తాజా వార్తలు

దేశంలో కొత్తగా 5,357 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 3.39%

దేశంలో గత 24 గంటల్లో 5,357 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కి చేరుకుంది.

చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను కనిపెట్టిన పదేళ్ల బాలుడు

పౌల్ట్రీ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల సరికొత్త యంత్రాన్ని జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ పదేళ్ల బాలుడు ఆవిష్కరించాడు.

08 Apr 2023

తెలంగాణ

10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం

10వ తరగతి పేపర్ లీక్ కేసులో డిబార్ అయిన విద్యార్థిని సోమవారం నుంచి మిగిలిన పరీక్షలు రాయడానికి తెలంగాణ హైకోర్టు శనివారం అనుమతించింది.

08 Apr 2023

సీబీఐ

ICICI-Videocon scam case: కొచ్చర్ దంపతులు, ధూత్‌లపై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల మోసం కేసుకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, ఛైర్మన్ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చార్జ్ షీట్ దాఖలు చేసింది.

'జడ్జి నాలుక నరికేస్తా'; రాహుల్ గాంధీని దోషిగా తేల్చిడంపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

'మోదీ ఇంటిపేరు' వివాదంలో రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తిపై తమిళనాడులోని దిండిగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శనివారం అనుచితన వ్యాఖ్యలు చేసారు.

08 Apr 2023

బీజేపీ

బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు

తొలి భారత గవర్నర్ జనరల్, కాంగ్రెస్ దిగ్గజం సి.రాజగోపాలాచారి మనవడు, తమిళనాడుకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు సిఆర్ కేశవన్ శనివారం బీజేపీలో చేరారు.

విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక

విశాఖపట్నంలోని గంగవరంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చిన ఘటన శనివారం వెలుగుచూసింది.

హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలపై భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ కీలక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో అప్పుడప్పుడు వర్షాలు పుడుతున్నా, ఎండలు మాత్రం మరింత పెరిగే అవకాశం ఉదని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా పగటి పూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

08 Apr 2023

నాసా

20 మిలియన్ సూర్యుల బరువుతో సమానమైన బ్లాక్ హోల్‌ను గుర్తించిన నాసా

నాసాకు చెందిన అత్యంత శక్తిమంతమైన హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్‌ను గుర్తించింది. ఇలాంటి బ్లాక్ హోల్‌ను గతంలో ఎన్నడూ చూడలేదని నాసా పరిశోధకులు చెప్పారు.

యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఫైటర్ జెట్ విమానంలో ప్రయాణించారు.

అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా?

మహారాష్ట్ర మరో రాజకీయ కుదుపునకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

దేశంలో కొత్తగా 6,155 కొత్త కోవిడ్ కేసులు; 9మరణాలు

దేశంలో గత 24 గంటల్లో 6,155 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 31,194కి చేరుకుంది.

08 Apr 2023

గ్యాస్

నేటి నుంచి అమల్లోకి వచ్చిన తగ్గిన గ్యాస్ ధరలు; సీఎన్‌జీ వినియోగదారులకు 40% ఎక్కువ ఆదా

గ్యాస్ ధరలపై కొత్త మార్గదర్శకాలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే సవరించిన మార్గదర్శకాలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో దేశంలో సహజ వాయువు ధరలను ప్రపంచ క్రూడ్ ధరలతో అనుసంధానించడానికి మార్గం సుగమమైంది. దీని వల్ల గ్యాస్ ధరలు తగ్గాయి.

సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య

సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యయి. అలాగే అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్ సంచలనంగా మారింది.

08 Apr 2023

అమెరికా

'అబార్షన్ మాత్ర' వినియోగంపై అమెరికా కోర్టులు ఒకేరోజు వేర్వేరు తీర్పులు

అమెరికాలోని టెక్సాస్, వాషింగ్టన్‌లోని ఫెడరల్ న్యాయమూర్తులు 'అబార్షన్ మాత్ర'పై శుక్రవారం ఒకేరోజు భిన్న తీర్పులు ఇవ్వడం సంచలనంగా మారింది.

అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఘోర ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని రవాణా కార్యాలయం సమీపంలోని ఒక దుకాణంలో భారీ పేలుడు సంభవంచింది.

07 Apr 2023

ఇస్రో

గగన్‌యాన్‌లో కీలక పురోగతి; మానవ-రేటెడ్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో

గగన్‌యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్రలో భాగంగా ఇస్రో ప్రయాణంలో కీలక ముందడుగు పడింది. 240 సెకన్ల ప్రణాళికాబద్ధమైన వ్యవధిలో మానవ-రేటెడ్ ఎల్110-జీ వికాస్ ఇంజిన్ చివరి టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది.

మస్క్ ట్విట్టర్ ఖాతాలో మళ్లీ వచ్చిన చేరిన 'పిట్ట'; డోజికాయిన్ లోగో తొలగింపు

తన మాటలు, చేష్టలతో ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకునే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. మూడు రోజుల క్రితం తన ట్విట్టర్ లోగోని బర్డ్‌ను తొలగించి డోజికాయిన్ సింబర్‌ను పెట్టి అందరనీ ఆశ్యర్యానికి గురిచేశారు.

07 Apr 2023

కోవిడ్

ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా మాక్ డ్రిల్; ఆరోగ్య శాఖ ఏర్పాట్లు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 10, 11తేదీల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

07 Apr 2023

బీజేపీ

ఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం దిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

07 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసులకు 'బైసాఖి' సెలవులు రద్దు

ఖలీస్తానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అహర్నిషలు అమృత్‌పాల్ కోసం వెతుకుతున్నారు. ఆపరేషన్ 'అమృత్‌పాల్ సింగ్'లో భాగంగా ఇప్పటికే పోలీసులు సెలవులు తీసుకోకుండా పని చేస్తున్నారు.

