భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

వచ్చే ఎన్నికలు బండి సంజయ్ నేతృత్వంలోనే.. మరోసారి తేల్చిచెప్పిన తరుణ్ చుగ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీలో సంచలన పరిణామాలు జరగనున్నాయనే ప్రచారాన్ని బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ ఖండించారు.

దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం

ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్య ఔషధాలు ప్రాణాలనే తీయడం వెనుక విస్తుబోయే విషయాలు తేటతెల్లమయ్యాయి. లాభాల కోసం మారియన్ బయోటెక్ అనే ఫార్మా కంపెనీ దారుణాలకు ఒడిగట్టింది.

హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు.. తండ్రి కూతురు అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌ ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఐఎస్ కేపీ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న ఓ తండ్రి, కుమార్తెను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఫిర్యాదు; ఎఫ్ఐఆర్ నమోదు 

రాహుల్ గాంధీని 'ఎగతాళి' చేశారంటూ బీజేపీ నేత, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులు బెంగళూరులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. జులై 8న కాజీపేటలో రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన

తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించేందుకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు జులై 12న మోదీ రాష్ట్రానికి రానున్నారని రాష్ట్ర బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

28 Jun 2023

కర్ణాటక

గోసంరక్షణ పేరుతో ఉద్రిక్తతలు సృష్టించే వారిని తరిమేయండి: కాంగ్రెస్

గతంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభుత్వ హయాంలో ఆమోదించిన గోహత్య నిరోధక చట్టాన్ని తాము ఉపసంహరించుకుంటామని కొన్ని వారాల క్రితం కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి కె వెంకటేష్ ప్రకటించారు.

కునో నేషనల్ పార్కులో 4 చీతాల కుమ్ములాట.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అగ్ని 

మనుషులే కాదు వన్య ప్రాణులూ అప్పుడప్పుడు కోట్లాటకు దిగుతుంటాయి. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని జూ పార్కులో చోటు చేసుకుంది.

ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం లా బోర్డు అత్యవసర సమావేశం

ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) పట్ల భోపాల్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంచలన వ్యాఖ్యలకు ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది.ఈ మేరకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

28 Jun 2023

కేరళ

ఆపరేషన్ థియేటర్లలోకి 'హిజాబ్'‌కు ప్రత్యామ్నాయ దుస్తులను అనుమతించాలి: వైద్య విద్యార్థినులు 

కేరళ తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు మహిళా విద్యార్థులు ఆపరేషన్ థియేటర్ లోపల లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, సర్జికల్ హుడ్స్ ధరించడానికి అనుమతించాలని ప్రిన్సిపాల్‌ను ఆశ్రయించారు.

28 Jun 2023

రాజ్యసభ

10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు

గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న జరగనున్న ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.

QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 'ఐఐటీ బాంబే'- టాప్-150లో చోటు 

2023-24 ఏడాదికి సంబంధించిన QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఈ ఏడాది ఐఐటీ బాంబే 149ర్యాంక్ సాధించింది. తద్వారా తొలిసారిగా ఐఐటీ బాంబే టాప్ 150లో చేరింది.

సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల

తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మిస్తున్న కేంద్రం.. దిల్లీ-చెన్నైల మధ్య 300 కిమీ దూరం తగ్గింపు

దేశ రాజధాని దిల్లీ నుంచి దక్షిణాదిలోని కీలక మెట్రో సిటీ చెన్నైల మధ్య రోడ్డు మార్గం 300 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ఈ మేరకు దిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేకి అనుసంధానంగా సూరత్‌ నుంచి చెన్నై వరకు కేంద్రం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మిస్తోంది.

వారాహి యాత్రకు తాత్కాలికంగా బ్రేక్.. జ్వరం కారణంగా పవన్ కల్యాణ్ కు విశ్రాంతి 

ఆంధ్రప్రదేశ్ లో వారాహి యాత్రతో పొలిటికల్ హీట్ పెంచుతున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు.

27 Jun 2023

తెలంగాణ

ఓఆర్‌ఆర్‌పై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్.. దూసుకెళ్లనున్న వాహనాలు 

వేగవంతమైన ప్రయాణానికి హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు దిక్సూచిగా నిలుస్తోంది. ఈ మేరకు వాహనదారులు మరింత వేగంతో వెళ్లేందుకు తెలంగాణ పురపాలక శాఖ నిర్ణయించింది.

ఆదిపురుష్‌ యూనిట్ పై అలహాబాద్‌ హైకోర్టు ఫైర్.. ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తారా అని నిలదీత

ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్ వివాదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే సినిమాలో చూపించిన పాత్రలు, సన్నివేశాలు రామాయణంలోని పాత్రలను కించపరిచేలా ఉన్నాయని పిటిషన్ దాఖలైంది.

కేజ్రీవాల్ ఇళ్లు పునరుద్ధరణ ఖర్చుపై కాగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆడిట్

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం పునరుద్ధరణలో ఆర్థిక, పరిపాలనాపరమైన అవకతవకలపై భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రత్యేక ఆడిట్ నిర్వహించనుంది.

రిటైర్మెంట్ వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు

బామ్మగా మనవళ్లు, మనవరాళ్లను ఆడించే వయసులో ఓ వృద్ధురాలు తల్లి అయ్యింది.

27 Jun 2023

దిల్లీ

దిల్లీలో విద్యుదాఘాతానికి మరొకరు బలి

దిల్లీలోని రైల్వే స్టేషన్ సమీపంలో 34ఏళ్ల సాక్షి అహుజా విద్యుదాఘాతంతో మరణించిన ఘటన మరువక ముందే, మరో బాలుడు కరెంట్ షాక్ గురై చనిపోయాడు.

కేసీఆర్‌ కుటుంబంపై మోదీ చురకలు..కూతురు,కొడుకు, అల్లుడు బాగుండాలంటే బీఆర్ఎస్ కే ఓటేయండని ఎద్దేవా

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన పొలిటికల్ కామెంట్స్ దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి.

27 Jun 2023

ధర

టమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే 

దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలనంటాయి. మార్కెట్‌లో కిలో రూ.10-20 పలికే టమాట అమాంత రూ. 100 పలుకుతోంది. దీంతో వినియోగదారులపై తీవ్రమైన భారం పడుతోంది.

ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర.. ఈటల సతీమణి జమున సంచలన ఆరోపణలు

భారతీయ జనతా పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హత్యకు కుట్ర చేస్తున్నారని ఈటల జమున సంచలన ఆరోపణలు చేశారు.

అనుకూలించని వాతావరణం; మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.

ఒకే దేశంలో రెండు చట్టాలా? ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ చేపట్టిన 'మేరా బూత్ సబ్సే మజ్‌బూత్' ప్రచారంలో కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.

27 Jun 2023

దిల్లీ

రిటైర్మెంట్ రోజు హైకోర్టు న్యాయమూర్తి రికార్డు.. 65 తీర్పులిచ్చిన జస్టిస్ ముక్తా గుప్తా

దిల్లీ హైకోర్టులో ఓ మహిళా న్యాయమూర్తి రికార్డు సృష్టించారు. సుదీర్ఘకాలం పాటు దిల్లీ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించి, సోమవారం కెరీర్ లోనే చివరి వర్కింగ్ డే సందర్భాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో కేసులను విచారించారు.

జమ్ముకశ్మీర్ చరిత్రను తెలిపేందుకు ఐసీహెచ్ఆర్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌

వేల సంవత్సరాల జమ్ముకశ్మీర్ చరిత్రను ప్రదర్శించే ఒక ఎగ్జిబిషన్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) ఏర్పాటు చేస్తోందని హిందూస్థాన్ టైమ్స్ నివేదించింది.

కమిషనర్ కుక్క కోసం ఇంటింటిని జల్లెడపడుతున్న పోలీసులు 

ఆ సిటీ మున్సిపల్ కార్పోరేషన్ కే ఆమె బాస్. సహజంగా జంతు ప్రేమికురాలు అయిన ఆవిడ ప్రేమతో ఓ కుక్కను కుటుంబ సభ్యురాలిగా పెంచుకుంటున్నారు.

27 Jun 2023

మణిపూర్

మయన్మార్ నుంచి సేకరించిన ఆయుధాలతోనే మణిపూర్‌లో హింస: ఇంటెలిజెన్స్ వర్గాలు 

మణిపూర్‌లో హింసను, అశాంతిని ప్రేరేపించేందుకు ఉపయోగించిన ఆయుధాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక ప్రకటన చేశాయి.

