భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా భారత్‌కు ఉంది: ఇస్రో చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత అంతరిక్ష రంగంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు సైన్స్ తో పాటు ఆధ్యాత్మిక రంగంపైనా ఆసక్తి ఉందని వెల్లడించారు. ఈ మేరకు తరచుగా ఆలయాలను సందర్శిస్తానన్నారు.
PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ
దిల్లీలో జరిగిన బిజినెస్ 20(బీ-20) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక ప్రసంగం చేశారు. బీ20 అధ్యక్ష పదవిని బ్రెజిల్‌కు అప్పగించిన సందర్భంలో ప్రధాని మోదీ ఈ ప్రసంగం చేశారు.
జీ20 సదస్సు వేళ.. దిల్లీ మెట్రో స్టేషన్ల గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' రాతలు
దిల్లీ మెట్రో స్టేషన్లో గోడలపై ఖలిస్థాన్‌కు మద్దతుగా రాసిన రాతలు కలకలం సృష్టిస్తున్నాయి. దిల్లీ వేదికగా త్వరలోనే G-20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోవడంపై నగరం ఉలిక్కి పడింది.
ఉత్తర్‌ప్రదేశ్: కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య
కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను, భార్య ఘోరంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. బదౌన్‌కు చెందిన తేజేంద్ర సింగ్, భార్య మిథిలేశ్ దేవికి నలుగురు సంతానం.
పశ్చిమ బెంగాల్: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24పరగణాస్ జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడినట్లు అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు.
రాజస్థాన్‌లో ఘోరం.. చంద్రయాన్-3 విజయాన్ని ఆస్వాదిస్తున్న స్టూడెంట్స్‌పై కశ్మీరీ విద్యార్థుల దాడి
రాజస్థాన్‌లోని మేవార్ విశ్వవిద్యాలయంలో తీవ్ర అలజడులు చెలరేగాయి. చంద్రయాన్-3 విజయోత్సవ వేడుకల సందర్భంగా కశ్మీరీ విద్యార్థులు హంగామా సృష్టించారు. దీంతో విద్యార్థి వర్గాల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది.
అసోం బీజేపీ ఎంపీ ఇంట్లో 10ఏళ్ల బాలుడి మృతదేహం.. అసలేమైంది?
అసోం సిల్చార్‌లోని బీజేపీ ఎంపీ రాజ్‌దీప్ రాయ్ నివాసంలో పదేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ వరాల జల్లు.. 12అంశాలతో డిక్లరేషన్
తెలంగాణలోని చేవెళ్లలో శనివారం కాంగ్రెస్ ప్రజా గర్జన సభ నిర్వహించింది.ఈ మేరకు 12 అంశాలతో కూడిన డిక్లరేషన్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలపై వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తే అంబేేేద్కర్ అభయహస్తం పథకం కింద రూ.12లక్షలను ఇస్తామని వెల్లడించింది.
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ: అశోక్ గెహ్లాట్
2024లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయే అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మైనంపల్లి ఇంటికి వేలాదిగా తరలి వెళ్ళిన బీఆర్ఎస్ శ్రేణులు: తన భవిష్యత్ కార్యచరణపై మైనంపల్లి క్లారిటీ
ధూలపల్లి లోని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి కార్యకర్తలు, కార్ఫోరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్ళారు.
యూనిఫామ్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు: సిబ్బందికి సీఆర్పీఎఫ్ హెచ్చరిక
కేంద్ర రిజర్వుడ్ పోలీసు బలగాలు తమ సిబ్బందికి సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. యూనిఫామ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కడా పంచుకోకూడదని హెచ్చరించింది.
వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదనే రిసీవ్ చేసుకోవడానికి రావొద్దని చెప్పాను: కాంగ్రెస్ విమర్శలకు మోదీ జవాబు
ఈరోజు ఉదయం ఏథేన్స్ నుండి బెంగళూరుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, డైరెక్టుగా ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకోవడానికి ISTRAC కేంద్రానికి వెళ్ళి శాస్త్రవేత్తలతో మాట్లాడారు.
భారత్ భళా..2030 నాటికి ఉపాధి రంగంలో మరో ఘనత : మెకిన్సే నివేదిక
ప్రపంచ దేశాల్లో భారత్ మరో ఘనత సాధించనుంది. ఈ మేరకు 2030 నాటికి జనాభాలో పని చేసే వయసులో ఉన్నవారు అత్యధికంగా ఉండే తొలి మూడు దేశాల్లో ఒకటిగా భారతదేశం నిలవనుంది.
ఉస్మానియా యూనివర్సిటీ 16వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి నవనీత్ రావు కన్నుమూత
ఉస్మానియా విశ్వ విద్యాలయం పూర్వ పూర్వ ఉపకులపతి డా.నవనీత రావు(95) కన్నుమూశారు.
యూపీలో అమానుషం.. లెక్కలు చేయలేదని ముస్లిం విద్యార్థిపై చెంప దెబ్బ కొట్టించిన టీచర్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అమానుషం జరిగింది. తరగతి గదిలో ఓ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో టీచర్ కొట్టించిన సంఘటన కలకలం రేపింది.
మధురై రైల్లో ఘోరం.. అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి, మరింత పెరిగే అవకాశం
తమిళనాడులో రైలు ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. శనివారం మధురై రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఆధ్యాత్మిక పర్యాటక రైలు ప్రమాదంలో (భారత్ గౌరవ్) 9 మంది దుర్మరణం పాలయ్యారు.
