భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?

మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయం మే 1 నుంచి నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది.

రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు 

నవంబర్ 2022లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో బాంబులు వేసి హత్య చేస్తామని బెదిరింపులతో కూడిన లేఖ పంపిన నిందితుడు 60ఏళ్ల దయాసింగ్ అలియాస్ ఐశిలాల్ ఝమ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు

పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి ఇల్లు అద్దెకు ఇచ్చే యజమానుల గురించి ఎప్పుడైనా విన్నారా? బెంగళూరులో అద్దెకోసం ఇల్లును వెతుకున్న వ్యక్తికి ఆ వింత అనుభవం ఎందురైంది.

బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం 

గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి.కృష్ణయ్య హత్య కేసులో దోషిగా ఉన్న ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయాలని బిహార్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ (ఐఏఎస్) అభ్యంతరం వ్యక్తం చేసింది.

ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని విషసర్పంతో పోల్చారు.

'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.

27 Apr 2023

ఐఎండీ

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు; ఆందోళనలో రైతన్నలు 

ఇప్పటికే రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షాలు తెలంగాణ మరో మూడు రోజలు పాటు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

27 Apr 2023

సూడాన్

సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి 

సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని సురక్షింతంగా స్వదేశానికి తరలించడమే ప్రభుత్వ లక్ష్యమని గురువారం విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా స్పష్టం చేశారు.

తెలంగాణ భవన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు 

భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు.

27 Apr 2023

తెలంగాణ

TS EAMCET-2023: తెలంగాణ ఎంసెట్‌కు పరీక్షాల కేంద్రాల పెంపు; భారీగా పెరిగిన అప్లికేషన్లు

తెలంగాణ ఎంసెట్‌ -2023 కోసం రికార్డు స్థాయిలో అప్లికేషన్లు పెరిగినట్లు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)- హైదరాబాద్ పేర్కొంది.

దేశంలో కొత్తగా 9,355 మందికి కరోనా; 26 మరణాలు 

దేశంలో గత 24గంటల్లో 9,355 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

27 Apr 2023

ఇస్రో

'గగన్‌యాన్' పైలెట్లకు శిక్షణ పూర్తికావొచ్చింది: రాకేష్ శర్మ 

భారత తొలి వ్యోమగామి, వింగ్ కమాండర్ (రిటైర్డ్) రాకేష్ శర్మ ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన 'గగన్‌యాన్' & బియాండ్'పై ప్రదర్శనలో పాల్గొన్నారు.

TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) హైదరాబాద్ పరిధిలోని సాధారణ ప్రయాణికుల కోసం టీ-24 టిక్కెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

27 Apr 2023

సూడాన్

ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు

'ఆపరేషన్ కావేరి' కింద, భారతదేశం ఇప్పటివరకు సూడాన్ నుంచి దాదాపు 1100 మందిని తరలించింది.

26 Apr 2023

తెలంగాణ

అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి, గైడ్ టీచర్ అరుదైన ఘనత సాధించారు. వీరు తయారు చేసిన ఓ నమూనా అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైంది.

ఛత్తీస్‌గఢ్‌: నక్సల్స్‌ దాడిలో 11మంది డీఆర్‌జీ జనాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో అరన్‌పూర్ సమీపంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి) సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై నక్సల్స్ ఐఈడీ దాడిలో మొత్తం 11 మంది సిబ్బంది మరణించారు.

26 Apr 2023

తెలంగాణ

అయ్యో! సైబీరియన్ పక్షలకు ఎంత కష్టమొచ్చే; వడగండ్లతో విలవిల

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని మాధాపురం గ్రామానికి ప్రతి ఏటా వలస వచ్చే సైబీరియన్ పక్షులు అకాల వర్షాలు, వడగళ్ల వానలకు అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా వడగళ్ల వానల వలన మృత్యువాత పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad Metro: ఆ రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను నడుపుతున్న హైదరాబాద్ మెట్రో 

హైదరాబాద్‌లో ప్రయాణాల కోసం మెట్రోను ఆశ్రయించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు వేసవి కావడంతో మెట్రో ప్రయాణాలు మరింత పెరిగాయి.

ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు

ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు గ్రామమైన 'మాణా' వద్ద 'భారత మొదటి గ్రామం' అని ప్రకటిస్తూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సైన్ బోర్డును ఏర్పాటు చేసింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి బోర్టును ఏర్పాటు చేశారు.

దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు

దేశంలో గత 24గంటల్లో 9,629 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 61,013కు చేరుకుంది.

పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్ 

ఆంధ్రప్రదేశ్‌లో పాస్ పోర్ట్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. రాష్ట్రంలో విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఇక నుంచి శనివారం కూడా పని చేయనున్నాయి.

26 Apr 2023

తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు శాపంగా మారిన అకాల వర్షాలు 

అకాల వర్షాల కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్‌లో నీటి కాలుష్యానికి చెక్ పెట్టేందుకు 'నాణ్యత' యాప్ 

నగరంలో నీటి నాణ్యత, సరఫరా, కాలుష్యంపై ప్రజలు ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్&ఎస్‌బీ) కొత్త యాప్‌ను రూపొందించింది.

26 Apr 2023

దిల్లీ

దిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు; పాజిటివ్ రేటు 22.74శాతం

దేశ రాజధాని దిల్లీలో కరోనా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు కొన్ని రోజులుగా తగ్గుతుంటే, దిల్లీలో మాత్రం భారీగా నమోదవుతున్నాయి.

25 Apr 2023

పంజాబ్

పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత 

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు ఎస్. ప్రకాష్ సింగ్ బాదల్ (95) మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పీఏ ధృవీకరించారు.

25 Apr 2023

కడప

రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్ 

కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ టీడీపీ నేతల ఫొటోలతో కూడిన పోస్టర్లను ప్రొద్దుటూరులో ప్రధాన కూడళ్లలో అతికించారు.

ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు 

భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి వార్త చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి 

2023 ఏడాదికి గాను సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు, 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు బోర్డు నిర్వహించింది.

25 Apr 2023

బిహార్

బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా? 

గ్యాంగ్‌స్టర్‌ ఆనంద్ మోహన్ బిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆనంద్ మోహన్ విడుదల వార్త ఇప్పుడు బిహార్‌లో సంచలనంగా మారింది.

ఖగోళ అద్భుతం: బెంగళూరులో జీరో షాడో డే- నీడలు అదృశ్యం 

బెంగళూరులో ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. ఒక నిమిషం పాటు పట్టపగలు నిడలు అదృశ్యమయ్యాయి.

25 Apr 2023

ఎన్ఐఏ

పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)ని లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.

25 Apr 2023

కేరళ

కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే! 

కేరళలోని కొచ్చిలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రారంభించారు. 10ద్వీపాలను కలిపే వాటర్ మెట్రో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లతో నడుస్తుంది.

కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్‌ వరకు నడిచే కేరళ తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.

సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం 

సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) మధ్య భీకర ఆదిపత్య పోరు జరుగుతోంది. ఈ పోరాటం కారణంగా సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారతదేశం 'ఆపరేషన్ కావేరి'ని ప్రారంభించింది.

25 Apr 2023

తెలంగాణ

ఈ నెల 30నుంచే తెలంగాణ కొత్త సచివాలయంలో విధులు 

తెలంగాణ నూతన సచివాలయంను ఏప్రిల్ 30న ఘనంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

25 Apr 2023

దిల్లీ

భవన నిర్మాణ కార్మికులకు కేజ్రీవాల్ గుడ్‌న్యూస్: ఉచిత బస్ పాస్‌లు; 75 శాతం రాయితో ఇళ్లు 

దిల్లీలోని భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరును సమీక్షించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు.

24 Apr 2023

తెలంగాణ

'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ 

అనంతపురం మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు తాను చెప్పిన 'రాయల తెలంగాణ' సిద్ధాంతాన్ని మరోసారి లేవనెత్తారు.

అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సోమవారం హౌరాలో కలిశారు.

తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు; అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్ 

వైఎస్ వివేకా హత్య కేసులో లోక్‌సభ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ

గత పాలకులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విరుచుకుపడ్డారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని, నిధుల కేటాయింపులో వివక్ష చూపాయని మండిపడ్డారు. అయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అలాంటి వ్యత్యాసాలను తొలగించిందన్నారు.