మధ్యప్రదేశ్ పర్యటనలో నరేంద్ర మోదీ.. ఒకేసారి 5 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు పచ్చ జెండా 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌ పర్యటనలో భాగంగా కొత్తగా ఐదు వందే భారత్‌ రైళ్లకు జెండా ఊపారు. దీంతో తొలిసారిగా ఏకకాలంలో ఒకటికంటే ఎక్కువ సంఖ్యలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ లను ప్రారంభించినట్టైంది.

27 Jun 2023

అమరావతి

అమరావతి ఆర్‌5 జోన్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ఆర్‌ 5 జోన్‌ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 47 వేలకుపైగా ఇళ్ల పట్టాదారులకు గృహాలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.

27 Jun 2023

ఎన్ఐఏ

దావూద్‌ మాదిరిగానే ఎదిగిన బిష్ణోయ్‌ గ్యాంగ్: ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు 

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్‌ రూపొందించి కేంద్ర హోంశాఖకు సమర్పించింది. చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ సంచలన విషయాలను వెల్లడించింది.

నా కొడుకు మోదీకే ఓటేస్తా.. 25 ఎకరాల పొలాన్ని కూడా ఇచ్చేస్తానన్న వందేళ్ల బామ్మ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ బామ్మ తన 25 ఎకరాల ఆస్తిని రాసిచ్చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు మోదీ తన 15వ కుమారుడితో సమానమన్నారు.

27 Jun 2023

బ్యాంక్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ కుంభకోణం.. మేనేజర్లు సహా 10 మంది నిందితుల అరెస్ట్ 

హైదరాబాద్‌ నడిబొడ్డున మరో భారీ బ్యాంక్ కుంభకోణం బయటపడింది. ప్రైవేట్ ఉద్యోగుల పేరిట అకౌంట్లు తెరిచి వాటి ద్వారా రూ.20 కోట్ల మేర పర్సనల్ లోన్లు తీసుకుని బ్యాంక్ ను మోసం చేసిన ఘటన మహానగరంలో చోటు చేసుకుంది.

27 Jun 2023

మణిపూర్

మణిపూర్‌లో మహిళలు మా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు: సైన్యం

మణిపూర్‌లోని మహిళలు ఉద్దేశపూర్వకంగా తమ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని, తమ ఆపరేషన్లలో జోక్యం చేసుకుంటున్నారని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.

ఎయిర్‌ఇండియా విమానంలో మరో వివాదం..ఫ్లైట్ గాల్లో ఉండగానే ప్రయాణికుడి మూత్ర విసర్జన

ఎయిర్‌ ఇండియా విమానంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దేశీయ వాయు మార్గంలో ముంబై నుంచి దిల్లీ వెళ్తున్న విమానం, గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు విచక్షణ కోల్పోయి సీట్లోనే మూత్ర విసర్జన కలకలం సృష్టించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో రౌడీ షీటర్ గుఫ్రాన్ కాల్చివేత 

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గుఫ్రాన్ హతమయ్యాడు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్)తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుఫ్రాన్ హతమైనట్లు పోలీసులు తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున రైలు, రోడ్డు మార్గం.. బ్రహ్మపుత్ర కింద సొరంగం ఏర్పాటు 

భారత దేశంలోనే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ కారిడార్‌ను కేంద్రం నిర్మించబోతోంది. ఇందుకోసం ఈశాన్య భారత్ లోని అస్సాంను వేదికగా చేసుకోనుంది.

కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లోకి.. పొంగులేటి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా 35 మంది బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.

మాతో మాట్లాడితే ఇక్కడితో వదిలేస్తాం, లేకుంటే స‌ల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం : గ్యాంగ్‌స్ట‌ర్ గోల్డీ బ్రార్

ప్రముఖ బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని కెన‌డియ‌న్‌ గ్యాంగ్‌స్ట‌ర్ గోల్డీ బ్రార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీలు త‌గ్గింపు

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలోని సుదూర ప్రాంతాల ప్ర‌యాణికులకు ఆర్థిక భారాన్ని త‌గ్గించేందుకు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ రేట్లను యాజమాన్యం తగ్గించింది.