భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

24 Aug 2023

తెలంగాణ

DSC Notification: గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్  

తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆమె స్పష్టం చేశారు. బషీర్ బాగ్‌లో గురువారం మంత్రి సబితా మీడియాతో మాట్లాడారు. మొత్తం 6500 పైగా పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

యూట్యూబ్ చూస్తూ భార్యకు కాన్పు చేసిన భర్త.. భార్య మృతి

యూట్యూబ్‌లో వీడియో చూస్తూ భార్యకు కాన్పు చేయాలకున్న భర్త ప్రయత్నం బెడిసి కొట్టింది. ఏకంగా భార్య ప్రాణాలను చేజేతులా తీసుకున్నాడు. ప్రసవం చేసిన తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది.

హైదరాబాద్‎: ఉచిత చేప మందు పంపిణీదారుడు బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

హైదరాబాద్‎లో ఏటా చేప మందును పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు. ముషీరాబాద్, బొలక్ పూర్ లోని పద్మశాలి కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇటీవలే అనారోగ్యం పాలయ్యారు.ఈ మేరకు బుధవారం పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

తెలంగాణ, ఆంధ్ర‌ప్రదేశ్‌‌కు వర్ష సూచన.. వచ్చే ఐదు రోజుల పాటు వానలు

తెలుగు రాష్ట్రాల్లో మరో దఫా భారీ వానలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 5 రోజులు జోరుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

హైదరాబాద్‎లో కాల్పుల కలకలం.. రెస్టారెంట్‌  మేనేజర్ మృతి 

హైదరాబాద్ మహానగరంలో నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు ఓ వైపు, దొంగతనాలు మరోవైపు తరచుగా జరుగుతుండటంతో నగర వాసులు బెంబెలిత్తిపోతున్నారు.

బెజవాడ బెంచ్ సర్కిల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 300 బైకులు దగ్ధం

విజయవాడలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని కేపీనగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో షార్క్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి.

చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షల వెల్లువ

చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో చంద్రయాన్-3 మిషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలతో సహా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

23 Aug 2023

తెలంగాణ

అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో గణనీయ అభివృద్ధి: కేసీఆర్ 

తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లాలో కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

23 Aug 2023

విమానం

దిల్లీలో తప్పిన ఘోరం.. ఒకేసారి 2 విమానాలకు ల్యాండింగ్, టేకాఫ్ క్లియరెన్స్

దిల్లీ విమానాశ్రయంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. 2 విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్‌ కోసం ఏటీసీ గ్రీన్ సిగ్నల్ అందింది.

India on the moon: చంద్రయాన్-3 విజయవంతం అభివృద్ధికి చెందిన భారతానికి నాంది: ప్రధాని మోదీ 

చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ప్రజలతో పాటు, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఏడాదికి రెండు బోర్డ్ ఎగ్జామ్స్ 

దేశంలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.

23 Aug 2023

తిరుపతి

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ లగేజీ నిర్వహణ

తిరుమల శ్రీవారి భక్తుల కోసం మరో కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు లగేజీ నిర్వహణ నిమిత్తం నూతన వ్యవస్థకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే BBMS (బాలాజీ బ్యాగేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)ను లాంచ్ చేసింది.

23 Aug 2023

మిజోరం

మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి

మిజోరంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. సాయిరాంగ్ ప్రాంతానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో కనీసం 17 మంది కార్మికులు మరణించారని పోలీసులు తెలిపారు.

CR Rao: తెలుగు మూలాలున్న ప్రపంచ గణిత మేథావి సీఆర్ రావు మృతి 

భారతదేశానికి చెందిన అమెరికన్ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త, స్టాటిస్టిక్స్‌లో నోబెల్‌గా చెప్పుకునే ఇంటర్నేషన్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు అందుకున్న సీఆర్ రావు, 103ఏళ్ల వయసులో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారు.

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..ఆ మాట ఆమోదయోగ్యం కాదని వెల్లడి

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370ని 2019లో కేంద్రం రద్దు చేసింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను మంగళవారం విచారించింది.

చంద్రయాన్‌-3లో తెలంగాణ శాస్త్రవేత్త.. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్ రాసిన గద్వాల యువకుడు

ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకిస్తున్న చంద్రయాన్-3 ప్రాజెక్టులో తెలంగాణకి చెందిన యువ శాస్త్రవేత్త భాగమయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి రెండు పేలోడ్స్‌ కోసం సాఫ్ట్‌వేర్‌ రాశారు.

ఒడిశా బీచ్‌లో అబ్బురపరిచే 'చంద్రయాన్-3' సైకత శిల్పం

చంద్రయాన్-3 మిషన్ బుధవారం సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవడానికి సిద్ధంగా ఉంది.

చంద్రయాన్-3పై స్పందించిన సునీత విలియమ్స్.. చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు వెల్లడి

చంద్రయాన్‌-3 మిషన్‌ కీలక ఘట్టానికి చేరుకున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మేరకు జాబిల్లిపై బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్ అడుగుపెట్టనుంది. ఈ అద్వితీయమైన దృశ్యం కోసం భారత ప్రజలతో పాటు ప్రపంచ దేశాలూ ఆశగా ఎదురు చూస్తున్నాయి.

తల్లీ కూతుళ్ల హత్య, మరో చిన్నారిని గర్భవతిని చేసిన నిందితుడికి మరణి శిక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తంబళ్లపల్లెలో జంట హత్యల కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ మేరకు నిందితుడికి మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కొన్ని నెలలు ఉల్లిపాయలు తినడం మానేయండి: ఉల్లి ధరల పెరుగులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు 

ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

నేషనల్ ఐకాన్ గా సచిన్ టెండూల్కర్‌.. కేంద్ర ఎన్నికల సంఘంతో ఒప్పందం

దేశవ్యాప్తంగా మరికొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలకు తెరలేవనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం అందుకు రంగం సిద్ధం చేస్తోంది.

