ఇండియా లేటెస్ట్ న్యూస్: వార్తలు

31 Mar 2023

దిల్లీ

మస్కిటో కాయిల్‌ నుంచి విషవాయువు; ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

దోమల నివారణకు ఉపయోగించే మస్కిటో కాయిల్ ఆరుగురి ప్రాణాలను తీసింది. దిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో గురువారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మస్కిటో కాయిల్ కారణంగా విడుదలైన విష వాయువును పీల్చడంతో ఊపిరాడక మరణించారు.

మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా చిరుతపులి 4 పిల్లలకు జన్మనిచ్చింది. కిడ్నీ వ్యాధితో ఒక చిరుత మరణించిన మూడు రోజుల తర్వాత మరో చిరుత 4 బుల్లి చిరుతలకు జన్మనిచ్చినట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు అతను చిరుత పిల్లల చిత్రాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌

మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ (ఎంఎంటీహెచ్)గా బెంగళూరు విమానాశ్రయం అవతరించనున్నది. భారతదేశంలోనే మొట్ట మొదటిగా ఈ స్థాయి గుర్తింపు పొందిన విమానాశ్రయంంగా బెంగళూరు నిలవనుంది.

మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?

లక్షదీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం పునరుద్ధరించింది. ఈ పరిణామంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో తమ నాయకుడు తిరిగి లోక్‌సభలో అడుగుపెడతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

29 Mar 2023

లోక్‌సభ

ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పార్లమెంట్ దిగువ‌సభ బుధవారం పునరుద్ధరించింది.

29 Mar 2023

కర్ణాటక

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ; మే 10న పోలింగ్, 13న కౌంటింగ్

కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం(ఈసీ) బుధవారం ప్రకటించింది.

29 Mar 2023

కోవిడ్

దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా; కొత్తగా 2,151 కేసులు, 5 నెలల్లో ఇదే అత్యధికం

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ, తగ్గడం లేదు. దేశంలో గత 24గంటల్లోనే 2,151 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత ఐదు నెలల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

28 Mar 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ అనుచరుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కుమారుడితో సంబంధాలు

అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ కేసు వ్యవహారంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. అమృత్‌పాల్ సింగ్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు స్పష్టమైన ఆధారాలను సేకరించారు.

ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ

లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వడంపై మంగళవారం రాహుల్ గాంధీ స్పందించారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

రాహుల్ గాంధీకి పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు కేటాయించిన దిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‍‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.

రాహుల్ గాంధీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోర్టు కేసును తాము నిశితంగా పరిశీలిస్తోందని, అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు.

ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్టు ప్రాథమిక విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగూనంగా ఈ మార్పులను తీసుకొచ్చినట్లు సీబీఎస్ఈ ప్రకటించింది.

27 Mar 2023

కోవిడ్

కరోనాపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం; ఏప్రిల్ 10,11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి రాష్ట్రాలను అలర్ట్ చేసింది. దేశంలో కరోనా సంసిద్ధతపై ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే లేఖలు రాసింది.

ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం

కోల్‌కతాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికను ఆదివారం ఆమె పొరుగింటికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పొరుగింటి వారి ఫ్లాట్‌లోని సూట్‌కేస్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

26 Mar 2023

కోవిడ్

దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం

భారతదేశంలో గత 24 గంటల్లో 1,890 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది.

రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు

రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హుత వేటు వేడయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా 'సత్యాగ్రహ' దీక్షలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

26 Mar 2023

ఇస్రో

శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి 36 ఉపగ్రహాలను మోసుకెళ్లే భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.

దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు అనర్హులైపోతారా?

క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన శాసన సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పిటిషన్ దాఖలైంది.

శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా తగ్గేది లేదు, జైల్లో పెట్టినా భయపడను: రాహుల్ గాంధీ

పరువు నష్టం కేసులో సూరుత్ కోర్టు తీర్పు, లోక్‌సభలో అనర్హత వేటు, అధికార బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం నిప్పులు చెరిగారు. ఏఐసీసీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

25 Mar 2023

కోవిడ్

దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు; 146రోజుల గరిష్ఠానికి వైరస్ బాధితులు

భారతదేశంలో గత 24గంటల్లో 1,500పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 146 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Karnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మరో నెలరోజుల్లో జరగనున్నారు. వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించింది.

రాజస్థాన్‌: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత సైన్యం చేస్తున్న ఫీల్డ్ ప్రాక్టీస్‌లో అపశృతి చోటు చేసుకుంది. సైన్యం ప్రయోగించిన మూడు క్షిపణులు మిస్ ఫైర్ అయ్యాయి. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఫైరింగ్ ప్రాక్టీస్ జరగుతుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

24 Mar 2023

పంజాబ్

భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు

పరారీలో ఉన్న 'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ గురించి తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి.

