బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

భారీ నష్టాల్లోకి జారుకుని చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రోజంతా నష్టాల బాట పట్టిన షేర్ మార్కెట్, ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి.

09 Aug 2023

అమెరికా

విలాసవంతమైన ఫ్లాట్ ను అమ్ముకున్న ముకేశ్‌ అంబానీ.. ధర ఎంతో తెలుసా

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీకి భారతదేశంలోనే కాదు విదేశాల్లోనూ లగ్జరీ హోమ్స్ ఉన్నాయి.

సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌‌ను ప్రారంభించనున్న భారత్ 

పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, వ్యవస్థాపకుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం ఈ ఏడాది బ్రిక్స్(BRICS) స్టార్టప్ ఫోరమ్‌ను ప్రారంభించనుంది.

08 Aug 2023

ముంబై

Ambareesh Murthi: పెప్పర్ ఫ్రై సీఈఓ అంబరీష్ మూర్తి హఠాన్మరణం

పెప్పర్ ఫ్రై సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అంబరీష్ మూర్తి మృతి చెందారు. సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ మరో సహ వ్యవస్థాపకుడు ఆశిష్ షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

07 Aug 2023

పేటియం

paytm stock: 11శాతం పెరిగిన పేటిఎం స్టాక్.. కారణం ఇదే 

చాలా రోజుల తర్వాత పేటీఎం బ్రాండ్‌తో సేవలను అందిస్తున్న ఫిన్‌టెక్ కంపెనీ One97 కమ్యూనికేషన్స్ షేర్ విలువ సోమవారం భారీగా పెరిగింది.

జుకర్ బర్గ్ తో ఫైటింగ్ చేస్తానంటున్న ఎలాన్ మస్క్: కౌంటర్ వేసిన థ్రెడ్స్ అధినేత 

ఎక్స్ (గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్, థ్రెడ్స్ సృష్టించిన జుకర్ బర్గ్ మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది.

ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్‌ : డెలివరీ బాయ్‌ అవాతారం ఎత్తిన జొమాటో సీఈఓ 

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్నేహితుల దినోత్సవం సందర్భంగా డెలివరీ బాయ్‌ అవతారమెత్తారు. ఈ మేరకు రెడ్‌ టీ షర్ట్‌ ధరించారు. అనంతరం తన రాయల్‌ ఎన్ఫీల్డ్‌ వాహనంపై ఫుడ్‌ డెలివరీలు అందించేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో అతని చేతిలో ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్ ఉండటం విశేషం.

వినియోగదారులకు ఉల్లి షాక్.. ఆగస్ట్ చివరి నాటికి కిలో ఉల్లి రూ.70పైనే!

భారతదేశంలో ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు క్రిసిల్ మార్కెట్ అంచనా వేసింది. ఆగస్ట్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కిలో రూ. 70కి చేరే అవకాశం ఉందని క్రిసిల్ మార్కెట్ తాజా నివేదికలో ప్రకటించింది.

Stock Market : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ లో నష్టాలకు బ్రేక్ పడింది. సూచీల వారాంతంలో భారీ లాభాలను నమోదు చేశాయి.

04 Aug 2023

టెస్లా

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో టెస్లా ఉన్నతాధికారుల కీలక చర్చలు

ప్రముఖ లగ్జరీ ఈవీ కార్ల తయారీ సంస్ఠ టెస్లా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కీలక చర్చలు జరిపారు.

ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు.. కారణమిదే!

ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది.

'ఓవర్ వెయిట్‌' లో మార్గాన్ స్టాన్లీ రేటింగ్ పెంపు.. భారత్ వృద్ధి అవకాశాలు మెరుగు

ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల రేటింగ్ లో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ 'మోర్గాన్ స్టాన్లీ' సంచలన మార్పులను చేసింది. భారత రేటింగ్ మెరుగుపర్చి ఓవర్ వెయిట్ గా పేర్కొనడం విశేషం.

మళ్లీ నిరాశపరిచిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ సూచీ 676 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి.

01 Aug 2023

విమానం

'బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌' కలిగిన మొదటి ఆసియా ఎయిర్‌లైన్‌గా 'ఆకాశ ఎయిర్' రికార్డు

ఆసియాలో తమ విమాన సర్వీసుల్లో బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టిన మొదటి ఎయిర్‌లైన్‌గా భారతీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ అవతరించింది.