22 Aug 2023

దిల్లీ

అమిత్ షాకు దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ లేఖ.. అత్యాచార బాధితురాలిని కలవనివ్వాలని అభ్యర్థన

కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షాకు దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ లేఖ రాశారు. స్త్రీ శిశుసంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురైన బాలికను కలిసేందుకు అనుమతివ్వాలని కోరారు.

హిమాచల్: భారీ వర్షాలకు 346మంది బలి; రూ.8100కోట్ల నష్టం 

హిమాచల్ ప్రదేశ్ లో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, రాష్ట్రం మొత్తాన్ని ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు.

22 Aug 2023

ఇండిగో

ఇండిగో విమానంలో విషాదం.. గాల్లో ఉండగానే  రక్తపు వాంతులతో ప్రయాణికుడు మృతి

ఇండిగో విమానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులతో తుది శ్వాస విడిచాడు.

కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు 

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సోమవారం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

22 Aug 2023

కేరళ

లక్షద్వీప్ ఎంపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ; కేరళ హైకోర్టుకు కీలక ఆదేశాలు 

2009లో జరిగిన హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు విధించిన శిక్షను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

7th Pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: రెండేళ్ళు సెలవు పెట్టినా జీతం వచ్చేస్తుంది 

ఆల్ ఇండియా సర్వీస్ సభ్యులకు సంబంధించిన సెలవుల విషయంలో కొన్ని సవరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

చంద్రయాన్-3 ల్యాండింగ్: విద్యాసంస్థల్లో ప్రత్యక్ష ప్రసారానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు 

జాబిల్లికి అత్యంత దగ్గరగా వెళ్ళిన చంద్రయాన్-3, మంగళవారం సాయంత్రం 6:04గంటలకు చంద్రుడి మీద అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడి చేసింది.

BRICS Summit: ప్రధాని మోదీ-జీ జిన్‌పింగ్ భేటీపైనే అందరి దృష్టి 

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు వెళ్లారు. బ్రిక్స్ సమ్మిట్ ఆగస్టు 22న ప్రారంభమై 24వరకు జరగనుంది.

కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. రగిలిపోతున్న కామ్రెడ్లు

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వ్యూహ్మాత్మక వైఖరిని పాటిస్తున్నారు.ఈ మేరకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు దూరంగా ఉంటున్నారు.

ప్రధాని మోదీకి పాక్ సోదరి రక్షాబంధన్ శుభాకాంక్షలు.. 31వసారి రాఖీ కట్టనున్న మొహిసిన్

ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ సోదరి రాఖీ కట్టనున్నారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని పాకిస్థాన్‌కు చెందిన కమర్ మొహిసిన్ షేక్ మోదీకి రాఖీ కట్టనున్నారు. ఇందుకోసం ఈనెల 30న పాక్ నుంచి దిల్లీకి రానున్నారు. గత 30సంవత్సరాలుగా మోదీకి కమర్ రాఖీ కడుతున్నారు.

Telangana voter list: తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా.. జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈసీ(ELECTION COMMISSION) ఓటర్ల జాబితాను ప్రకటించింది.

Balakot: ఉగ్రవాదుల చొరబాటు విఫలం: ఎల్‌ఓసీ వద్ద ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటును భారత సైన్యం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం ప్రకటించింది.

BRICS Summit: 'బ్రిక్స్' సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ 

దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఆగస్టు 22-24 తేదీల్లో జోహన్నెస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణాఫ్రికాకు బయలుదేరారు.

21 Aug 2023

తెలంగాణ

త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ!.. పట్నం మహేందర్ రెడ్డి మంత్రి పదవి? 

రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రికి పట్నం మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది. అయితే సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో పట్నం మహేందర్ రెడ్డికి చోటు దక్కలేదు.

21 Aug 2023

దిల్లీ

స్నేహితుడి కూతురిపై అత్యాచారం చేసిన ప్రభుత్వ అధికారిపై సస్పెన్షన్ వేటు 

స్నేహితుడి కూతురపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ప్రభుత్వ అధికారి ప్రేమోదయ్ ఖాఖాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

21 Aug 2023

సీబీఐ

సీబీఐ కేసుల డేటాను వెల్లడించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్... 20ఏళ్లు గడిచినా పూర్తికాని అవినీతి కేసులు 

దేశవ్యాప్తంగా వందలాది అవినీతి కేసులు దాదాపు 20 ఏళ్లకుపైగా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (CVC) నివేదిక విడుదల చేసింది.

Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు వైఎస్ జగన్ కుట్ర- బండి సంజయ్ ఆరోపణలు 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.

21 Aug 2023

మణిపూర్

Manipur violence: మణిపూర్‌ హింసపై సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించిన జస్టిస్ మిట్టల్ కమిటీ

మణిపూర్‌లో చెలరేగిన హింసపై జస్టిస్ (రిటైర్డ్) గీతా మిట్టల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

Oldest Elephant: దేశంలోనే అత్యంత వృద్ధాప్య ఏనుగు 'బిజులీ ప్రసాద్' మృతి 

అసోంలో సోనిత్‌పూర్ జిల్లాలోని తేయాకు తోటల్లో ఇన్నిరోజులు రాజుగా జీవించిన 'బిజులీ ప్రసాద్' అనే పెంపుడు ఏనుగు సోమవారం ఉదయం కన్నుమూసింది. ఈ ఏనుగు వయసు 89 సంవత్సరాలు అని అధికారులు తెలిపారు.