భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం 

జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం గోవాలో ప్రారంభమైంది.

19 Jun 2023

తుపాను

గుజరాత్‌,రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌లను ముంచెత్తిన భారీ వర్షాలు.. 3 రాష్ట్రాలకు పొంచిఉన్న వరద ముప్పు

గుజరాత్ ను ముప్పతిప్పలు పెట్టిన అతి తీవ్ర తుపాను బిపోర్‌జాయ్‌, క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం తీరం దాటింది.

వర్షాల జడలేక, ప్రాజక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు 

జూన్ మూడో వారం గడుస్తున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల జడలేదు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో జలాశయాల్లోని నీరు క్రమంగా అడుగంటిపోతున్న పరిస్థితి నెలకొంది.

చెన్నైలో వరుణ బీభత్సంతో విమానాల దారి మళ్లింపు.. బడులకు సెలవు ప్రకటించిన సర్కార్

తమిళనాట భారీ వర్షాలు ఆ రాష్ట్ర రాజధాని చెన్నెని వరదలతో ముంచెత్తుతున్నాయి. గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిన నగర వాసులకు భారీ వర్షాలు, చల్లటి గాలులతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు.

19 Jun 2023

సిక్కిం

భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం.. 300 మంది పర్యాటకులను రక్షించిన అధికారులు

భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలమవుతోంది. నాలుగు రోజులగా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి.

ఏపీలో రికార్డు స్థాయిలో 260.96 ఎంయూల విద్యుత్ డిమాండ్‌.. డిస్కంల చరిత్రలోనే ఫస్ట్ టైమ్

ఏపీలో ఓ వైపు నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడం, మరోవైపు జూన్ 20 గడుస్తున్నా అధిక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యుత్‌ డిమాండ్‌ ఎవరూ ఊహించనంత భారీగా పెరిగింది.

ప్రధాని మోదీ అమెరికా పర్యటన: షెడ్యూల్ ఇదే 

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నుంచి శనివారం(21-24) వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వేలాది మంది ప్రవాసులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన షెడ్యూల్ గురించి ఒకసారి తెలుసుకుందాం.

గజపతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు ఇకలేరు

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు ఆదివారం మరణించారు. నాయడు స్వగ్రామం మెంటాడ మండలంలోని చల్లపేట. గత కొంతకాలంగా గజపతినగరంలో ఉంటున్న సన్యాసినాయుడు, వారం కిందట ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డారు.

'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ నుంచి గుర్బానీని అందరికీ ఉచితంగా ప్రసారం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

నేటి నుంచి ఏపీలో వర్షాలు..తెలంగాణకు మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు

ఎప్పుడూ లేని రీతిలో నైరుతి రుతుపవనాలు అటు అన్నదాతలను, ఇటు సాధారణ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.

ఏపీలో నయా పాలిటిక్స్: రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం

ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్లో సంచలనం చోటు చేసుకుంటోంది. రాజకీయ చైతన్య వేదిక విజయవాడ వేదికగా మ‌రో కొత్త పార్టీకి ఏపీ జన్మనివ్వబోతోంది.

2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ 

2025 నాటికి క్షయవ్యాధి (టీబీ)ని నిర్మూలించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. 'మన్ కీ బాత్'లో భాగంగా ఆదివారం మోదీ మాట్లాడారు.

18 Jun 2023

ఆర్ బి ఐ

రూ.88,032.5 కోట్ల విలువైన 500 నోట్ల మాయంపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

రూ.88,032.5 కోట్ల విలువైన రూ.500 నోట్లు మాయమైపోయినట్లు వచ్చిన ఆరోపణలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఖండించింది.

18 Jun 2023

యోగ

యూఎన్ హెడ్ ఆఫీస్‌లో మోదీ ఆధ్వర్యంలో యోగా డే: 180 దేశాల ప్రతినిధులు హాజరు 

జూన్ 21న న్యూయార్క్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ రంగాలకు చెందిన 180 దేశాలకు చెందిన వారు పాల్గొనున్నారు.

17 Jun 2023

గుజరాత్

జునాగఢ్‌: ఆక్రమణల కూల్చవేతలో పోలీసులపై రాళ్ల దాడి; ఒకరు మృతి 

గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. జునాగఢ్ మున్సిపల్ అధికారులు ఆక్రమణ తొలగింపులో భాగంగా ఒక దర్గాకు కూల్చివేత నోటీసును అందజేశారు. ఇది ఈ హై డ్రామాకు దారితీసింది.

మిల్లెట్ ప్రయోజనాలపై ప్రత్యేక పాట; గ్రామీ విజేత ఫాలుతో కలిసి రాసి, పాడిన మోదీ

గ్రామీ అవార్డు విజేత భారతీయ అమెరికన్ గాయకురాలు ఫాలుతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మిల్లెట్ల ప్రయోజనాలు, ప్రపంచ ఆకలిని తగ్గించడంలో మిల్లెట్ల ప్రాముఖ్యను వివరిస్తూ ఒక ప్రత్యేక పాటను రూపొందించారు.

16 Jun 2023

దిల్లీ

బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: దిల్లీలో వర్షం, రోడ్లన్నీ జలమయం 

బిపోర్‌జాయ్ తుపాను తీరం దాటే సమయంలో దిల్లీలో కూడా వర్షాలు కురిశాయి. గాలులు చాలా బలంగా వీచినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

అలా చేస్తే రాజస్థాన్‌‌లో మేం పోటీచేయం; కాంగ్రెస్‌కు ఆప్ బంపర్ ఆఫర్

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 'వన్ ఆన్ వన్' వ్యూహంతో బీజేపీకి వ్యతిరేకంగా ముందుకెళ్లాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.

నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్చిన కేంద్రం; కాంగ్రెస్ ఫైర్

నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్) పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ సొసైటీగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర యువతి ప్రపంచ రికార్డ్; 127గంటల పాటు డ్యాన్స్ 

మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన యువతి సుధీర్ జగ్తాప్(16 ఏళ్లు) అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 127గంటల పాటు డ్యాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

16 Jun 2023

తిరుపతి

తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

తిరుపతిలోని గోవిందరాజస్వామి దేవాలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపులో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

16 Jun 2023

బాపట్ల

బాపట్లలో ఘోరం; 10వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో స్టూడెంట్ 

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాజోలులో దారుణం జరిగింది.

బంగ్లాదేశ్‌లో 4.8తీవ్రతతో భూకంపం; అసోంతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు

బంగ్లాదేశ్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.8తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

తొలకరి కోసం రైతుల ఎదురుచూపు; మూడు రోజుల తర్వాత వర్షాలపై క్లారిటీ

వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు తొలకరి జల్లుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

16 Jun 2023

మణిపూర్

మణిపూర్‌లో కేంద్రమంత్రి ఇంటికి నిప్పు: 1000మందికి పైగా దాడి

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింస ఇంకా ఆగడం లేదు. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ)లో చేర్చాలనే డిమాండ్‌పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి.

జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్: కుప్వారాలో ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య శుక్రవారం హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

16 Jun 2023

తుపాను

బిపార్‌జాయ్ తుపాను బీభత్సం: గుజరాత్‌లో ఇద్దరు మృతి; 22 మందికి గాయాలు

బిపార్‌జాయ్ తుపాను గుజరాత్ తీరంలో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను గురువారం రాత్రి తీరాన్ని తాకి, శుక్రవారం కుంభవృష్టిని కురిపిస్తోంది.

నాగ‌పూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

మహారాష్ట్రలోని నాగ‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని గురువారం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు 

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యలు కిడ్నాప్‌కు గురైన వార్త సంచలనం రేపింది.

15 Jun 2023

తెలంగాణ

Telangana Forest Dept: రీల్స్, వీడియోలు తీసేయ్, అవార్డులు పట్టెయ్ 

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. దశాబ్ది ఉత్సవాల్లో జూన్ 19న 'హరితోత్సవం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖ కీలక ప్రకటన చేసింది.

గోదావరి ఎక్స్‌ప్రెస్‌తోపాటు 14రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే 

ట్రాక్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ గురువారం ప్రకటించింది.

15 Jun 2023

తుపాను

నెల రోజుల క్రితం పుట్టిన చిన్నారికి 'బిపోర్‌జాయ్' తుపాను పేరు 

నెల రోజుల క్రితం జన్మించిన పాపకు ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం గుజరాత్, ముంబై తీరాలను వణిస్తున్న 'బిపోర్‌జాయ్' తుపాను పేరు పెట్టుకున్నారు. దీంతో తుపాను పేరు పెట్టుకున్నవారి జాబితాలో చిన్నారి చేరింది.

15 Jun 2023

దిల్లీ

కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం, కిటికీల నుంచి దూకిన విద్యార్థులు

దిల్లీ ముఖర్జీ నగర్ ప్రాంతంలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో విద్యార్థులు భయంతో కిటికీల నుంచి కిందకు దూకారు. నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.

AP ICET 2023: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల; ర్యాంకు కార్డును తీసుకోండి 

ఆంధ్ర‌ప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్( ఏపీ ఐసెట్- 2023) ఫలితాలను గురువారం అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది.

సీబీఐకి షాకిచ్చిన సీఎం స్టాలిన్; అనుమతులుంటేనే తమిళనాడులోకి ఎంట్రీ

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కేసుల విచారణకు సీబీఐకి ఇచ్చే మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

అంతరిక్ష కేంద్రం నుంచి బిపోర్‌జాయ్ తుపాను చిత్రాలను బంధించిన వ్యోమగామి 

బిపోర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటుకున్న నేపథ్యంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో గుజరాత్ తీరాన్ని ముంచెతుత్తోంది.

15 Jun 2023

తుపాను

బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: గుజరాత్ తీరంలో రెడ్ అలర్ట్ జారీ 

బిపోర్‌జాయ్ తుపాను గురువారం గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో తీరాన్ని తాకనుంది.

భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ఆత్రేయపురం పూతరేకులు 

కొన్ని కొన్ని ఆహార పదార్థాలు కొన్ని ప్రాంతాల్లోనే తయారవుతాయి. అలాగే అవి ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. అలాంటి ఆహార పదార్థాల్లో ఆత్రేయపురం పూతరేకులు ఒకటి.

14 Jun 2023

ఎన్ఐఏ

నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ 

కర్ణాటకలో తప్పుడు గుర్తింపు పత్రాలో నివసిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మాస్టర్ వెపన్ ట్రైనర్‌ మొహమ్మద్ యూనస్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది.

14 Jun 2023

తుపాను

బిపర్‌జోయ్ తుపాను; గుజరాత్ లోని 9 నగరాలకు రాకపోకలు బంద్ 

బిపర్‌జాయ్ తుపాను కల్లోలంగా మారుతుండగా తీర ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మురంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.