తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం

ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విస్తృత ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం తెలిపారు.

ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో జరిగిన శ్రీరామనవమి ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే రాజా‌సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అఫ్జల్‌గంజ్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ ) సెక్షన్ 153-ఏ, 506 కింద అభియోగాలు మోపారు.

మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు

శ్రీనగర్‌లోని లాల్ చౌక్ ఒకప్పుడు కర్ఫ్యూలు, ఉగ్రవాద దాడులకు నెలవుగా ఉండేది. నిత్యం ఇంటర్నెట్ ఆంక్షల్లో ఉండే ఆ ప్రాంతం త్వరలో ఉచిత వై-ఫై జోన్‌గా మారుబోతోంది. శ్రీనగర్‌ను స్మార్ట్‌సిటీగా చేయడంలో భాగంగా జమ్ముకశ్మీర్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో విషాదం

తెలంగాణ సీఎం కుమార్తె, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల పర్యటనలో విషాధం చోటుచేసుకుంది.

'ఏకే 47తో చంపేస్తాం'; సంజయ్ రౌత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్‌కు చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. రౌత్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించినట్లు ముంబయి పోలీసులు శనివారం తెలిపారు.

హైదరాబాద్‌లో ఈడీ సోదాల కలకలం; ఆ కంపెనీలే టార్గెట్‌గా దాడులు

హైదరాబాద్‌లోని వివిధ ఫార్మా కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ) శనివారం ఉదయం నుంచి దాడులు ప్రారంభించింది.

01 Apr 2023

కోవిడ్

దేశంలో కొత్తగా 2,994 మందికి కరోనా; ఐదు మరణాలు

24గంటల్లో భారతదేశంలో 2,994 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదైనట్లు శనివారం కేంద్రం ఆరోగ్య శాఖ పేర్కొంది. గత రోజుతో పోల్చుకుంటే కేసులు 101 మేరకు తగ్గినట్లు వెల్లడించింది.

01 Apr 2023

ముంబై

మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులు; ముంబయిలో నిందితుడు అరెస్ట్

బ్యాంకాక్‌ నుంచి ముంబయికి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఎయిర్ హోస్టెస్‌పై ఓ స్వీడన్‌ ప్రయాణికుడు వేధింపులకు పాల్పడ్డాడు. విమానం దిగిన వెంటనే ముంబయి పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత

తాను అవినీతిపరుడినంటూ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తనకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా పరువు నష్టం కేసు పెడతానని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు.

Hush money case: న్యూయార్క్ జడ్జి నన్ను ద్వేషిస్తున్నారు: డొనాల్డ్ ట్రంప్

'హష్ మనీ' కేసులో ఆరోపణలను ఎందుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తన సొంత 'ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్' వేదికగా డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ కోర్టు జడ్జిపై సంచలన కామెంట్స్ చేశారు.

వినియోగదారులకు గుడ్‌న్యూస్; వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయ్

వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. ఏప్రిల్ 1నుంచి తగ్గిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు తెలిపాయి.

ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు

ఐఐటీ-హైదరాబాద్ మరో ఘనత సాధించింది. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సహకారంతో స్వదేశీ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ వంతెనను పరిశోధన బృందం అభివృద్ధి చేసింది.

మద్యం పాలసీ కేసు: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన దిల్లీ కోర్టు

లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియా బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.

ఇంట్లో భారీ పేలుడు, 4మృతదేహాలు లభ్యం; రంగంలోకి ఫోరెన్సింగ్ బృందం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని పొలాల మధ్యలో ఉన్న ఓ ఇంట్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు అధికారులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.

ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లపై శుక్రవారం గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఎవరికీ అందించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది.

ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు; ఏప్రిల్ 1నుంచి అమలు

ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్‌అండ్‌టీఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్) ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో కొత్తగా ప్రవేశపెట్టిన ఆఫర్లు, డిస్కౌంట్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని యాజమాన్యం ప్రకటించింది.

31 Mar 2023

పంజాబ్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుమార్తెకు ఖలిస్థానీ మద్దతుదారుల బెదిరింపులు

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కుమార్తె సీరత్ కౌర్‌ను ఖలిస్థానీ అనుకూల శక్తులు బెదిరించారు. భగవంత్ మాన్ కుమార్తెకు భద్రత కల్పించాలని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు.

31 Mar 2023

దిల్లీ

మస్కిటో కాయిల్‌ నుంచి విషవాయువు; ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

దోమల నివారణకు ఉపయోగించే మస్కిటో కాయిల్ ఆరుగురి ప్రాణాలను తీసింది. దిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో గురువారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మస్కిటో కాయిల్ కారణంగా విడుదలైన విష వాయువును పీల్చడంతో ఊపిరాడక మరణించారు.

ఏడాదిలో రూ.6లక్షల ఇడ్లీలను ఆర్డర్ చేసిన హైదరాబాద్ వ్యక్తి

హైదరాబాద్‌కు చెందిన ఒక ఇడ్లీ ప్రేమికుడు గత ఏడాది కాలంలో రూ. 6 లక్షల విలువైన ప్లేట్లకు ఆర్డర్ ఇచ్చారని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ వెల్లడించింది.

31 Mar 2023

దిల్లీ

దిల్లీని వణికిస్తున్న భారీ వర్షాలు, పలు ప్రాంతాలు జలమయం; ట్రాఫిక్‌కు అంతరాయం

దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిల్లీలోని పలు ప్రాంతాలు శుక్రవారం ఉదయం జలమయమైనట్లు ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (ఆర్‌డబ్ల్యూఎఫ్‌సీ) సూచించింది.

స్టార్మీ డేనియల్స్ ఎవరు? ఈ పోర్ట్న్ స్టార్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న సంబంధం ఏంటి?