స్టాక్ మార్కెట్లో ఆవిరైన లాభాలు.. నష్టాలతో ముగిసిన నిఫ్టీ, సెన్సెక్స్ 

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవరాం నష్టాలతో ముగిశాయి. ఉదయం సెషన్ లో ట్రేడింగ్ ప్రారంభం సమయం నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. రియాల్టీ, పీఎస్యూ సూచీలు ఒత్తిడికి గురికావడంతోనే షేర్లు పతనమయ్యాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ వాటాను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్ 

భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్‌కు చెందిన 1.4 బిలియన్ డాలర్ల వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. అంటే మొత్తం రూ.11.5వేల కోట్లకు తన తన వాటను వాల్‌మార్ట్‌కు టైగర్ గ్లోబల్‌ విక్రయించింది.

31 Jul 2023

బ్యాంక్

ఎస్‌బీఐ చైర్మన్ జీతం తెలిస్తే షాక్.. వెల్లడించిన మాజీ సారథి రజనీష్ కుమార్

భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి అలాంటి బ్యాంక్ సారథి అంటే అందరి కళ్లు అతని జీతం మీదే ఉంటుంది. అయితే తనకు లభించిన వేతనం ఎంతో ఇటీవలే బహిర్గతం చేశారు మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్.

Elon Musk : ట్విట్‌లతో 'X.COM'లో డబ్బులు సంపాదించడానికి నిబంధనలు ఇవే

ట్విట్టర్ (x.com) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు గుడ్ న్యూస్ ను అందించాడు. ట్విట్ లతో డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించాడు. దీని కోసం మస్క్ యాడ్ రెవెన్యూ షేరింగ్ ఫీచర్ ను డెవలప్ చేశారు.

28 Jul 2023

ఇండిగో

ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగోకు భారీ జరిమానా.. రూ.30 లక్షలు చెల్లించాలని డీజీసీఏ ఆదేశం 

ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగోకు డీజీసీఏ (DGCA) భారీ జరిమానా విధించింది. ఈ మేరకు సంస్థలో వ్యవస్థీకృత లోపాలను గుర్తించినట్లు సివిల్‌ ఏవియేషన్‌ ప్రకటించింది.

26 Jul 2023

బ్యాంక్

భారీ లాభాలను ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంక్‌.. గతేడాదితో పోల్చితే 40 శాతం వృద్ధి

ప్రైవేట్ రంగంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి క్వార్టర్ లో భారీ లాభాలను ప్రకటించింది.

26 Jul 2023

బైజూస్‌

బైజూస్‌ సంక్షోభంపై కన్నీరుమున్నీరైన సీఈఓ రవీంద్రన్‌

ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్-టెక్ స్టార్టప్ 'బైజూస్' ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోంది.

రూ.2 వేల నోట్ల మార్పిడిపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన

రూ.2వేల నోట్ల మార్పిడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు విధించిన గడువును మరింత పొడింగించే ప్రతిపాదన తమ వద్ద లేదని ప్రకటించింది.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 299.48, నిఫ్టీ 72.65 పాయింట్ల క్షీణత 

భారత స్టాక్ మార్కెట్‌లు సోమవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 299.48 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 72.65 పాయింట్లు క్షీణించింది.

24 Jul 2023

ఈపీఎఫ్ఓ

ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) ఖాతాల్లో ఉండే సొమ్ముపై వడ్డీ రేటు ఖారారైంది. ఆర్థిక సంవత్సరం(2022-23)కి సంబంధించి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును కేంద్రం 8.15 శాతంగా నిర్ణయించింది.

ట్విట్టర్ లోగో నుంచి పక్షి బొమ్మ ఔట్; కొత్త డిజైన్‌పై మస్క్ ఫోకస్

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆదివారం సంచలన ప్రకటన చేసారు. తర్వలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ బర్డ్ లోగోను తొలగిస్తుందని ప్రకటించారు.

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ రికార్డ్: సెకనుకు ఐదు స్మార్ట్ ఫోన్లు అమ్మిన అమెజాన్ 

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఏడాది జులై 15, 16తేదీల్లో జరిగిన అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో విపరీతంగా అమ్మకాలు జరిపింది.