చంద్రయాన్-3 మూన్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశానికి 'శివశక్తి' గా నామకరణం: మోదీ
బెంగళూరులోని పీణ్య పారిశ్రామిక ప్రాంతంలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ సెంటర్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
ఏపీ ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు.. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన సీబీఐ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. 2007లో అక్రమంగా గనులు కేటాయించారని శ్రీ లక్ష్మీపై సిబిఐ కేసులు నమోదు చేసింది.
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఝలక్.. ప్రధాని డిగ్రీ కేసులో సుప్రీం కీలక నిర్ణయం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్క ఎదురైంది. ప్రధాని మోదీ డిగ్రీ కేసులో గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్ తిరస్కరణకు గురైంది.
TS DSC 2023: గుడ్ న్యూస్.. 5089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి కేసీఆర్ సర్కార్ పచ్చజెండా ఊపింది. తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
TS Gurukulam: గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్
సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వాన్‌పిక్ కేసులో ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు.. స్టేటస్ కోను అమలు చేయాలని ఆదేశం
వాన్‌పిక్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ, ఉత్తర్వులిచ్చేవరకు స్టేటస్ కోను అమలు చేయాలని ఆదేశించింది.
B20 సదస్సులో నిర్మలా సీతారామన్.. ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యం
దేశంలో గత 9 ఏళ్లుగా సుస్థిరమైన సంస్కరణలు చేపట్టామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గతంలో అస్థిరమైన సంస్కరణలు ఉండేవని, కొవిడ్ కాలంలోనూ సంస్కరణలను కొనసాగించామన్నారు.
Congress: ఎమ్మెల్యే టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు.. కొన్ని చోట్ల ఒకే సీటు కోసం తల్లీకొడుకుల దరఖాస్తులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
రచయిత్రి మధుమితా శుక్లా హత్య కేసులో మాజీ మంత్రి దంపతులకు బెయిల్
ఉత్తర్‌ప్రదేశ్ రచయిత్రి,మధుమితా శుక్లా హత్య కేసులో నిందితుల విడుదలకు సుప్రీం స్టే నిరాకరించింది. ఈ మేరకు 8 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని శుక్రవారం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
హిమాచల్‌లో ఆకాశానికి చిల్లులు.. 51 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్
హిమాచల్ ప్రదేశ్‌లో భీకర వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. క్లౌడ్‌బర్స్ట్ కారణంగా చిక్కుకుపోయిన 51 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.
మధ్యప్రదేశ్ లో దారుణం.. 13 ఏళ్ళ బాలుడిపై ప్యూన్ లైంగికదాడి
మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఉన్న ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 13 ఏళ్ళ బాలుడిపై ప్యూన్ లైంగికదాడికి పాల్పడ్డాడు.
తెలంగాణాలో రానున్న మూడు రోజులలో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలిక నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Telangana : ఈఎస్ఐ స్కామ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ- బీమా వైద్య సేవల(IMS) కుంభకోణంలో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
భారత కార్పొరేట్లకు మరో షాక్.. హిండెన్‌బర్గ్ తరహాలో మరో నివేదిక
భారత పారిశ్రామిక దిగ్గజాలకు (కార్పొరేట్లకు) హిండెన్‌బర్గ్ మాదిరి షాక్ తగలనుంది. ఈ మేరకు నిర్దిష్ట కంపెనీల్లో చోటు చేసుకున్న అవకతవకలను ఓసీసీఆర్‌పీ(OCCRP) బయటపెట్టనుంది.
ఖరారైన తెలంగాణ అమిత్ షా పర్యటన.. టూర్ వివరాలు ఇవే
ఈనెల 27న తెలంగాణ పర్యటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఖమ్మంలో తలపెట్టిన బీజేపీ 'రైతు గోస - బిజెపి భరోసా' సభలో అమిత్ షా ప్రసంగిస్తారు.
మణిపూర్ దుస్థితికి కాంగ్రెస్సే కారణమన్న బీరెన్ సింగ్.. సీఎం రాజీనామాకు సీపీఐ పట్టు
మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజకీయంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో శుక్రవారం తెల్లవారు జామున 4.40గంటల సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ముంబైలో జీకా కలకలం.. 79 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్
జీకా వైరస్ దేశంలో మరోసారి కలకలం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి జికా వైరస్ బారిన పడ్డారు. ఈ మేరకు వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వైరస్ పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల సెలవులు
అత్యంత ప్రతిష్టాత్మకమైన G-20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు సెలవులు ప్రకటించింది. కేంద్ర కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులను మంజూరు చేసింది.
Patnam Mahender reddy: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డి
తెలంగాణ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేపట్టారు. ఈ మేరకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆయనతో పదవీ స్వీకారోత్సవం చేయించారు.
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ
గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. కుప్పకూలిన భారీ భవనాలు
హిమాచల్‌ప్రదేశ్‌ను కొండచరియలు బెెంబెలెత్తిస్తున్నాయి. గురువారం కులు జిల్లాలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో భారీ వాణిజ్య సముదాయాలు, ఇళ్లు కుప్పకూలిపోయాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్; కొత్తగా పెన్షన్, రేషన్ కార్డుల జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. కొత్త పెన్షన్ కార్డులు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీకార్డులను మంజూరు చేశారు.
చంద్రయాన్-3 వ్యోమగాములకు శుభాకాంక్షలు చెప్పిన రాజస్థాన్ మంత్రి.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
చంద్రయాన్-3పై రాజస్థాన్ మంత్రి అశోక్ చందన్ నోరు జారారు. ఈ మేరకు ప్రాజెక్టు విజయవంతంపై ఆయన స్పందించారు. ఈ క్రమంలోనే ఇస్రోకు అభినందనలు తెలియజేశారు.