దిల్లీ: వార్తలు
13 Mar 2023
గోవాషాకింగ్ న్యూస్: గోవాలో పర్యాటక కుటుంబంపై కత్తులతో దాడి; సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్
విహారయాత్రకు గోవాకు వచ్చిన దిల్లీకి చెందిన ఓ కుటుంబంపై కత్తులతో దాడి చేశారు. అంజునా ప్రాంతంలో బీచ్‌కు సమీపంలో ఉండే 'స్పాజియో లీజర్' అనే రిసార్ట్‌లో బస చేసిన వారిపై కొందరు దుండగులు పాశవికంగా దాడి చేశారు. కుటుంబ సభ్యుల్లో జతిన్ శర్మ ఈ సంఘటన గురించి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తెలియజేశాడు.
13 Mar 2023
పాకిస్థాన్ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి
దిల్లీ నుంచి దోహాకు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్‌కు చెందిన 6ఈ-1736 మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. అయితే విమానం విమానాశ్రాయానికి చేరుకునే లోపే నైజీరియన్‌కు చెందిన ప్రయాణికుడు మరణించినట్లు వైద్య బృందం ప్రకటించింది.
11 Mar 2023
మహిళనా చిన్నతనంలో మా నాన్న లైంగికంగా వేధించాడు: డీసీడబ్ల్యూ చీఫ్ సంచలన కామెంట్స్
దిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ శనివారం తన చిన్ననాటి కష్టాలను వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు.
11 Mar 2023
కల్వకుంట్ల కవితదిల్లీలో కవితను ప్రశ్నిస్తున్న ఈడీ; హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
దిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత శనివారం దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
11 Mar 2023
హోలీదిల్లీ: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు; ముగ్గురు అరెస్టు
దిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో జపాన్‌కు చెందిన యువతిని కొందరు వేధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనను దిల్లీ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.
11 Mar 2023
కల్వకుంట్ల కవితదిల్లీ లిక్కర్ కుంభకోణం: నేడు ఈడీ ఎదుట విచారణకు కవిత
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరుకానున్నారు.
10 Mar 2023
కల్వకుంట్ల కవితరేపు కవిత విచారణ; ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర పిళ్లై
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ విచారించాల్సి ఉండగా, శుక్రవారం అరుణ్‌రామచంద్ర పిళ్లై ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
10 Mar 2023
కల్వకుంట్ల కవితWomen's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత
ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత శుక్రవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
09 Mar 2023
హైకోర్టుదిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం
దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ), అరవింద్ టెక్నో గ్లోబ్ జేవీ మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను దిల్లీ హైకోర్టు మధ్యవర్తిగా నియమించింది.
09 Mar 2023
మనీష్ సిసోడియాతీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం తీహార్ జైలులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను రెండోసారి ప్రశ్నించింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అక్రమాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం ఇచ్చినం అంశాలపై ప్రధానంగా ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
09 Mar 2023
కల్వకుంట్ల కవితఏ తప్పూ చేయలేదు, ఈడీ విచారణను ఎదుర్కొంటా: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
ఎన్నికలు ఉన్న చోట మోదీ కంటే ముందే ఈడీ చేరిపోతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున తెలంగాణలో కూడా కేంద్ర ఏజెన్సీలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. గురువారం దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
07 Mar 2023
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీదిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్
దిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ విచారణలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. పాలసీని రూపొందించి అమలు చేస్తున్నప్పుడు ఇతర నిందితులతో జరిగిన సమావేశాల్లో పిళ్లై 'సౌత్ గ్రూప్'కు ప్రాతినిధ్యం వహించారని అధికారులు తెలిపారు.
07 Mar 2023
లాలూ ప్రసాద్ యాదవ్జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం
ఉద్యోగాల కుంభకోణం కేసులో సోమవారం రబ్రీ దేవిని విచారించిన సీబీఐ అధికారులు, మంగళవారం బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమార్తె మిసా భారతిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
07 Mar 2023
కోవిడ్హెచ్3ఎన్2 వైరస్ కూడా కరోనా తరహాలోనే వ్యాపిస్తుంది; ఎయిమ్స్ మాజీ చీఫ్ హెచ్చరిక
దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్-ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు.
06 Mar 2023
మనీష్ సిసోడియాదిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ
దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను వారం రోజుల రిమాండ్ ముగియడంతో సీబీఐ సోమవారం రోస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ క్రమంలో సిసోడియాను 14రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అంటే మార్చి 20 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.
04 Mar 2023
మనీష్ సిసోడియామనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను శనివారం దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఐదు రోజలు కస్టడీ ముగిసిన నేపథ్యంలో సిసోడియాకు బెయిల్ మంజూరు చేయాలని అతని తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు దాఖలు చేశారు.
03 Mar 2023
సోనియా గాంధీకాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని శుక్రవారం ఆసుపత్రి వర్గాలు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి.
01 Mar 2023
ప్రభుత్వందిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం
సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాత వారి స్థానంలో సౌరభ్ భరద్వాజ్, అతిషిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు వారి పేర్లను లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపారు.
01 Mar 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా; 2013 నాటి కేజ్రీవాల్ ట్వీట్‌ను వెలికితీసిన బేజేపీ
ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయడం, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వాటిని ఆమోదించిన నేపథ్యంలో దిల్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
28 Feb 2023
చైనాదిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు
మార్చి 2న దిల్లీలో జరిగే జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ హాజరుకానున్నారు. ఈ మేరకు చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
28 Feb 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్దిల్లీ మద్యం కుంభకోణం: అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా
లిక్కర్ పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
27 Feb 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్మనీష్ సిసోడియా అరెస్టును సీబీఐ అధికారులే వ్యతిరేకిస్తున్నారు: కేజ్రీవాల్
దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిసోడియా అరెస్ట్ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే జరిగిందని చెప్పారు.
27 Feb 2023
హైకోర్టుఅగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత
అగ్నిపథ్ పథకాన్ని దిల్లీ హైకోర్టు సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
27 Feb 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్దిల్లీ మద్యం కేసు: సిసోడియా అరెస్టుపై ఆప్ నిరసనలు; బీజేపీ హెడ్ క్వార్టర్ వద్ద హై టెన్షన్
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే సిసోడియా అరెస్టు అక్రమమంటూ దేశవ్యాప్తంగా నిరసనలకు ఆప్ సోమవారం పిలుపునిచ్చింది.
26 Feb 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్దిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఆప్ కీలక నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం రాత్రి అరెస్టు చేసింది. ఉదయం నుంచి తొమ్మిది గంటలకు పైగా మనీష్ సిసోడియాను సీబీఐ విచారించింది. అనంతరం అదుపులోకి తీసుకుంది.
26 Feb 2023
సీబీఐDelhi Excise Policy Scam: నేను జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను: మనీష్ సిసోడియా
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసు విచారణలో సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఆదివారం సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
23 Feb 2023
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీదిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ
దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌ను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది.
22 Feb 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్దిల్లీ కొత్త మేయర్‌గా ఆప్ నేత షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక
దిల్లీ మేయర్‌గా ఆప్‌కు చెందిన షెల్లీ ఒబెరాయ్ ఎన్నికలయ్యారు. ఒబెరాయ్‌కు 150ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116ఓట్లు వచ్చాయి. మేయర్ ఎన్నికల్లో గెలుపొందిన షెల్లీ ఒబెరాయ్‌ను దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అభినందించారు.
22 Feb 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి
ఫీడ్‌బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసులో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్రం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అనుమతిని ఇచ్చింది.
21 Feb 2023
భారతదేశంఓలా, ఉబర్, రాపిడో బైక్ టాక్సీలపై నిషేధం విధించిన దిల్లీ ప్రభుత్వం
ఓలా, ఊబర్, రాపిడో బైక్ టాక్సీ సేవలపై దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బైక్ ట్యాక్సీల నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
21 Feb 2023
ఎన్ఐఏగ్యాంగ్స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు
గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్ అణచివేతపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఫోకస్ పెట్టింది. మంగళవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 72చోట్ల దాడులు నిర్వహిస్తోంది.
20 Feb 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్దిల్లీ మద్యం కేసు: 'ఈ నెల 26న విచారణకు రండి'; మనీష్ సిసోడియాను మళ్లీ సీబీఐ సమన్లు
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో విచారణ నిమిత్తం ఫిబ్రవరి 26న మళ్లీ తమ ముందు హాజరు కావాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోరింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది.
20 Feb 2023
అసదుద్దీన్ ఒవైసీదిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి
దిల్లీలోని తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు దాడి చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఈ దాడిలో ఇంటి కిటికీ ధ్వంసమైనట్లు చెప్పారు.
19 Feb 2023
ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్రెండో టెస్టు: ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది.
18 Feb 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ
దిల్లీ మద్యం కేసులో డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆదివారం తమ ప్రధాన కార్యాలయానికి రావాలని సీబీఐ సమన్లు జారీ చేసినట్లు సిసోడియా శనివారం ట్వీట్ చేశారు.
18 Feb 2023
భారతదేశందిల్లీ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్: 2020లో సాహిల్, నిక్కీకి పెళ్లి; మ్యారేజ్ సర్టిఫికెట్ లభ్యం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిక్కీ యాదవ్ హత్య కేసులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలైన నిక్కీకి, నిందితుడు సాహిల్‌కు 2020లో పెళ్లి జరిగింది. వివాహానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోయిడాలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.
16 Feb 2023
బీబీసీబీబీసీ ఆఫీసుల్లో 45గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు- మూడు రోజులుగా ఇంటికెళ్లని ఉద్యోగులు
దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఆదాయపు పన్ను శాఖ సోదాలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. దాదాపు 45 గంటలకు పైగా ఏకధాటిగా అధికారులు సర్వే చేస్తున్నారు.
15 Feb 2023
భారతదేశంహత్యకు ముందు 'నిక్కీ యాదవ్' సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు- నెట్టింట్లో వైరల్
దిల్లీలో ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి, అదే రోజు ఆ యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో నిందితుడిని సాహిల్ గెహ్లాట్‌గా, మృతురాలిని నిక్కీ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు.
15 Feb 2023
బీబీసీబీబీసీ కార్యాలయాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు
ముంబయి, దిల్లీలో బీబీసీకి చెందిన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు బుధవారం కూడా కొనసాగాయి.
15 Feb 2023
భారతదేశంప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ప్రిజ్‌లో పెట్టి; అదేరోజు మరో అమ్మాయితో పెళ్లి
ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేసి, అదే రోజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన దిల్లీలో మిత్రోన్ గ్రామంలో జరిగింది. ఈ హత్యకు సంబంధించి దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.