అనుమతి లభించింది.
Hottest October: 120 ఏళ్లు తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు.. అత్యధిక వేడిగా అక్టోబర్
అక్టోబర్ 2024, భారతదేశంలో అత్యంత వేడిగా నిలిచింది.
Chandra Babu: విశాఖ-అమరావతి మార్గంలో వేగవంతమైన మార్పులు : చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Encounter: అనంత్‌నాగ్, శ్రీనగర్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య రెండు వేర్వేరు చోట్ల ఎదురుకాల్పులు జరిగాయి.
Poison gas leak : రాయల్ మెరైన్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో విషవాయువు లీక్.. 30 మంది కార్మికులకు అస్వస్థత
బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గోకర్ణమఠంలో రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో విషవాయువు లీకేజీ ఘటనలో 30 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Chandrababu: తిరుపతిలో బాలికపై హత్యాచార ఘటన.. స్పందించిన సీఎం చంద్రబాబు
తిరుపతి జిల్లా వడమాలపేటలో జరిగిన మూడేళ్ల బాలికపై హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Nara Lokesh: ముగిసిన నారా లోకేశ్ అమెరికా పర్యటన.. 100 కంపెనీలతో కీలక చర్చలు
అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది.
Bomb Threat: సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కి బాంబు బెదిరింపు
దేశంలో వరుసగా బాంబు బెదిరింపు ఘటనలు కొనసాగుతుండటం కలకలం రేపుతోంది.
IMD : నవంబర్‌లో చలి తక్కువే.. వాతావరణ శాఖ నివేదిక
గత వందేళ్లలో అధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాది అక్టోబర్‌లో నమోదు కావడం గమనార్హం. 1901 నుంచి అక్టోబర్‌లో నమోదైన సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఈ ఏడాది 1.23 డిగ్రీల మేర పెరిగడం విశేషం.
Kharge-Modi : ఖర్గే-మోదీ మధ్య మాటల యుద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌పై పరస్పర విమర్శలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమైంది. శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, కర్ణాటక ఎన్నికల హామీలపై తనను విమర్శించిన మోదీకి కౌంటర్ ఇచ్చారు.
Advance Booking: రైలు టికెట్ బుకింగ్‌లో మార్పులు.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి!
భారత రైల్వే బోర్డు రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల బరిలో 7,994 మంది.. 921 మంది నామినేషన్లు తిరస్కరణ
నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తియైంది.