దిల్లీ: వార్తలు

26 Apr 2023

కోవిడ్

దిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు; పాజిటివ్ రేటు 22.74శాతం

దేశ రాజధాని దిల్లీలో కరోనా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు కొన్ని రోజులుగా తగ్గుతుంటే, దిల్లీలో మాత్రం భారీగా నమోదవుతున్నాయి.

భవన నిర్మాణ కార్మికులకు కేజ్రీవాల్ గుడ్‌న్యూస్: ఉచిత బస్ పాస్‌లు; 75 శాతం రాయితో ఇళ్లు 

దిల్లీలోని భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరును సమీక్షించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు.

దిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పులు; మహిళకు గాయాలు 

దిల్లీలోని సాకేత్ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో సస్పెండ్ అయిన న్యాయవాది శుక్రవారం కాల్పులు జరపడంతో ఒక మహిళ గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

 2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ 

2024-25 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 10,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్‌సీ) మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌హెచ్‌ఏఐ కృషి చేస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు

ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో భారత్ నుంచి ముంబై, దిల్లీ, హైదరాబాద్‌కు చోటు దక్కింది.

దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు

దేశంలో గత 24 గంటల్లో 11,109 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ సానుకూలత రేటు 5.01 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.ఏడు నెలల్లో ఇదే అత్యధికమని కేంద్రం పేర్కొంది.

ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత

ధూళి ఎక్కువగా ఉన్నందున దిల్లీలోని గాలి నాణ్యత మంగళవారం దారుణంగా పడిపోయిందని, మరింత క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ నుంచి వీచే పశ్చిమ గాలులు నగరానికి దుమ్మును చేరవేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

07 Apr 2023

బీజేపీ

ఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం దిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

'దేశానికి విద్యావంతులైన ప్రధాని కావాలి'; మోదీని ఉద్దేశించి సిసోడియా లేఖ

జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రధాని మోదీని ఉద్దేశించి దేశ ప్రజలకు ఒక లేఖ రాశారు. అందులో ప్రధాని మోదీ విద్యార్హతలపై ప్రశ్నలు లేవనెత్తారు. లేఖలో ప్రధాని మోదీపై సిసోడియా విరుచుకపడ్డారు. భారతదేశం పురోగమించాలంటే చదువుకున్న ప్రధానమంత్రి కావాలన్నారు.

దిల్లీ మెట్రోలో బ్రాలెట్, మినీ స్కర్ట్‌లో మహిళ హల్‌చల్; అశ్లీల ప్రదర్శనపై చట్టం ఏం చెబుతోంది?

ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా అశ్లీల ప్రదర్శన, డ్యాన్స్‌లు, వీడియోలు తీయడాన్ని దిల్లీ మెట్రో ఇప్పటికే నిషేధించింది. అయినా ఆ ఆదేశాలను పూర్తిస్థాయిలో పాటించడం లేదు.

దిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దీపక్ బాక్సర్ మెక్సికోలో అరెస్ట్

దిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో ఒకరైన దీపక్ బాక్సర్‌ మెక్సికోలో అరెస్టు చేసినట్లు సీనియర్ స్పెషల్ సెల్ అధికారులు మంగళవారం తెలిపారు.

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తున్న మద్యం పాలసీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని దిల్లీ కోర్టు సోమవారం రెండు వారాల పాటు పొడిగించింది.

దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉత్తర భారత పర్యటనలో ఉన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం పవన్ పర్యటించారు. పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు.

1000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొట్టిన పక్షి; దిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ విధింపు

దుబాయ్‌కి వెళ్లే ఫెడెక్స్ విమానాన్ని ఓ పక్షి బలంగా ఢీకొట్టడంతో శనివారం మధ్యాహ్నం ఆ ఫ్లైట్‌ను దిల్లీ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు విమానాశ్రయంలో పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీని ప్రకటించారు.

మద్యం పాలసీ కేసు: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన దిల్లీ కోర్టు

లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియా బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.

మస్కిటో కాయిల్‌ నుంచి విషవాయువు; ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

దోమల నివారణకు ఉపయోగించే మస్కిటో కాయిల్ ఆరుగురి ప్రాణాలను తీసింది. దిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో గురువారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మస్కిటో కాయిల్ కారణంగా విడుదలైన విష వాయువును పీల్చడంతో ఊపిరాడక మరణించారు.

దిల్లీని వణికిస్తున్న భారీ వర్షాలు, పలు ప్రాంతాలు జలమయం; ట్రాఫిక్‌కు అంతరాయం

దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిల్లీలోని పలు ప్రాంతాలు శుక్రవారం ఉదయం జలమయమైనట్లు ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (ఆర్‌డబ్ల్యూఎఫ్‌సీ) సూచించింది.

30 Mar 2023

కోవిడ్

దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి; 3వేలు దాటిన కొత్త కేసులు; దిల్లీ ప్రభుత్వం అప్రమత్తం

దేశ రాజధానితో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24గంటల్లో దేశంలో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 40 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య

భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ భార్య వసుధ రోహత్గీ దిల్లీలోనే ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. బంగ్లా ఖరీదు అక్షరాల రూ.160 కోట్లు అని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

28 Mar 2023

పంజాబ్

దిల్లీ రోడ్లపై కనిపించిన అమృత్ పాల్ సింగ్; తలపాగా లేకుండా కళ్లద్దాలు, డెనిమ్ జాకెట్‌తో దర్శనం

పంజాబ్ నుంచి పారిపోయి వారం రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ దిల్లీలోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడు.

'ఫోన్లను ఓపెన్ చేసేందుకు సిద్ధం'; కవితకు లేఖ రాసిన ఈడీ జాయింట్ డైరెక్టర్

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మంగళవారం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.

దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా

దిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది.

దిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కుమార్తె కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరగనుంది.

రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు

రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హుత వేటు వేడయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా 'సత్యాగ్రహ' దీక్షలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

22 Mar 2023

భూకంపం

అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా?

అఫ్ఘానిస్థాన్‌లో మంగళవారం రాత్రి 6.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోని దిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లోని జైపూర్, జమ్ముకశ్మీర్‌లో ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం వస్తే దాని ప్రకంపనలు ఉత్తర భారతంలో ఎందుకొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు

దిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. దీంతో అలర్ట్ అయిన దిల్లీ పోలీసులు వాటిని తొలగించే పనిలో పడ్డారు.

22 Mar 2023

భూకంపం

పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు

పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి పాకిస్థాన్‌లో 11మంది మృతి చెందినట్లు ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.

దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మంగళవారం అధికారులు విచారిస్తున్నారు. మూడో దఫా విచారణలో భాగంగా కవిత ఇప్పటి వరకు తాను ఉపయోగించిన అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించారు.

దిల్లీ మద్యం కేసు: నేడు మరోసారి ఈడీ ముందుకు కవిత; అరెస్టుపై ఊహాగానాలు

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం మూడోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు. ఈ క్రమంలో అమె అరెస్టుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.

భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం!

లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఖలిస్థానీ మద్దతుదారులు కిందకు లాగిన ఘటన సంచలనంగా మారింది.

20 Mar 2023

జపాన్

దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు

జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిదా రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో కిషిదాకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు.

హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు

దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వైరస్ సోకి 9మంది మృతి చెందినట్లు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.

దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5 రోజులు పొడిగించిన కోర్టు

మద్యం పాలసీ కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5రోజులు పొడిగిస్తున్నట్లు రూస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది.

దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు

దిల్లీ మద్యం పాలసీ కేసు విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. ఈ కేసులో పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ఈ కేసులో విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు పంపింది.

కవితకు మళ్లీ నోటీసులు పంపిన ఈడీ; ఈనెల 20న విచారణ

దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు పంపింది. ఈ నెల 20న తేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.

జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు

దిల్లీ ప్రభుత్వ ఫీడ్‌బ్యాక్ యూనిట్ (ఎఫ్‌బీయూ) కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరో కేసు నమోదు చేసింది.

చివరి నిమిషంలో కవిత ట్విస్ట్; విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ

దిల్లీ మద్యం పాలసీ కేసులో మరికొద్ది సేపట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరు హాజరు కావాల్సిన భారత రాష్ట్ర సమితి నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు.

'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం

'పాత ఎక్సైజ్ పాలసీ'ని దిల్లీ ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ లోగా కొత్త ఎక్సైజ్ పాలసీని సిద్ధం చేయాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.

మహిళా రిజర్వేషన్ బిల్లు: రేపు కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి బుధవారం దిల్లీలోని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది.

దిల్లీ మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు చిత్రీకరించడం నిషేధం: డీఎంఆర్‌సీ

మెట్రోలలో రీల్స్, డ్యాన్స్ వీడియోల చిత్రీకరణపై దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్( డీఎంఆర్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు చిత్రీకరించడాన్ని నిషేధిస్తున్నట్లు డీఎంఆర్‌సీ పేర్కొంది. ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.