భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

26 Jun 2023

దిల్లీ

సినీ ఫక్కిలో భారీ చోరీ.. దిల్లీలో గన్నులతో బెదిరించి డబ్బులతో జంప్

ద్విచక్ర వాహనాలపై వచ్చి కారును అడ్డగించిన దోపిడీ దొంగలు, గన్నులతో బెదిరించి డబ్బుల సంచిని దోచుకెళ్లారు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో చోటు చేసుకుంది.

ఆమె ఎంతోమంది షర్మిలలను సృష్టించాలి.. అందుకే కారును గిఫ్ట్‌గా ఇస్తున్నానన్న కమల్‌ హాసన్

తమిళనాడులోని కొయంబత్తూర్‌ లో తొలి మహిళా బస్సు డ్రైవర్‌ షర్మిల అంశం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ ఘటన పట్ల తాను చాలా బాధపడ్డానని చెప్పారు.

పొంగులేటి, జూపల్లి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దమైంది.

తెలంగాణలో కొత్తగా మరో 3 డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా.. మొత్తం 14కు చేరిన స్వయంప్రతిపత్తి కాలేజీలు

తెలంగాణలో కొత్తగా మరో 3 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అటానమస్‌ హోదా దక్కించుకున్నాయి. ఆయా కాలేజీలు న్యాక్‌ - ఏ గ్రేడ్‌ను సాధించుకోవడంతో యూజీసీ స్వయంప్రతిపత్తి హోదాను కల్పించింది.

26 Jun 2023

మణిపూర్

మణిపూర్‌లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది: సీఎం బీరేన్ సింగ్ 

ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో పరిస్థితిపై అమిత్ షాకు బీరెన్ సింగ్ వివరించారు.

26 Jun 2023

ముంబై

రెండు రోజుల పాటు ముంబైలో కుంభవృష్టి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

ముంబై సహా మహారాష్ట్ర తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురవనున్నాయి. రాగల 2 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్జ్ ను సైతం జారీ చేసింది.

పాట్నలో సమావేశమైన ప్రతిపక్ష కూటమిని 'వాగ్నర్ గ్రూప్' గా పోల్చిన ఉద్ధవ్ ఠాక్రే

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్షాల కూటమిని రష్యా కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌తో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది.

నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు 

నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతటా విస్తరిస్తుండటంతో పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.

హిమాచల్ ప్రదేశ్‌: కొండచరియలు విరిగిపడటంతో 11కిలోమీటర్లు నిలిచిపోయిన ట్రాఫిక్; వందల మంది రోడ్లపైనే 

హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో జనజీవనం స్తంభించిపోయింది.

26 Jun 2023

కర్ణాటక

ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిరీక్షిస్తున్న ప్రయాణికులు.. మరో ప్లాట్‌ఫామ్‌పై నుంచి జారుకున్న రైలు

ఓ రైల్వే స్టేషన్ సిబ్బంది అనౌన్స్ మెంట్ ఇవ్వకపోవడంతో వందలాది ప్రయాణికులు ట్రైన్ మిసయ్యారు.

26 Jun 2023

మేఘాలయ

మేఘాలయ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అవుట్‌పోస్ట్‌పై దాడి: ఐదుగురి గాయాలు

మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో సరిహద్దు ఔట్‌పోస్ట్‌పై ఆదివారం రాత్రి గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందితో సహా మొత్తం ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

దేశంలోనే పొడవైన స్కైవాక్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్

దేశంలోనే అత్యంత పొడవైన ఉప్పల్ స్కైవాక్ ను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ట్రాఫిక్ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు నాలుగేళ్ల క్రితం దీని నిర్మాణం మొదలుపెట్టారు.

భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్‌ పైకప్పు లీక్ కావడంపై నెటిజన్లు ఫైర్

ప్యాసింజర్ రైలు కోచ్ పైకప్పు నుంచి నీరు కారుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

డ్యూటీ అవర్స్ ముగిశాయని ఫ్లైట్ నడపనన్న పైలట్.. విమానంలోనే 350 మంది ప్రయాణికులు

ఎయిర్ ఇండియా విమానం మరో వివాదాస్పద ఘటనకు తావిచ్చింది. ప్రయాణికులతో నిండి ఉన్న విమానంలోకి ఎక్కేందుకు పైలెట్ నిరాకరించారు.

26 Jun 2023

ఆర్ బి ఐ

ఆర్థిక వ్యవస్థపై రూ.2,000నోట్ల ఉపసంహరణ ప్రభావం ఉండదు: ఆర్‌బీఐ గవర్నర్

రూ.2000 నోటును ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

26 Jun 2023

తెలంగాణ

తెలంగాణలో రూ.3500 కోట్లతో మెగా పెట్టుబడులు.. త్వరలోనే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం : లులూ సంస్థ

ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎగుమతుల రంగాల్లో మెగా పెట్టుబడికి తెలంగాణ వేదిక కానుంది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో పెద్ద కంపెనీ ముందుకొచ్చింది.

26 Jun 2023

కర్ణాటక

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్నేహితుడి గొంతు కోసి, రక్తం తాగాడు

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తన స్నేహితుడి గొంతు కోసి, రక్తాన్ని తాగేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

గుండెపోటుతో రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే కన్నుమూత

భారత దేశ రాజకీయాల్లో మరో విషాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భాజపా సీనియ‌ర్ నేత‌, రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే కన్నుమూశారు.

26 Jun 2023

తెలంగాణ

అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల,పోడు రైతులకూ వర్తింపు

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ ప్రక్రియను చేపట్టింది.

500 వాహనాల భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..దారిపొడవునా ఫ్లెక్సీల హోరు

మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ చేపట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగానే నేటి నుంచి 2 రోజుల పాటు మరాఠీ గడ్డపై పర్యటించనున్నారు.

26 Jun 2023

ఒడిశా

ఒడిశాలో పెండ్లి బస్సు- ఆర్టీసీ బస్సు ఢీ; 12మంది దుర్మరణం 

ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒడిశా స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(ఓఎస్‌ఆర్‌టీసీ) బస్సు- పెళ్లి బృందంతో వస్తున్న ప్రైవేట్ బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.

ఇక కోర్టులోనే పోరాటం; ఆందోళన విరమించిన రెజ్లర్లు 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఈ వ్యవహారాన్ని ఇక కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆందోళలను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

25 Jun 2023

బీజేపీ

బీజేపీ మీటింగ్‌లో కాల్పుల కలకలం; కార్యకర్తకు గాయాలు 

బిహార్‌లోని మాధేపురా జిల్లా మురళిగంజ్‌లో జరిగిన బీజేపీ మీటింగ్‌లో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో బీజేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి.

15గంటల్లో 286 మెట్రో స్టేషన్లలో ప్రయాణం; దిల్లీ వ్యక్తి గిన్నిస్ రికార్డు

కేవలం 15గంటల్లోనే దిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణించి ఓ వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.

పశ్చిమ బెంగాల్: బంకురాలో రెండు గూడ్స్ రైళ్లు ఢీ

పశ్చిమ బెంగాల్‌ బంకురాలోని ఓండా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.

పురుషుడికి గర్భం: ఆపరేషన్ చేసి ఆశ్చర్యపోయిన వైద్యులు 

పురుషుడు గర్భం దాల్చడం ఏంటి? విడ్డూరంగా ఉంది కదా! మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన సంఘటన నిజంగా విడ్డూరమే.

24 Jun 2023

జనసేన

పవన్‌ కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్: గాజు గ్లాసు గుర్తు తిరిగి జనసేనకు కేటాయింపు

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి గుడ్‌న్యూస్ అందింది.

నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ

తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని ఐఎండీ- హైదరాబాద్ అంచనా వేసింది.

పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో నమ్మలేని నిజాలు.. బాలికను గర్భవతిని చేసిన స్వామిజీ

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో గత సోమవారం లైంగిక వేధింపుల కేసులో పూర్ణానంద సరస్వతి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

పవన్ కల్యాణ్ నిజంగానే చాలా గొప్పవాడివి.. కానీ ఈ ఒక్క పనిచేస్తేనే: పోసాని

సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మరోసారి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యాడు. పవన్ తీరుతో కాపుల్లో చిచ్చు రేగుతోందన్న పోసాని, కాపులను తిడుతూ చంద్రబాబును పొగడటం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు.

గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కాబోయే ఇంజినీర్లు ఘర్షణ పడ్డారు. ఇంజినీరింగ్ విద్యకు ప్రసిద్ధి గాంచిన వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) యూనివర్సిటీలో ఒకరినొకరు దూషించుకుంటూ విద్యార్థులు గొడవ పడ్డారు.

గ్యుడ్‌న్యూస్: ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 4-5 తగ్గనున్నాయ్

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు సంబంధించి వినియోగదారులకు త్వరలో ఓ శుభవార్త అందే అవకాశం ఉంది.

మరోసారి ఈటల,రాజగోపాల్‌ రెడ్డిలకు దిల్లీకి రమ్మని కబురు.. అధినాయకత్వంతో కీలక చర్చలు

మరోసారి తెలంగాణ రాష్ట్రంపై బారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దృష్టి సారించింది. రాష్ట్ర పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆ పార్టీ అగ్రనేతలు అమిత్‌ షా, పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆరా తీశారు.

23 Jun 2023

తెలంగాణ

తెలంగాణ ఉద్యోగులకు సర్కారు వారి భారీ కనుక.. ఇళ్లు కట్టుకుంటే రూ.30 లక్షల అడ్వాన్స్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

యూపీఏ ప్రభుత్వం 12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడింది: అమిత్ షా

కాంగ్రెస్ పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం విరుచుకుపడ్డారు. యూపీఏ హయాంలో భారీఎత్తున కుంభకోణాలు జరిగినట్లు చెప్పారు.

23 Jun 2023

విమానం

ఫోన్లో హైజాక్ అని అరిచిన వ్యక్తి అరెస్ట్.. లేట్ గా బయల్దేరిన విమానం

ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఫ్లైట్ హైజాక్ అంటూ మాట్లాడిన మాటలతో ఏకంగా టేక్ అయ్యే విమానం ఆగిపోయింది. ఈ మేరకు సదరు విమానం 4 గంటలు ఆలస్యంగా బయల్దేరింది.

23 Jun 2023

ముంబై

బీఎంసీ కోవిడ్ స్కామ్ దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేసిన ముంబై పోలీసులు

కోవిడ్ సమయంలో బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో జరిగిన రూ. 12,500 కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి ముంబై పోలీసులు శుక్రవారం నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. వైట్‌హౌస్‌ డిన్నర్ సూపర్ అంటూ ట్వీట్

ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ గౌర‌వార్ధం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వైట్‌హౌస్‌లో గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. విందులో పారిశ్రామిక దిగ్గ‌జం, మ‌హీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మ‌హీంద్ర కూడా పాల్గొన్నారు.

ఇన్నేళ్లు పని చేయించుకున్నారు.. ఇప్పుడెలా తొలగిస్తారంటూ కేజీబీవీ టీచర్ల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్​ టైం పీజీటీలు, పీఆర్​టీల తొలగింపుపై దుమారం రేగుతోంది.

'Bharat Jodo' vs 'Bharat Todo': కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం: రాహుల్ గాంధీ 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శుక్రవారం బిహార్‌‌ పాట్నలోని రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యాలయం సడకత్‌ ఆశ్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.