'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్

రామ భక్తులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు కేవలం ఓట్ల కోసం శ్రీరాముడిని ఉపయోగించుకుంటున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రాముడు హిందువులకు మాత్రమే చెందినవాడు కాదని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

24 Mar 2023

కేరళ

'కథాకళి' పేరుతో ఒక గ్రామం; శాస్త్రీయ నృత్య రూపానికి అరుదైన గౌరవం

కేరళ రాష్ట్ర కళా వారసత్వంగా భావించే శాస్త్రీయ నృత్య రూపం 'కథాకళి'కి అరుదైన గౌరవం లభించింది. ఒక గ్రామానికి 'కథాకళి' పేరును అంకితం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు చేసింది. దీంతో దశాబ్దాల కల నెరవేరడంతో ఆ గ్రామ ప్రజలు ఆనందంలో ముగిపోతున్నారు.

టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ

ఈ ఏడాది, వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. జనరల్ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయ సాధించి చరిత్ర సృష్టించాలని కాషాయ దళం ఉవ్విళ్లురూతోంది. ఈ క్రమంలో పార్టీలో రాష్ట్రాల వారికి కీలక మార్పులు చేస్తోంది.

23 Mar 2023

సీబీఐ

విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ

పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా 2015-16లో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లలో రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పేర్కొంది. అదే సమయంలో అతని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ విజయ్ మాల్యా విదేశాల్లో ఆస్తులను కొన్నారని చెప్పింది.

23 Mar 2023

కర్ణాటక

అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు?

కర్ణాటకలో మరో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. 18వ శతాబ్దపు పాలకుడు టిప్పు సుల్తాన్‌పై తాజాగా వివాదం రాజుకుంది. టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారనే అంశాన్ని బీజేపీ ఎన్నికల అంశంగా మార్చింది.

'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలో అదే ఏడాది రాహుల్‌పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ చేసిన ఫిర్యాదు మేరకు పరువు నష్టం కేసు నమోదైంది.

23 Mar 2023

పంజాబ్

బైక్‌పై వెళ్తున్న అమృత్‌పాల్ సింగ్ ఫొటో వైరల్; అతని భార్యను ప్రశ్నించిన పోలీసులు

ఖలిస్తానీ నాయకుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కొత్త ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అతను మూడు చక్రాల బండిపై మోటారుసైకిల్, డ్రైవర్ కాకుండా మరొక వ్యక్తితో కనిపించాడు.

ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఆవిష్కరణ; అది ఎలా పని చేస్తుందంటే?

ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అందుబాటులోకి వచ్చింది. నాలుగు మీటర్లు ఉండే దీన్ని ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఐఎల్ఎంటీ)గా పిలుస్తారు. ఉత్తరాఖండ్‌లోని దేవస్థాన్‌లో దీన్నిఏర్పాటు చేశారు.

బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం

తమిళనాడులోని కాంచీపురంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా ఫ్యాక్టరీలో మంటల చేలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు ఫ్యాక్టరీలోనే చనిపోయారు.

బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు

గుజరాత్ అల్లర్ల సమయంలో అత్యాచారం, హత్య కేసులో 11మంది దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.

22 Mar 2023

పంజాబ్

గురుద్వారాలో 45 నిమిషాలు గడిపిన అమృత్‌పాల్ సింగ్; అక్కడే బట్టలు మార్చుకొని పరార్

ఖలిస్థానీ నాయకుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌కు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు శనివారం ఆపరేషన్‌ను ప్రారంభించిన కొద్ది సేపటికే ఆయన ఓ గురుద్వారాకు వెళ్లి 45నిమిషాలు గడిపిన విషయం తాజాగా బయటికి వచ్చింది.

22 Mar 2023

దిల్లీ

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు

దిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. దీంతో అలర్ట్ అయిన దిల్లీ పోలీసులు వాటిని తొలగించే పనిలో పడ్డారు.

SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మిలటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ కాన్ఫరెన్స్‌కు పాకిస్థాన్ మంగళవారం హాజరుకాలేదు. కశ్మీర్‌కు సంబంధించిన దేశ సరిహద్దులను తప్పుగా మార్చి పాక్ ప్రదర్శించాలని చూసింది. దీనిపై భారత్ అభ్యంతరం చెప్పడంతోనే పాకిస్తాన్ గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి రూ.10 కోట్ల డిమాండ్ చేశాడు.

ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు; తక్కువ బాధతో మరణశిక్ష అమలు ఎలా? కేంద్రానికి సూచనలు

మరణశిక్షను అమలు చేసే కేసుల విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మరణశిక్ష అమలులో భాగంగా మెడకు తాడును వేలాడిదీసి ఉరివేయడం క్రూరమైన చర్యగా చెబుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది.

కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రం తనపై చేసిన ఆరోపణలపై లోక్‌సభలో మాట్లాడేందుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

21 Mar 2023

బీజేపీ

ప్రపంచంలోనే బీజేపీ అత్యంత ముఖ్యమైన పార్టీ: వాల్ స్ట్రీట్ జర్నల్

భారతీయ జనతా పార్టీపై అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ అని పేర్కొంది. వాల్టర్ రస్సెల్ మీడ్ ఈ కథనాన్ని రాశారు.

మునుపటి
తరువాత