ఇండియా లేటెస్ట్ న్యూస్: వార్తలు

12 Apr 2023

కోవిడ్

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 8,000 మందికి వైరస్

దేశంలో గత 24 గంటల్లో కరోనా కొత్త కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజులో దాదాపు 8వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

12 Apr 2023

పంజాబ్

పంజాబ్ మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం; నలుగురు మృతి 

పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ కార్యాలయం ప్రకటించింది.

12 Apr 2023

ఆర్ బి ఐ

భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు 

అంతర్జాతీయ ద్రవ్యనిధి విభాగం(ఐఎంఎఫ్) చీఫ్ డేనియల్ లీ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనదిగా అభివర్ణించారు.

'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం

తన అధికారాలతో చెలగాటాలాడొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మంగళవారం ఒక న్యాయవాది పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

11 Apr 2023

కర్ణాటక

ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత 

మూడు వారాల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

11 Apr 2023

దిల్లీ

ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత

ధూళి ఎక్కువగా ఉన్నందున దిల్లీలోని గాలి నాణ్యత మంగళవారం దారుణంగా పడిపోయిందని, మరింత క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ నుంచి వీచే పశ్చిమ గాలులు నగరానికి దుమ్మును చేరవేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

11 Apr 2023

ఐఎండీ

రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా

ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్రం వెల్లడించింది. సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం 67 శాతం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసినట్లు కేంద్రం పేర్కొంది.

11 Apr 2023

చైనా

డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన 

డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న భూటాన్‌లోని 'అమో చు' లోయలో చైనా సైన్యం భారీ నిర్మాణాలను చేపడుతోంది. దీనిపై భారత సైన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

11 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్! 

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు మార్చి 18 నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిఘా వ్యవస్థల కళ్లు గప్పి అతను ఎలా తప్పించుకుంటున్నాడు? అతను అసలు ఎక్కడ ఉన్నాడు? అనే విషయాలను అమృత్‌పాల్ సింగ్‌ సలహాదారుగా చెప్పుకునే పాపల్‌ప్రీత్ సింగ్‌‌ పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష 

రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ వర్గపోరు తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్- కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

11 Apr 2023

విమానం

విమానాల్లో వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులపై చర్యలకు 'డీజీసీఏ' కీలక సూచనలు 

ఇటీవల విమానాల్లో కొందరు ప్రయాణికుల వికృత చేష్టలు పెరిగిపోతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక సూచనలను జారీ చేసింది.

10 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ మెంటర్ పాపల్ ప్రీత్ సింగ్ అరెస్ట్ 

ఖలిస్థానీ నాయకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పాపల్‌ప్రీత్ సింగ్‌ను సోమవారం పంజాబ్ పోలీసులు, పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు.

10 Apr 2023

కోవిడ్

కరోనా భయాలు: దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నేపథ్యంలో ఆసుపత్రుల సంసిద్ధతను అంచనా వేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం, మంగళవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లను ప్రకటించింది.

దేశంలో కొత్తగా 5,880 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 6.91శాతం

భారతదేశంలో గత 24 గంటల్లో 5,880 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 6.91%గా ఉన్నట్లు వెల్లడించింది.

రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు?

ఎప్పుడూ అదానీ అంశంపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నించే అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కాంగ్రెస్‌ను వీడిన నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే రాహుల్ చేసిన ఆ ట్వీట్‌కు తీవ్ర స్థాయిలో ప్రతి స్పందన వ్యక్తమవుతోంది.

ఈదురు గాలులకు కూలిన భారీ చెట్టు; ఏడుగురు మృతి

మహారాష్ట్రలోని అకోలాలో ఓ టిన్‌షెడ్‌పై భారీ చెట్టు కూలడంతో ఏడుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.

దేశంలో కొత్తగా 5,357 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 3.39%

దేశంలో గత 24 గంటల్లో 5,357 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కి చేరుకుంది.

చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను కనిపెట్టిన పదేళ్ల బాలుడు

పౌల్ట్రీ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల సరికొత్త యంత్రాన్ని జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ పదేళ్ల బాలుడు ఆవిష్కరించాడు.

08 Apr 2023

సీబీఐ

ICICI-Videocon scam case: కొచ్చర్ దంపతులు, ధూత్‌లపై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల మోసం కేసుకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, ఛైర్మన్ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చార్జ్ షీట్ దాఖలు చేసింది.

యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఫైటర్ జెట్ విమానంలో ప్రయాణించారు.

దేశంలో కొత్తగా 6,155 కొత్త కోవిడ్ కేసులు; 9మరణాలు

దేశంలో గత 24 గంటల్లో 6,155 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 31,194కి చేరుకుంది.

