కోవిడ్: వార్తలు

ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు

ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు ఏ దేశంలో కూడా ఈ కొత్త వేరియంట్‌ కేసులు నమోదు కాలేదు.

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు; 6రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. గురువారం ఒక్కరోజే 754కేసులు నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు లేఖలు రాసింది.

హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 వైరస్‌లతో భయాలు వద్దు: ఐసీఎంఆర్

హెచ్3ఎన్2, టైప్ బీ ఇన్‌ప్లూయెంజా, అడెనో, కరోనా లాంటి గాలి ద్వారా సంక్రమించే వైరస్‌లు ఆందోళనకరమైనవి కావని నేషనల్ ఇన్‌ప్లూయెంజా సెంటర్ (ఎన్ఐసీ) పేర్కొంది.

దేశంలో హెచ్2ఎన్3 వైరస్ కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; రాష్ట్రాలకు లేఖ

దేశంలో హెచ్2ఎన్3, హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరుపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.

11 Mar 2023

అమెరికా

కరోనా మూలాల గుట్టు విప్పే కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం; బైడెన్ వద్దకు ఫైల్

పదిలక్షల కంటే ఎక్కువ మంది అమెరికన్లను పొట్టనపెట్టున్న కరోనా వైరస్ మూలాలను తెలుసుకునే కీలక బిల్లును అమెరికా కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

10 Mar 2023

కర్ణాటక

హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా రూపంలో మరో వైరస్ వణికిస్తోంది. దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

07 Mar 2023

దిల్లీ

హెచ్3ఎన్2 వైరస్ కూడా కరోనా తరహాలోనే వ్యాపిస్తుంది; ఎయిమ్స్ మాజీ చీఫ్ హెచ్చరిక

దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్-ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు.

04 Mar 2023

రష్యా

Andrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య

రష్యన్ కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వీ'ని రూపొందించడంలో విశేషంగా కృషి చేసిన రష్యా శాస్త్రవేత్త ఆండ్రీ బోటికోవ్ మాస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు. అతడిని బెల్ట్‌తో గొంతుకోసి హత్య చేసినట్లు రష్యా మీడియా కథనాలు శనివారం తెలిపాయి.

కరోనా గురించి ఎవరెవరికి ఏం తెలుసో తెలియజేయండి; ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు

చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్టీ డిపార్ట్‌మెంట్ ఆరోపించిన నేపథ్యంలో బీజింగ్ దాన్ని తిరస్కరించింది. శుక్రవారం ఈ వ్యవహారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది.

945రోజుల తర్వాత మాస్క్ ఆంక్షలకు ముగింపు పలికిన హాంకాంగ్‌

ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా ఆంక్షల నుంచి బంధ విముక్తులవుతున్నాయి. సుదీర్ఘ కరోనా కాలానికి ఇక ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో తమ దేశంలో సుదీర్ఘ కాలంగా అమలు చేస్తున్న మాస్క్ ఆంక్షలను తొలగిస్తున్నట్లు హాంకాంగ్‌ ప్రకటించింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

The Wall Street Journal: చైనా ల్యాబ్‌ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి చైనాలో జరిగిందని మరో పరిశోధన తేల్చి చెప్పింది. చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు రిపోర్డును 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించింది.

మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది'

కరోనా సమయంలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన్ని కేంద్ర ఆరోగ్య‌మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా కరోనా టీకా కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల కోవిడ్ సమయంలో దేశంలో 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడగలిగినట్లు ఆయన చెప్పారు.

23 Feb 2023

హర్యానా

గురుగ్రామ్: కరోనాకు భయపడి మూడేళ్లుగా బయటికి రాకుండా ఇంట్లోనే తల్లీకొడుకులు

కరోనాకు భయపడి ఓ మహిళ మూడేళ్లుగా బయటకు రావడం లేదు. తన పదేళ్ల కొడుకుతో కలిసి ఇంటికి తాళం వేసి లోపల ఉంటుంది. కనీసం తన భర్తను కూడా లోపలికి రానివ్వకపోవడం గమనార్హం. హర్యానా గురుగ్రామ్‌లో వెలుగుచూసిన ఈ ఘటన పోలీసు అధికారులు, స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.

09 Feb 2023

చైనా

చైనాలో మరో కరోనా వేవ్, కొత్త వేరియంట్ల పుట్టుకపై శాస్త్రవేత్తలు ఏం అన్నారంటే?

చైనాలో ఇటీవల కొత్త వేరియంట్ల కారణంగా కరోనా కేసులు ఏ స్థాయిలో పెరిగాయో అందరకీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఏమైనా కొత్త వేరియంట్లు పుట్టకొచ్చాయా? అనే అంశంపై ఒక పరిశోధన జరిగింది. 'ది లాన్సెట్‌'లో ఆ పరిశోధన ప్రచురితమైంది.

భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా

భారతీయులకు వీసాలను ఎక్కువ సంఖ్యలో, వేగంగా జారీ చేసేందుకు అమెరికా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం దౌత్య కార్యాలయాల్లో నియామకాలను రెట్టింపు చేయాలని భావిస్తోంది. అది కూడా భార్య భర్తలను నియమించాలని అమెరికా కృషి చేస్తోందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు.

ఓమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.5: అమెరికాను భయపెడుతున్న కరోనా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు

కరోనా కథ కంచికి వెళ్ళిందనుకునే లోపే కళ్ళముందు కనిపించి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా దాదాపు 38దేశాల్లో కొత్త రూపమైన XBB.1.5 విలయ తాండవం చేస్తోంది.

షాకింగ్ న్యూస్: దేశంలో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు గుర్తింపు

చైనాలో ఒమిక్రాన్ బీఎఫ్-7 సబ్ వేరియంట్ విజృంభణ నేపథ్యంలో దేశంలో కూడా దీనిపైనే చర్చ జరిగింది. అయితే తాజాగా తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే.. దేశంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఉన్నాయని తేలింది. ఈ విషయంగా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను కనుగొన్నిది అంతర్జాతీయ ప్రయాణికుల్లోనే కావడం గమనార్హం.

పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్

పశ్చిమ బెంగాల్‌లో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు బెంగాల్ ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పింది.

04 Jan 2023

చైనా

ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా

చైనాలో కరోనా విరవిహారం చేస్తోంది. దీంతో ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించిన జాబితాలో ఉన్నాయి.

జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం

అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పని సరి చేసింది. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

29 Dec 2022

చైనా

కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు

చైనాలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఒమిక్రాన్ బీఎఫ్.7తో ఉక్కిరిబిక్కరి అవుతున్న బీజింగ్‌లో ఇప్పుడు.. ఔషధార కొరత ఏర్పడింది. మహమ్మారి నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చైనీయులు భారతీయ ఔషధాలను ఆశ్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో అవి లభ్యం కాకపోవడంతో.. బ్లాక్ మార్కెట్ కొని మరీ.. వినియోగిస్తున్నారు.

కరోనా అలర్ట్.. రాబోయే 40 రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!

జనవరి మధ్యలో దేశంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవి అని, జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత అనుభవాలను విశ్లేషించిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంటున్నాయి.

హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం

ఫార్మా దిగ్గజం హెటిరో మరో మైలు రాయిని అధిగమించింది. ఆ సంస్థ తయారు చేసిన కరోనా ఔషధం 'నిర్మాకామ్' ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) ప్రీక్వాలిఫికేషన్ గుర్తింపు లభించింది. కరోనా రోగులకు అందించే.. ఫైజర్‌కు చెందిన పాక్స్‌లోవిడ్‌ ఔషధానికి 'నిర్మాకామ్' అనేది జెనరిక్‌ ఔషధం.

27 Dec 2022

టీకా

ముక్కు ద్వారా తీసుకునే టీకా ధరను ఖరారు చేసిన భారత్ బయోటెక్.. డోసు రేటు ఎంతంటే?

దేశీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తాను అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్‌ ధరను నిర్ణయించింది. సింగిల్ డోసు ధర రూ. 800గా నిర్ణయించినట్లు వెల్లడించింది. దీనికి పన్నులు అదనం అని తెలిపింది.

27 Dec 2022

కర్ణాటక

కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స

చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ BF.7 వేరియంట్ దేశంలో వెలుగు చూడడంతోపాటు అంతర్జాతీయ ప్రయాణికుల్లో బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్

దేశంంలో కరోనా కేసులు పెరుగుదల పెద్దగా లేకపోయినా..కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండో వేవ్‌లో తలెత్తిన పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేలా దేశవ్యాప్తంగా చర్యలకు ఉపక్రమించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను కేంద్రం సంసిద్ధం చేస్తోంది. ఇందుకోసం మంగళవారం అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆరోగ్యమంత్రి మాండవీయా ఆదేశించారు.

26 Dec 2022

బిహార్

కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు

అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం బిహార్ విమానాశ్రయంలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయ్యింది.

26 Dec 2022

ప్రపంచం

కరోనా రోగులతో కిటకిటలాడుతున్న చైనా ఆస్పత్రులు.. ఆ ఒక్క ప్రావిన్స్‌లోనే రోజుకు 10లక్షల కేసులు

చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒమిక్రాన్ BF.7 వేరియంట్ విజృంభణతో చైనాలో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి . ముఖ్యంగా పట్టణాల్లో అయితే... కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఒక్కో ప్రావిన్స్‌లో లక్షల కొద్ది కేసులు నమోదవుతున్నాయి. షాంఘై సమీపంలోని పెద్ద పారిశ్రామిక ప్రావిన్స్ అయిన ఒక్క జెజియాంగ్‌లోనే రోజుకు 10లక్షలు నమోదవుతుండటం గమనార్హం.

కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం

దేశానికి కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్ బీఎఫ్ 7' ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం.. తాజాగా మరికొన్ని సూచనలు చేసింది.

2023లో కూడా ఇంటి నుండి పనిచేసే సౌకర్యం కొనసాగుతుందా?

వచ్చే ఏడాది US జాబ్ మార్కెట్ బలహీనంగా కొనసాగితే, కంపెనీలు రిమోట్‌గా పని చేయడానికి ఉద్యోగులను అనుమతించకుండా వెనక్కి తీసుకోవచ్చు. ఉద్యోగులు సాధారణంగా ఇంటి నుండి పని చేయడంపై రెండు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహమ్మారి సమయంలో ఇంటి నుండి పనిచేస్తూ ఎంతో సమయాన్ని ఆదా చేయడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కొందరు చెప్తే, మరికొందరు కంపెనీ సంస్కృతి కార్యాలయంలో సరైన విధంగా ఉంటుందని చెప్పారు.

81కోట్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అదేంటంటే?

పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి కరోనా ముంచుకొస్తున్న నేపథ్యంలో.. ఇంకో ఏడాది పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద.. 81కోట్ల మందికి రేషన్‌ఉచితంగా అందించాలని ప్రధాని మోదీ అధ్యక్షత కేంద్ర కేబినెట్‌నిర్ణయం తీసుకుంది.

కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు

చైనాతో పాటు అనేక దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈమేరకు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికుల్లో కనీసం 2శాతం మందికి కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. శనివారం నుంచే ఈ పరీక్షలు చేయనున్నారు.

భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే ?

భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్‌కు అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు. బూస్టర్ డోస్‌గా నాసల్ వ్యాక్సిన్‌కు వేసుకోవచ్చని సూచించారు.

'బూస్టర్‌ డోస్‌ త్వరగా తీసుకోండి'.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిక

దేశంలోని ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొంది. రాబోయే రోజుల్లో కోవిడ్ వ్యాప్తిని అధిగమించడానికి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్‌లతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వంటివి చేయాలని సూచించింది. పాజిటివ్ కేసులను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలని అన్ని రాష్ట్రాలను కోరినట్లు చెప్పింది.

'పండగల వేళ జాగ్రత్తలు అవసరం'.. పార్లమెంట్‌లో రాష్ట్రాలకు మంత్రి కీలక సూచనలు

దేశంలోని కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఉభయ సభల్లో కీలక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని, తదనుగుణంగా చర్యలు తీసుకుటుందని చెప్పారు. రానున్నవి పండగ రోజులని, ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను అమలు చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు.

ఈ చైనా సింగర్ చాలా క్రేజీ.. న్యూఇయర్ కోసం కరోనా అంటించుకుందట..

కరోనా కేసులతో చైనా అల్లాడిపోతంది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అక్కడి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఓ చైనీస్ సింగర్ మాత్రం కరోనా పట్ల వింతగా ప్రవర్తించింది. అందరూ కరోనాకు దూరంగా ఉంటుంటే.. చైనాకు చెందిన ప్రముఖ గాయని, పాటల రచయిత జేన్ జాంగ్ మాత్రం కరోనాను కావాలనే అంటించుకుంది.

భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే..

చైనాలో కరోనా విజృంభించడానికి కారణమైన BF.7 వేరియంట్‌.. భారత్‌ను సైతం వణికిస్తోంది. దేశంలో నాలుగు కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. అయితే నిపుణులు మాత్రం భారత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. భారత్‌లో నమోదైన నాలుగు కేసులు కూడా.. తాజాగా వచ్చినవి కావని, జూలై, సెప్టెంబర్, నవంబర్‌లో కనుగొనబడినట్లు చెబుతున్నారు.

'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ

'భారత్ జోడో యాత్ర'లో కోవిడ్ ప్రోటోకాల్‌ పాటించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా రాసిన లేఖపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. దేశంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్రం తాజా కోవిడ్ మార్గదర్శాలను జారీ చేసింది.

కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. నిఘాను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మాండవీయ స్పష్టం చేశారు.

మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

చైనాతో పలు దేశాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోజూవారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల నమూలనాలను క్రమం తప్పకుండా ట్రాక్ చేయాలని సూచించింది. దేశంలో ప్రస్తుతం వారానికి 1,200 కేసులు నమోదవుతున్నాయి.

మునుపటి
తరువాత