భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

ఉత్తర్‌ప్రదేశ్: వీధి కుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలోని సీబీ గంజ్ ప్రాంతంలో వీధి కుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అలాగే మరో చిన్నారికి గాయాలయ్యాయి.

దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. దిల్లీ పర్యటనలో భాగంగా మే 4వ తేదీన ఆయన వసంత్ విహార్‌లో శాశ్వత బీఆర్ఎస్ జాతీయ పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన బుధవారమే దిల్లీకి వెళ్లనున్నారు.

02 May 2023

కర్ణాటక

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌ తప్పిన ప్రమాదం; హెలికాప్టర్ అత్యవసరల ల్యాండింగ్

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌ తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్తున్న హెలికాప్టర్‌ను హోసాకోట్‌ సమీపంలో పక్షి ఢీకొట్టిందని అధికారులు మంగళవారం తెలిపారు.

అకాల వర్షాలకు తడిసిన పంటను కొనుగోలు చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్

తెలంగాణలో అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. చేతికొచ్చిన పంట వర్షార్పణం అవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

02 May 2023

దిల్లీ

దిల్లీ మద్యం పాలసీ కేసు: ఛార్జిషీట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చిన ఈడీ 

దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం తన రెండో అనుబంధ ఛార్జిషీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చింది.

Big Breaking: ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన ప్రకటన చశారు.

02 May 2023

దిల్లీ

దిల్లీలో భారీ వర్షాలు: 13ఏళ్లలో రెండో కూలెస్ట్ డేగా రికార్డు

దిల్లీలో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో సోమవారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 26.1 డిగ్రీలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే! 

పార్లమెంట్ కొత్త భవనం సెంట్రల్ విస్టాను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. నిరంతరం వైద్య సదుపాయాలను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

02 May 2023

కర్ణాటక

కాంగ్రెస్ మేనిఫెస్టో: ఉచిత విద్యుత్, రూ.3వేల నిరుద్యోగ భృతి, కుటుంబ పెద్దకు రూ.2వేలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ మంగళవారం విడుదల చేసింది. మహిళా ఓటర్లు, యువతే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొంచింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య తదితరులు మేనిఫెస్టోను విడుదల చేశారు.

మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ 

ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆమె మే 8న నగరంలో పర్యటిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

02 May 2023

దిల్లీ

తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య

తీహార్ మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థి ముఠా సభ్యులు అతనిపై దాడి చేయడంతో టిల్లు తాజ్‌పురియా మరణించినట్లు మంగళవారం జైలు అధికారులు తెలిపారు.

మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ 

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ పదవికి రాజీనామా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నోరువిప్పాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.

తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు

తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఐదేళ్ల క్రితం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టిన కేసును విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కొట్టేసింది.

థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టు; చికోటి ప్రవీణ్ అరెస్టు

భారతదేశంలో ఫెమా ఉల్లంఘనల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌ను థాయ్‌ లాండ్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.

01 May 2023

ఐఎండీ

తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు

విడాకుల విషయంలో 6నెలల వెయిటింగ్ పీరియడ్‌‌పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం వివాహం బంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైతే, ఆ కారణంతో వివాహాలను వెంటనే రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

01 May 2023

కర్ణాటక

కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో; ఏడాదికి మూడు సిలిండర్లు, రోజుకు అర లీటర్ నందిని పాలు ఉచితం 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ జాతీయ(బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం బెంగళూరులో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

01 May 2023

దిల్లీ

దిల్లీలో వ్యక్తిని 3కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిని కారు 

దిల్లీలో కారు ఈడ్చుకెళ్లిన ఘటన మరొకటి జరిగింది. దిల్లీలోని ఆశ్రమ్‌చౌక్‌ నుంచి నిజాముద్దీన్‌ దర్గా వరకు ఆదివారం రాత్రి ఓ వ్యక్తిని కారు బానెట్‌కు తగిలించుకుని 3కిలో మీటర్లు పాటు లాక్కెళ్లింది.

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో బాధపడుతూ ఆదివారం రాత్రి దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని క్రిటికల్ కార్డియాక్ యూనిట్‌లో చేరినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర

19కిలోల కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ల ధరను రూ. 171.50 తగ్గిస్తున్నట్లు పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. మే 1 నుంచి తగ్గించిన ధరలు అమలులోకి వచ్చినట్లు వెల్లడించాయి.