22 Jul 2023

ఐఫోన్

Apple Iphone: 2023లో 8-9 మిలియన్ ఐఫోన్‌లను అమ్మడమే యాపిల్ టార్గెట్

ప్రముఖ ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్ 2023లో రికార్డు స్థాయిలో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

21 Jul 2023

విమానం

గోఫస్ట్‌ ఎయిర్ లైన్స్ సేవలకు డీజీసీఏ గ్రీన్‌ సిగ్నల్‌

గోఫస్ట్ విమానయాన సంస్థ తన సర్వీసులను పునఃప్రారంభించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. కానీ ఇందుకు సంబంధించి పలు షరుతులు విధించింది.

భారీ నష్టాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు.. దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల వరుస లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.ఈ దశలో సెన్సెక్స్‌ 888 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్ల మేర నష్టాలను చవిచూశాయి.

దారుణంగా పతనమైన ఇన్ఫోసిస్ స్టాక్.. ఇంట్రాడేలో 10శాతం డౌన్‌

మార్కెట్ వాటా పరంగా దేశంలో ఇన్ఫోసిస్ రెండవ అతిపెద్ద టెక్ సంస్థగా ఉంది. శుక్రవారం ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇంట్రాడేలో ఏకంగా పదిశాతం వరకూ క్రాష్ కావడం గమనార్హం.

21 Jul 2023

అమెరికా

అమెరికాలో త్వరలోనే ఆర్థిక మాంద్యం.. భారత్ సహా ప్రపంచంపైనా ప్రభావం

అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికమాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఈ మేరకు త్వరలోనే మాంద్యం ప్రారంభం కానున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. యూఎస్ఏలోని వ్యాపార సంస్థల సూచికలు గత నెలలో బలహీనంగా మారాయి.

లాభాల్లో ఇన్ఫోసిస్ టాప్.. ఏకంగా 11శాతం వృద్ధి

దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసిక ఫలితాలను రిలీజ్ చేసింది.

Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్

భారతీయ వినియోగదారులకు ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్ భారీ షాకిచ్చింది. పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకొనే అవకాశాన్ని ఇండియాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

లాభాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు.. విభజన తర్వాత ట్రేడింగ్‌లో దూకుడు

విభజన తర్వాత కూడా రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేరు తగ్గడం లేదు. ఆర్ఐఎల్ తన వ్యాపార ఆర్థిక సేవల విభాగమైన రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విభజించిన విషయం తెలిసిందే.

ట్విట్టర్‌లో 'ఆర్టికల్స్' ఫీచర్; ట్వీట్‌లో ఇకపై అక్షరాల లిమిట్ ఉండదు

వినియోగదారులను ఆకర్షించేందుకు ట్విట్టర్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది.

IPO: ఐపీఓ లిస్టింగ్‌లో భారత్ టాప్; ఈ ఏడాది 80లాంచ్‌లతో అదరగొట్టిన బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ 

ఐపీఓల లిస్టింగ్‌లలో భారత్‌కు చెందిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్ఈ) సత్తా చాటాయి.

రూ.6వేల కోట్ల జీతాలను వాపస్ చేయనున్న టెస్లా డైరెక్టర్లు

ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలో టెస్లా కంపెనీ ఎన్నో సంచనాలను సృష్టించింది. ప్రస్తుతం టెస్లా కంపెనీలో డైరక్టర్లు పొందుతున్న జీతాలు, అలవెన్సులపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

18 Jul 2023

చైనా

Evergrande: రెండేళ్లలో ఏకంగా రూ.6లక్షల కోట్ల నష్టం; తీవ్ర సంక్షోభంలో చైనా కంపెనీ 'ఎవర్‌గ్రాండే' 

చైనాకు చెందిన ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ సంస్థ 'ఎవర్‌గ్రాండే' పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది.

హిండెన్‌బర్గ్‌ నివేదిక పూర్తిగా అవాస్తవం : గౌతమ్ అదానీ

మోసపూరిత లావాదేవీలు, స్టార్ ధరల తారుమారు వంటి అవకతవలకు ఆదానీ గ్రూప్ పాల్పడిందంటూ గతంలో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చింది.

17 Jul 2023

ఆర్ బి ఐ

RBI Pension: 4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్ 

రిటైర్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఉద్యోగుల పెన్షన్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.