'ఫోర్బ్స్ 2023' జాబితాలో రికార్డుస్థాయిలో భారతీయ బిలియనీర్లు; కొత్తగా 16 మందికి చోటు

వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా- 2023ను ఫోర్బ్స్ విడుదల చేసింది. అయితే తాజా జాబితాలో భారతీయుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. 'ఫోర్బ్స్ 2023' జాబితాలో భారతీయ బిలియనీర్లు 169 మందికి చోటు దక్కింది. 2022లో 166 మంది భారతీయ బిలియనీర్లు ఉన్నారు.

నేడు బీజేపీలోకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర పెద్దల సమక్షంలో ఆయన ఆయన పార్టీలో చేరనున్నారు.

7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్

దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. కేవలం ఏడు రోజుల్లోనే కొత్త కరోనా కేసులు మూడింతలు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13శాతం పెరిగాయి.

07 Apr 2023

ఐఎంఎఫ్

2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్

గత ఏడాది మాదిరిగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర మందగమనం 2023లో కూడా కొనసాగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు.

ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు

జెరూసలేంలోని అల్-అక్సా మసీదు వద్ద జరిగిన ఘర్షణల అనంతరం లెబనాన్‌, ఇజ్రాయెల్ దేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

07 Apr 2023

గ్యాస్

వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు

దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. సహజ వాయువు ధరను నిర్ణయించడానికి కేంద్ర క్యాబినెట్ కొత్త పద్ధతిని ఆమోదించింది. దీంతో ఫైన్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలు దాదాపు 10శాతం తగ్గనున్నాయి.

వాతావరణ మార్పులతో విజృంభిస్తున్న డెంగ్యూ, చికున్‌గున్యా; 129 దేశాలను హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌ఓ

దోమల ద్వారా సంక్రమించే ఆర్బోవైరస్‌ల వల్ల కలిగే డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది.

06 Apr 2023

బీజేపీ

బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పదమైన బీబీసీ డాక్యుమెంటరీని విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగడంతో జనవరిలో ఆయన కాంగ్రెస్‌కతు రాజీనామా చేశారు.

06 Apr 2023

తెలంగాణ

సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రాబోయే రోజుల్లో 1,050మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. థర్మల్‌, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై జరిగిన సమీక్ష సమావేశంలో సింగరేణి కంపెనీ సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

06 Apr 2023

బిహార్

స్టార్టప్‌తో రిక్షా పుల్లర్ అద్భుతం; ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిస్తున్నాడు

కష్టపడి పనిచేస్తే ఏదో ఒక రోజు ప్రతిఫలం వస్తుందని నిరూపించిన వారు ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. బిహార్‌కు చెందిన దిల్‌ఖుష్ కుమార్ కథ కూడా అలాంటి గొప్పవారికి ఏం తీసిపోనిది.

సైకో ఘాతుకం; స్నాప్‌చాట్‌లో ప్రేమించిన మహిళ అనుకొని మరో యువతి హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ హత్య జరిగింది. అమలాపురం పట్టణంలో ఈనెల 4న నెల్లూరు జిల్లాకు చెందిన కోట హరికృష్ణ ఓ మహిళను కత్తితో నరికి చంపాడు.

మార్చిలో భగభగమన్న భూమి; చరిత్రలో రెండోసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఈ ఏడాది మార్చిలో రికార్డుస్థాయిలో భూమిపై ఉష్ణగ్రతలో నమైదైనట్లు ఈయూ వాతావరణ పర్యవేక్షణ ఏజెన్సీ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ గురువారం తెలిపింది.

'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌'తో వైద్య రంగంలో పెను మార్పులు: సీఎం జగన్

'ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌'తో దేశంలో వైద్య వ్యవస్థలో పెనుమార్పు వస్తాయని, ఆ మహత్తర కార్యక్రమం పల్నాడులోని లింగంగుంట్ల నుంచే ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

06 Apr 2023

కెనడా

కెనడాలో మరో దేవాలయంపై హిందూ వ్యతిరేకుల అక్కసు

కెనడాలోని విండ్సర్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి ఘటన సంఘటన వెలుగులోకి వచ్చింది.

06 Apr 2023

కర్ణాటక

అసెంబ్లీ ఎన్నికలు: 'రాహుల్ జీ.. కర్ణాటక సమస్యలపై గొంతు విప్పాలి'; కాంగ్రెస్ శ్రేణుల వేడుకోలు

నెల రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఆశపడుతుంది.

06 Apr 2023

జనగామ

జనగామలో దారుణం: భార్య ఉరేసుకుందని రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

జనగామలో గురువారం దారుణం జరిగింది. జనగామ స్థానిక పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ కె శ్రీనివాస్ తన సర్వీస్ రివాల్వర్‌‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో భార్య ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది.

ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్

దేశంలో గత 24 గంటల్లో 5,335 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇవి నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువని వెల్లడించింది.

BJP Foundation Day: 'నేషన్ ఫస్ట్' మంత్రమే బీజేపీ నినాదం: ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అవినీతి, బాద్‌షా మనస్థతత్వంపై పోరాటానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ను వీడటానికి రాహుల్ గాంధీనే కారణం: గులాం నబీ ఆజాద్

డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తాను కాంగ్రెస్ వీడటానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు.