దిల్లీ: వార్తలు
14 Feb 2023
బీబీసీBBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు
ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
11 Feb 2023
బీజేపీ'దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది' జమియత్ చీఫ్ సంచలన కామెంట్స్
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ముస్లింలు వ్యతిరేకం కాదని, అయితే వారి మధ్య సైద్ధాంతిక విభేదాలు కొనసాగుతున్నాయని జమియత్ ఉలామా-ఇ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదానీ శనివారం అన్నారు. ప్రస్తుత హిందూత్వ రూపం భారతదేశ స్ఫూర్తికి విరుద్ధమని మదానీ పేర్కొన్నారు.
11 Feb 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్
దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వైరం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి ఆప్ నియమించిన ఇద్దరు ప్రభుత్వ నామినీలను ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌ల) బోర్డుల నుంచి గవర్నర్ తొలగించారు.
11 Feb 2023
నరేంద్ర మోదీఐదు రాష్ట్రాలను కలిపే దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే; రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిని కలుపుతూ, ఐదు రాష్ట్రాల గుండా వెళ్లే ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను కేంద్రం చేపడుతోంది. 1,386 కిలోమీటర్లు దూరంతో దాదాపు రూ.4లక్షల వ్యయంతో నిర్మిస్తున్న దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే మొదటి ఫేజ్‌ను ఆదివారం ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు.
11 Feb 2023
ఆంధ్రప్రదేశ్దిల్లీ లిక్కర్ కేసు: వైసీపీ ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి అరెస్ట్
దిల్లీ మద్యం కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచడంతో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.
08 Feb 2023
జమ్ముకశ్మీర్అఫ్ఘానిస్థాన్, పాలస్తీనా కంటే అధ్వానంగా కశ్మీర్: ముఫ్తీ
జమ్ముకశ్మీర్‌లో ఇళ్లను కూల్చడాన్ని నిరసిస్తూ పీడీపీ అగ్రనేత మెహబూబా ముఫ్తీ దిల్లీలో ఆందోళన చేప్టటారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ, లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనపై ఆమె విరుచుపడ్డారు. పేదలు, అట్టడుగువర్గాల ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు జమ్ముకశ్మీర్‌ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
08 Feb 2023
కల్వకుంట్ల కవితదిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ
దిల్లీ మద్యం కేసులో శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ మల్హోత్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది.
08 Feb 2023
కల్వకుంట్ల కవితదిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ
దిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది.
07 Feb 2023
భారతదేశంశ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనాలు: ఎముకలను కాల్చి, గ్రైండ్ చేసిన ఆఫ్తాబ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించిన మరికొన్ని సంచలన విషయాలు బయటికి వచ్చాయి. దిల్లీ పోలీసులు దాఖలు చేసిన 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌లో ఆ విషయాలు ఉన్నాయి.
04 Feb 2023
భారతదేశంఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట్లో కాల్చుకుని సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అసిస్టెంట్ సబ్ దిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
04 Feb 2023
ఉత్తర్ప్రదేశ్ఉత్తర్ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు
హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూ ప్రకంపం సంభవించింది. స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
02 Feb 2023
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీదిల్లీ లిక్కర్ స్కామ్: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ గురువారం దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉండటం గమనార్హం. రెండో చార్జ్‌షీట్‌లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కవిత, వైసీపీ ఎంపీ మాగుంట బాబుతో పాటు మొత్తం 12మంది పేర్లను ఈడీ ఇందులో చేర్చింది.
28 Jan 2023
నరేంద్ర మోదీబీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు
ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని దిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేయగా, ఆ సమయంలో గందరగోళం నెలకొంది.
28 Jan 2023
రోడ్డు ప్రమాదందిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి
దిల్లీలోని సుల్తాన్‌పురిలో జరిగిన అంజలి తరహా ఘటన దేశ రాజదానిలో మరొకటి చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత వారిని 350 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.
27 Jan 2023
నరేంద్ర మోదీనేడు దిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన
ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించినా దేశంలో ప్రదర్శనలు ఆగడం లేదు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో పలు విద్యార్థి సంఘాలు ప్రతిష్టాత్మంగా తీసుకొని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా దిల్లీ యూనివర్సిటీలో ఎన్ఎస్‌యూఐ, భీమ్ ఆర్మీ, వామపక్షతో పాటు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నార్త్ క్యాంపస్‌లో ప్రదర్శించనున్నట్లు పిలుపునిచ్చారు.