స్టార్మీ డేనియల్స్ ఒకప్పటి పాపులర్ పోర్న్ స్టార్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆమెకు రహస్య సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో స్టార్మీ డేనియల్స్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. అసలు స్టార్మీ-ట్రంప్ వ్వవహారం ఏంటి? ఇద్దరు శారీరకంగా ఎక్కడ కలుసుకున్నారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి చూద్దాంం.

31 Mar 2023

తెలంగాణ

తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ

తెలంగాణలో ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మార్చి 31(శుక్రవారం) నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు సూర్యుడు భగ్గమననున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.

ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని శ్రీరామనవమి సందర్భంగా బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది.

31 Mar 2023

కోవిడ్

దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు

దేశంలో గత 24 గంటల్లో 3,095 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

'హష్ మనీ' కేసులో ట్రంప్‌ను అరెస్టు చేస్తారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోండి

'హష్ మనీ' కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఉచ్చు బిగుస్తోంది. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

30 Mar 2023

అమెరికా

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా ఏకగ్రీవ ఎన్నిక!

ప్రపంచ బ్యాంక్ తదుపరి చీఫ్‌గా మాస్టర్‌కార్డ్ మాజీ సీఈఓ, భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా ఎన్నిక దాదాపు ఖారారైంది.

డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.

తమిళనాట మరోసారి హిందీ రగడ; పెరుగు పేరును 'దహీ'గా మార్చడంపై వివాదం

తమిళనాడులో మరోసారి 'హిందీ' వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ 'ఆవిన్' తమ ప్యాకెట్లపై పెరుగుకు సమానమైన హిందీ పదమైన 'దహీ'ని ముద్రించడంపై రగడ రాజుకుంది.

30 Mar 2023

కర్ణాటక

Karnataka: 100శాతం నేనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని; డీకేతో ఇబ్బంది లేదు: సిద్ధరామయ్య కామెంట్స్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో సీఎం కుర్చి కోసం పోటీ మొదలైంది. కర్ణాటక కాంగ్రెస్‌లో చాలా మందే సీనియర్ నాయకులు సీఎం అభ్యర్థిగా తామంటే తాము అని ఊహించుకుంటున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ మధ్య నెలకొంది.

ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని ఒక ఆలయంలో గురువారం శ్రీరామ రామనవమి వేడుకలు జరుగుతుండగా మెట్లబావి కూలిపోయింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పలువురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.

శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం

పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఏలూరులోని తణుకు మండలం దువ్వలో శ్రీరామ నవమి వేడుక కోసం వేసిన చలువ పందిళ్లకు మంటలు అంటున్నాయి.

అత్యాధునిక AI వ్యవస్థలపై పరిశోధనలు ఆపేయండి: మస్క్‌తో పాటు 1000మంది ఐటీ నిపుణుల లేఖ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అనేది ఆధునిక సాంకేతిక విప్లవం. సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా పరిమితంగా వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే విచ్చవిడి తనం పెరిగితే మానవాళికే పెనుముప్పుగా పరిణమించొచ్చు. ప్రస్తుతం AI విషయంలో కూడా అలాంటి ఊహాగానాలే వెలువడుతున్నాయి.

30 Mar 2023

ఏలూరు

ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న 'దురంతో ఎక్స్‌ప్రెస్‌' రైలు గురువారం తెల్లవారుజామున ఎస్‌యూవీని ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలంలో ఈ ఘటన జరగడంతో ఆ మార్గం గుండా వెళ్లే పలు రైళ్లు ఆరు గంటలకు పైగా ఆలస్యంగా వెళ్లాయి.

30 Mar 2023

వీసాలు

వేలాది మంది భారతీయ టెక్కీలకు గుడ్‌న్యూస్; H-1B వీసాపై అమెరికా కోర్టు కీలక తీర్పు

వేలాది మంది భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభించింది. H-1B వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు యునైటెడ్ స్టేట్స్‌లో పని చేయవచ్చని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో హెచ్-1బీ వీసా హోల్డర్లు సంతోషం వ్యక్తం చేశారు.

యూకే కోర్టులో రాహుల్ గాంధీపై లలిత్ మోదీ దావా

'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై కేసు పెడతానని చెప్పారు.

30 Mar 2023

కోవిడ్

దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి; 3వేలు దాటిన కొత్త కేసులు; దిల్లీ ప్రభుత్వం అప్రమత్తం

దేశ రాజధానితో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24గంటల్లో దేశంలో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 40 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

30 Mar 2023

దిల్లీ

రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య

భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ భార్య వసుధ రోహత్గీ దిల్లీలోనే ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. బంగ్లా ఖరీదు అక్షరాల రూ.160 కోట్లు అని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

30 Mar 2023

చిలీ

53ఏళ్ల వ్యక్తిలో బర్డ్ ఫ్లూ వైరస్; చిలీలో మొదటి కేసు గుర్తింపు

బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకదనే అపోహ ఇన్నాళ్లూ ఉండేది. అయితే అది తప్పని తేలింది. తాజాగా చిలీ దేశంలో ఓ మనిషిలో బర్డ్ ఫ్లూ వైరస్‌ను గుర్తించారు.

29 Mar 2023

నాసా

సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు సూర్యునిపై భారీ నల్లటి ప్రాంతాన్ని గుర్తించింది. ఇది మన భూమి కంటే 20 రెట్లు పెద్దదని వైస్ న్యూస్‌ నివేదిక పేర్కొంది.

29 Mar 2023

పంజాబ్

పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా?

గత 10 రోజులుగా పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ తిరిగి పంజాబ్ వచ్చినట్లు సమాచారం. అంతేకాదు అతను గోల్డెన్ టెంపుల్‌లో పోలీసులకు లొంగిపోవాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.