భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన
జీ20 సదస్సు తొలి సెషన్‌లో కూటమిలోని దేశాధినేతలు దిల్లీ సమ్మిట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
వేములవాడ రాజన్న ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వేములవాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ఆలయ వసతి గృహాలకు చెందిన దుకాణాల వద్ద మంటలు అంటుకున్నాయి.
ఇది ప్రపంచానికి కొత్త దిశను చూపే సమయం: జీ20 స్వాగత ప్రసంగంలో ప్రధాని మోదీ
దిల్లీ ప్రగతి మైదాన్‌లోని 'భారత్ మండపం'లో జీ20 సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత ప్రారంభమైంది. మోదీ ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పాత్రదారి చంద్రబాబు: ఏపీ సీఐడీ
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ మాట్లాడారు. నంద్యాలలో ఉదయం 6గంటలకు చంద్రబాబ అరెస్ట్ చేశామన్నారు.
ఎమిరేట్స్ విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ.. దిల్లీకి మళ్లిన ఫ్లైట్
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. (Dubai-Guangzhou Emirates Aeroplane) దుబాయ్ నుంచి గ్యాంగ్ జౌ వెళ్లాల్సిన EK- 362 ఎమిరేట్స్ విమానం అత్యవసర వైద్య పరిస్థితుల కారణంగా దిల్లీకి మళ్లింది.
Modi-Biden bilateral meet: ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ చర్చించిన అంశాలు ఇవే..
జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్- ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరువురు దేశాధినేతలు కీలక అంశాలపై చర్చించారు.
G20 summit 2023: ప్రధాని మోదీ సీటు ముందు నేమ్ ప్లేట్‌పై 'భారత్' పేరు
G20 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో భారత్ పేరు మరోసారి కనిపించింది. రౌండ్‌టేబుల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న స్థానంలో భారత్ నేమ్ ప్లేట్ దర్శనమిచ్చింది.
G20 summit delhi: దిల్లీలో అట్టహాసంగా జీ20 సదస్సు.. దేశాధినేతలకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ
జీ20 సదస్సు శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. శిఖరాగ్ర సమావేశానికి తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న భారత్ రాజధాని దిల్లీ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ప్రపంచ దేశాధినేతల రాకతో మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
అరెస్ట్‌పై స్పందించిన చంద్రబాబు.. న్యాయమే గెలుస్తుందని ధీమా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తాను తప్పు చేయలేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను అణిచివేస్తున్నట్లు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు.. ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్
అవినీతి ఆరోపణల కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు.
దేశంలోనే అతికొద్దిమంది నిజాయితీ నేతల్లో చంద్రబాబు ఒకరు: ఎంపీ కేశినేని
తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోనే అతికొద్ది మంది నిజాయితీ గల నేతల్లో చంద్రబాబు ఒకరని ఆయన అన్నారు.
G-20 డిక్లరేషన్ రెడి, ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత పూర్తిగా వెల్లడిస్తాం - షెర్పా అమితాబ్ కాంత్
G-20 శిఖరాగ్ర సమానేశాలకు దిల్లీ డిక్లరేషన్ రెడి అయ్యింది. ఈ మేరకు ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత త్వరలోనే ఇందులోని అంశాలను వెల్లడిస్తామని జీ-20 భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటు చేయనున్న బీజేపీ
ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కమల దళం వ్యుహాత్మకంగా అడుగులు వేస్తుంది.
దిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్యం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట
దిల్లీ లిక్కర్ కుంభకోణంలో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అప్రూవర్ గా మారడం సంచలనంగా మారింది.
G-20 సమావేశం: భారత ప్రతిపాదిత శిలాజ ఇంధన విధానాన్ని వ్యతిరేకిస్తున్న చైనా, సౌదీ
G-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా భారతదేశం ప్రతిపాదించిన శిలాజ ఇంధన పద్ధతిని చైనా, సౌదీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు కఠిన వైఖరి అవలింభించనున్నాయి.
10వేల అడుగుల ఎత్తులో G20 జెండాతో IAF అధికారి అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్
జీ 20 శిఖరాగ్ర సదస్సు కోసం దేశ రాజధాని దిల్లీ ముస్తాబైంది. ప్రపంచ దేశాల నాయకులకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే దేశాధినేతలు దిల్లీకి చేరుకున్నారు.
ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు-2023 ప్రారంభం.. ఎప్పట్నుంచో తెలుసా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 24కి ఆరు నెలల గడువు తీరిపోనుంది. ఈ మేరకు ప్రతీ ఆరు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.
సతీసమేతంగా దిల్లీకి చేరిన రిషి సునక్‌కు ఘన స్వాగతం.. పర్యటన తనకెంతో స్పెషల్ అన్న ఇంగ్లీష్ ప్రధాని
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సునక్ దంపతులకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఘనంగా స్వాగతం పలికారు.
చంద్రబాబు వ్యూహంతో తెలుగుదేశంలో జోష్.. కడపలో మహిళా అభ్యర్థికి టీడీపీ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ కొత్త ఇంఛార్జీలను ప్రకటించింది.