26 Jan 2023
నరేంద్ర మోదీగణతంత్ర వేడుకలు: ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ తలపాగా- దేశంలో వైవిధ్యానికి ప్రతీక
74వ గణతంత్ర వేడుకల వేళ ప్రధాని మోదీ తలపాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి స్వాతంత్య్ర, రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఆయన వస్త్రాధారణ హైలెట్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా మోదీ ధరించే తలపాగా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.
26 Jan 2023
గణతంత్ర దినోత్సవం74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్యపథ్‌లో అంబరాన్నంటిన సంబరాలు
దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళితో గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ హాజరయ్యారు.
25 Jan 2023
గణతంత్ర దినోత్సవంప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను ప్రకటించిన కేంద్రం, ఏపీకి విశిష్ట సేవా పురస్కారాలు
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకాలను ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రపతి పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 15 మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను గెలుచుకుంది.
25 Jan 2023
భారతదేశంశ్రద్ధా హత్య: పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి 6,629 పేజీల ఛార్జ్‌షీట్ ను దిల్లీ పోలీసులు సాకేత్ కోర్టులో దాఖలు చేశారు. శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్ పూనావాలా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, పూర్వాపరాలను ఛార్జ్‌షీట్‌లో పోలీసులు వెల్లడించారు.
25 Jan 2023
నరేంద్ర మోదీజేఎన్యూలో హై టెన్షన్: మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని చూస్తున్న విద్యార్థులపై రాళ్లదాడి
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో మంగళవారం రాత్రి హై డ్రామా జరిగింది. వామపక్ష విద్యార్థులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో బీబీసీ డాక్యుమెంటరీని చూసేందుకు గుమికూడగా వారిపై రాళ్లదాడి జరిగింది. దీంతో జేఎన్‌యూలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
24 Jan 2023
ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియాకు డీజీసీఏ మరో షాక్, ఈ సారి రూ.10లక్షల ఫైన్
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు డీజీసీఏ మరోసారి షాక్ ఇచ్చింది. న్యూయార్క్-దిల్లీ వెళ్లే విమానంలో మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనలో ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ, తాజాగా అలాంటి సంఘటనలో రూ. 10లక్షల ఫైన్ విధించింది. వారం లోపలే ఎయిర్ ఇండియాకు ఈ రెండు ఫైన్లు విధించడం గమనార్హం.
24 Jan 2023
భూమిదిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు
దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
24 Jan 2023
విమానంస్పైస్జెట్: దిల్లీ-హైదరాబాద్ విమానంలో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన, అరెస్టు చేసిన పోలీసులు
విమానాల్లో కొందరు ప్రయాణికులు సిబ్బంది పట్ల , తోటి ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాల సంఘటనలు మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
20 Jan 2023
భారతదేశంఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు: డబ్య్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ స్పందించారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో తాను ఫెడరేషన్ పదవి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదన్నారు. తనకు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల ఈ పదవి దక్కలేదన్నారు. ప్రజలు ఎన్నుకోవడం వల్ల తాను ఇక్కడ కూర్చున్నట్లు స్పష్టం చేశారు.
20 Jan 2023
గవర్నర్దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య మాటల యుద్ధం రోజుకు రోజుకు పెరుగుతోంది. ఇటీవల గవర్నర్‌పై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్జీని కలిసేందుకు తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. ఈ ప్రశ్నలపై సమాధానంగా శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. కేజ్రీవాల్‌కు లేఖ రాశారు.
20 Jan 2023
ఎయిర్ ఇండియావిమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
న్యూయార్క్-దిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం చర్యలు తీసుకుంది.
20 Jan 2023
గణతంత్ర దినోత్సవంరిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం
దిల్లీలో ఖలిస్థానీ పోస్టర్లు కలకలం సృష్టించాయి. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్న నేపథ్యంలో దిల్లీలో పలు ప్రాంతాల్లో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి, జనక్‌పురి, పశ్చిమ్ విహార్, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి.
19 Jan 2023
భారతదేశందిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌కు వేధింపులు, కారు అద్దంలో చేయి ఇరుక్కున్నా ఈడ్చుకెళ్లిన డ్రైవర్
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్‌ను ఓ డ్రైవర్ వేధించాడు. ఆమె చేయి కారు అద్దంలో ఇరుక్కోగా, అమెను అలాగే కొంతదూరం లాక్కెళ్లాడు. రాత్రి 3గంటల సమయంలో ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది.