May Day 2023: భారత్‌లో 'మే డే'ను మొదట ఎక్కడ నిర్వహించారు? తొలిసారి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం( మే డే)ను ప్రతి సంవత్సరం మే 1న దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచంలోని అనేక దేశాలు మే డేను సెలవుదినంగా పాటిస్తారు.

30 Apr 2023

తెలంగాణ

తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయాన్ని సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు.

Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్ మైలురాయికి చేరుకుంది.

పంజాబ్: లుథియానాలో గ్యాస్ లీక్; 9మంది మృతి

పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. లుథియానా జిల్లాలోని గియాస్‌పురా ప్రాంతంలో గ్యాస్ లీక్ అయింది.

29 Apr 2023

తెలంగాణ

నేడే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభం; 150ఏళ్లైనా చెక్క చెదరకుండా నిర్మాణం 

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. , తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. అధునాతన హంగులతో తక్కువ వ్యవధిలో నిర్మించిన ఈ సెక్రటేరియట్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం

ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' ఆదివారం(ఏప్రిల్ 30) 100వ ఎపిసోడ్‌‌కు చేరుకుంటుంది.

APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) లంబసింగి, పాడేరు, అరకు లోయ, బొర్రా గుహలు వంటి పర్యాటక ప్రదేశాల్లో విహార యాత్రల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రారంభించబోతోంది.

29 Apr 2023

కర్ణాటక

కాంగ్రెస్ నన్ను 91సార్లు దుర్భాషలాడింది: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే శుక్రవారం మోదీ 'విషసర్పం'తో పోల్చగా, శనివారం మోదీ ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

29 Apr 2023

కడప

వైఎస్ కుటుంబం చీలిపోయిందా? వచ్చే ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య పోరు తప్పదా? 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, వైఎస్ కుటుంబంలో కూడా తీవ్రఅలజడిని రేపుతోంది. వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో వైఎస్ కుటుంబం నిలువుగా చీలిపోయిందనేది బహిరంగ రహస్యం.

28 Apr 2023

తెలంగాణ

వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా

వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఇప్పుడు వాదనలు వినలేమని శుక్రవారం తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభంతో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ 

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 91 కొత్త ఎఫ్ఎం ట్రాన్స్‌మిటర్‌లను ప్రారంభించారు.

28 Apr 2023

హర్యానా

హర్యానా: భార్యను చంపి, చేతులు, తల నరికి; ఆ తర్వాత శరీరాన్ని కాల్చేశాడు

హర్యానాలోని మనేసర్ జిల్లాకు చెందిన 34ఏళ్ల వ్యక్తిని తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

చేతిపంపు కొట్టుకొని నీళ్లు తాగిన ఏనుగు; వీడియో వైరల్ 

పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కొమరాడ మండలంలోని వన్నాం గ్రామంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

28 Apr 2023

బ్రిటన్

'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది': రిషి సునక్‌పై సుధా మూర్తి ఆసక్తికర కామెంట్స్

యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ అత్తగారు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్తాపకుడు సుధా మూర్తి ఆసక్తిక కామెంట్స్ చేశారు.

పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి

పశ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో పిడుగులు పడి దాదాపు 14 మంది మరణించారని అధికారులు తెలిపారు.

28 Apr 2023

సూడాన్

ఆపరేషన్ కావేరి: సూడాన్ నుంచి 10వ బ్యాచ్ భారతీయుల తరలింపు

సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కున్న భారతీయులను రక్షించడానికి కేంద్రం 'ఆపరేషన్ కావేరి'ని ముమ్మరం చేసింది. తాజాగా ఎనిమిది, తొమ్మిది, పదవ బ్యాచ్‌లు సూడాన్ నుంచి బయలుదేరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.

28 Apr 2023

మణిపూర్

మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు 

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం హాజరుకావాల్సిన ఈవెంట్ వేదికను గురువారం రాత్రి కొందరు తగలబెట్టారు.

దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు

దేశంలో గత 24గంటల్లో 7,533 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసులు సంఖ్య 4.49కోట్లకు పెరిగినట్లు కేంద్రం చెప్పింది.

28 Apr 2023

తెలంగాణ

మొక్కజొన్న రైతులకు కేసీఆర్ శుభవార్త; పంట కొనుగోలుకు ముందుకొచ్చిన ప్రభుత్వం

మొక్కజొన్న రైతులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగిలో పండించిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.