ఉప ఎన్నికల్లో భాజపా హవా.. మూడు చోట్ల ఆధిక్యం
త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలోని ధన్‌పూర్,బోక్సానగర్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఆంధ్రప్రదేశ్ సర్కారు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి ఇంటింటికీ ఆరోగ్య సర్వేను చేపట్టబోతోంది.ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ప్రకటన చేశారు.
G-20 Summit : ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్.. 15 ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్న ప్రధాని మోదీ
G-20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుస ద్వైపాక్షిక చర్చలు చేయనున్నారు. ఈ మేరకు మొత్తంగా 15 రౌండ్ల చర్చలు చేయనున్నారని కేంద్రం వెల్లడించింది.
మణిపూర్‌లో మళ్ళీ హింస: భద్రతా బలగాలు,సాయుధులకు మధ్య కాల్పులు
మణిపూర్ తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు,సాయుధ సిబ్బంది మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
భారత్ సరైన పనే చేసింది: రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత కేంద్రం వైఖరికి మాజీ ప్రధాని మద్దతు
భారతదేశం"తన సార్వభౌమత్వం,దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి మంచి పనిచేసిందని,అదే సమయంలో శాంతి శాంతిస్థాపన ఆవశ్యకతను ప్రస్తావించింది"అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.
ప్రపంచ దేశాధినేతలకు కనీవినీ ఎరుగని రీతిలో ఆతిథ్యం.. మమతా, నితీశ్ హాజరయ్యే అవకాశం
G- 20 సదస్సుకు సర్వం ముస్తాబైంది. విదేశీ అతిథులకు అద్భుతమైన ఆతిధ్యం ఇచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఏర్పాటు చేశారు.
Sanatana Dharma Row:రావణుడు,కంసుడు సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టడంలో విఫలమయ్యారు.. సనాతన ధర్మంపై ఆదిత్యనాథ్
సనాతన ధర్మంపై గతంలో జరిగిన అనేక దాడులు ఎటువంటి నష్టాన్ని కలిగించలేకపోయాయని,ఈరోజు కూడా శక్తి ఆకలితో ఉన్న"పరాన్నజీవి" ద్వారా ఎటువంటి హాని జరగదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
G-20 సదస్సుకు వేళాయే.. నేడు దిల్లీకి ప్రపంచ దేశాధినేతల రాక
G-20 శిఖరాగ్ర సమావేశానికి వేళైంది. సదస్సులో పాల్గొనేందుకు అగ్ర దేశాధినేతలు, ఆహ్వాన దేశాల ప్రతినిధులు శుక్రవారం వరుసగా భారత్ చేరుకోనున్నారు.
ఉపపోరు: 6 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, మధ్యాహ్నం వరకు ఫలితాలు
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మేరకు ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
నేడు దిల్లీ వేదికగా మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇవాళ దిల్లీ చేరనున్నారు. ఈ మేరకు గురువారం అమెరికాలో గురువారం బయల్దేరిన బైడెన్, శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు దిల్లీ చేరుకోనున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి?
బీజేపీ,జనతాదళ్(సెక్యులర్)2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో చేతులు కలపడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
G-20 సమావేశం సన్నాహాలపై ప్రధాని మోదీ సమీక్ష.. కేంద్రమంత్రులకు దిశానిర్దేశం
భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G-20 శిఖరాగ్ర సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ మేరకు ప్రధాని మోదీ పర్యవేక్షించనున్నారు.
ఏపీలో ఆదర్శ వివాహం.. కుమార్తెకు దగ్గరుండి పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో కులాంతర వివాహాం జరిగింది.
ఉపాధి కోసం ఫ్యాక్టరీ అడిగితే.. చంద్రయాన్-4 ద్వారా పైకి పంపిస్తామన్న సీఎం
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఓ మహిళను అవమానించారు. అంతటితో ఆగకుండా బహిరంగ సభలో ఆమెపై వ్యంగాస్త్రాలను విసిరారు.
ఎమ్మెల్యేలకు మమతా బెనర్జీ బంపర్ బొనాంజా.. ఒక్కొక్కరి జీతం దాదాపు రూ.40 వేలు పెంపు
పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేలకు నెలకు రూ.40 వేల చొప్పున జీతం పెంచుతున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్-సీపీఐ చర్చలు సఫలం.. సీపీఐ, సీపీఎంలకు ఎన్ని టిక్కెట్లో తెలుసా
తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రధానిపై సీఎం స్టాలిన్ ఫైర్.. తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అంటూ నిలదీత
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ 'సనాతన ధర్మం'పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపాయి.ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు.
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ మద్ధతు..వివక్ష ఉన్నంతవరకు అవి కొనసాగాల్సిందే
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
G-20 SUMMIT : దిల్లీలో మూడు కూటముల ప్రపంచ అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం
దిల్లీ వేదికగా అతిపెద్ద శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా G-20 పేరు మోగిపోతోంది.
సనాతన ధర్మంపై డిఎంకె మంత్రి రాజా వివాస్పద వ్యాఖ్యలు
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్నవేళ,డీఎంకే మంత్రి,ఎంపి ఎ రాజా గురువారం సనాతన ధర్మాన్ని పై వివాస్పద వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. అందుకే గుడిలోకి ప్రవేశించలేదంటూ మరో రగడ
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలోని ఓ హిందూ దేవాలయంలో తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.