17 Jan 2023
భారతదేశంరాయల్ కుటుంబం పేరుతో లగ్జరీ హోటల్‌లో బస, రూ.23లక్షల బిల్లు ఎగ్గొట్టి పరార్
దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో యూఏఈ రాజకుటుంబ సభ్యుడిగా నటిస్తూ మూడు నెలలకు పైగా అక్కడే ఉండి.. ఏకంగా రూ.23 లక్షలు బిల్లు చెల్లించకుండా పరారయ్యాడు ఓ యువకుడు. అతడిని మహమ్మద్ షరీఫ్ వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. ఆచూకీకోసం వెతుకున్నారు.
13 Jan 2023
హోంశాఖ మంత్రిదిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ
దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనపై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11మంది పోలీసులను సస్పెండ్ చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది.
12 Jan 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు
దిల్లీలో అధికార పార్టీ అయిన 'ఆప్'కు డీఐపీ విభాగం షాకిచ్చింది. ప్రకటన కోసం వినియోగించిన రూ.163కోట్లు చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు జారీ చేసింది.
12 Jan 2023
ఎయిర్ ఇండియావిమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు
ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నిరాకరించింది. దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఒక నాన్ బెయిలబుల్ నేరం కూడా ఉందని కేసును విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్ గార్గ్ వెల్లడించారు.
10 Jan 2023
ఎయిర్ ఇండియాప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్
విమానాల్లో ప్రయాణికులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలు ఇటీవల తరుచూ జరుగుతున్నాయి. న్యూయార్క్- దిల్లీ, దిల్లీ-పాట్నా ఘటనలు మరవకముందే.. మరోసారి ఇలాంటి వార్తే ఆలస్యంగా బయటకు వచ్చింది.
09 Jan 2023
అరవింద్ కేజ్రీవాల్‌దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో సంబంధించి కోర్టులో హాజరవుతున్న న్యాయవాదులకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.25.25 కోట్లు చెల్లించినట్లు అధికార వర్గాలు తెలిపారు.
09 Jan 2023
బిహార్ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు
విమానాల్లో అసభ్యకర సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎయిర్ ఇండియాలో తోటి మహిళా ప్రయాణికులపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన మరువకముందే.. ఇండిగో ఫ్లైట్‌లో మరో ఘటన జరిగింది.
09 Jan 2023
రోడ్డు ప్రమాదందిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా..
దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనలో విచారణ జరుగుతున్నా కొద్ది.. షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో అరెస్టయిన నిందితులు అసలు విషయాన్ని బయటపెట్టారు. కారు కింద ఆ యువతి ఇరుక్కుపోయిందని తమకు తెలుసునని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
06 Jan 2023
రోడ్డు ప్రమాదంఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని
దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనలో పోలీసులు మరో పురోగతిని సాధించారు. అంజలిని 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు యజమాని అశుతోష్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అంజలి స్కూటర్‌ను ఢీకొట్టినప్పుడు కారులో ఉన్న నలుగురితో పాటు మరో వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
05 Jan 2023
ఉత్తర్ప్రదేశ్దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు
దిల్లీలోని సుల్తాన్‌పురి ఘటన మరవక ముందే... నోయిడాలో అలాంటి ప్రమాదమే వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ రోజు రాత్రి నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్ కౌశల్ యాదవ్ బైక్‌ను కారు ఢీకొట్టడంతో పాటు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో కౌశల్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
05 Jan 2023
కాంగ్రెస్అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను.. దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ అరూప్ బసు బృందం సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేరే సమయంలో సోనియాగాంధీ వెంట ఆమె కుమార్తె ప్రియాంక వాద్రా ఉన్నారు.
04 Jan 2023
టాటాతాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది?
ఓ వ్యక్తి పీకల దాకా తాగి.. ఆ మత్తులో తొటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇది జరిగింది.. బస్సులో కాదు, ట్రైన్‌లో కాదు. అమెరికా నుంచి దిల్లీకి వస్తున్న ఢిల్లీ ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని బుధవారం ఎయిర్ ఇండియా అధికారులు ధృవీకరించారు.