07 Apr 2023

కోవిడ్

ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా మాక్ డ్రిల్; ఆరోగ్య శాఖ ఏర్పాట్లు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 10, 11తేదీల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

07 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసులకు 'బైసాఖి' సెలవులు రద్దు

ఖలీస్తానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అహర్నిషలు అమృత్‌పాల్ కోసం వెతుకుతున్నారు. ఆపరేషన్ 'అమృత్‌పాల్ సింగ్'లో భాగంగా ఇప్పటికే పోలీసులు సెలవులు తీసుకోకుండా పని చేస్తున్నారు.

7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్

దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. కేవలం ఏడు రోజుల్లోనే కొత్త కరోనా కేసులు మూడింతలు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13శాతం పెరిగాయి.

07 Apr 2023

గ్యాస్

వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు

దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. సహజ వాయువు ధరను నిర్ణయించడానికి కేంద్ర క్యాబినెట్ కొత్త పద్ధతిని ఆమోదించింది. దీంతో ఫైన్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలు దాదాపు 10శాతం తగ్గనున్నాయి.

06 Apr 2023

బీజేపీ

బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పదమైన బీబీసీ డాక్యుమెంటరీని విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగడంతో జనవరిలో ఆయన కాంగ్రెస్‌కతు రాజీనామా చేశారు.

06 Apr 2023

బిహార్

స్టార్టప్‌తో రిక్షా పుల్లర్ అద్భుతం; ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిస్తున్నాడు

కష్టపడి పనిచేస్తే ఏదో ఒక రోజు ప్రతిఫలం వస్తుందని నిరూపించిన వారు ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. బిహార్‌కు చెందిన దిల్‌ఖుష్ కుమార్ కథ కూడా అలాంటి గొప్పవారికి ఏం తీసిపోనిది.

ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్

దేశంలో గత 24 గంటల్లో 5,335 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇవి నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువని వెల్లడించింది.

BJP Foundation Day: 'నేషన్ ఫస్ట్' మంత్రమే బీజేపీ నినాదం: ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అవినీతి, బాద్‌షా మనస్థతత్వంపై పోరాటానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ను వీడటానికి రాహుల్ గాంధీనే కారణం: గులాం నబీ ఆజాద్

డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తాను కాంగ్రెస్ వీడటానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు.

'నన్నే కరుస్తావా'; పాము తల కొరికిన వ్యక్తి; వీడియో వైరల్

తమిళనాడులోని రాణిపేటలో పామును పట్టుకుని, దాని తలను కొరికి, వీడియో రికార్డు చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

జమ్ముకశ్మీర్: పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలోని ఓ వైన్‌షాప్‌లో బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరు లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు తప్పించుకున్నారు. సినీ ఫక్కీలో బుధవారం ఉదయం పోలీసుల అదుపులో నుంచి బయటపడ్డారు.

కరోనా ఉద్ధృతి; దేశంలో కొత్తగా 4,435మంది వైరస్; 163 రోజుల్లో ఇదే అత్యధికం

దేశంలో గత 24 గంటల్లో 4,435 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 15 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 163 రోజుల్లో ఇదే అత్యధికమని కేంద్రం పేర్కొంది.

05 Apr 2023

కర్ణాటక

సూపర్ బామ్మ! 70ఏళ్ల వృద్ధురాలి ఆలోచన భారీ రైలు ప్రమాదాన్ని నివారించింది; అదెలాగో తెలుసుకోండి

మంగళూరులోని మందారకు చెందిన 70ఏళ్ల వృద్ధురాలు ఇటీవల కర్ణాటకలో భారీ రైలు ప్రమాదాన్ని నివారించడంలో దోహదపడింది.

05 Apr 2023

కేరళ

కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడి అరెస్టు

కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడిని మంగళవారం అర్థరాత్రి మహారాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు.

ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం

ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రయాగ్‌రాజ్ పోలీసులు కీలకమైన పురోగతిని సాధించారు. గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కసరి మసారి ఇంటి నుంచి ఒక ఐఫోన్, కీలకమైన రిజిస్టర్‌తో పాటు రెండు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

గాలిలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం; హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్

బెంగళూరు నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6E897లో సాంకతిక లోపం తలెత్తడంతో మంగళవారం హైదరాబాద్‌కు మళ్లించారు. హైదరాబాద్‌ విమానాశ్రాయంలో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

04 Apr 2023

అమెరికా

భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన

భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న కంటి చుక్కల మందు(ఐడ్రాప్స్‌)పై అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 'కాంగ్రెస్ ఫైల్స్' పేరుతో తన సిరీస్‌లోని రెండో ఎపిసోడ్‌ను సోమవారం విడుదల చేయగా, 3వ ఎపిసోడ్‌ను మంగళవారం విడుదల చేసింది.

03 Apr 2023

కేరళ

కేరళ: రైలులో గొడవ; తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన వ్యక్తి; రైల్వే ట్రాక్‌పై మూడు మృతదేహాలు

కేరళలోని కోజికోడ్‌లో ఎలత్తూర్‌ సమీపంలో కదులుతున్న రైలులో దారుణం జరిగింది. తోటి ప్రయాణికుడితో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగాడు.